లైంగిక వాంఛలు పెరగాలంటే వాటిని తినాలి.. వాల్ నట్స్ తో వంద రకాల ప్రయోజనాలు

Written By:
Subscribe to Boldsky

రోజూ గుప్పెడు వాల్‌నట్స్‌తో హృద్రోగాలతో పాటు పేగు క్యాన్సర్‌ను నివారించవచ్చని తాజా అధ్యయనం పేర్కొంది. ఆరు వారాల పాటు రోజూ మూడోవంతు కప్పు వాల్‌నట్స్‌ తీసుకుంటే చెడు కొలెస్ర్టాల్‌ తగ్గడంతో పాటు ప్రమాదకర ఆమ్లాలు పేరుకుపోవడాన్ని నిరోధిస్తాయని అథ్యయనం తేల్చింది. ఈ తరహా ఆమ్లాలు పేగు క్యాన్సర్‌కు దారితీస్తాయని గత పరిశోధనలు పేర్కొన్న క్రమంలో ఆ ముప్పును కూడా వాల్‌నట్స్‌ తగ్గిస్తాయని పేర్కొంది.

హృద్రోగాల ముప్పు తగ్గుతుంది

హృద్రోగాల ముప్పు తగ్గుతుంది

కొవ్వుశాతాన్ని కరిగించడంతో హృద్రోగాల ముప్పు తగ్గుతుందని పరిశోధకులు విశ్లేషించారు. అధిక ఫైబర్‌ కలిగి ఉండే వాల్‌నట్స్‌తో కడుపులో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని, ఇది గుండె, జీర్ణవ్యవస్థను ఆరోగ్యకరంగా నిర్వహిస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు.

పేగు క్యాన్సర్‌ను నివారిస్తాయి

పేగు క్యాన్సర్‌ను నివారిస్తాయి

వాల్‌నట్స్‌లో క్యాలరీలు అధికంగా ఉన్నప్పటికీ మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు ఇవి దోహదపడతాయని శాస్త్రవేత్తలు సైతం గుర్తించారు. ఇక వాల్‌నట్స్‌లో ప్రమాదకర ఆమ్లాలు శరీరంలో పేరుకుపోవడాన్ని నియంత్రించే గుణం ఉండటంతో పేగు క్యాన్సర్‌ను నివారిస్తాయని అధ్యయన రచయిత, యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయిస్‌కు చెందిన ప్రొఫెసర్‌ హన్నా హల్చర్‌ చెప్పారు.

మరింత మేలు

మరింత మేలు

ఇక వాల్‌నట్స్‌ మరింత మేలు అంటున్నారు బెత్‌ ఇజ్రాయెల్‌ డెకోనన్‌ మెడికల్‌ సెంటర్‌కు చెందిన పరిశోధకులు. ఎందుకంటే దీంతో చేసిన స్మూతీని తీసుకున్నవాళ్లలో ఆకలీ, తినాలన్న కోరికా బాగా తగ్గాయన్న విషయాన్ని మెదడు స్కానింగుల ద్వారా గుర్తించారట.

ఎన్నో పోషకాలు లభ్యమవుతాయి

ఎన్నో పోషకాలు లభ్యమవుతాయి

వాల్‌నట్స్‌లో విటమిన్లూ ప్రొటీన్లూ ఫ్యాటీఆమ్లాలతోబాటు కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, పొటాషియం, సోడియం, జింక్‌, కాపర్‌, మాంగనీస్‌, సెలీనియం... వంటి ఎన్నో పోషకాలు లభ్యమవుతాయి. సుమారు 30 గ్రా. వాల్‌నట్స్‌ నుంచి 190 క్యాలరీలు లభిస్తాయి. వీటిని ఎవరైనా తమ ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. అందుకే దీన్ని పవర్‌ ఫుడ్‌గానూ పేర్కొంటున్నారు.

మధుమేహం నియంత్రణలో ఉంటుంది

మధుమేహం నియంత్రణలో ఉంటుంది

పోషకవిలువలు సమృద్ధిగా ఉండే వాల్‌నట్స్‌ అనేక రోగాలనూ నియంత్రిస్తాయని తేలింది. వీటి కారణంగా చెడు కొలెస్ట్రాల్‌ తగ్గి, జీవక్రియావేగం పెరిగిందనీ తద్వారా మధుమేహం నియంత్రణలో ఉంటుందనీ తెలుసుకున్నారు. పైగా ఇవి డిప్రెషన్‌ను తగ్గించడంతోబాటు, క్యాన్సర్‌ కణాల వృద్ధిని సైతం అడ్డుకోగలవని భావిస్తున్నారు.

నిద్ర పట్టేలా చేస్తుంది

నిద్ర పట్టేలా చేస్తుంది

వీటిల్లో అధికంగా ఉండే ఒమేగా-3-ఫ్యాటీ ఆమ్లాలు మెదడు పనితీరునీ మెరుగుపరుస్తాయి. నానబెట్టుకుని నిద్రపోయేముందు భోజనంలో భాగంగాగానీ సలాడ్‌మీద చల్లుకునికానీ తినడంవల్ల వాటిల్లోని మెలటోనిన్‌ అనే హార్మోన్‌, క్రమపద్ధతిలో నిద్ర పట్టేలా చేస్తుంది.

మాంగనీస్‌

మాంగనీస్‌

ఎముక సాంద్రతకు అవసరమైన కాపర్‌, వాల్‌నట్స్‌లో పుష్కలంగా ఉంటుంది. అందుకే వీటిని క్రమం తప్పక తినడంవల్ల ఆస్టియోపొరొసిస్‌ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. మూర్ఛ... వంటి నాడీసంబంధ సమస్యలతో బాధపడేవాళ్లకి వీటిల్లో ఉండే మాంగనీస్‌ దోహదపడుతుంది.

వికారాన్ని తగ్గిస్తాయి

వికారాన్ని తగ్గిస్తాయి

వీటిల్లోని యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్నీ అడ్డుకుంటాయి. గర్భిణీలకి ఇవి ఎంతో మేలు. వికారాన్ని తగ్గిస్తాయి. శిశువు మెదడు పెరుగుదలకు తోడ్పడతాయి. ఇక ఆక్రోట్లు (వాల్‌నట్స్) తినడం వల్ల కొన్ని రకాల కేన్సర్లకు చెక్ పెట్టవచ్చు. రోజువారీ ఆహారంలో ఎంతో కొంత మేర గింజల్ని తింటే మంచిదని ఇప్పటికే పలు పరిశోధనలు తేల్చాయి.

కొన్ని రకాల కేన్సర్లకు చెక్

కొన్ని రకాల కేన్సర్లకు చెక్

వాల్‌నట్స్‌ తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ల బారి నుంచి అవి మనల్ని కాపాడుతాయని టెక్సాస్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన ఒక పరిశోధనలో తేలింది. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌‌తో పాటు కొన్ని రకాల కేన్సర్లకు ఇది చెక్ పెడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరింతగా మనకు మేలుచేస్తాయి

మరింతగా మనకు మేలుచేస్తాయి

మనం తీసుకునే ఇతర గింజ ధాన్యాలకంటే వాల్‌నట్స్‌ మరింతగా మనకు మేలుచేస్తాయని పరిశోధకులు అంటున్నారు. రోజూ పరిమితంగా ఆక్రోట్‌ పప్పును ఆహారంలో తీసుకుంటే ప్రొస్టేట్‌, రొమ్ము క్యాన్సర్‌ వంటి కొన్ని రకాల క్యాన్సర్లను నివారించవచ్చని లేదా వాటికి కొంతమేర దూరంగా వుండొచ్చునని పరిశోధకులు చెబుతున్నారు.

నల్ల వాల్‌నట్స్‌ తో ప్రయోజనాలు

నల్ల వాల్‌నట్స్‌ తో ప్రయోజనాలు

ఇక నల్ల వాల్‌నట్స్‌ తో కూడా కొన్ని రకాల ప్రయోజనాలున్నాయి. చాలామంది నల్ల వాల్ నట్స్ ను చూడగానే పాడైపోయినట్టు అనిపించి, తెల్లవాటినే ఎంచుకుంటూ ఉంటారు. మామూలు వాల్‌నట్స్‌తో పోలిస్తే నల్లవాటిలో పోషకాలు ఎక్కుగా ఉంటాయి. నల్ల వాల్ నట్స్ వల్ల పిన్‌వార్మ్‌, హుక్‌వార్మ్‌, టేప్‌వార్మ్‌ మొదలైన నులి పురుగులు నశిస్తాయి.

రోజుకు మూడు సార్లు వీటిని తినాలి

రోజుకు మూడు సార్లు వీటిని తినాలి

ఇన్‌ఫెక్షన్‌ పేగుల లోపలి గోడలను బలహీనపరిచి రోగనిరోధకశక్తిని దెబ్బ తీస్తుంది. దీన్ని సమూలంగా తొలగించే శక్తి కూడా నల్ల వాల్‌నట్స్‌కు ఉంటుంది. కాబట్టి రోజుకు మూడు సార్లు వీటిని తినాలి. నల్ల వాల్ నట్స్

రింగ్‌వార్మ్‌, జాక్‌ ఇట్చ్‌, అథ్లెట్స్‌ ఫుట్‌ లాంటి ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు ఉన్నప్పుడు, ఆ ప్రదేశాల్లో నూరిన నల్ల వాల్‌నట్‌ పూస్తే తగ్గుముఖం పడతాయి.

చమట దుర్వాసన రాకుండా

చమట దుర్వాసన రాకుండా

నల్ల వాల్‌నట్స్‌లో ఉండే టానిన్స్‌ అనే యాస్ట్రింజెంట్లు స్వేదాన్ని నిలువరిస్తాయి. చమట దుర్వాసన రాకుండా కూడా చేస్తాయి. కాబట్టి ఈ సమస్యలు ఉన్నవాళ్లు తరచుగా బ్లాక్‌ వాల్‌నట్స్‌ తింటూ ఉండాలి. ఇక మోనో సాచురేటేడ్ కొవ్వు పదార్థాలను అధికంగా కలిగి ఉండే వాల్నట్స్ గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంచుతుంది. అలాగే లైంగిక వాంఛను కూడా పెంచి, సెక్స్ సమస్యలను కూడా దూరం చేస్తుంది. చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, ఒమేగా ఫాటీ ఆసిడ్ లు వీటిలో పుష్కంగా ఉంటాయి.

English summary

20 research backed health benefits of walnuts for good health

20 research backed health benefits of walnuts for good health
Story first published: Tuesday, May 8, 2018, 15:00 [IST]