For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాఫీ గురించి మనం నమ్మలేని నిజాలెన్నో ఉన్నాయని తెలుసా...

మిమ్మల్ని ఆశ్చర్యపరిచే కాఫీలోని 13 ఫ్యాక్ట్స్ !!

By Staff
|

మీరు కాఫీ ప్రియులా? అయితే మీకు ఈ విషయం తెలుసా? ఈ ప్రపంచంలో ఒక రోజుకు 2.25 బిలియన్ల కప్పు కాఫీని తాగుతారట! దీన్ని బట్టి తెలుస్తుంది కాఫీ లవర్స్ ఎంత మంది ఉన్నారో అని. నిద్ర లేచిన వెంటనే కాఫీ గొంతులోకి దిగందే బెడ్ దిగరు కొంత మంది. అంత పిచ్చి కాఫీ అంటే. ఈ ప్రపంచంలో కాఫీ ఇష్టపడేవారు వెలకట్టలేనంత మంది ఉంటారు.

కొన్ని మిలియన్లో ప్రజలు కాఫీతోనే వారి దినచర్యను ప్రారంభిస్తారు. కాఫీలో అద్భుతమైన ఆరోమా వాసన, అద్భుతమైన రుచి, మంచి సువాసన కలిగిన ఫ్లేవర్ ఉంది. అంతే కాదు వీటితో పాటు అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది.

కాఫీలో వివిధ రకాలున్నాయి. వాటిలో ఎస్ ప్రెసో, డికేఫ్, ఫ్రెంచ్ ప్రెస్, క్యాపిచ్చినో, మొదలగు వెరైటీ కాఫీలు కూడా ఆయా దేశాల్లో ప్రసిద్ది చెందాయి. కాఫీ తయారీకి ఉపయోగించే కాఫీ బీన్ కొద్దిగా అసిడిక్ నేచర్ ను కలిగి ఉంటుంది. అలాగే ఇందులో ఉండే కెఫిన్ వల్ల స్టిములేటింగ్ ఎఫెక్ట్ ను కలిగి ఉంటారు.

మీరు కూడా కాఫీ ప్రియులైతే, కాఫీ గురించి మీకు తెలియని 13 సర్ఫ్రైజింగ్ ఫ్యాక్ట్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

13-surprising-facts-about-coffee-you-never-knew

1. కాఫీ ఇన్ఫ్లమేసన్ తగ్గిస్తుంది

కాఫీలో ఫాలీఫినాల్స్ అనే కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి, ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. హెవీ మీల్స్ తిన్నప్పుడు కడుపుబ్బరంగా అనిపించకుండా కాఫీ ఎంజాయ్ చేయవచ్చు. మీరు ఎప్పుడైనా ఒక మంచి హెవీ మీల్స్ తినడానికి ముందు కాఫీ ఆర్డర్ చేసుకోండి.

2. అద్భుతమైన యాంటీఆక్సిడెంట్

2. అద్భుతమైన యాంటీఆక్సిడెంట్

కాఫీలో అద్భుతమైన యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. కాఫీ రోజూ తాగడం వల్ల శరీరానికి కావల్సిన యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా అందుతాయి. ఒక కప్పు కాఫీలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి వ్యాధులను తగ్గిస్తాయి.

3. రిఫ్రెష్ చేస్తుంది

3. రిఫ్రెష్ చేస్తుంది

వేకువ జామునే నిద్రలేయడం కొంచెం కష్టంగా ఫీలవుతారు చాలా మంది, అదే నిద్రలేచిన వెంటనే ఒక కప్పు కాఫీ తాగి చూడండి రిఫ్రెష్ గా ఫీలవుతారు. అలర్ట్ నెస్ వస్తుంది. నిద్ర మేల్కొంటారు.

4. కాఫీలో ఉండే ఆరోమా వాసన మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది

4. కాఫీలో ఉండే ఆరోమా వాసన మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది

కాఫీ అంటే ఇష్టమున్నవారు ఘుమఘుమల ఆరోమా వాసన ఉత్సహాపరుస్తుంది. కాఫీ వాసన మీ శరీరాన్ని రిలాక్స్ చేయడంతో పాటు, డీస్ట్రెస్ చేస్తుంది. ఆరోమా వాసన నిద్రలేపుతుంది, ఏకాగ్రతను పెంచుతుంది. అందుకే కాఫీని పెద్దవారు ఎందుకు అంత ఇష్టపడుతుంటారో ఇప్పటికైనా మీకు అర్థమైందా!

5. బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది

5. బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది

రోజూ వాకింగ్ కు వెళ్ళడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, అయితే, మీకు తెలుసా? కాఫీ కూడా రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది! మరి మీకు కాఫీ తాగడానికి కారణం వెతుకుతుంటే ఇది ఒక బెస్ట్ రీజన్. కాఫీ రెగ్యులర్ డైట్ లో బాగం చేసుకుని, రక్తప్రసరణను మెరుగుపరుచుకోండి.

6. శరీరంను ఉత్సహాపరుస్తుంది

6. శరీరంను ఉత్సహాపరుస్తుంది

శారీరకంగా ఉత్సాహంగా పనిచేయడానికి కాఫీలోని కెఫిన్ కంటెంట్ ముఖ్యపాత్ర వహిస్తుందని కొన్ని పరిశోధనల ద్వారా వెల్లడించారు. అందుకే అథ్లెట్స్ లో ఉన్నవారు కాఫీని వ్యాయామాల సమయాల్లో తీసుకుంటుంటారు. వ్యాయామం చేసిన తర్వాత కండరాల నొప్పులను , అలసటను తగ్గించడంలో కాఫీ గ్రేట్ రెమెడీ.

7. క్యాలరీలు శూన్యం

7. క్యాలరీలు శూన్యం

కాఫీ తాగడం వల్ల ఎక్స్ ట్రా క్యాలరీలు, ఎక్స్ ట్రా కార్బోహైడ్రేట్స్ చేరుతాయన్న భయమక్కర లేదు. కాఫీ లోఫ్యాట్ డ్రింక్. అది రెగ్యులర్ గా మీరు ఇంట్లో తాగే కాఫీ అయినా, బయట తాగే కాఫీ అయినా క్యాలరీలు మాత్రం జీరో. ఫిల్టర్ కాపీలో 0.6శాతం ఫ్యాట్ , బ్లాక్ కాఫీ లోఫ్యాట్ కలిగి ఉంటాయి.

8. తలనొప్పి తగ్గిస్తుంది

8. తలనొప్పి తగ్గిస్తుంది

రీసెర్చ్ ప్రకారం, మైగ్రేన్ లక్షణాలను నివారిస్తుంది, తలనొప్పి తగ్గిస్తుంది. రక్తనాళాల సమస్య వల్ల వాస్క్యులర్ తలనొప్పిని తగ్గించడంలో కెఫిన్ సహాయపడుతుంది. తలనొప్పి నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.

9. ఏకాగ్రతను పెంచుతుంది

9. ఏకాగ్రతను పెంచుతుంది

కాఫీ శరీరాన్ని మాత్రమే కాదు, మైండ్ ను కూడా ఉత్సాహాపరుస్తుంది. మెమరీ స్కిల్స్ మెరుగుపరుస్తుంది . న్యూరో డిజనరేటివ్ వ్యాధులను నివారిస్తుంది. షార్ట్ టర్మ్ మెమరీ లాస్ నుండి కాపాడుతుంది.

10. మెటబాలిజం రేటును పెంచుతుంది

10. మెటబాలిజం రేటును పెంచుతుంది

మీ మెటబాలిజం రేటును పెంచాలంటే ఒకకప్ప కాఫీ తాగాల్సిందే, రోజంతా మీకు ఎక్స్ ట్రాకిక్ ను అందించి, మెమెరీ పవర్ ను పెంచుతుంది.

11. చర్మానికి రక్షణ కల్పిస్తుంది

11. చర్మానికి రక్షణ కల్పిస్తుంది

ఎల్లప్పుడు చర్మం యూవీ కిరణాలకు బహిర్గతం అవ్వడం వల్ల స్కిన్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. కాఫీలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల స్కిన్ డ్యామేజ్ కాకుండా ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది. ముడుతలు లేకుండా చేస్తుంది

12. కాఫీలోన్యూట్రీషియన్స్ అధికం

12. కాఫీలోన్యూట్రీషియన్స్ అధికం

కాఫీలో వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా విటమిన్స్, విటమిన్ బి2 అధికంగా ఉండటం వల్ల ఇది మెటబాలిజం రేటును పెంచుతుంది. ఎనర్జీని అందిస్తుంది. విటమిన్ బి5 స్ట్రెస్ తగ్గిస్తుంది. హార్ట్ రేటు మెరుగుపరిచి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

13. మూడ్ ను మెరుగుపరుస్తుంది

13. మూడ్ ను మెరుగుపరుస్తుంది

కాఫీలో ఉండే కెఫిన్ కంటెంట్ సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ ను మెరుగుపరుస్తుంది. ఇది శరీరంలో న్యూరోట్రాన్స్ మీటర్స్ ను పెంచుతుంది. న్యూరోట్రాన్స్ మీటర్ అనేవి సెరోటినిన్, న్యూరోడ్రినలిన్ , ఇవి మూడ్ ను మెరుగుపరచడానికి సహాయపడుతాయి.

English summary

13-surprising-facts-about-coffee-you-never-knew

Coffee is a drink that many of us love and there are many reasons why it is the most loved beverage around the world. Read to know the surprising facts on coffee you never knew.
Desktop Bottom Promotion