For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షియాట్సు మసాజ్ వలన చేకూరే 6 ఆరోగ్య ప్రయోజనాలు

షియాట్సు మసాజ్ వలన చేకూరే 6 ఆరోగ్య ప్రయోజనాలు

|

శారీరిక శ్రమ లేదా ఒత్తిడితో కూడిన వారం తర్వాత, లేదా పని ఒత్తిడితో కూడిన రోజు తర్వాత, మనలో అనేక మంది మసాజ్ వైపుకు మొగ్గు చూపడం పరిపాటి, అవునా కాదా? మసాజ్ ద్వారా క్రమంగా శరీరాన్ని సడలించడం ద్వారా ఒత్తిడి రహితమైన భావనకు లోనవుతుంటారు. ఈ మసాజ్, వెన్ను, పాదాలు, తల, శరీరం, చేతులకు సంబంధించినదిగా ఉంటుంది. ఏది ఏమైనా ఇటువంటి మసాజ్, మీకు తాత్కాలిక ఉపశమనం ఇస్తుంది, కానీ మీరు షియాట్సు మసాజ్ ను ప్రయత్నించినట్లయితే, ఇది రెండు విధాలుగా పని చేస్తుంది – అనగా నొప్పి ఉపశమనం మాత్రమే కాకుండా మరియు మీ శరీరం, మరియు మానసిక స్థితిని పునరుద్ధరించడం కూడా జరుగుతుంది.

జపాన్లో పుట్టిన షియాట్సు మసాజ్, శరీరంలోని కొన్ని నిర్దిష్ట పాయింట్ల వద్ద వేళ్ళతో మసాజ్ చేసేలా ఉంటుంది. షియాట్సు అనగా వేలితో ఒత్తిడి కలిగించడం అని జపాన్లో అర్ధం., శరీరంలోని శక్తి మార్గాలను సమతుల్యం చేసే, గొప్ప ప్రక్రియగా పేరు పొందిన ఈ మసాజ్, ఒక స్వీయ మర్దన రూపంగా ఉంటుంది. జీర్ణ సమస్యలు, నిరాశ, కండరాల ఉద్రిక్తత, తలనొప్పి, ఆందోళన మరియు సైనస్ సమస్యల వంటి అనేక ఆరోగ్య పరిస్థితులను ఎదుర్కోవటానికి ఈ మసాజ్ సహాయపడుతుంది.

6 Health Benefits Of Shiatsu Massage

నిపుణులైన షియాట్సు మసాజ్ థెరపిస్ట్స్ వారి అరచేతులు, మోచేతులు, మోకాలు మరియు పాదాలను శరీరంపై ఒత్తిడి కలిగించడానికి ఉపయోగిస్తారు. ఇక్కడ వివిధరకాల షియాట్సు ఫలితాలు మరియు పద్దతుల గురించిన వివరాలను పొందుపరచబడ్డాయి.

షియాట్సు మసాజ్ వలన చేకూరే 6 ఆరోగ్య ప్రయోజనాల గురించిన వివరాలను తెలుసుకొనుటకు ఈ వ్యాసం ఉపయోగపడుతుంది.

1. ఒత్తిడి తగ్గించడం

1. ఒత్తిడి తగ్గించడం

మసాజ్ థెరపీలన్నింటిలో, షియాట్సు మసాజ్ థెరపీ ఒత్తిడిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుందని తెలుపబడింది. బి.ఎం.సి కాంప్లిమెంటరీ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసన్ జర్నల్లో ప్రచురించిన ఒక సమీక్ష ప్రకారం, షియాట్సు మసాజ్ శరీరంలోని శక్తి సమతుల్యతను సంతులనం చేయడం, నిర్వహించడం మరియు పునరుద్ధరించడం వంటి చర్యలనే కాకుండా ఒత్తిడిని సైతం పూర్తిగా నిరోధించగలదు. ఒత్తిడిని తగ్గించడం మీ ప్రధాన లక్ష్యం అయితే, షియాట్సు మసాజ్ ఒక గూప్ప ఎంపిక అవుతుంది.

2. ఆందోళనల నుండి ఉపశమనం

2. ఆందోళనల నుండి ఉపశమనం

మీరు ఆందోళన లేదా డిప్రెషన్ సమస్యలతో పోరాడుతున్నట్లయితే, షియాట్సు మసాజ్ అనేది ఒక గొప్ప చికిత్సా ఎంపికగా ఉంటుంది. ఈ మసాజ్ థెరపీ మానసిక సంబంధిత సమస్యలకు చెక్ పెట్టగలదని అనేక పరిశోధనలలో తేలిన నిజం. ముఖ్యంగా కాలిన గాయాలు కలిగిన వారికి మానసిక సంతృప్తిని అందించేలా ఉంటుంది.

3. నొప్పి నుండి ఉపసమనం

3. నొప్పి నుండి ఉపసమనం

నొప్పి నుండి ఉపశమనం కోసం తరచుగా పెయిన్ కిల్లర్ల వైపుకు మొగ్గు చూపుతున్నారా? ఈ పెయిన్ కిల్లర్లు మీకు నొప్పిని తగ్గించడంలో తక్షణ ఉపశమనం కలిగించగలవు, కానీ పూర్తిగా కాదు మరియు కొన్ని మందులు దుష్ప్రభావాలను సైతం కలిగి ఉంటాయి. కానీ షియాట్సు మసాజ్ మీకు ఎటువంటి దుష్ప్రభావాలు లేని ఉపశమనాన్ని ఇస్తుంది. మరియు అనేకరకాల నొప్పులను ఎదుర్కొనే ప్రసిద్ద సామర్ధ్యాలను కలిగి ఉంటుంది. అనేక అధ్యయనాలు, ఆక్యుప్రెజెర్ (షియాట్సు మసాజ్ యొక్క ప్రధానభాగం) ఒక సహజ ప్రత్యామ్నాయ చికిత్సా విధానంగా పేర్కొన్నాయి. మరియు ముఖ్యంగా వెన్నునొప్పిని తగ్గించడంలో క్రియాశీలంగా పనిచేస్తుందని తేలింది కూడా.

4. కండరాల నొప్పుల నుండి ఉపశమనం

4. కండరాల నొప్పుల నుండి ఉపశమనం

షియాట్సు మసాజ్లో, సమర్థవంతంగా చర్మంపై రుద్దడం మరియు కండరముల వద్ద లాగడం వంటి చర్యల ద్వారా కండరాల నొప్పులు మరియు నిస్తేజం, ఉద్రిక్తత వంటి ఇతర సమస్యలు కూడా తగ్గుముఖం పడుతాయి,. ఆక్యుప్రెషర్ పాయింట్లను నొక్కడం ద్వారా ఒత్తిడిని కలిగించడం ద్వారా ఈ చర్య కొనసాగుతుంది. వెన్నునొప్పి, భంగిమ సమస్యలు, కీళ్ళనొప్పి మరియు కండరాలసమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.

5. శరీరంలో శక్తి ప్రవాహాన్ని మెరుగుపరచడం

5. శరీరంలో శక్తి ప్రవాహాన్ని మెరుగుపరచడం

శరీరంలో అంతర్గత శక్తి వ్యవస్థను సానుకూలంగా ప్రభావితం చేయడం ద్వారా మీ మొత్తం శరీరం యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం షియాట్సు మసాజ్ లక్ష్యంగా ఉంటుంది. ఆక్యుప్రెషర్ పాయింట్లపై దృష్టిసారించడం ద్వారా, శరీరంలో పేరుకుపోయిన కొవ్వు అడ్డంకులను తొలగించడానికి మరియు శరీరంలో ముఖ్యమైన శక్తి యొక్క ఆరోగ్యకరమైన ప్రవాహాన్ని ప్రోత్సహించడానికి షియాట్సు మసాజ్ ప్రయత్నిస్తుంది.

6.చర్మ ఆరోగ్యానికి

6.చర్మ ఆరోగ్యానికి

మీ శరీరంలోని వేర్వేరు ఆక్యుప్రెషర్ పాయింట్లలో మీ వేళ్ళను ఉపయోగించి కలిగించే ఒత్తిడి, చర్మంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు చర్మంలోని సెబాషియస్ గ్రంధులను ప్రభావితం చేయడం ద్వారా, స్వేదాన్ని ఉత్పత్తి చేయడం మూలంగా చర్మాన్ని ఎల్లప్పుడూ తేమగా ఉంచే ప్రయత్నం చేస్తుంది. క్రమంగా మసాజ్ పూర్తైన తర్వాత ఆరోగ్యకర రూపాన్ని సంతరించుకుంటుంది.

షియాట్సు మసాజ్ ఉపక్రమించే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు :

మీరు షియాట్సు మసాజ్ కోసం తయారవుతున్నట్లయితే, శిక్షణ పొందిన మసాజ్ నిపుణుడిని మాత్రమే సంప్రదించవలసి ఉంటుంది. మరియు వారి వద్ద గుర్తింపు పొందిన శిక్షణా కార్యక్రమం ఉండాలి.

ఈ క్రింది జాగ్రత్తలు ప్రధానంగా తీసుకోవాలి :

మీరు షియాట్సు మసాజ్, నొప్పి కలిగే మసాజ్ వలె భావిస్తున్న వారైతే,ముందుగా మీ

సమస్యను మసాజ్ థెరపిస్ట్ నకు తెలియజేయండి. వారు మీ భావాలకు తగినట్లుగా మార్పులను చేయడం జరుగుతుంది.

రక్తంలో తక్కువ ప్లేట్లెట్ సంఖ్య లేదా రక్తస్రావ సమస్యలు కలిగిన వ్యక్తులు లోతైన కణజాల మసాజ్లను నివారించాలి.

మీరు రక్తం పలుచబడే మందులు వాడుతున్న ఎడల, ఈ మర్దన పొందడానికి ముందు మీ వైద్యునితో మాట్లాడండి.

మీరు గర్భవతి అయితే, షియాట్సు మర్దన పొందడానికి ముందు మీ గైనకాలజిస్ట్ ను సంప్రదించండి.

మీరు క్యాన్సర్ భాదితులు అయితే, కణితి లేదా క్యాన్సర్ ఉన్న శరీర భాగాలలో లోతైన ఒత్తిడిని కలిగి ఉన్న మసాజ్లు సిఫార్సు చేయబడవు.

మీరు ఏదైనా చర్మ వ్యాధి లేదా గాయాలు వంటి సమస్యలను కలిగి ఉంటే, లోతైన లేదా తీవ్రమైన కణజాల సంబంధిత మసాజ్ సిఫార్సు చేయబడదు.

మీకు ఎటువంటి వైద్య పరిస్థితులు ఉన్నా, ఈ మర్దన మీకు మంచిదని నిర్ధారించుకోవడానికి మీ వైద్యునితో మాట్లాడడం శ్రేయస్కరం.

English summary

6 Health Benefits Of Shiatsu Massage

Shiatsu meaning 'finger pressure' in Japanese, is a self-massage technique which is a form of bodywork that balances the energy pathways in the body. The health benefits of Shiatsu massage are reducing stress, lowering anxiety, managing pain, relieving muscle aches, stimulating the skin, and improving the flow of energy.
Story first published:Friday, August 3, 2018, 18:04 [IST]
Desktop Bottom Promotion