స్త్రీలు పాటించవలసిన 10 సురక్షిత శృంగార పద్దతుల గురించి మీకు తెలుసా ?

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

స్త్రీలు అందరూ సురక్షిత శృంగారంలో పాల్గొనటం అలవాటు చేసుకోవడం చాలా అవసరం. అంతే కాకుండా వారి యొక్క శృంగార ఆరోగ్యం మరియు రక్షణ గురించి బాధ్యత తీసుకోవడానికి, వారు అస్సలు భయపడకూడదు. మానసికంగా మరియు శారీరికంగా సమాయత్తమై దేనైనా ఎదుర్కోవడానికి సన్నద్ధతతో ఉండి మరియు సురక్షితంగా ఉండటం వంటి పనులు చేయడం ద్వారా శృంగార జీవితం ఎంతో ఆరోగ్యకరంగా మరియు ఆనందదాయకంగా ఉంటుంది.

లైంగిక సంక్రమణ వ్యాధుల భారిన పడకుండా, అవి తమకు సోకకుండా మరియు గర్భం దాల్చకుండా చర్యలు తమంతట తాముగా తీసుకొని తమ ఆరోగ్యాన్ని భవిష్యత్తుని కాపాడుకోవాలి స్త్రీలు. తమ యొక్క ఋతుక్రమణలు లేదా నెలసరి పై మరియు శృంగార ఆరోగ్యం పై ఎల్లప్పుడూ నిఘా ఉంచి, ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటే, మీ శృంగార జీవితం ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది.

ఈ 10 మార్గాల ద్వారా స్త్రీలు ఆరోగ్యవంతమైన శృంగార జీవితాన్ని గడపవచ్చు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

#1 గర్భం నియంత్రన మార్గాలను మరియు పద్దతులను పరిశోధించండి :

#1 గర్భం నియంత్రన మార్గాలను మరియు పద్దతులను పరిశోధించండి :

మీరు గనుక శృంగారంలో తరచూ పాల్గొంటున్నట్లైతే గర్భనియంత్రణకు ఉత్తమమైన మార్గాలులేవి అని కనుక్కోవడం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో తాత్కాలికంగా లేదా శాశ్వతంగా గర్భనియంత్రణను చేయడానికి ఎన్నో రకాల పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. మీ ఇష్టాన్ని బట్టి మరియు మీ శరీరతత్వానికి ఏదైతే సరిపోతుందని అనిపిస్తుందో, అలాంటి వాటిల్లో మీకు నచ్చింది ఎంచుకొనే వెసులుబాటు మీకు ఉంది. మీ వైద్యుడిని సంప్రదించి సరైన గర్భనియంత్రణ మార్గాన్ని కనుక్కోండి. దానిని అమలు పరచండి.

#2 ప్రతిసారి రక్షణను వాడండి :

#2 ప్రతిసారి రక్షణను వాడండి :

ఇది వినడానికి కొద్దిగా ఎబెట్టుగా ఉన్నా, అయినప్పటికీ అందరూ ప్రవాహంతో పాటు వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ, శృంగార సమయంలో రక్షణను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడండి. అది అనవసర గర్భదారణను నియంత్రించడమే కాకుండా, శృంగార సంబంధిత వ్యాధుల భారిన పడకుండా మిమ్మల్ని రక్షిస్తుంది. మీ భాగస్వామికి గనుక కండోమ్ ధరించడం ఇష్టం లేకపోతే మీరు ఒకటి ధరించండి.

మహిళల్లో కామేచ్ఛ పెంచడానికి ఎలా

#3 మనస్సు విప్పి మాట్లాడటం అన్నిటి కంటే ఉత్తమం :

#3 మనస్సు విప్పి మాట్లాడటం అన్నిటి కంటే ఉత్తమం :

మీకు గనుక గతంలో పాల్గొన శృంగార అనుభవాలు ఉంటే, వాటి గురించి మీ భాగస్వామితో చెప్పండి మరియు సురక్షిత శృంగారంలో మీ యొక్క ప్రాధాన్యతలను వారికి తెలియజేయండి. ఇలా చెప్పడం ద్వారా మీ భాగస్వామి కూడా ప్రమాదం జరగకుండా ఉండటానికి అత్యంత జాగ్రత్తలు తీసుకుంటారు. అంతేకాకుండా క్రమం తప్పకుండా మీరు, మీ భాగస్వామి శృంగార సంక్రమణ వ్యాధుల పరీక్షలు చేయించుకోండి.

#4 మీ భాగస్వాముల సంఖ్యకు పరిమితి విధించండి :

#4 మీ భాగస్వాముల సంఖ్యకు పరిమితి విధించండి :

ఆరోగ్యవంతమైన శృంగార జీవితాన్ని గడపాలి అని మీరు గనుక భావిస్తున్నట్లైతే అందుకు ఉత్తమమైన మార్గం, శృంగార భాగస్వాములకు పరిమితి విధించడం. ఈ నిజం చాలా సులభమైనది. మీరు గనుక ఎక్కువ మంది భాగస్వాములతో శృంగారంలో పాల్గొంటే, మీకు శృంగార సంబంధిత వ్యాధులు సోకె అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే, ప్రతి ఒక్క కొత్త భాగస్వామికి గతంలో కొన్ని శృంగార అనుభవాలు ఉండి ఉండొచ్చు. మీరు గనుక ఒక్కరి కంటే, ఎక్కువ మందితో శృంగారంలో తరచూ పాల్గొంటున్నట్లైతే, మీరు శృంగారంలో పాల్గొన్న ప్రతిసారి సురక్షిత శృంగార పద్దతులను అలవర్చుకోండి.

#5 మంచి పద్దతి, ఒకే భాగస్వామిని కలిగి ఉండటం :

#5 మంచి పద్దతి, ఒకే భాగస్వామిని కలిగి ఉండటం :

ఇలా చెబుతున్నప్పుడు మీకు వినడానికి కొద్దిగా అధికారం చెలాయించినట్లు ఉండొచ్చు. కానీ నిజం ఏమిటంటే, ఆరోగ్యవంతమైన శృంగార జీవితం కావాలనుకుంటే, దీర్ఘకాలం పాటు ఒకే భాగస్వామితో శృంగారంలో పాల్గొనటం ఉత్తమమైన మార్గం. ఒకరి పై ఒకరికి విపరీతమైన విశ్వాసం మరియు నమ్మకం ఉండాలి. అంటువంటప్పుడు వ్యాధుల భారినపడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

#6 మీరు వాడే ఉత్పత్తుల గురించి కొద్దిగా జాగ్రత వహించండి :

#6 మీరు వాడే ఉత్పత్తుల గురించి కొద్దిగా జాగ్రత వహించండి :

చాలా మంది స్త్రీలు తమ వ్యక్తిగత ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవడం కోసమై యోని సంబంధిత వాషెస్ ని వాడుతుంటారు. కానీ, ఇటువంటి సమయంలో మీరు తెలివిగా వ్యవహరించడం చాలా ముఖ్యం. మీరు ఎప్పుడైతే ఇటువంటి వాటిని కొంటుంటారో, అప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇలాంటి ఉత్పత్తుల్లో ఎక్కువ శాతం, సాధారణంగా ఉండే పి హెచ్ సమతుల్యతను దెబ్బతీస్తాయి. దీని ఫలితంగా యోని ప్రాంతం పొడిబారిపోతుంది మరియు దురద మొదలవుతుంది. అంతేకాకుండా మీకు శృంగార సంక్రమణ వ్యాధులు రాకుండా మిమ్మల్ని కాపాడే మంచి క్రిములు కూడా వీటిని వాడటం వల్ల మీ శరీరం నుండి బయటకు వెళ్లిపోతాయి. దీనికి తోడు యోని సంబంధిత ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండటానికి సరైన లుబ్రికంట్స్ ని ఎంచుకోండి, ఎంచుకొనే సమయంలో తెలివిగా వ్యవహరించండి.

#7 శృంగార సమయంలో లుబ్రికంట్స్ ని వాడటం :

#7 శృంగార సమయంలో లుబ్రికంట్స్ ని వాడటం :

శృంగార సమయంలో లుబ్రికంట్స్ ని వాడటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది కండోమ్ చిరిగిపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొన్ని సందర్భాల్లో యోని ప్రాంతం, శృంగారం జరిగే సమయంలో కొద్ది సేపు తర్వాత పొడిబారిపోవచ్చు. అటువంటి సమయంలో రాపిడి ఎక్కువై కండోమ్ చిరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. దీని ఫలితంగా అనవసర గర్భం మరియు ఇన్ఫెక్షన్లు సోకె ప్రమాదం ఉంది. అందుచేత ఇలా జరగకుండా ఉండటానికి మీరు శృంగార సమయంలో లుబ్రికంట్స్ ని వాడటం మరచిపోకండి.

లైంగిక సామర్థ్యంను పెంచే 15 ఇండియన్ సూపర్ ఫుడ్స్

#8 శృంగార బొమ్మలను కూడా శుభ్రపరచండి :

#8 శృంగార బొమ్మలను కూడా శుభ్రపరచండి :

మీ శృంగార జీవితాన్ని కొత్త పుంతలు తొక్కించడం కోసమై, శృంగార బొమ్మలు మరియు ఇతర సామాగ్రిని కొనుక్కొని వాటిని ఉపయోగించి మీ కల్పనలను నిజం చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ, శృంగార బొమ్మలను చాలా పద్దతిగా మరియు సరైన పద్దతిలో నిర్వహించాలి. ఎందుకంటే అవి శరీరంలోని అత్యంత సున్నితమైన మరియు సన్నిహిత ప్రాంతాల్లో వాటిని వాడుతాం కాబట్టి. అందుచేత శృంగార బొమ్మలను ఎప్పటికప్పుడు కడిగి మరియు క్రిమిరహితంగా ఉంచుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీ యొక్క శృంగార బొమ్మలకు కూడా కండోమ్ తొడగవచ్చు. మీ యొక్క శృంగార బొమ్మలని ఎవరితో గాని పంచుకోకండి.

#9 శృంగారానికి దూరంగా ఉండండి :

#9 శృంగారానికి దూరంగా ఉండండి :

ఏ వ్యక్తులైతే శారీరికంగా మరియు మానసికంగా శృంగారం చేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేయరో, వారికి ఇది వర్తించబడుతుంది. కానీ, కొంతమంది వారి యొక్క భాగస్వాముల గురించి అభద్రతా భావానికి లోనవుతూ తీవ్ర ఒత్తిడిలను ఎదుర్కొంటూ ఉంటారు. మీరు గనుక శృంగారం నుండి దూరంగా ఉండాలి అని భావిస్తున్నట్లైతే అందులో ఎటువంటి తప్పు లేదు. మీరు ఇదే విషయమై మీ భాగస్వామితో మాట్లాడండి మరియు మీరు ఎలా భావిస్తున్నారు ఈ విషయమై అనే విషయాన్ని మీ భాగస్వామికి అర్ధం అయ్యేలా చెప్పండి. ఇలా చేయడం ద్వారా మిమ్మల్ని మీరు బాధ్యత వహించే విధంగా మెలిగినట్లు అవుతుంది.

#10 మీ పరిస్థితిని తెలుసుకోండి :

#10 మీ పరిస్థితిని తెలుసుకోండి :

ఎప్పటికప్పుడు శృంగార సంక్రమణ వ్యాధుల గురించి పరీక్షలు చేయించుకుంటూ, మీ పరిస్థితిని తెలుసుకుంటూ ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే, ఈ వ్యాధుల యొక్క లక్షణాలు తెలియాలంటే సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని నెలల నుండి సంవత్సరాలు పట్టవచ్చు. మరో రకంగా ఇది ఎలా లాభదాయకం అంటే, మీరు గనుక వ్యాధుల భారిన పడినట్లైతే, మీ భాగస్వామికి అవి సంక్రమించకుండా మీరు జాగ్రత్త పడవచ్చు.

English summary

10 Safe Sex Practices For Women

As a woman, it is very essential to practice safe sex and not be scared of taking authority of your sexual health and safety. Being prepared mentally and physically, being ready and being safe are the key elements to a healthy sex life.
Story first published: Tuesday, January 16, 2018, 12:30 [IST]