మెదడును షార్ప్ గా ఉంచి, జ్ఝాపకశక్తిని పెంచే కొన్ని ఇండియన్ ఫుడ్స్

By: Mallikarjuna d
Subscribe to Boldsky
23 Awesome Indian Foods that Make You Smarter and Boost Your Memory!

మన శరీరంలో మెదడు 2శాతం మాత్రమే, కానీ ఇది రోజులో దీనికి 20శాతం క్యాలరీలు అవసరం అవుతాయి!

ఎందుకంటే?మన శరీరానకి అత్యంత ముఖ్యమైన అవయవం మెదడు. మెదడు శరీరంలో అన్ని అవయవాలకు సంకేతాలను చేరవేస్తుంది, గుండె కొట్టుకోవడం, ఊపిరితిత్తులు ఉశ్చ్వాస, నిశ్చ్వాసలు, కిడ్నీల వడపోత ఇలా రోజుకు అవసరం అయ్యే పనులన్నీ ఆ అవయవాలతో చేయిస్తుంది. వీటిలో ఏ ఒక్క అవయం పనిచేయపోయినా శరీరానికి నష్టం వాటిల్లుతుంది. అందుకే , మనం తీసుకునే ఆహారం పొట్టకు మాత్రమే కాదు, మొత్తం ఆరోగ్యానికి అవసరం అని గుర్తించాలి. సరైన ఆహారం తీసుకోకపోతే ముఖంలో అప్పుడే నీరసం, నిస్సత్తువ కనబడుతుంది.

ముఖ్యంగా మెదడులో 60శాతం ఫ్యాట్ టిష్యులతో తయారుచేయబడినది, మొదడు నిండా ద్రవాలతో నిండి ఉంటుంది.

అందువల్ల, మనం తీసుకునే ఆహారంలో ఫ్యాట్స్ కూడా తప్పనిసరిగా ఉండేట్లు చూసుకోవాలి. సరైన క్యాలరీలు మెదడు అందకపోతే డిప్రెషన్, మతిమరుపు, జ్జాపకశక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల మెదడు మీద ప్రభావం చూపుతుందన్న విషయాన్ని గుర్తుంచుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

మెదడును షార్ప్ గా ఉంచి, జ్ఝాపకశక్తిని పెంచే కొన్ని ఇండియన్ ఫుడ్స్ ఉన్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం..

#1 వాల్ నట్స్

#1 వాల్ నట్స్

వాల్ నట్స్ బ్రెయిన్ బూస్టింగ్ పవర్ ఫుడ్స్. ఇవి చూడటానికి కూడా అచ్చం బ్రెయిన్ ఆకారాన్ని పోలి ఉంటుంది. వాల్ నట్స్ బ్రెయిన్ బూస్టింగ్ కోసం అవసరమయ్యే ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్, ముఖ్యంగా డిహెచ్ ఎ అధికంగా ఉన్నాయి. అనేక పరిశోధనల ప్రకారం మతిమరుపును నివారించే గుణాలు కలిగి ఉన్నాయి. వయస్సు పెరిగే కొద్ది ప్రారంభమయ్యే డిజనరేటివ్ ఎఫెక్ట్స్ ను తగ్గిస్తాయి. వాస్తవానికి కొన్ని పరిశోధనలు కూడా గర్భిణీలు రోజుకు ఒక కప్పు వాల్ నట్స్ ను తీసుకోవాలని సూచిస్తున్నాయి. పుట్టే పిల్లలు స్మార్ట్ గా, షార్ప్ గా పుడుతారని వాల్ నట్స్ ని సూచిస్తున్నారు.

#2 గుడ్లు

#2 గుడ్లు

గుడ్డులో కోలిన్ అలే విటమిన్ బి కాంప్లెక్స్ అధికం ఉంది, ఇది శరీరంలో అసిటైల్ కోలిన్ అనే ఉత్పత్తి చేసి, నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీరు స్మార్ట్ గా ఉండాలంటే రోజూ గుడ్డు తినాల్సిందే.

#3 కాఫీ

#3 కాఫీ

కాఫీ మీ షార్ట్ టర్మ్ మెమరీని మెరుగుపరుస్తుంది. మతిమరుపు వ్యాధిని నివారిస్తుంది. తలనొప్పి తగ్గిస్తుంది. అయితే కెఫిన్ పరిమితంగా తీసుకోవడం వల్ల హెపరాక్టివ్ మరియు ప్రిస్పిటేట్ మైగ్రేన్ ను నివారిస్తుంది.

#4 టమోటోలు

#4 టమోటోలు

టమోటోలలో కెరోటినాయిడ్స్ అధికంగా ఉన్నాయి, ఇవి లైకోపిన్ మరియు బీటో కెరోటిన్ లు అనే స్ట్రాంగ్ యాంటీఆక్సిడెంట్స్ లక్షణాలను కలిగి ఉండి, ఫ్రీరాడికల్స్ అట్రాక్షన్ ను నివారిస్తుంది.

హెచ్చరిక: ఆలివ్ ఆయిల్, అవొకాడో వంటి హెల్తీ ఫ్యాట్స్ తో పాటు టమోటోలను తినడం వల్ల ప్రోవిటమిన్స్ , సోలబుల్ ఫైబర్ వల్ల శరీరంలోకి మరింత బెటర్ గా అబ్సార్బ్ అవుతుంది.

#5 అవొకాడో

#5 అవొకాడో

అవొకాడోలో ఉండే మోనోశ్యాచురేటెడ్ ఫ్యాట్స్ మొత్తం శరీర ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా మీ హార్ట్ అండ్ బ్రెయిన్ కు గ్రేట్ గా సహాయపడుతుంది.

ప్లస్, అవొకాడో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. బ్లాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిస్తుంది. కాబట్టి, ఇది అన్ని రకాలుగా ఉపయోగడపుతుంది!

#6 త్రుణధాన్యాలు

#6 త్రుణధాన్యాలు

బ్రౌన్ రైస్, ఓట్స్, హోల్ వీట్, బ్రాన్, బార్లీ మొదలగు త్రుణధాన్యాలు అన్ రిఫైన్డ్ ధాన్యాలలో న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి, రిఫైన్ చేసిన వాటికి బదులుగా వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఇవి రోజుకు కావల్సిన, ఫైబర్, విటమిన్ ఇ, మరియు యాంటీఆక్సిడెంట్స్ ను అందిస్తుంది. ఫ్రీరాడికల్స్ కు నివారిస్తుంది. బ్రెయిన్ పవర్ ను పెంచుతుంది.

#7 డార్క్ చాక్లెట్

#7 డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి మాత్రమే కాదు, బ్రెయిన్ పవర్ పెంచడానికి కూడా గ్రేట్ గా సహాయపడుతుంది. వాస్తవానికి ఈ విషయాన్ని 85శాతం పరిశోధనల్లో కూడా తేలింది. ఎందుకంటే డార్క్ చాక్లెట్ లో ఉండే ఫ్లెవనాయిడ్స్ అందులో ఉండే స్ట్రాంగ్ యాంటీఆక్సిడెంట్స్ బ్రెయిన్ ఇంజ్యురి తగ్గించి, క్యాన్సియస్ నెస్ ను పెంచుతుంది. జ్ఝాపకశక్తిని పెంచుతుంది.

డార్క్ చాక్లెట్ బ్రెయిన్ లో సెరోటినిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది ఫీల్ గుడ్ హార్మోన్. ఇది మూడ్ ను మెరుగుపరిచి, డిప్రెషన్ తగ్గిస్తుంది.

#8 చియా సీడ్స్

#8 చియా సీడ్స్

ప్రస్తుత రోజుల్లో చియా సీడ్స్ కూడాచౌకైనే, ఇండియాలో కూడా ప్రతి చోట అందుబాటులో ఉన్నాయి. వీటిని తినడం వల్ల బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. చియాసీడ్స్ లో మెదడుకు సంబంధించిన ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ ఎక్కువ, స్ట్రాంగ్ యాంటీఆన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కూడా అధికంగా ఉన్నాయి. బ్రెయిన్ కు వ్యాధులు సోకకుండా దూరం చేస్తుంది. ఫ్రీరాడికల్స్ ను దూరం చేసి, మతిమరుపు నివారిస్తుంది.

హెచ్చరిక: సాధా విత్తనాలు తినకూడదు, ఇవి హైగ్రోస్కోపిక్ గుణాన్ని కలిగి ఉండటం వల్ల, వీటిని నీటిలో వేస్తే 10 రెట్లు ఉబ్బుతాయి.దాంతో అన్నవాహికలో బ్లాక్ అవుతాయి.

వీటిని 1:4 రేషియో వాటర్లో నానబెట్టి , తర్వాతి రోజూ ఉదయం తినాలి!

#9 ఆకుకూరలు

#9 ఆకుకూరలు

ఆకుకూరలు తినడం వల్ల వీటిలో ఉండే విటమిన్ కె మరియు ఫొల్లెట్ వంటి అంశాలు మైండ్ ను షార్ప్ చేస్తుంది. వయస్సుతో వచ్చే సమస్యలను నివారిస్తుంది.

#10 పసుపు

#10 పసుపు

భారత దేశంలో అల్జీమర్స్ వ్యాధి వరల్డ్ లోయస్ట్ రేట్ కలిగి ఉంది. ఎందుకంటే, భారతదేశపు వంటకాల్లో కొన్ని మసాలా దినుసులు జోడించడం వల్ల మెదడుకు సంబంధించిన కొన్ని ప్రమాధకరమైన వ్యాధులను తగ్గించే అవకాశం ఉంది అంటున్నారు. ఆల్జీమర్స్ వ్యాధి మెదడులో ఒక వాపును కారణం అవుతుంది. పసుపు మసాలా దినుసుల్లో ఒకటి కాబట్టి మన రెగ్యులర్ డైల్ లో దీనికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. పసుపులో ఉండే ఫాలీఫినాల్స్ మతిమరుపును నివారిస్తుంది. పసుపులో ఉండే కుర్కుమిన్ ఇది స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగినది.

#11 త్రుణ ధాన్యాలు

#11 త్రుణ ధాన్యాలు

ధాన్యంతో తయారు చేసిన ఆహారాలు, బ్రెడ్, మిల్లెట్, మరియు క్వీనా వంటివి మెదడకు అద్భుతమైన ఆహారాలుగా పరిగణిస్తారు. ఈ ఆహారాలు ప్రసరణ మెరుగుపరచడానికి మరియు అవసరమైన ఫైబర్స్ మరియు విటమిన్లు అంధించడానికి సహాయపడుతాయి. అంతే కాదు, నట్స్, బీన్స్ వంటి వాటిలో విటమిన్ బి12(పొల్లెట్స్ అధికంగా ఉంటాయి. ఇది హెల్తీ నర్వస్ సిస్టమ్ మరియు బ్రెయిన్ కు సహాయపడుతుంది.

#12 క్వీనా

#12 క్వీనా

మరో ఏన్సియంట్ ఫుడ్ గ్రెయిన్, క్వీనా 4000 ఏళ్ళ నాటి పౌష్టికాహారం. క్వీనాలో ఉండే ఫినామిల్ ఎబిలిటి స్టామినా పెంచుతుంది.

క్వీనాలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇందులో 9 అమినో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. విటమిన్ బి2, మెగ్నీషియం, మరియు మ్యాంగనీస్ లు బ్రెయిన్ ను స్ట్రాంగ్ గా ఉంచుతుంది. క్వీనాలో ఐరన్, మినిరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి హీమోగ్లోబిన్ నుపెంచుతుంది. దాంతో మీ మెదడు 20శాతం ఆక్సిజన్ గ్రహిస్తుంది.

#13 రెడ్ క్యాబేజ్

#13 రెడ్ క్యాబేజ్

రెడ్ మరియు పర్పుల్ కలర్ క్యాబేజ్ చాలా అరుదుగా చూస్తుంటాము. గ్రీన్ క్యాబేజ్ ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. ఇందులో అసిడిక్ సోయిల్ ఎక్కువ. వాస్తవానికి రెడ్ క్యాబేజ్ లో ఆల్కలైన్ గుణాలు ఎక్కువగా ఉంటాయి.

రెడ్ క్యాబేజ్ అప్పుడప్పుడు కలర్ మారడానికి కారణం అందులో ఉండే యాంతోసైనిన్స్. ఇందులో ఉండే నేటివ్ సాయిల్ బ్రెయిన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది.

#14 బాదం

#14 బాదం

నట్స్ లో బాదం ఒకటి. బాదంను రాత్రంతా నీటిలో నానబెట్టి , మరుసటి రోజు తొక్క తీసి తినాలి.

బాదంలో బ్రెయిన్ హెల్త్ కు సహాయపడే మోనోసాచ్యురేటెడ్ ఫ్యాటీయాసిడ్స్, రిభోఫ్లొవిన్ (విటమిన్ బి కాంప్లెక్స్ )మరియు ఎల్ కెరోటినిన్ వంటివి మతిమరుపు నివారించే శక్తిసామర్థ్యాలు కలిగి ఉంటుంది. బ్రెయిన్ డ్యామేజ్ కాకుండా చేస్తుంది.

#15 బీట్ రూట్

#15 బీట్ రూట్

బీట్ రూట్ డిప్రెషన్ ఫైటింగ్ వెజిటేబుల్, ఇందులో పుష్కలమైన విటమిన్ B ఉండటం వల్ల ఇది త్వరగా విషయాలను జ్ఞాపకాల ద్వారా,సమర్థవంతంగా మెదడుకు చేరవేసేందుకు సహాయపడుతుంది. అంటే బ్రెయిన్ స్టిములేటింగ్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. బీట్ రూట్ లో ఉండే నైట్రేట్స్ మెదడు యొక్క రక్తనాళాలకు రక్తప్రసరణను మెరుగ్గా ఉంచుతుంది.

#16 రోజ్మెర్రీ

#16 రోజ్మెర్రీ

రోజ్మెర్రీ హెర్బ్ ఇండియాలో పండుతుంది. అయితే ప్రపంచం మొత్తంలో కూడా ఇది అందుబాటులో ఉంటుంది. సూపర్ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. షార్టటర్మ్ మెమరీని నివారిస్తుంది.

#17 బ్రొకోలీ

#17 బ్రొకోలీ

ఈ గ్రీన్ ఫేవరెట్ వెజిటేబుల్ లో విటమిన్ కె పుష్కలంగా ఉంది. బ్రోకలీ మెదడు పనితీరును సమర్ధంగా మరియు బ్రెయిన్ పవర్ మెరుగుపరచడానికి బాగా సహాయపడుతుంది.

బ్రొకోలిని పిల్లలు ఇష్టపడకపోవచ్చు, ఇందులో విటమిన్ ఎ, సి, బి-కాంప్లెక్స్, కె, క్యాల్షియం, ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి.

అందుకే బ్రెయిన్ హెల్త్ కు ఇది గ్రేట్ అని చెప్పవచ్చు. ఫ్రీరాడికల్స్ ను నివారించి బ్రెయిన్ పవర్ ను పెంచుతుంది.

#18 సన్ ఫ్లవర్ సీడ్స్

#18 సన్ ఫ్లవర్ సీడ్స్

సన్ ఫ్లవర్ సీడ్స్ లో ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్, ప్రోటీన్స్, బి కాంప్లెక్స్ ఎక్కువ. ఇవి బ్రెయిన్ హెల్త్ ను మెరుగుపరుస్తాయి

ఇందులో ఉండే ట్రైప్టోఫోన్ , అమినో యాసిడ్స్ సెరోటిన్ ఫీల్ గుడ్ హార్మోన్ ను ఉత్పత్తి చేస్తాయి.

#19 బ్లూ బెర్రీస్

#19 బ్లూ బెర్రీస్

ఇవి చూడటానికి చిన్నగా ఉన్నా, ఇవి మొత్తం శరీర ఆరోగ్యంతో పాటు, బ్రెయిన్ ఫుడ్ గా కూడా వీటిని ఎక్కువగా తీసుకుంటారు. ఇది మెదడును చురుకుగా ఉంచడంతో పాటు మిమ్మల్ని యాక్టివ్ గా ఉండేందుకు సహాయపడుతుంది.వీటిలో ఉండే చాలా పవర్ ఫుల్ ఆమ్లజనకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మన మెదడుకు చాలా మేలు చేస్తాయి. మెదడుకు సంబంధించిన కణాల వాపు తగ్గించడానికి కూడా ఈ పండ్లు బాగా ఉపయోగపడతాయి. అందువల్ల బ్లూబెర్రీస్ ను ఎక్కువగా తింటూ ఉండాలి.

#20 ఫ్యాటీ ఫిష్

#20 ఫ్యాటీ ఫిష్

కొన్ని అధ్యయనాల ద్వారా చేపలు తినడం వల్ల ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంది.. ఏకాగ్రతను పెంచుతాయని.. చెబుతున్నాయి. వారానికి రెండుసార్లు చేపలు తీసుకోవాలని ఈ స్టడీస్ చెబుతున్నాయి. ఫ్యాటీ ఫిష్ లో సాల్మన్, మెకరెల్, సార్డిన్స్ వంటి చేపల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. ఇవి బ్రెయిన్ పవర్ ను పెంచడానికి సహాయపడుతాయి. వాస్తవానికి కొన్ని పరిశోధనల ప్రకారం గర్భిణీలు ఫ్యాటీ ఫిష్ ను వారంలో కనీసం రెండు సార్లు తినాలని సూచిస్తున్నారు. వీరికి పుట్టే పిల్లలు చాలా సోషియల్ గా, కమ్యునికేటివ్ గా పుడుతారిని సూచిస్తున్నారు.

#21 రెడ్ గ్రేప్స్

#21 రెడ్ గ్రేప్స్

ఎండు ద్రాక్ష మెమరీ పవర్ పెంచడంలో బాగా సహాయపడుతుంది. మెమరీ పవర్ మెరుగుపరచడానికి ఇందులో బోరాన్ అనే ఒక శక్తివంతమైన సమ్మేళన మూలకం ఉంది. రెడ్ గ్రేప్స్ లో ఫ్లెవనాయిడ్స్, యాంతోసైనిన్స్, వంటి అధికంగా ఉండటం వల్ల బ్రెయిన్ హెల్త్ ను కాపాడుతుంది. న్యూరో డిజనరేటివ్ డిజార్డర్స్ ను డెమెంటీనియా, ఆల్జైమర్స్ ను నివారిస్తుంది.

#22 వాటర్ మెలోన్

#22 వాటర్ మెలోన్

వాటర్ మెలోన్ మెదడు మీద నేరుగా ప్రభావం చూపుతుంది. ఇందులో వాటర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల డీహైడ్రేషన్ నివారించడానికి సహాయపడుతుంది. డీహైడ్రేషన్ మెదడు మీద తీవ్ర ప్రభావం చూపుతుంది.

#23 పీనట్స్

#23 పీనట్స్

పీనట్స్ హైప్రోటీన్ లెగ్యుమ్. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల స్మార్ట్ గా ఉంటారు. ఎందుకంటే వేరుశెనగల్లో విటమిన్ ఇ, స్ట్రాంగ్ యాంటీఆక్సిడెంట్స్ మరియు థైయమిన్లు ఎక్కువగా ఉంటాయి.

English summary

23 Awesome Indian Foods that Make You Smarter and Boost Your Memory!

Therefore, you should never cut out fats completely from your diet. Unless you voluntarily want to be depressed, get dementia, or lose your memory. And should be careful of what you eat since your brain is affected by your diet for better or for worse. So, now that we have set the precedent, let us dive straight into the topic for the day - Indian foods that make you smarter and boost your memory. After all, everyone wants a slice of what the Indians are having! :)
Story first published: Sunday, January 28, 2018, 16:00 [IST]
Subscribe Newsletter