For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మీ వీర్యంతో మీ భార్య అండం ఫలదీకరణం చెంది సంతానం పుట్టాలంటే వాటిని తినాలి

  |

  మనం రోజూ తినే ఆహారంలో మెులకెత్తిన విత్తనాలను చేర్చుకోవటం వలన చాలా ప్రయోజనాలున్నాయి. వీటిని వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసులవారు తినవచ్చు. వీటిలో విటమిన్లు, ఖనిజలవణాలు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని శుధ్ది చేస్తాయి. వీటిని ప్రతిరోజు తీసుకోవటం వల్ల శరీరం చైతన్యమై నిత్యయవ్వనంగా కనిపిస్తారు.

  పోషక స్థాయి పెరుగుతుంది

  పోషక స్థాయి పెరుగుతుంది

  గింజలను మెులకెత్తించినుపుడు వాటిలో పోషక స్థాయి పెరుగుతుంది. ముఖ్యంగా పెసలు, మినుములు, శనగలు, బొబ్బర్లు, గోధుమలు, వేరుశనగ, బఠానీలు వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పోషకాల నిధి మెులకెత్తిన గింజలలో జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైములు ఉంటాయి. మెులకెత్తిన గింజలు త్వరగా జీర్ణమవుతాయి. ఆరోగ్యానికి హానికరమైన కొవ్వు, కొలెస్ట్రాల్ వంటివి వీటిలో ఉండవు.

  పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు

  పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు

  మెులకెత్తిన విత్తనాల్లో ఎ, బి కాంప్లెక్స్, సి విటమిన్లు అత్యధికంగా కనిపిస్తాయి. మెులకలలో క్షార గుణం ఉంటుంది. మెులకలను గర్భిణీ స్త్రీలు తింటే పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. మెులకలలో పీచు పదార్ధం ఎక్కువుగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది.

  పళ్లు, ఎముకలు దృఢంగా మారుతాయి

  పళ్లు, ఎముకలు దృఢంగా మారుతాయి

  మెులకెత్తేటప్పుడు విటమిన్ ఎ రెండు రెట్లు, విటమిన్ బి,సిలు ఐదు రెట్లు అధికంగా లభ్యమవుతాయి. ఖనిజ లవణాలు అయిన ఇనుము, ఐరన్, ఫాస్పరస్, జింక్ శరీరానికి సులభంగా అందుబాటులో ఉండేలా తయారవుతాయి. పళ్లు, ఎముకలు కూడా దృఢంగా తయారవుతాయి. రక్తహీనత కూడా దరిచేరదు.

  బాగా నమిలి తినాలి

  బాగా నమిలి తినాలి

  మొలకెత్తిన విత్తనాలను నాలుగు సంవత్సరాల పిల్లల నుంచి ముసలివారి వరకు అందరూ తినవచ్చు. నమలలేని వారు ఈ గింజలను వడల పిండిలాగా (మరీ మెత్తగా కాకుండా) నూరుకొని చప్పరించి మింగవచ్చు. మిగతా వారు బాగా నమిలి తినాలి. సరిగా నమలకపోతే ముక్కలు ముక్కలుగా అరగనట్లుగా విరేచనం ద్వారా వచ్చేస్తాయి. మొలకెత్తిన విత్తనాలను సాయంకాలం 6, 7 గంటల ప్రాంతంలో తినకూడదు. చాలామంది అప్పుడే కొని తింటూ ఉంటారు.

  ఉదయం పూట తినడం శ్రేష్ఠం

  ఉదయం పూట తినడం శ్రేష్ఠం

  మొలకెత్తిన విత్తనాలను ఉదయం పూట తినడం శ్రేష్ఠం. ఎప్పుడన్నా కుదరకపోతే అప్పుడప్పుడు మధ్యాహ్నం భోజనం లాగా తినండి. వేరుశనగ పప్పులను నానబెడితే సరిపోతుంది. వాటికి మొక్కలు అక్కర్లేదు. పచ్చి కొబ్బరిని యథావిధిగా ఎదిగే వయసులో ఉన్న పిల్లలు, బాగా ఎండలో కష్టపడి పనిచేసేవారు, బరువు పెరగాల్సిన వారు, కండపట్టాలనుకునే వారు, నీరసం ఎక్కువగా ఉన్నవారు తప్పనిసరిగా తినాలి. బరువు తగ్గాల్సిన వారు, కొలెస్ట్రాల్ తగ్గాల్సిన వారు వేరుశనగపప్పులను మానండి. పచ్చి కొబ్బరిని కొద్దిగా తినండి.

  ఆకలి అసలు వేయని వారు...

  ఆకలి అసలు వేయని వారు...

  బరువు తగ్గాలనుకునే వారు, షుగర్‌ వ్యాధి ఉన్న వారు మొలకెత్తిన విత్తనాలు 3, 4 రకాలను బాగా తినాలి. వేరుశనగపప్పులు, కొబ్బరి తినేవారు వాటితో పాటు 2, 3 రకాల మొలకలను తప్పనిసరిగా పెట్టుకొని తింటే మంచిది. మొలకలను ఒక దోసెడు నిండా ప్రతిరోజూ తినవచ్చు. పొట్టకు సరిపడా తినండి. గ్యాస్‌ ట్రబుల్‌ ఉన్నవారు, బాగా మలబద్ధకం ఉన్నవారు, ఆకలి అసలు వేయని వారు మొలకల టిఫిన్‌ 10, 15 రోజులు మాని, పండ్లు టిఫిన్‌గా తింటే మంచిది.

  రక్తం తక్కువగా ఉన్నవారు..

  రక్తం తక్కువగా ఉన్నవారు..

  ఆ తర్వాత మొలకలు తినవచ్చు. బెల్లం వాడవద్దు. షుగర్‌ ఉన్నవారు తినకూడదు. బరువు తగ్గాల్సిన వారు 7, 8 పండ్లు వరకూ తింటే, సన్నగా ఉన్నవారు, నీరసం ఎక్కువగా ఉన్నవారు, రక్తం తక్కువగా ఉన్నవారు 10, 15 ఖర్జూరం పండ్లను ప్రతిరోజూ ఉదయం తినడం ఎంతో మంచిది. ఈ మొలకలను ఉదయం పూట తినమంటున్నాం. మరి రోజూ తినే టిఫిన్‌ సంగతేమిటని అందరి అనుమానం. ఇడ్లీలు, దోసెలు తింటూ ఉంటే మన ఆరోగ్యం ఇంత కంటే దిగజారి పోతుంది. కాబట్టి వాటిని నెలలో 3, 4 సార్లుగా ఎప్పుడన్నా తినండి. రోజూ మాత్రం మొలకలనే తినండి.

  నలుగురికీ నాలుగు మూటలు కట్టి

  నలుగురికీ నాలుగు మూటలు కట్టి

  మొలకలు తినేటప్పుడు వాటితోపాటు ఉడికినవి ఏమీ తినకూడదు. ఇక రోజులో మిగతా టైములో గింజలను మనం వాడకుండా గింజల్లో లాభాన్నంతా ఉదయాన్నే అందిద్దాం. రేపటి నుంచి పొద్దున్నే హడావుడి పడుతూ టిఫిన్‌లు, చట్నీలు చేయాల్సిన పనిలేకుండా మీ ఇంట్లోని నలుగురికీ నాలుగు మూటలు కట్టి ఎవరి మూట వారికి పారేస్తే పనై పోతుంది.

  చైనీయుల వైద్యవిధానంలో అధిక ప్రాధాన్యం

  చైనీయుల వైద్యవిధానంలో అధిక ప్రాధాన్యం

  శనగలు, పల్లీలు, పెసర్లు, చిక్కుళ్లు, సోయా వంటి విత్తనాలను తింటే చాలా మంచిది. చైనీయుల వైద్యవిధానంలో కూడా మొలకెత్తిన గింజలకు అధిక ప్రాధాన్యం ఉంది. ఇవి శరీరాన్ని శుద్ధి చేస్తాయి. వీటిని తరచుగా తీసుకుంటే శరీరం చైతన్యవంతమై నిత్యయవ్వనంతో ఉండవచ్చని చైనా వైద్యవిధానం చెబుతున్నది.

  కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు

  కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు

  మనం తీసుకునే ఆహారంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు ఉంటాయి. ఇవి జీర్ణప్రక్రియ ద్వారా చక్కెరలు, అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలుగా విడిపోతాయి. ఇవి ఇలా విడిపోవడానికి సహకరించే కొన్ని రకాల ఎంజైమ్‌లు మొలకెత్తిన గింజల్లో ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉండే ఎంజైమ్‌ల కన్నా మరింత శక్తిమంతంగా పనిచేస్తాయి.

  భోజనంలో భాగం చేసుకుంటే

  భోజనంలో భాగం చేసుకుంటే

  శరీరంలోని ఎంజైమ్‌ల చర్యాశీలతను పెంచుతాయి. ముఖ్యంగా కార్బోహైడ్రేట్‌లపై పనిచేసే అమైలేజ్ ఎంజైమ్ చురుకుదనం మరింత పెరుగుతుంది. కాబట్టి మొలకెత్తిన గింజలను భోజనంలో భాగం చేసుకుంటే జీర్ణప్రక్రియ వేగవంతం అవుతుంది.

  మాంసాహారం తీసుకుంటే

  మాంసాహారం తీసుకుంటే

  గింజలను మొలకెత్తించినప్పుడు వాటి పోషకస్థాయి పెరుగుతుంది. వీటిలోని ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజలవణాలు, ఎంజైమ్‌లు మరింత సులభ ప్రక్రియల ద్వారా మన శరీరంలోకి చేరుతాయి. ఇలా తీసుకోండి. మధ్యాహ్న భోజనంలో మాంసాహారం తీసుకుంటే తప్పనిసరిగా సాయంకాలం మొలకెత్తిన గింజలను తీసుకోవాలి. దీనివల్ల మాంసాహారంలోని అధిక కొవ్వు చేసే హాని నుంచి తప్పించుకోవచ్చు.

  ఉడికించడమో చేయడం వల్ల

  ఉడికించడమో చేయడం వల్ల

  మొలకెత్తిన గింజలను వేయించడమో, ఉడికించడమో చేయడం వల్ల వేడికి వాటిలోని విటమిన్లు దెబ్బతింటాయి. కాబట్టి వీటిని పచ్చివి తినడమే ఉత్తమం. వీటి పోషక విలువ పెరగాలన్నా, మరింత రుచిగా ఉండాలన్నా పల్లీలు, క్యారెట్ ముక్కలు, బఠాని లాంటివి కలుపుకొని తినవచ్చు. రకరకాల పండ్ల ముక్కలు కూడా కలుపుకోవచ్చు.

  అన్ని రకాలు కలిపి తీసుకుంటే

  అన్ని రకాలు కలిపి తీసుకుంటే

  ఏదో ఒకే రకమైన గింజలకు బదులుగా అన్ని రకాలు కలిపి తీసుకుంటే మంచిది. మొలకెత్తిన గింజలను తరచుగా తీసుకుంటే అసిడిటీ, గ్యాస్ సమస్యలు దూరమవుతాయి. మొలకెత్తిన విత్తనాల్లో విటమిన్ బి 30 శాతం, విటమిన్ సి 60 శాతం ఉంటాయి. క్యాన్సర్లను నివారించే యాంటి ఆక్సిడెంట్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి.

  వీర్యకణాలు అండంతో ఫలదీకరణం చెందడానికి

  వీర్యకణాలు అండంతో ఫలదీకరణం చెందడానికి

  చైనావాసులు పిల్లలు కావాలనుకునే దంపతులు మొలకెత్తిన గింజలు తినడం వలన పలు ప్రయోజనాలు ఉంటాయని విశ్వసిస్తారు. మొలకెత్తిన గింజలు శరీరంలో ముఖ్యంగా కటి వలయంలో ఆమ్ల పరిస్థితులకు విరుద్ధంగా ఆల్కలైన్ అంశాలను పెంపొందిస్తాయి. సెక్స్ లో పాల్గొన్నప్పుడు మగవారి వీర్యం యోనిలోకి ప్రవేశించిన తర్వాత వీర్యకణాలు అండంతో ఫలదీకరణం చెందడానికి మొలకెత్తిన విత్తనాలు అనుకూలమైన పరిస్థితులను ఏర్పరుస్తాయి.

  English summary

  20 benefits of sprouting and the right way to do it

  20 benefits of sprouting and the right way to do it
  Story first published: Friday, May 11, 2018, 11:38 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more