For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లైంగిక పటుత్వానికి.. ఆరోగ్యానికి.. ఆధ్యాత్మికతకు చిరునామా మామిడి ఆకులు

నీటిలో మామిడి ఆకులు మరిగించి తాగడం వల్ల చాలా లాభాలున్నాయి. మామిడి ఆకుల నీటిని తాగకుండా, చెవిలో వేసుకుంటే చెవినొప్పి సమస్యలను దూరం పెట్టొచ్చు. మామిడి ఆకులతో ప్రయోజనాలు.

|

మామిడి చెట్టు పండ్లే కాదు ఆకులు కూడా మ‌న‌కు ఉప‌యోగ‌క‌ర‌మే. పండుగలు, శుభకార్యాల‌ సమయంలో ఇంటి ద్వారాలకు మామిడి తోర‌ణాలు ఎందుకుక‌డ‌తారో తెలుసా..? మామిడి చెట్టు పండ్లే కాదు ఆకులు కూడా మ‌న‌కు ఉప‌యోగ‌క‌ర‌మే. వాటిని ప‌లు అనారోగ్యాలు తొల‌గించుకునేందుకు ఆయుర్వేదంలో వాడుతారు.

మామిడి ఆకులపైనా పెట్టండి

మామిడి ఆకులపైనా పెట్టండి

కానీ, ప్రతి ఒక్కరి ధ్యాసా మామిడి కాయలపైనే కాదు.. కాస్త మామిడి ఆకులపైనా పెట్టండి. ఎందుకంటే వీటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయట. ఓస్... మామిడి ఆకులా అని తీసిపారేయకండి. వీటిల్లో ఉండే పోషక విలువల మాటల్లో చెప్పలేనివి. మామిడి ఆకుల్లో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈ లతో పాటు కాపర్, పొటాషియం, మెగ్నేషియం, ఫ్లెవోనాయిడ్స్, సాపోనిన్స్.. అబ్బో ఇంకెన్నో పోషకాలున్నాయి.

మామిడి ఆకులను నీళ్ళలో మరిగించి

మామిడి ఆకులను నీళ్ళలో మరిగించి

మామిడి ఆకుల్లో చాలా సైన్స్ దాగుంది కాబట్టే వేల ఏళ్ళుగా, మన ఇంటి తలుపుల ముందు మామిడి తోరణాలు ఉండటం సంప్రదాయంగా వస్తోంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మామిడి ఆకులను నీళ్ళలో మరిగించి, ఆ నీటిని తాగడం వల్ల శరీరానికి కలిగే లాభాలను తెలుసుకుని ఆచరించే ప్రయత్నం చేయండి.

చాలా లాభాలున్నాయి

చాలా లాభాలున్నాయి

నీటిలో మామిడి ఆకులు మరిగించి తాగడం వల్ల చాలా లాభాలున్నాయి. మామిడి ఆకుల నీటిని తాగకుండా, చెవిలో వేసుకుంటే చెవినొప్పి సమస్యలను దూరం పెట్టొచ్చు. గాయల దగ్గర మామిడి ఆకులని నూరి పెట్టినా, లేదంటే మామిడి ఆకులు మరిగిన నీటిని పోసినా తక్షణ ఉపశమనం లభిస్తుంది.

యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలం

యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలం

మామిడి ఆకుల్లో యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలం. ఇంచుమించుగా మామిడి ఆకులు మరిగిన నీళ్ళు గ్రీన్ టీ లానే పనిచేస్తూ బాడిలోంచి టాక్సిన్స్ తొలగిస్తుంది. ఆస్తమా ఒక్కటే కాదు, ఇంకా ఇలాంటి శ్వాససంబంధిత సమస్యలకు మామిడి ఆకులు మంచి పరిష్కారం.

కిడ్నీల్లో రాళ్ళని కరిగించవచ్చు

కిడ్నీల్లో రాళ్ళని కరిగించవచ్చు

రోజు రాత్రి మామిడి ఆకులు మరిగిన నీటిని తాగితే, కిడ్నీల్లో రాళ్ళని కరిగించవచ్చు. ఈ మామిడి ఆకుల నీటిని రెగ్యులర్‌గా తాగితే లైంగిక పట్టుత్వం పెరుగుతుంది. నోటి దుర్వాసన, దంత సమస్యలు, చిగుళ్ళ సమస్యలకు చెక్.

రక్తపుపోటు నియంత్రణలో

రక్తపుపోటు నియంత్రణలో

ఈ మామిడి ఆకుల నీటిని తీసుకోవడం వలన రక్తపుపోటు నియంత్రణలో ఉంటుంది. లో ఉంటుంది. మానసిక ఒత్తిడి, అజీర్ణం వంటి మిగితా సమస్యలపై కూడా మామిడి ఆకులు బ్రహ్మాండంగా పనిచేస్తాయి.

యూరిక్ ఆసిడ్ సమస్యలు

యూరిక్ ఆసిడ్ సమస్యలు

నీటిలో మామిడి ఆకులు మరిగించి తాగితే అది డయాబెటిస్ ట్రీట్‌మెంట్ గా పనిచేస్తుంది. ఇందులో ట్యానిన్స్, అంథోక్యానిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ మామిడి ఆకుల నీటిని తీసుకోవడం వలన బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లో ఉంటుంది. యూరిక్ ఆసిడ్ సమస్యలు, హైపర్ టెన్షన్, నెర్వస్ నెస్ వంటి సమస్యలపై కూడా మామిడి ఆకులు బ్రహ్మాండంగా పనిచేస్తాయి.

తోరణాలు కట్టడానికి చాలా కారణాలు

తోరణాలు కట్టడానికి చాలా కారణాలు

ఇక హిందూ సంప్రదాయంలో మామిడి ఆకులకు ప్రత్యేకస్థానముంది. ఇంట్లో ఓ శుభకార్యం జరిగినా మామిడి ఆకులతో పని వుంటుంది. ముఖ్యంగా.. పండగలు, పబ్బాలతో పాటు శుభకార్యాలు జరిగినపుడు ఇంటి ద్వారాలకు మామిడి ఆకులతో తోరణాలు కడతారు. ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే, ఇంటి ద్వారాలకు కేవలం మామిడి ఆకులతోనే తోరణాలు కట్టడానికి చాలా కారణాలున్నాయి.

వాస్తు దోషం పోతుంద‌ట‌

వాస్తు దోషం పోతుంద‌ట‌

సాధారణంగా మామిడి ఆకుల్లో ల‌క్ష్మీదేవి కొలువైవుంటుందని పెద్దలు చెపుతారు. అందుకే ఆ ఆకుల‌తో చేసిన తోరణాలు క‌డితే ఆ ఇంట్లోకి ధనం వ‌చ్చి చేరుతుంద‌ట‌. ఆర్థిక స‌మ‌స్య‌లు పోతాయ‌ట‌. ఇంటి ప్రధాన గుమ్మానికి, ఇంటి ఆవరణంలోని ద్వారానికి మామిడి ఆకుల తోర‌ణాలు క‌డితే ఆ ఇంట్లోని వాస్తు దోషం పోతుంద‌ట‌. అంటే ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోయి.. పాజిటివ్ ఎనర్జీ ప్రసారమవుతుందట. ఈ కారణంగా అన్నీ శుభాలే క‌లుగుతాయి.

పురాణాలు ఇదే విష‌యాన్ని చెబుతున్నాయి

పురాణాలు ఇదే విష‌యాన్ని చెబుతున్నాయి

మామిడి ఆకులు శుభానికి చిహ్నాలు. అందుకే వాటి తోర‌ణాల‌ను ఆల‌యాల్లో కూడా క‌డుతుంటారు. అలాంటిది ఆ తోర‌ణాలు గృహాల్లో కూడా క‌డితే అంతామంచే జ‌రుగుతుంద‌ని మ‌న పెద్దల న‌మ్మ‌కం. అందుకే మనం కూడా అదే పాటిస్తున్నాం. పురాణాలు కూడా ఇదే విష‌యాన్ని చెబుతున్నాయి.

మామిడి ఆకులు ప్ర‌శాంత‌త‌కు చిహ్నాలు

మామిడి ఆకులు ప్ర‌శాంత‌త‌కు చిహ్నాలు

ఇంట్లో ఏవేని దుష్టశక్తులు ఉండివున్నట్టయితే ఆ శక్తులన్నీ వెళ్లిపోయి.. దేవ‌త‌లు అనుగ్ర‌హిస్తార‌ట‌. అలాగే, మామిడి ఆకులు ప్ర‌శాంత‌త‌కు చిహ్నాలు. మామిడి ఆకుల తోర‌ణాల‌ను చూస్తే ఎవ‌రికైనా మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంద‌ట‌. ఇంట్లో ఉండే గాలి శుభ్ర‌మ‌వుతుంద‌ట‌. త‌ద్వారా చ‌క్క‌ని ఆరోగ్యం క‌లుగుతుంద‌ట‌. ఇంట్లో ఉండే ఆక్సిజ‌న్ శాతం పెరిగి స్వ‌చ్ఛమైన గాలి మ‌న‌కు లభిస్తుంది.

English summary

15 unknown benefits of mango leaves dont throw them away

15 unknown benefits of mango leaves dont throw them away
Story first published:Monday, May 7, 2018, 12:46 [IST]
Desktop Bottom Promotion