సోంపు టీ తో పక్కాగా శృంగార సామర్థ్యం పెరుగుతుంది.. ఇంకా పదహారు ప్రయోజనాలున్నాయి

Written By:
Subscribe to Boldsky

సోంపులో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. సోంపును డైరెక్ట్ గా తీసుకోకుండా టీ రూపంలో తీసుకుంటే మంచి ప్రయోజనాలున్నాయి. సోంపు టీ తాగితే శరీరానికి తక్షణ శక్తి వస్తుంది. అలసట మాయమవుతుంది. ఒక టీస్పూన్ సోంపు గింజలు తీసుకుని.. ఒక కప్పు మరుగుతున్న నీటిలో కలపాలి. కొద్ది సేపటి తర్వాత అందులోని పోషకాలను నీళ్లు గ్రహిస్తాయి. ఇలా తయారు చేసే టీని రోజూ ఉదయం, సాయంత్రం తాగితే మంచి ప్రయోజనాలుంటాయి.

బరువు తగ్గుతారు

బరువు తగ్గుతారు

సోంపు టీ ని రెగ్యులర్ తాగితే మీరు త్వరలోనే బరువు తగ్గుతారు. సోంపు జీర్ణక్రియ శక్తిని పెంచుతుంది. అంంతేకాకుండే శరీరంలో ఉంటే అనవసర కొవ్వును మొత్తం కరిగించేయగలదు. అందువల్ల రెగ్యులర్ సోంపు టీ తాగండి. శరీర మెటబాలిజం రేట్ పెరుగుతుంది. తద్వారా ఒంట్లో అధికంగా ఉన్న కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.

గుండెను ఆరోగ్యంగా ఉంచగలదు

గుండెను ఆరోగ్యంగా ఉంచగలదు

సోంపు టీ గుండెను ఆరోగ్యంగా ఉంచగలదు. గుండెకు సంబంధించిన రోగాల బారిన పడకుండా సోంపు కాపాడగలదు. సోంపులో ఎక్కువగా పోటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును కూడా అదుపులో ఉంచగలదు. దీంతో మీరు గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది. సోంపు టీ తాగడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

సోంపులో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు వంటి వాటి బారిన మీరు పడకుండా సోంపు రక్షించగలదు. మీరు త్వరగా వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు సోంపు టీ బాగా తోడ్పడుతుంది.

కంటిచూపు

కంటిచూపు

సోంపులో విటమిన్ సీ కంటి చూపు మెరుగయ్యేందుకు బాగా తోడ్పడుతుంది. అలాగే కళ్లకు సంబంధించిన వ్యాధులు రాకుండా సోంపు బాగా సహాయపడుతుంది.

మొటిమలను తగ్గిస్తుంది

మొటిమలను తగ్గిస్తుంది

సోంపు చర్మ సంరక్షణకు కూడా బాగా తోడ్పడుతుంది. ముఖంపై వచ్చే మొటిమలను తగ్గించడంలో సోంపు బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ల్ఫమేంటరీ గుణాలు చర్మ సంరక్షణకు బాగా ఉపయోగపడతాయి.

డయాబెటీస్

డయాబెటీస్

సోంపులో ఉండే విటమిన్ సీ, పోటాషియం డయాబెటీస్ ను అదుపులో ఉంచగలవు. బ్లడ్ షుగర్ ను నియంత్రించడంలో సోంపు బాగా ఉపయోగపడుతుంది. షుగర్ ను అదుపులో ఉంచే ఆహారాల్లో సోంపు కూడా ప్రధానమైనది.

మడమ నొప్పులు తగ్గుతాయి

మడమ నొప్పులు తగ్గుతాయి

సోంపు టీని రోజూ తాగితే మడమ నొప్పి తగ్గిపోతుంది. కండరాలు రిలాక్స్ అవుతాయి. కండరాల్లో ఏర్పడే నొప్పులు తగ్గుతాయి. దీర్ఘకాలంగా ఉన్న కీళ్ల నొప్పులు కూడా దీంతో కాస్త తగ్గే అవకాశం ఉంది. సోంపులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉండడం వల్ల శరీరంలో నొప్పులు, వాపులు తగ్గుతాయి.

బాగా జీర్ణం

బాగా జీర్ణం

సోంపు టీ తాగడం వల్ల జీర్ణాశయం శుభ్రమవుతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు దూరమవుతాయి. తిన్న అన్నం వెంటనే జీర్ణం కావడానికి మీరు రోజూ సోంపు టీ తాగడం చాలా ఉత్తమం.

రుతు సంబంధ సమస్యలు

రుతు సంబంధ సమస్యలు

స్త్రీలలో రుతు సంబంధ సమస్యలను సోంపు టీ తగ్గించగలదు. ఇక పాలిచ్చే తల్లులు తాగితే పాలు బాగా పడతాయి. రుతుక్రమంలో వచ్చే నొప్పులను, అధిక రక్త స్రావాన్ని సోంపు టీ తగ్గించగలదు. సొంపు టీ మెనోపాజ్ లక్షణాలతో పోరాడే శక్తిని ఇవ్వడంలో సహాయపడుతుంది. ఇది ఇన్ల్ఫమేషన్ ని తగ్గిస్తుంది. ఈస్ట్రోజెన్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది.

క్యాన్సర్ నుంచి రక్షణ

క్యాన్సర్ నుంచి రక్షణ

సోంపు టీ క్యాన్సర్ బారిన పడకుండా మిమ్మల్ని రక్షించగలదు. దీన్ని రెగ్యులర్ గా తాగితే క్యాన్సర్ బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. క్యాన్సర్ కారకాలను సోంపు టీ తగ్గించగలదు. సోంపు టీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల.. కోలన్ క్యాన్సర్ రిస్క్ ని తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉండటం వల్ల.. క్యాన్సర్ కణాలను తొలగిస్తుంది.

శృంగార సామర్థ్యం

శృంగార సామర్థ్యం

సోంపు టీ పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది.

నిత్యం సోంపు టీ తాగితే శృంగార శక్తి పెరుగుతుంది. ప్రధానంగా అంగ స్తంభన సమస్య తొలగిపోతుంది. అలాగే ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనే అవకాశం ఉంటుంది.

పేగుల్లో ఉండే క్రిములు

పేగుల్లో ఉండే క్రిములు

సోంపు టీని తాగడం వల్ల జీర్ణాశయం, పేగుల్లో ఉండే క్రిములు చనిపోతాయి. మంచి బాక్టీరియా వృద్ధి చెందుతుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

విషపదార్థాలు

విషపదార్థాలు

సోంపు టీని రోజూ తాగితే శరీరంలో ఉన్న విష పదార్థాలు బయటికి పోతాయి. ఒంట్లో అధికంగా ఉన్న నీరు మూత్రం రూపంలో బయటికి పోతుంది. శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది.

మూత్రశయ సమస్యలు

మూత్రశయ సమస్యలు

కొంతమంది మూత్రాశయ సమస్యలతో చాలా ఇబ్బందులుపడతుంటారు. సోంపు టీ ని రెగ్యులర్ గా తాగితే మూత్రాశయ సమస్యలు పోతాయి. కిడ్నీ స్టోన్లు కరుగుతాయి. మూత్రం ధారాళంగా వస్తుంది.

గ్యాస్ట్రిక్

గ్యాస్ట్రిక్

గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవాళ్లకు సోంపు టీ అద్భుత పరిష్కారం. ఇది బ్లోటింగ్, అజీర్ణం వంటి జీర్ణసంబంధ సమస్యలను నివారిస్తుంది.

దుర్వాసన

దుర్వాసన

నోటి దుర్వాసన పోతుంది. దంత సమస్యలు నయమవుతాయి. చిగుళ్లు దృఢంగా మారుతాయి.వీటిని తీసుకోవడం వల్ల నోట్లో.. మంచి సువాసన ఉంటుంది. ఈ టీ మౌత్ వాష్ లా పనిచేస్తుంది.

బీపీ

బీపీ

సోంపు టీని రోజూ తాగితే బీపీ కంట్రోల్ అవుతుంది. రక్త సరఫరా మెరుగుపడుతుంది. బీపీతో బాధపడే వారు సోంపు టీని రెగ్యులర్ గా తాగడం చాలా మంచిది. కాబట్టి.. రెగ్యులర్ గా సోంపు టీ తాగడం అలవాటు చేసుకోండి.

English summary

16 awesome health benefits of fennel tea

16 awesome health benefits of fennel tea
Subscribe Newsletter