పొన్నగంటి కూర.. వీర్యకణాల్లోని లోపాలను సరిదిద్దుతుంది..అనారోగ్యాలను తరిమికొడుతుంది

Written By:
Subscribe to Boldsky

ప్రస్తుతం మనం తీసుకునే ఆహారంలో, పీల్చుకునే గాలిలో రసాయనాలు ఉండటంతో అవి రక్తంతో కలిసిపోతున్నాయి. తద్వారా రక్తం అశుభ్రమైపోతుంది. అపరిశుభ్రమైన రక్తం ఎన్నో రోగాలకు దారి తీస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడానికి మనకు ఎంతో ఉపకరిస్తుంది పొన్నగంటి కూర. అంతే కాదు, దీని వల్ల బరువు తగ్గడం, పెరగడం, శరీర సౌష్టవం పెరగడం వంటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

రక్తాన్ని శుద్ధి చేసేందుకు

రక్తాన్ని శుద్ధి చేసేందుకు

రక్తాన్ని శుద్ధి చేసేందుకు.. శుభ్రం చేసిన పొన్నగంటి ఆకును కట్ చేసి.. పెసరపప్పు, చిన్న ఉల్లి పాయలు, జీలకర్ర, వెల్లుల్లి, మిరియాల పొడి చేర్చి ఉడికించి తీసుకుంటే సరిపోతుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారు పొన్నగంటి కూరను ఉడికించి ఉప్పు, మిరియాల పొడి చేర్చి తీసుకుంటే బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

బరువు పెరగాలనుకునే వారు

బరువు పెరగాలనుకునే వారు

అదే బరువు పెరగాలనుకునే వారు కందిపప్పు, నెయ్యితో పొన్నగంటి కూరను కలిపి తీసుకుంటే బరువు పెరుగుతారు. శరీరానికి మేలు చేయడంతో పాటు పొన్నగంటి కూరను తీసుకోవడం ద్వారా శరీర ఛాయను మెరుగుపరుచుకోవచ్చు.

కంప్యూటర్ల ముందు కూర్చునే వారికి

కంప్యూటర్ల ముందు కూర్చునే వారికి

ఎక్కువ ఎండల్లో తిరిగి పనిచేసే వారికి, గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు కూర్చునే వారికి కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడుతాయి. కంటి సమస్యలు ఏర్పడుతాయి. అలాంటి సమస్యలు ఎదురైతే.. పొన్నగంటి ఆకుతో తాలింపు చేసుకుని తీసుకుంటే ఫలితం ఉంటుంది.

ప్రొటీన్ల పుట్ట

ప్రొటీన్ల పుట్ట

ఇంకా ఈ ఆకుకూర నోటి దుర్వాసనను పోగొడుతుంది. ఇందులో బి, సి విటమిన్‌లు ఎక్కువగా వుంటాయి. పొన్నగంటి కూర జీర్ణశక్తిని పెంచుతుంది. మూత్ర వ్యాధులవను నివారిస్తుంది. పొన్నగంటి ప్రొటీన్ల పుట్ట అని సామెత. విటమిన్ ఎ, బి6, సి, ఫాలేట్, రిబొఫ్లావిన్, పొటాసిం, ఇనుము, మెగ్నీషియం దీనిలో సమృద్ధిగావుంటాయి.

అమైనో ఆమ్లాలు

అమైనో ఆమ్లాలు

గోధుమపిండి, బియ్యం, ఓట్స్‌లో కంటే 30 శాతం అధికంగా ప్రొటీన్లు దీనిలో వున్నాయి. అమైనో ఆమ్లాలు కూడా లభిస్తాయి. బరువు తగ్గాలనేవారికి ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఎక్కువగా తినాలి. ఇందులో కొలెస్ట్రాల్ చాలా తక్కువగా వుంటుంది. రోగనిరోధక శక్తి దీనిలో వుంది. ఈ కూరలో లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటును తగ్గించి గుండె సమస్యలనుంచి కాపాడుతుంది.

పోషకాలు కాన్సర్ కారకాలతో పోరాడతాయి

పోషకాలు కాన్సర్ కారకాలతో పోరాడతాయి

ఆస్తమా, బ్రాంకైటిస్ బాధితులు ఈ ఆకు రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచిది. దీనిలోని కాల్షియమ్ ఎముకల ఎదుగుల, ఆస్టియోపోరోసిస్ వంటివాటిని దూరం చేయడానికి దోహదం చేస్తుంది. దీనిలోని పోషకాలు కాన్సర్ కారకాలతో పోరాడతాయి. చర్మవ్యాధులు, రక్తస్రావం, అజీర్ణం, అరిచేతి మంటలకు బాగా పనిచేస్తాయి. ఈ ఆకు పెసరపతో, పొడికూర, పప్పులో వేసుకోవచ్చు. దీని కూర కంటికి ఎంతో మంచిది.

వీర్యకణాల్లోని లోపాలను సరిచేసే పొన్నగంటి కూర

వీర్యకణాల్లోని లోపాలను సరిచేసే పొన్నగంటి కూర

పొన్నగంటి కూరతో కంటి చూపు పొందండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పొన్నగంటి కూర జీవక్రియల్లోని లోపాలను, వీర్యకణాల్లోని లోపాలను సరిచేస్తుందట. టేబుల్‌స్పూను తాజా ఆకుల రసంలో వెల్లుల్లి కలిపి తీసుకుంటే దీర్ఘకాలిక దగ్గు, ఆస్తమా వ్యాధులు తగ్గుతాయట. కంటికలకలకు, నరాల్లో నొప్పికి ముఖ్యంగా, వెన్నునొప్పికి పొన్నగంటి కూర దివ్యౌషధంగా పనిచేస్తుంది. వైరల్, బ్యాక్టీరియాల కారణంగా తలెత్తే జ్వరాలనూ ఇది నివారిస్తుంది.

క్రమం తప్పకుండా తీసుకోవాలి

క్రమం తప్పకుండా తీసుకోవాలి

మధుమేహుల్లో పొన్నగంటి కూర కణజాలం దెబ్బతినకుండా చూడటంతో పాటు ఆ వ్యాధి కారణంగా కంటిచూపు తగ్గకుండా చేస్తుంది. అందుకే ఇతర మందులతో పాటుగా ఆహారంలో దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

రోజుకి రెండుమూడుసార్లు

రోజుకి రెండుమూడుసార్లు

మొలల వ్యాధినీ ఇది నివారిస్తుంది. అయితే ఈ వ్యాధి బాధితులు దీన్ని ఇతర నూనెలతో కాకుండా ఆవునెయ్యితో వండుకుని తింటే మంచిదట. లేదా రెండు టేబుల్‌స్పూన్ల ఆకు రసాన్ని ముల్లంగి ఆకు రసంతో కలిపి రోజుకి రెండుమూడుసార్లు నెలరోజులపాటు తీసుకుంటే ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

పొన్నగంటి కూర

పొన్నగంటి కూర

పొన్నగంటి కూరను ఈ విధంగా తయారు చేసుకోవొచ్చు.

కావలసిన పదార్థాలు : పొన్నగంటి కూర... ఆరు కట్టలు, ఉల్లిపాయలు రెండు, పచ్చికొబ్బరి పావు భాగం, నూనె తగినంత, పసుపు చిటికెడు.

ఇక పోపు కోసం ఎండుమిరపకాయలు, మిపపప్పు... సరిపడా

ఆవాలు, జీలకర్ర కరివేపాకు, వెల్లుల్లి... సరిపడా తీసుకోవాలి.

తయారీ విధానం

తయారీ విధానం

పొన్నగంటి ఆకును బాగా కడిగిన తరువాత సన్నగా తరిగి ఉంచుకోవాలి. ముందుగా పోపు వేసి, ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. తరువాత కొంచెం పసుపు వేసి, తరిగిన ఆకు వేసి మూతపెట్టి కాసేపు మగ్గనివ్వాలి. మూత తీసి, సరిపడా ఉప్పు వేసి నీరంతా ఇగిరేవరకూ వేయించాలి. చివరగా దించేముందు కొబ్బరి తురుము వేసి కలపాలి. ఈ ఆకుకూరను తినడం వల్ల కంటిచూపు సమస్యలు ఎదుర్కొంటున్న వారికి చాలా మేలు చేకూరుతుంది.

English summary

15 health benefits of alternanthera sessilis

15 health benefits of alternanthera sessilis
Story first published: Friday, May 11, 2018, 17:00 [IST]