For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పచ్చి వెల్లుల్లి వలన కలిగే ఈ 10 సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీరు తప్పక తెలుసుకోవాలి

|

చిన్న వెల్లుల్లి రెబ్బ అనేక సైడ్ ఎఫెక్ట్స్ ను కలిగిస్తుందని మీరు ఎప్పుడైనా భావించారా? లేదా, అయితే ఈ విషయంలో ఇంక దిగులు అనవసరం! పచ్చి వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోవడం అలాగే వెల్లుల్లిని ఆహారంలో మరీ ఎక్కువగా వాడటం వలన ప్రాణాపాయ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

అన్ని రకాల వంటకాలలో వెల్లుల్లిని సాధారణంగా వాడతారు. ముఖ్యంగా భారతీయ వంటకాలలో వెల్లుల్లి వాడకం ఎక్కువ. వంటకాల రుచిని అలాగే ఫ్లేవర్ ని పెంపొందించే సామర్థ్యం వెల్లుల్లిలో కలదు. వెల్లుల్లిని కేవలం వంటలలోనే కాకుండా ఔషధంగా కూడా తీసుకుంటారు.

ఇందులో కేల్షియం, ఐరన్, ఐయోడిన్, సల్ఫర్ వంటి ఎన్నో ఎసెన్షియల్ న్యూట్రియెంట్స్ కలవు. ఇవన్నీ వివిధ ఆరోగ్య సమస్యలను తగ్గించేందుకు దోహదపడతాయి. ఇది శరీరానికి ఎన్నో విధాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. బ్లడ్ ప్రెషర్ ని అలాగే కొలెస్ట్రాల్ ని తగ్గించడం, ఇన్ఫెక్షన్ ను నివారించడం అలాగే రోగనిరోధక శక్తిని పెంపొందించే గుణాలు ఇందులో అధికంగా లభిస్తాయి.

కానీ, వెల్లుల్లిని అతిగా తీసుకోవడం అలాగే వీటిని వండకుండా పచ్చివి తినడం వంటివి ఆరోగ్యానికి ఎన్నో విధాలా హానీ కలిగిస్తాయి. దీని వలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి వివరంగా తెలుసుకుందామిప్పుడు. సరేనా?

1. లివర్ ని దెబ్బతీయవచ్చు

వెల్లుల్లిని అతిగా తీసుకోవడం వలన లివర్ పనితీరు దెబ్బతినవచ్చు. లివర్ అనేది శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో ఒకటి. పేరుపొందిన ఇండియన్ స్టడీ ప్రకారం వెల్లుల్లిని అధిక మొత్తంలో తీసుకుంటే లివర్ టాక్సిసిటీ సమస్యకు దారితీయవచ్చు.

2. నీళ్ల విరేచనాలు:

2. నీళ్ల విరేచనాలు:

ఖాళీ కడుపుతో అధిక మొత్తంలో వెల్లుల్లిని తీసుకుంటే నీళ్ల విరేచనాలు పట్టుకునే ప్రమాదం కలదు. కొంతమందికి, వెల్లులి వలన గ్యాస్ ఫార్మ్ అయి ఇబ్బందులు తలెత్తుతాయి. తద్వారా, విరేచనాల సమస్య బారిన పడే ప్రమాదం ఉంది.

3. వికారం, వాంతులు మరియు హార్ట్ బర్న్

3. వికారం, వాంతులు మరియు హార్ట్ బర్న్

నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రకారం, తాజా వెల్లుల్లిని లేదా వెల్లుల్లి నూనెను ఖాళీ కడుపుతో తీసుకుంటే హార్ట్ బర్న్, వికారం మరియు వాంతుల సమస్య వేధించవచ్చు. అలాగే, హార్వర్డ్ మెడికల్ స్కూల్ వారు పబ్లిష్ చేసిన రిపోర్ట్ ప్రకారం వెల్లుల్లి వలన గ్యాస్ట్రోఎసోఫేగల్ రిఫ్లక్స్ డిసీస్ కు గురయ్యే ప్రమాదం కలదని తెలుస్తోంది.

4. రక్తస్రావానికి దారితీయవచ్చు:

4. రక్తస్రావానికి దారితీయవచ్చు:

యూనివర్సిటీ ఆఫ్ మేరీ ల్యాండ్ మెడికల్ సెంటర్ సూచనల ప్రకారం బ్లడ్ తిన్నింగ్ మెడిసిన్స్ తో పాటు వెల్లుల్లిని తీసుకోకూడదు.వెల్లుల్లి అనేది బ్లీడింగ్ రిస్క్ ను పెంచుతుంది. సర్జరీ తరువాత వెల్లుల్లిని కనీసం రెండు వారాల వరకు తీసుకోకూడదు.

5. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కి దారితీయవచ్చు

5. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కి దారితీయవచ్చు

పచ్చి వెల్లుల్లిని మరీ ఎక్కువగా తీసుకోవడం వలన గ్యాస్ట్రిక్ హెల్త్ పై దుష్ప్రభావం పడే ప్రమాదం ఉంది. వెల్లుల్లి వలన జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి వెల్లుల్లిని ఆహారంలో మితంగా వాడాలి. అలాగే, వాటిని పచ్చిగా తినడాన్ని అవాయిడ్ చేయాలి.

6. మైకం కమ్మవచ్చు:

6. మైకం కమ్మవచ్చు:

కొంతమందిలో వెల్లుల్లి వలన మైకం కమ్మడాన్ని గుర్తించవచ్చు. నిపుణుల సూచనల ప్రకారం బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అమాంతం తగ్గిపోవడం వలన ఈ సమస్య ఏర్పడుతుంది. కాబట్టి, లో బ్లడ్ ప్రెషర్ తో బాధపడుతున్నవారు ఈ పాయింట్ ను గుర్తుంచుకోవడం మంచిది.

7. ర్యాషెస్ ఏర్పడవచ్చు:

7. ర్యాషెస్ ఏర్పడవచ్చు:

అతిగా పచ్చి వెల్లుల్లిని తీసుకోవడం వలన స్కిన్ ఇరిటేషన్ కి గురికావచ్చు. ఎందుకంటే వెల్లుల్లిలో అల్లీయిన్ ల్యాస్ అనే ఎంజైమ్ కలదు. ఇది స్కిన్ ని ఇరిటేషన్ కి గురిచేస్తుందని గుర్తించాలి.

8. తలనొప్పి:

8. తలనొప్పి:

పచ్చివెల్లులిని తీసుకోవడం వలన మైగ్రైన్ తలనొప్పులు సమస్య మరింత పెరగవచ్చు. త్రిజమినల్ అనే నెర్వ్ ని వెల్లుల్లి ప్రేరేపించడం వలన న్యూరానల్ సిగ్నలింగ్ మాలిక్యూల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇవి బ్రెయిన్ ని కవర్ చేసే మెంబ్రేన్ వైపు దూసుకుపోతాయి. అందువలన, తలనొప్పి సమస్య వేధిస్తుంది.

9. కంటి చూపులో తేడా రావచ్చు:

9. కంటి చూపులో తేడా రావచ్చు:

వెల్లుల్లిని అతిగా తీసుకోవడం వలన కంటి చూపులో తేడా రావచ్చు. హైఫెమా అనే కండిషన్ కు దారితీయవచ్చు. ఈ కండిషన్ లో ఐ ఛాంబర్ లోపల బ్లీడింగ్ ఏర్పడుతుంది. కోర్నియా మరియు ఐరిస్ మధ్య ఉన్న స్పేస్ నే ఐ చాంబర్ అనంటారు. ఈ కండిషన్ వలన కంటిచూపును కూడా కోల్పోయే ప్రమాదం కలదు. అందువలన, వెల్లుల్లిని మితంగానే తీసుకోవాలి.

10. గర్భిణీలకు అనారోగ్యకరం:

10. గర్భిణీలకు అనారోగ్యకరం:

గర్భిణీలు వెల్లుల్లిని అతిగా తీసుకోకూడదు. అతిగా వెల్లుల్లిని తీసుకోవడం వలన గర్భిణీలలో ముందస్తు ప్రసవం అయ్యే సూచనలు కనిపిస్తాయి. అలాగే పాలిచ్చే తల్లులు కూడా వెల్లుల్లిని అతిగా తీసుకోకపోవటం మంచిది.

English summary

10 Side Effects Of Raw Garlic You Should Know

Eating raw garlic or consuming too much of garlic can have side effects on the body which can be life-threatening. It is because garlic contains certain compounds like alliin lyase and fructans that have side effects which include diarrhoea, liver toxicity, problems during pregnancy, low blood pressure, dizziness, vomiting, and nausea.