ఇలాచీ ఛాయ్ లో 10 వండర్ ఫుల్ హెల్త్ బెనిఫిట్స్

By: Mallikarjuna
Subscribe to Boldsky

కార్డమం (యాలకలు లేదా ఏలకలు) గురించి వినే ఉంటారు. పాయసం చేయాలన్నా, వెరైటీ వంటలు చేయాలన్నా, పులావ్, బిర్యానీలు వండాలన్నా,ముఖ్యంగా స్వీట్స్ చేయాలాన్నా యాలకలను తప్పనిసరిగా వాడుతారు. ఈ విషయం మీకు కూడా తెలుసుంటుంది. ఎందుకంటే యాలకల్లో అద్భుతమైన ఆరోమా వాసన కలిగి ఉంటుంది. ఈ ఆరోమా వాసన వల్లే యాలకలను మసాలా దినుసులన్నింటిలోకి దీన్ని 'క్వీన్ ఆఫ్ స్పైసెస్ ' అని పిలుస్తుంటారు. అద్భుతమైన రుచి, మరియు స్వీట్ ఫ్లేవర్ ను కలిగి ఉండే ఈ యాలకలు మీ వంటలకు అద్భుతమైన రుచి, వాసను అందిస్తాయి.

యాలకల్లో ఉండే స్ట్రాంగ్ ఆరోమా వాసన , యాలకల్లో ఉండే విత్తనాల్లోని నూనెల వల్ల అటువంటి బలమైన వాసన వస్తుంది. వాసన, రుచి మాత్రమే కాదు, యాలకల్లో అద్భుత ఉపయోగాలు కూడా ఉన్నాయి. యాలకల్లో ఉండే విత్తనాల్లో టెర్పినైన్, బోర్నియోల్, యుకలిప్టోల్, కర్పూరం మరియు లెమనోన్ వంటివి ఉండటం వల్ల ఆరోమా వాసన అంత స్ట్రాంగ్ గా హెల్త్ బెనిఫిట్స్ ఫుల్ గా ఉన్నాయి.

యాలకలలోని విత్తనాలు పొడి చేసి నీళ్ళలో వేసి మరిగిస్తే అద్భుతమైన ఫ్లేవర్ సువాసన వస్తుంది. దీనితో తయారచేసిన టీ ఇండియాలో చాలా ఫేమస్, దీన్నే కొన్ని ప్రదేశాల్లో 'ఇలాచీ చాయ్' అని కూడా పిలుస్తారు. ఈ టీని నేరుగా అలాగే సర్వ్ చేయరు. దీనికి కొద్దిగా పాలు, పంచదార కలిపి సర్వ్ చేయడం వల్ల చాలా అద్భుతంగా డిఫరెంట్ ఫ్లేవర్ కలిగి ఉంటుంది.

యాలకల్లో ఉండే ఆరోమా వాసనకు అద్భుతమైన రుచి తోడవ్వటం వల్లే ప్రపంచంలో మిలియన్ల మంది ఇలాచీ చాయ్ కి దాసోహం అవుతున్నారు.

హైబ్లడ్ ప్రెజర్, వ్యాధినిరోధకత బలహీనంగా ఉన్నవారు, శ్వాసనాళ ఇన్ఫెక్షన్స్ తో బాధపడే వారు, ఐరన్ లోపం ఉన్నవారు, ఊబకాయగ్రస్తులు, అజీర్తితో బాధపడే వారి యాలకలతో తయారుచేసిన టీ మంచిది, ఆరోగ్యం పరంగా మేలు చేస్తుంది. యాలకలతో తయారుచేసిన టీని తరుచూ తాగుతుండాలని అనడానికి, ఇక్కడ 10 ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

1. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

1. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

ఆయుర్వేదం ప్రకారం భోజనం చేసిన తర్వాత యాలకలతో తయారుచేసిన టీ తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది, పొట్టలో యాసిడ్స్ క్రమబద్దం అవుతాయి, స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల, జంక్ ఫుడ్స్ తినడం వల్ల ఆమ్లాలు పెరగడం సాధారణం, గ్యాస్ , ఎసిడిటి వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. కాబట్టి, భోజనం తర్వాత యాలకల టీ తాగడం మంచిది.

2. డెంటల్ ట్రీట్మెంట్

2. డెంటల్ ట్రీట్మెంట్

యాలకల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇవి డెంటల్ బ్యాక్టీరియాను న్యూట్రలైజ్ చేస్తుంది. భోజనం చేసిన వెంటనే ఒక కప్పు యాలకల టీ తాగడం వల్ల బ్యాడ్ బ్రీత్ తగ్గుతుంది, గొంతు తడి ఆరిపోవడం వంటి సమస్యలుండవు. దంతాలకు కూడా యాలకల టీ వల్ల అద్భుత ఉపయోగమే ఉంది, ఇది దంతాలను తెల్లగా మార్చుతుంది. పవర్ ఫుల్ ఫ్యాగ్రెన్స్ వల్ల నోట్లో ఒక పూతలాగే కొన్ని గంటల పాటు ఉంటుంది.

3. ముక్కు దిబ్బడ

3. ముక్కు దిబ్బడ

దగ్గు, జలుబుతో బాధపడుతున్నట్లే, ఒక కప్పు ఇలాచీ ఛాయ్ తాగడం వల్ల గొంతు నొప్పి, దగ్గు, ముక్కు దిబ్బడ నుండి ఉపశమనం కలుగుతుంది. ముక్కులు ఫ్రీ అవుతాయి. శ్వాస నాళంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ముక్కులో మ్యూకస్ తొలగించి శ్వాసనాళం క్లియర్ చేస్తుంది

4. యాంటీబ్యాక్టీరియల్ గుణాలు

4. యాంటీబ్యాక్టీరియల్ గుణాలు

కార్డమం టీలో అనేక యాంటీబ్యాక్టీరియల్ గుణాలున్నాయి. ఇది గ్రేట్ ఆస్ట్రిజెంట్, అంతర్గతంగానే కాదు, బహిర్గతంగా కూడా ఇది గాయాలను మాన్పుతుంది. కాలిన గాయలను మాన్పుతుంది. యాలకల టీ తాగడం వల్ల చిన్న చిన్న గాయాలను మాన్పుతుంది.

5. ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది

5. ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది

యాలకల టీలో ఉన్న అనేక యాంటీఆక్సిడెంట్ శరీరంలో ఫ్రీరాడికల్స్ ను తొలగించడానికి సహాయపడుతుంది. డ్యామేజ్ అయిన సెల్స్ ను తొలగిస్తుంది. యాలకల టీలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆర్థ్రైటిస్, , తలనొప్పి, ఇతర గాయాలను మాన్పుతుంది.

6. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది

6. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది

ఒకటి , రెండు కప్పుల యాలకల టీ తాగడం వల్ల రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. ఇది మీ చర్మానికి గ్లోయింగ్ లుక్ ను అందిస్తుంది. ఇది ఇతర ఆర్గాన్స్ పనిచేయడానికి, వాటి పనితీరును మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. యాలకల్లో ఉండే ఐరన్ కంటెంట్ ఎర్రరక్త కణాలను పెంచి, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

7. హార్ట్ హెల్త్

7. హార్ట్ హెల్త్

యాలకలతో తయారుచేసిన టీ తాగడం వల్ల హైపర్ టెన్షన్ తగ్గుతుంది. యాలకల్లో ఉండే హైలెవల్ పొటాషియం హైబ్లడ్ ప్రెజర్ తో బాధపడే పేషంట్స్ కు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. పొటాషియం స్ట్రెయిన్ తగ్గిస్తుంది. రక్తనాళాల్లో అడ్డంకులు తొలగించి హార్ట్ అటాక్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

8. డిటాక్సిఫై చేస్తుంది

8. డిటాక్సిఫై చేస్తుంది

వ్యాధినిరోధకత మెరుగ్గా ఉండాలంటే ముందుగా శరీరం శుభ్రంగా ఉండాలని, శరీరంలో వ్యర్థాలను తొలగించడంలో ఇలాచీ ఛాయ్ గ్రేట్ గా ఉపయోగపడుతుంది., ఇందులో ఉండే డిటాక్సిఫైయింగ్ ఏజెంట్ లివర్ ఫంక్షన్ ను క్రమబద్దం చేస్తుంది. టాక్సిన్స్ ను తొలగిస్తుంది.

9. బరువు తగ్గడానికి సహాయపడుతుంది

9. బరువు తగ్గడానికి సహాయపడుతుంది

యాలకల్లో ఉండే వివిధ రకాల విటమిన్లు, మెటబాలిజం ేటును పెంచుతుంది. దాంతో శరీరం మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దాంతో ఫ్యాట్ త్వరగా కరుగుతుంది. శరీరానికి ఎక్కువ ఎనర్జీని అందిస్తుంది. బరువు తగ్గేవారికోసం కార్డమం టీ ఉపయోగకరమైనది.

10. తలనొప్పి తగ్గిస్తుంది

10. తలనొప్పి తగ్గిస్తుంది

తలనొప్పి ఎక్కువగా బాధిస్తుంటే, ఒక కప్పు యాలకల టీ తాగడం వల్ల మెడ కండరాలు లాక్స్ చేసేందుకు యాలకల టీ సహాయపడుతుంది. స్ట్రెస్ తగ్గిస్తుంది. ఈ టీ తాగిన తర్వాత తలనొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

యాలకల టీ ఎలా తయారుచేయాలి

యాలకల టీ తయారుచేయడం చాలా సులభం మరియు సింపుల్ . యాలకలను పొడి చేసి పెట్టుకోవాలి.

ఒక పాన్ లో ఒక గ్లాసు నీళ్ళు పోసి, యాలకలపొడి వేసి బాగా మరిగించాలి.

నీళ్ళు మరిగే సమయంలో టీపొడి , పంచదార వేసి మరికొద్ది సేపు మరిగించాలి.

అందులో పాలు(సరిపడా) పోసి, బాగా ఉడికించాలి. టీ బ్రౌన్ కలర్లోకి మారి ఆరోమా వాసనతో , మంచి రంగుతో తయారవుతుంది.

బాగా ఉడికిన తర్వాత , వడగట్టి, వేడి వేడిగా అందివ్వండి.

English summary

10 Wonderful Health Benefits Of Cardamom Tea

Cardamom tea by itself features a diverse and aromatic taste, and this particular unique taste is liked by millions of people around the world. It is a spiced tea that originated in India most commonly known as 'elaichi chai'. It is good for people suffering from high blood pressure, a weak immune system, respiratory infections, iron deficiency, obesity, indigestion, etc.
Subscribe Newsletter