ఏనల్ సెక్స్ వలన ఆరోగ్యానికి కలిగే 5 దుష్రభావాలు

Written By: DEEPTHI T A S
Subscribe to Boldsky

'సెక్స్’ అనే టాపిక్ యే మన దేశంలో చర్చించటానికి కూడా ప్రజలు వారికివారే చాలా తీవ్రంగా నిషేధించుకున్న ఒక విషయం. ఈ కారణం వలనే అది చాలామంది దృష్టిని ఉన్నపళంగా ఆకర్షిస్తుంది కూడా.

సెక్స్ గురించి దాదాపు ప్రతి ఒక్కరిలో ఎప్పుడూ ఆసక్తి నెలకొనే ఉంటుంది మరియు పోర్న్ వలన ప్రపంచంలో సులువుగా అందరికీ దొరుకుతోంది, ప్రజలు సులభంగా దాని గురించి మాట్లాడగలుగుతున్నారు లేదా చూడగలుగుతున్నారు.

మన దేశంలో చాలా సున్నితమైన విషయాలలో సెక్స్ ఒకటి మరియు ఇదే సెక్స్ సంబంధ సుఖవ్యాధులు లేదా గర్భ సంబంధ సమస్యలు పెరగటానికి పెద్ద కారణం. ప్రజల్లో సరైన అవగాహన లేని కారణంగా తరచూ అవాంఛిత గర్భం మరియు లైంగిక వ్యాధులు, ఇన్ఫెక్షన్లు తీవ్రంగా సంక్రమించటం వంటివి జరుగుతాయి.

5 Health Risks Of Having Anal Sex

ఒక బంధంలో సెక్స్ అనేది ముఖ్యమైన భాగం మరియు జంటలు తమ శారీరక బంధానికి కొత్త మెరుగులు ఇవ్వటానికి పడకగదిలో వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఏదిఏమైనా శారీరక దగ్గరితనమే ఒక బంధాన్ని ఎక్కువగా జీవించివుండేలా చేస్తుంది కదా. కొత్త సెక్స్ పొజిషన్లు ప్రయత్నించడంతో పాటు, కొందరు జంటలు ఏనల్ సెక్స్ తో కూడా తమ కోరికను సరికొత్త స్థాయికి తీసుకెళ్తారు.

ఏనల్ సెక్స్ అనేది ఈ మధ్య మెల్లగా జంటల్లో ప్రాచుర్యం పొందుతున్న సెక్స్ కల.కానీ చాలామందికి దాని ప్రభావాల గురించి అవగాహన లేదు. ఏనల్ సెక్స్ సహజమా కాదా అనే వాదన పక్కనబెడితే, యోనితో సెక్స్ కన్నా ఏనల్ సెక్స్ తప్పకుండా భిన్నమైనదే. అందుకనే మీరు ఏనల్ సెక్స్ ను ప్రయత్నించేటప్పుడు కొన్ని విషయాలు మనస్సులో పెట్టుకోవాలి.

ఈ విషయం తెలిస్తే..మగవారు సెక్స్ ను అస్సలు విడిచిపెట్టరు?

గాసిప్స్ మాట్లాడుకునేవారి మధ్యనుంచి లేదా పత్రికల్లో అయినా చదివితే ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది ఏనల్ సెక్స్ గురించి మీరు చదివినది, విన్నది పూర్తిగా భిన్నమైన విషయాలని. ఇది మిమ్మల్ని ఏది నమ్మాలో తెలియని సందిగ్థంలో పడేస్తుంది. చింతించకండి. మేము ఇక్కడ మీకు ఏనల్ సెక్స్ తో వచ్చే వివిధ ఆరోగ్య రిస్క్ లను తెలపబోతున్నాం.

ఏనల్ సెక్స్ ద్వారా వచ్చే కొన్ని ఆరోగ్య రిస్క్ లు ఇవిగో-

1) ఇన్ఫెక్షన్లు

1) ఇన్ఫెక్షన్లు

ఏనల్ సెక్స్ వలన అనేక లైంగికంగా సంక్రమించే సుఖవ్యాధులు(ఎస్ టిఐలు) అనగా గనేరియా, హెపటైటిస్ బి మరియు సిఫిలిస్ వంటివి వస్తాయి. మలద్వారం యొక్క చర్మపొరలు చాలా సన్నగా ఉండి, సులువుగా చిరిగిపోగలవు మరియు ఇన్ఫెక్షన్లు అలా సులువుగా సోకుతాయి.

2)మలద్వారపు చీముగడ్డల స్థితి

2)మలద్వారపు చీముగడ్డల స్థితి

ఏనల్ సెక్స్ వలన సున్నితమైన మలద్వారపు చర్మం చిరిగి, సులువుగా బాగవదు. ఈ పొర సాధారణంగా బ్యాక్టీరియా మలద్వారం గుండా లోపలికి రాకుండా కాపాడుతుంది. ఇది చిరగటం వలన అక్కడ గడ్డలలాగా ఏర్పడి యానల్ యాబ్సెస్ స్థితి ఏర్పడుతుంది, అది తీవ్ర ఇన్ఫెక్షన్లకి దారితీయవచ్చు.

లైంగిక సామర్థ్యంతో పాటు,ఎనర్జీనిచ్చే టాప్ 15 పవర్ ఫుడ్స్

3)ఫిస్ట్యులాలు ఏర్పడటం

3)ఫిస్ట్యులాలు ఏర్పడటం

మలద్వారం వద్ద చర్మం పొర చిరగటం వలన ఇన్ఫెక్షన్లు పెరిగి, ఫిస్ట్యులా అనే స్థితికి దారితీయవచ్చు. ఈ స్థితిలో మలం ప్రేగులనుంచి సులువుగా బయటకి పోలేదు. ఈ స్థితి చాలా ఇబ్బందికరంగా ఉండి, సరి అవటానికి సర్జరీ అవసరమవుతుంది.

4) గర్భం

4) గర్భం

చాలామంది ఈ అసురక్షిత ఏనల్ సెక్స్ వలన గర్భం రాదనుకుంటారు, కానీ ఇది పూర్తిగా తప్పు. ఏనల్ సెక్స్ వలన కూడా ప్రెగ్నెన్సీ రావచ్చు. ఎందుకంటే మలద్వారం యోనికి చాలా దగ్గరలో ఉంటుంది, మరియు కండోం వేసుకోకపోతే, కొంత వీర్యం యోనిలోకి కూడా ప్రవేశించి ప్రెగ్నెన్సీకి దారితీయవచ్చు. ఇంకా, కండోం వాడేటప్పుడు, సరిగా వేసుకోవాలి మరియు మంట పుట్టకుండా, జారుడు పదార్థాలను కూడా వాడాలి. మలద్వారానికి యోనిలాగా జారుడుగా మారే పద్దతి లేదు, అందుకని ఎక్కువగా చిరగటానికి మరియు సరిగా పట్టకపోవటానికి దారితీస్తుంది.

5)ఏనల్ మరియు గర్భాశయ క్యాన్సర్ రిస్కులు

5)ఏనల్ మరియు గర్భాశయ క్యాన్సర్ రిస్కులు

ఇటీవలి అధ్యయనాలలో తేలింది ఏమిటంటే ఏనల్ మరియు గర్భాశయ క్యాన్సర్లు హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ వలన వస్తాయి మరియు ఈ వైరస్ ఎక్కువ సోకటానికి ముఖ్యకారణం ఏనల్ సెక్స్.

మరిన్ని ఆర్టికల్స్ మీకోసం:

సెక్స్ హార్మోన్స్ మరియు లిబిడో పెంచే టిప్స్ అండ్ ట్రిక్స్

ఈ పవర్ ఫుడ్స్ తింటే కోరికలు గుర్రాలై పరుగులు తీస్తాయి..?

English summary

5 Health Risks Of Having Anal Sex

Anal sex is something that is slowly catching people's fancy but many aren't aware about its effects. Therefore you need to keep certain things in mind before indulging in anal sex. Infections, cervical and anal cancer cancer, pregnancy, anal abscess and fistulas are some of the health risks of having anal sex.
Story first published: Friday, February 23, 2018, 19:00 [IST]