సొరకాయ పురుషాంగాన్ని నిటారుగా లేపుతుంది.. లైంగిక శక్తితో పాటు చాలా వాటిని పెంచుతుంది

Written By:
Subscribe to Boldsky

సొరకాయ లేదా అనపకాయ. సొరకాయను తెలంగాణా ప్రాంతంలో అనపకాయ అంటారు. సొరకాయ కుకుర్ బిటాన్సి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం లాజనేరియా వల్గారిస్ అంటారు. దీనినే ఇంగ్లీష్‌లో బాటిల్ గార్డ్ అంటారు. వేదకాలం నుంచి మన దేశంలో సొరకాయను సాగు చేస్తున్నారు. మానవజాతికి ఏనాడో పరిచయమైన అతి ప్రాచీనమైన కూరగాయ సొరకాయ.

ఆఫ్రికాలో

ఆఫ్రికాలో

సొరకాయ పుట్టింది ఆఫ్రికాలో అని చెప్పినప్పటికీ క్రీస్తు పూర్వం 11 వేల నుంచి 13 వేల సంవత్సరంలో పెరులో సొరకాయ సాగు జరిగిందని పురాతన శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎండిన సొరకాయపై తొడుగును సొరకాయ బుర్ర అని అంటారు. దీనిలో నీరు పోసుకుని పొలాలకు తీసుకునిపోయేవారు.

నేచురల్ వాటర్ బాటిల్

నేచురల్ వాటర్ బాటిల్

అందులోని నీళ్ళు చాలా చల్లగా ఉంటాయి. అందుకే సొరకాయను నేచురల్ వాటర్ బాటిల్, నేచురల్ మినీకూలర్‌గా చెబుతుంటారు. పూర్వకాలంలో పెద్దవారు సొరకాయలోని నీళ్ళు తాగబట్టే అన్ని సంవత్సరాల పాటు బతికేవారట.

శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది

శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది

సొరకాయ కూరే కాదు.. సొర బూరలు కూడా చాలా ఫేమస్. సొరకాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. మన శరీరంలోని అధిక వేడిని బయటకు పంపి మనకు మేలు చేస్తుంది. శరీరం విపరీతమైన వేడితో బాధపడేవారు దీని రసం తాగడం వల్ల శరీరాన్ని కూల్ చేస్తుంది. సొరకాయలో నీటి శాతం అధికంగా ఉండటమే ఇందుకు కారణం. సొరకాయ మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

నిద్ర సమస్యను అధిగమించవచ్చు

నిద్ర సమస్యను అధిగమించవచ్చు

మెదడులోని కణాలు ఉత్తేజితమవుతాయి. ఈ రోజుల్లో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుండటం, చాలామందికి నిద్రపట్టకుండా కళ్ళు మంటలు వస్తాయి. నువ్వుల నూనెతో సొరకాయ వేపుడు చేసుకుని తింటే నిద్ర సమస్యను అధిగమించవచ్చు. సొరకాయ సులభంగా జీర్ణమవుతుంది. మూత్రనాల జబ్బులకు సొరకాయ చాలా మంచిది. మలబద్థక, కాలేయ సమస్యను ఉన్నవారికి సొరకాయ చాలా మంచిది.

తొంభై శాతానికి మించి నీరే

తొంభై శాతానికి మించి నీరే

ఇక సొరకాయలో క్యాలరీలు చాలా తక్కువ. తొంభై శాతానికి మించి నీరే ఉంటుంది. కొవ్వుపాళ్లు కేవలం 1 శాతం మాత్రమే. పీచు పాళ్లు ఎక్కువ. ఈ అన్ని అంశాలు కలగలిసి ఉండటం వల్ల సొరకాయ తినగానే కడుపు నిండిపోతుంది. కానీ బరువు పెరగనివ్వదు. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి ఇంతకంటే మంచి కూర... మంచి వంటకం మరేముంటుంది. కేవలం బరువు తగ్గడానికే కాదు... మరెన్నో విధాల మేలు చేస్తుంది సొరకాయ. దానితో ఒనగూరే ప్రయోజనాల్లో కొన్ని ఇవి...

ఫైబర్‌ పుష్కలం

ఫైబర్‌ పుష్కలం

సొరకాయలో డయటరీ ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. దాంతో సొరకాయ ఐటమ్స్‌ తినగానే వెంటనే కడుపు నిండిపోయిన భావన కలుగుతుంది. దాంతో తినేది చాలా తక్కువ. సంతృప్త భావన ఎక్కువ. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి సొరకాయ మంచి ఆహారం. బరువు తగ్గడానికి తోడు... డయాబెటిస్‌ వ్యాధితో బాధపడేవారికి... ఉపకరించే మరో గుణం సొరకాయలో ఉంది.

ఒబేసిటీ తగ్గించుకోడానికి..

ఒబేసిటీ తగ్గించుకోడానికి..

వంద గ్రాముల సొరకాయ తింటే దాని వల్ల సమకూరేది కేవలం 15 క్యాలరీలు మాత్రమే. అందుకే డయాబెటిస్‌ ఉన్నవారు సొరకాయను ఏ రకంగా తీసుకున్నా మంచిదే. ఇక సొరకాయలో 96 శాతం నీరే. ఇలా చూసినప్పుడు డయటరీ ఫైబర్, తక్కువ క్యాలరీలను ఇచ్చే గుణం, నీరు ఎక్కువగా ఉండటం... ఈ మూడు అంశాలూ ఒబేసిటీ తగ్గించుకోడానికీ, డయాబెటిస్‌ను అదుపులో పెట్టుకోడానికి పనికి వస్తాయి.

చాలా మేలు చేసే ఆహారం

చాలా మేలు చేసే ఆహారం

ఇందులో నీటి పాళ్లు 96 శాతం ఉండటం వల్ల ఒంట్లో ద్రవాలు తగ్గుతున్నవారికి (డీహైడ్రేషన్‌కు గురవుతున్నవారికి) ఇది చాలా మేలు చేసే ఆహారం.100 గ్రాముల సొరకాయలో కొవ్వుల పాళ్లు కేవలం 1 గ్రాము మాత్రమే. కొలెస్ట్రాల్‌ పాళ్లు చాలా చాలా తక్కువ. అందుకే ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

పురుషాంగం బాగా గట్టిపడుతుంది

పురుషాంగం బాగా గట్టిపడుతుంది

సొరకాయలో జీవక్రియల్ని క్రమబద్ధం చేసే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా వీర్యవృద్ధి, లైంగిక శక్తి పెరుగుతుంది. అంగస్తంభన సమస్య పోయి పురుషాంగం బాగా గట్టిపడుతుంది. సెక్స్ చేసేటప్పుడు నిటారుగా నిలపడుతుంది. బాగా సెక్స్ చేయడానికి వీలవుతుంది. మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయి.ప్రధానంగా పురుషుల్లో వీర్యవృద్ధిని కలిగించడంలో సొరకాయ గింజల పాత్ర కీలకం.

శారీరకదారుఢ్యం

శారీరకదారుఢ్యం

సొరకాయ ముదురు గింజలను వేయించి, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాలు, జీలకర్ర కలిపి నూరి కొంచెం అన్నంతో కలిపి తీసుకుంటే.. లైంగిక శక్తి పెరుగుతుంది. దీని వల్ల శారీరకదారుఢ్యం కూడా వృద్ధి చెందుతుంది.

హృదయసంబంధ వ్యాధుల నివారణ

హృదయసంబంధ వ్యాధుల నివారణ

హృదయసంబంధ వ్యాధులను అరికట్టడంలో సొరకాయ కీలక పాత్ర పోషిస్తుంది. ఒకవేళ తరుచూ తింటే జలుబు చేస్తుందనుకుంటే... శొంఠిపొడినిగానీ, మిరియాల పొడినిగానీ కలిపి తీసుకుంటే మంచి గుణం కనిపిస్తుంది. అలాగే, అందాన్ని మరింత ద్విగుణీకృతం చేయడంతో పాటు.. బరువును కూడా తగ్గిస్తుందట.

సొరకాయ విత్తనాలు తినండి

సొరకాయ విత్తనాలు తినండి

సొరకాయ శరీరంలోని వేడినీ, కఫాన్నీ తగ్గిస్తుంది. వాంతులు, విరేచనాలు, పేగుపూత వంటి సమస్యలు ఉన్నవారు సొరకాయను తరుచూ తింటే ఎంతో మేలు కలుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం.. సొరకాయతే చేసిన కూరలు లేదా సొరకాయ విత్తనాలను తినేందుకు సిద్ధంకండి.

సొరకాయ ద్వారా తిరిగి పొందవచ్చు

సొరకాయ ద్వారా తిరిగి పొందవచ్చు

ఇక వ్యాయామాలు కండరాల నిర్మాణానికి తోడ్పడుతాయి. అదనపు కొవ్వును కోల్పోయెలా చేస్తాయి. కావున, వ్యాయామాల తరువాత తీసుకొనే ఆహార పదార్థాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి ఎలక్ట్రోలైట్, గ్లైకోజన్ వ్యాయామం చేసేపుడు కోల్పోయిన ద్రావణాలను సొరకాయ ద్వారా తిరిగి పొందవచ్చు.

సొరకాయ రసం తాగితే

సొరకాయ రసం తాగితే

వ్యాయామాల తరువాత సొరకాయ రసం తాగితే మంచిది. బరువు తగ్గుటకు, శక్తిని తిరిగి పొందేందుకు ఇది బాగా తోడ్పడుతుంది. ఇతరేతర శక్తిని అందించే ద్రావణాలకు బదులుగా, స్వతహాగా సొరకాయ రసాన్ని తయారు చేసుకొని తాగండి.

అధిక ఫైబర్

అధిక ఫైబర్

సొరకాయ అధిక ఫైబర్ ను కలిగి ఉంటుంది. ఫైబర్ లతో పాటూ, సొరకాయలో ఉండే కార్బోహైడ్రేట్లు ఆకలిని తగ్గిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్ లను పుష్కలంగా కలిగి ఉండి, జీవక్రియను పెంచుతాయి. వీటిలో ఉండే సహజ చక్కెరలు గ్లైకోజన్ ను స్థాయిలను పెంచి, కండరాలలో కోల్పోయిన కార్బోహైడ్రేట్లను వీటిని బదిలీ చేస్తాయి.

అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ దూరం

అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ దూరం

సొరకాయ అమైనో ఆసిడ్ లను కలిగి ఉండి, వేగంగా శక్తివంతంగా కండరాలను పునరుద్దరింపజేస్తుంది. అలాగే విటమిన్ 'బీ' 'సీ' నిండి ఉండి, ఐరన్, పొటాషియం, సోడియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. సొరకాయమూత్రాశయ సంబంధిత అన్ని రకాల ఇన్ఫెక్షన్ లకు దూరంగా ఉంచుతుంది.

జ్యూస్ ఇలా

జ్యూస్ ఇలా

సొరకాయ జ్యూస్ ను ఈ విధంగా తయారు చేసుకోవాలి.

తాజాగా సేకరించిన సొరకాయపై పొరను తొలగించాలి.

దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్టిరించి, గ్రైండ్ చేయండి.

రుచి కోసం ఉప్పు, మిరియాలను కలపండి. దాన్ని తాగండి.

నీటిని శాతాన్ని ఎక్కువగా కలిగి ఉండే సొరకాయ రసం, కూలింగ్ ఎఫెక్ట్ కలిగి ఉండి, వ్యాయామాల వలన శరీరం కోల్పోయిన ద్రావణాలను తిరిగి అందిస్తుంది.

English summary

30 incredible benefits of bottle gourd

30 incredible benefits of bottle gourd
Story first published: Tuesday, May 8, 2018, 13:00 [IST]