For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొలెస్ట్రాల్ గురించి మీకు తెలియని 10 ఆశ్చర్యకరమైన నిజాలు !

కొలెస్ట్రాల్ గురించి మీకు తెలియని 10 ఆశ్చర్యకరమైన నిజాలుచెడు కొలెస్ట్రాల్ (LDL) గుండెజబ్బులను, ఇతర గుండెసమస్యల ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది. మంచి కొలెస్ట్రాల్ (HDL) అనేది ఒక 'ఆరోగ్యకరమైన' కొలెస్ట్

|

మీరు కొలెస్ట్రాల్ గురించి ఆలోచించినప్పుడు మీ మనస్సుకి మెదిలే మొట్టమొదటి విషయం ఏమిటి? మీరు కొవ్వును కలిగి ఉన్న ఆహారపదార్ధాల గురించి ఆలోచిస్తున్నారా? మీ శరీర కణాలన్నింటిలో కొలెస్ట్రాల్ అనేది ఒక మైనములా ఉండే పదార్ధం. ఈ కొలెస్ట్రాల్ అనేది 2 రకాలు - 1) చెడు-కొలెస్ట్రాల్ 2) మంచి-కొలెస్ట్రాల్. ఈ ఆర్టికల్ ద్వారా, మీరు కొలెస్ట్రాల గూర్చి వాస్తవాలను తెలుసుకోని ఆశ్చర్యపోతారు.

చెడు కొలెస్ట్రాల్ (LDL) గుండెజబ్బులను, ఇతర గుండెసమస్యల ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది. మంచి కొలెస్ట్రాల్ (HDL) అనేది ఒక 'ఆరోగ్యకరమైన' కొలెస్ట్రాల్, ఇది ధమనులు & కాలేయాల నుంచి చెడు కొలెస్ట్రాల్ను తొలగించి, మానవ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.

10 Surprising Facts About Cholesterol

ఇండియన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, మంచి & చెడు కొలెస్ట్రాల్ల మధ్య ఏర్పడిన సమతుల్యత కారణంగా కార్డియోవాస్కులర్ (గుండె సంబంధిత జబ్బులు)కు, స్ట్రోక్ వంటి ప్రమాదాల ఏర్పడతాయి. భారతీయులకు, HDL కొలెస్ట్రాల్ 50-60 మధ్యన ఉండాలి.

మీరు అనుకోవచ్చు, మీకు కొలెస్ట్రాల్ గురించి ప్రతిదీ తెలుసని. కానీ, ఈ వ్యాసమును చదివిన తర్వాత మీ ఆలోచనలన్నీ ఒక చిన్న బుడగ మాదిరిగా విచ్ఛిన్నం అయిపోతుంది.

1. కొలెస్ట్రాల్ తక్కువగా ఉండటం శరీరానికి మంచిది కాదు :

1. కొలెస్ట్రాల్ తక్కువగా ఉండటం శరీరానికి మంచిది కాదు :

కొలెస్ట్రాల్ ను అధికంగా కలిగి ఉండటం ఏమాత్రం మంచిది కాదని అందరికీ తెలుసు, కానీ చాలా తక్కువ కొలెస్ట్రాల్ను కలిగి ఉండటం కూడా అనారోగ్యకరమైనది కావచ్చు. నిపుణుల సూచనల ప్రకారం, మీ శరీర మొత్తంలో కొలెస్ట్రాల్ 200 mg / dL కంటే తక్కువగా ఉండాలని సూచించారు, ఇది పెద్దలకు ఉండాల్సిన సగటు అని, 160 mg / dL కంటే తక్కువ కొలెస్ట్రాల్ను కలిగి ఉండటం అనేది క్యాన్సర్తో సహా ఇతర ఆరోగ్య ప్రమాదాల ముప్పును పెంచుతుంది.

2. వ్యాయామం, మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది :

2. వ్యాయామం, మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది :

మీ జీవనశైలిలో మంచి మార్పు కోసం వ్యాయామం తప్పక చేయాలని డాక్టర్ల చేత సిఫార్సు చెయ్యబడింది. శారీరక శ్రమ మీ శరీరంలో మంచి కొలెస్ట్రాల్ (HDL) ను పెంచుతుంది. ఒక తేలికపాటి వ్యాయామమును (లేదా) వారానికి సగటున ఒక అరగంట వ్యాయామము చెయ్యడం వల్ల హై డెన్సిటీ లిపోప్రొటీన్ (HDL) కొలెస్ట్రాల్ను పెంచుతుంది.

3. కొలెస్ట్రాల్ రహిత ఆహారము, కొలెస్ట్రాల్ను పెంచుతుంది :

3. కొలెస్ట్రాల్ రహిత ఆహారము, కొలెస్ట్రాల్ను పెంచుతుంది :

కొలెస్ట్రాల్ అనేది జంతువు కాలేయం చేత తయారు చేయబడుతుంది. మాంసము, గుడ్లు, పాల వంటి రూపాలలో ఆహారంగా లభించే జంతువులలో మాత్రమే కొలెస్ట్రాల్ను కలిగి ఉంటాయి. బాగా వేయించిన ఆహారాలలో కొలెస్ట్రాల్-పెంచే "ట్రాన్స్ ఫ్యాట్స్"ను కలిగి ఉంటాయి. ట్రాన్స్ ఫ్యాట్స్, శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ వల్ల మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతాయి.

4. హై కొలెస్టరాల్, అంగస్తంభనకు కూడా కారణం కావచ్చు :

4. హై కొలెస్టరాల్, అంగస్తంభనకు కూడా కారణం కావచ్చు :

అధిక కొలెస్ట్రాల్ను కలిగి ఉండేవారిలో అంగస్తంభన, అల్జీమర్స్ వ్యాధి, మూత్రపిండాల వైఫల్యాల వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలతో ఎక్కువ సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఒక ప్రముఖ అధ్యయనం ప్రకారం, మీరు అనుసరించే డైట్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న ఆహారాలను అధికంగా తీసుకోవడం వల్ల కాలేయ క్యాన్సర్ అభివృద్ధి చెందే ప్రమాదానికి కారణమవుతున్నాయి.

5. కొలెస్ట్రాల్ను అందించే గుడ్లను తినండి :

5. కొలెస్ట్రాల్ను అందించే గుడ్లను తినండి :

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, మీ రోజువారీ కొలెస్ట్రాల్ను 300 మిల్లీగ్రాముల కంటే తక్కువగా తీసుకోవడం మంచిదని సిఫార్సు చెయ్యబడింది. అందువల్ల మీరు సుమారుగా 213 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ను కలిగి ఉండేందుకు, ప్రతిరోజూ ఒక పెద్ద గుడ్డును తినండి.

6. జన్యువుల రీత్యా మీరు అధిక కొలెస్ట్రాల్ను కలిగి ఉండవచ్చు :

6. జన్యువుల రీత్యా మీరు అధిక కొలెస్ట్రాల్ను కలిగి ఉండవచ్చు :

మనము కలిగి ఉండే కొలెస్ట్రాలలో 75% జన్యువుల రీత్యానూ - 25% ఆహార రీత్యాగా ఉంటుందని ఒక అంచనా. చేపలు, మాంసం, పాల ఉత్పత్తుల వంటి ఆహార పదార్ధాలలో కలిగి ఉండే మంచి కొలెస్ట్రాల్లు మన శరీరంలో అదనంగా ఉన్న కొలెస్ట్రాల్ను తగ్గించి, శరీర వ్యవస్థ సరిగా పనిచేసేలా చేస్తుంది.

7. పిల్లల్లో కూడా అధిక కొలెస్ట్రాల్ ఉంది :

7. పిల్లల్లో కూడా అధిక కొలెస్ట్రాల్ ఉంది :

పిల్లల చిన్న వయస్సులోనే చెడు కొలెస్ట్రాల్ను అధికంగా కలిగి ఉండే ప్రమాదాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న పిల్లలలో వచ్చే ఊబకాయం అనేది వారి కుటుంబ చరిత్ర ఆధారంగా ఉన్న గుండెజబ్బులు (లేదా) అధిక కొలెస్ట్రాల్ పరిస్థితుల ఆధారంగా ఉంటాయి.

8. చెమట - మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది :

8. చెమట - మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది :

మీరు మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను వ్యాయామం ద్వారా పెంచుకోవచ్చని, మీకు తెలుసా? జాగింగ్, రన్నింగ్ వంటి మధ్యస్థ వ్యాయామ పద్ధతులను పాటిస్తే మీ శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. మరింత ఎక్కువగా మీరు చెమటను చిందించడం వల్ల, మీరు మరింత చెడ్డ కొలెస్ట్రాల్ను తగ్గించుకోగలరు.

9. కొలెస్ట్రాల్ స్థాయిలలో అసమానతలు :

9. కొలెస్ట్రాల్ స్థాయిలలో అసమానతలు :

పురుషుల కంటే మహిళలు తక్కువ కొలెస్ట్రాల్ స్థాయిని కలిగి ఉంటారు. కానీ, గర్భధారణ సమయంలో, మహిళలలో కూడా కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. ఇది పిల్లల మెదడు అభివృద్ధికి బాగా సహాయపడుతుంది. రుతువిరతి తరువాత, ఒక మహిళలో చెడ్డ కొలెస్ట్రాల్ స్థాయి పెరిగి, మంచి కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది.

10. కొలెస్ట్రాల్ లేకుండా మనము జీవించలేము :

10. కొలెస్ట్రాల్ లేకుండా మనము జీవించలేము :

మీ శరీరంలో ఉండే హార్మోన్లు, కణాలు సరిగా పనిచేసేలా చేయడానికి కొలెస్ట్రాల్ అనేది చాలా అవసరం. ఇది శరీరంలో ఉన్న అన్ని కణాలను నిర్మించబడే బ్లాక్గా కూడా పిలువబడుతుంది. కొవ్వును తయారుచేయడానికి కాలేయానికి అవసరమైన ఆమ్లాలలో అందించడంలో ఈ కొలెస్ట్రాల్ బాగా సహాయపడుతుంది.

English summary

10 Surprising Facts About Cholesterol

Bad cholesterol (LDL) doubles the risk of heart disease and other heart problems. Good cholesterol (HDL) is a 'healthy' cholesterol that lowers bad cholesterol. Physical activity can increase good cholesterol (HDL) level in the body. High cholesterol has been linked to a greater risk of erectile dysfunction, Alzheimer's disease and kidney failure.
Story first published:Thursday, March 29, 2018, 12:36 [IST]
Desktop Bottom Promotion