For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 7 భయంకరమైన వ్యాధుల గురించి చర్మం మిమ్మల్ని హెచ్చరిస్తోంది

ఈ 7 భయంకరమైన వ్యాధుల గురించి చర్మం మిమ్మల్ని హెచ్చరిస్తోంది

|

ఒక దోమ లేదా ఒక చీమ కుట్టిన చోట చర్మంపై ఏర్పడే సెన్సేషన్ ను ఒక్కసారి ఇమేజిన్ చేసుకోండి. తీవ్రంగా దురద వేధిస్తుంది. ఆ ప్రాంతంలో ఏర్పడిన దురద నుంచి ఉపశమనం కోసం మీరు అదే పనిగా గోకుతూ ఉంటారు. నిజమే కదా?

కాబట్టి, ఇరిటేట్ అయినా ఇచీ స్కిన్ సమస్య ఎంతో అసౌకర్యానికి గురిచేస్తుంది.

చర్మంపై దురద అనేది అనేక వ్యాధుల వలన అలాగే చర్మ సమస్యల వలన తలెత్తుతుంది. దురద అనేది మిగతా ఆరోగ్య స్థితులకు ఒక లక్షణంగా వ్యవహరిస్తుంది. చర్మంపై దురదకు అనేక ఫ్యాక్టర్స్ దారితీస్తాయి.

కొన్ని రకాల దురదలు దోమకాటుతో ఏర్పడినవి అయితే వాటంతటవే కొద్ది నిమిషాలలో తగ్గిపోతాయి. మరికొన్ని రకాల దురదలు అలర్జీల ద్వారా తలెత్తినవి కొన్ని రోజులు అలాగే కొన్ని సంవత్సరాల పాటు వేధిస్తాయి.

దీర్ఘకాలంగా ఈ దురద సమస్య నుంచి మీరు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారంటే రోజువారీ పనులను సైతం సౌకర్యవంతంగా పూర్తిచేయలేరు. ప్రశాంతంగా ఉండలేరు. ఎప్పుడూ, దురద మీదే మనసు లగ్నం అవుతూ వస్తుంది.

ప్రతిసారి గోక్కోవడం కూడా అసౌకర్యంగా ప్రత్యేకించి కొన్ని సార్లు ఇబ్బందికరంగా ఉంటుంది. దురద పెట్టిన ప్రదేశాన్ని అదేపనిగా గోక్కోవడం వలన కూడా అలసటకు గురయ్యే అవకాశాలున్నాయి.

ఇక్కడ, దురదలకి దారితీసే కొన్ని ఆరోగ్యస్థితుల గురించి వివరించాము. వీటిని పరిశీలించండి:

1. కిడ్నీ వ్యాథి:

1. కిడ్నీ వ్యాథి:

శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తాయి. శరీరం నుంచి టాక్సిన్స్ ను అలాగే వేస్ట్ ను ఫిల్టర్ చేయడం వీటి ముఖ్య విధి. అనేక అధ్యయనాల ప్రకారం, కిడ్నీ వ్యాధి (చిన్నదైనా లేదా పెద్దదైనా) బారిన పడిన వారిలో చర్మంపై దురదల సమస్య ఎదురవుతుందని తేలింది.

కిడ్నీ ఫెయిల్యూర్ వంటి క్రానిక్ కిడ్నీ వ్యాధుల సమయంలో దురదలు మరింత తీవ్రంగా ఉంటాయి. టాక్సిన్స్ ను అలాగే వేస్ట్ ను కిడ్నీలు సరిగ్గా ఫిల్టర్ చేయలేని కారణంగా అవి రక్తప్రవాహంలో చేరి దురదలకి దారితీస్తాయి.

2. లివర్ సమస్యలు:

2. లివర్ సమస్యలు:

కిడ్నీలలాగానే లివర్ కూడా శరీరంలోని ముఖ్యమైన అవయవం. ఇది జీర్ణక్రియకు తోడ్పడుతుంది. పోషకాలను శరీరానికి అందేలా చేస్తుంది. తద్వారా, శక్తినిస్తుంది. శరీరం మొత్తమ్మీద దురదతో ఇబ్బందులు ఎదురయితే లివర్ డిసీజ్ ల గురించి తెలిపే ప్రారంభ సూచికగా ఈ దురదను పరిగణించాలి.

లివర్ లో బైల్ ఎక్కువ మొత్తంలో పేరుకుంటే అది ఎసిడిఫై అవడం ప్రారంభిస్తుంది. రక్తప్రవాహంలో కలుస్తుంది. దాంతో తీవ్రమైన దురద తలెత్తుతుంది.

3. వెన్నెముక వ్యాధి:

3. వెన్నెముక వ్యాధి:

వీపుపై అలాగే మధ్యవీపుపై ఎక్కువ దురద మిమ్మల్ని వేధిస్తుంటే, ర్యాషెస్ కనిపించకపోతే అది వెన్నెముక వ్యాధికి సంబంధించిన సూచిక కావచ్చు. స్పైనల్ కార్డులో ఏర్పడిన గాయాలు అలాగే ఇంఫ్లేమేషన్ కారణంగా ఈ సమస్య తలెత్తవచ్చు.

స్పైనల్ కార్డు చుట్టూ ఉన్న నరాలు దెబ్బతిన్నప్పుడు లేదా ఇంఫ్లేమేషన్ కు గురయినపుడు కొన్ని అసౌకర్యాలు ఎదురవుతాయి. కూర్చున్నప్పుడు, అటూ ఇటూ తిరుగుతున్నప్పుడు ఆ ప్రాంతంలో ఇచింగ్ సెన్సేషన్ కలుగుతుంది.

4. ఉదరకుహర వ్యాధి:

4. ఉదరకుహర వ్యాధి:

తీవ్రమైన దురదలతో పాటు మోకాళ్ల చుట్టూ, మోచేతుల వద్ద, పిరుదులు అలాగే హెయిర్ లైన్ ప్రాంతం వద్ద ఎర్రటి బొబ్బలు లేదా చిన్న గడ్డలను గమనించినా, అది డెర్మటైటిస్ హెర్పెటిఫార్మిస్ కి సంబంధించిన ఒక లక్షణం కావచ్చు. ఇది ఒకరకమైన ఉదరకుహర వ్యాధి. ఇది చర్మంపై దుష్ప్రభావాన్ని చూపుతుంది.

గ్లూటెన్ రిచ్ ఫుడ్స్ ను తీసుకున్నప్పుడు ఉదరకుహర వ్యాధి కారణంగా వీటిని శరీరం తగిన విధంగా ప్రాసెస్ చేయలేదు. ఈ కండిషన్ ను మేనేజ్ చేయడానికి గ్లూటెన్ ఫ్రీ డైట్ ను అలాగే కొన్ని రకాల మెడికేషన్స్ ను తీసుకోవలసి వస్తుంది. ఈ సమస్య తగ్గుముఖం పట్టడానికి చాలా కాలం పడుతుంది.

5. లింఫోమా:

5. లింఫోమా:

ఇది ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్. ఇది శరీరంలోని లింఫ్ నోడ్స్ పై ప్రభావము చూపుతుంది. ఈ రకమైన క్యాన్సర్ కు చికిత్స చేయడం కష్టం. రిలాప్స్ రేట్ చాలా ఎక్కువ. ఈ వ్యాధితో ఇబ్బంది పడుతున్న వారికి శరీరమంతా దురద వేధిస్తుంది. ర్యాషెస్ మాత్రం కనిపించవు.

ఇది సైటోకైన్స్ వలన తలెత్తుతుంది. ఇవి స్కిన్ సెల్స్ లోని ఇంఫ్లేమేషన్ ను ప్రేరేపిస్తాయి. తద్వారా, తీవ్రమైన దురద వేధిస్తుంది.

6. థైరాయిడ్:

6. థైరాయిడ్:

థైరాయిడ్ రెండు రకాలు. మొదటి రకం హైపోథైరాయిడిజం. థైరాయిడ్ గ్లాండ్స్ తక్కువగా పనిచేయడం వలన ఈ సమస్య తలెత్తుతుంది. రెండవ రకం హైపర్ థైరాయిడిజం. ఈ సమస్య థైరాయిడ్ గ్లాండ్స్ ఎక్కువగా పనిచేయడం వలన తలెత్తుతుంది. థైరాయిడ్ సమస్య అనేది హార్మోన్ల డిసీజ్ వలన తలెత్తుతుంది. వీటికి దీర్ఘకాల చికిత్స అవసరం. హార్మోన్లలో అసమతుల్యం వలన చాలా మంది పేషంట్స్ లో దురద సమస్య తలెత్తుతుంది.

7. మెనోపాజ్:

7. మెనోపాజ్:

మెనోపాజ్ అనేది వ్యాధి కాకపోయినా దీని వలన మహిళలు అనేక ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవలసి వస్తుంది. మెనోపాజ్ అనేది నేచురల్ గా జరిగే ప్రక్రియ. ప్రతి మహిళా దీనిని ఫేస్ చేయవలసి వస్తుంది. 45 ఏళ్ళు పైబడిన స్త్రీలలో ఇది తలెత్తుతుంది. నేచురల్ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఆగిపోయినప్పుడు మెనోపాజ్ మొదలవుతుంది.

మెనోపాజ్ సమయంలో శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. హార్మోన్ల మార్పుల వలన శరీరంలోని నేచురల్ ఆయిల్స్ ఉత్పత్తి తగ్గుతుంది. తద్వారా, చర్మం పొడిగా మారి దురదకు గురవుతుంది. హార్మోనల్ థెరపీల వలన ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.

English summary

7 Deadly Diseases Your Itchy Skin Is Trying To Warn You About!

Severely itchy skin can be extremely irksome & discomforting. Normally, we feel that itchy skin is not much of an issue to worry about and take simple medications to suppress it but it could be a symptom of diseases such as kidney disease, liver disease, spinal disease, celiac disease, lymphoma, thyroid disease, and menopause.
Desktop Bottom Promotion