Just In
- 2 hrs ago
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- 5 hrs ago
Chanakya Niti: ఈ పనులతో పేదలు కూడా ధనవంతులు అవుతారు, అవేంటంటే..
- 10 hrs ago
Today Rasi Palalu 28January 2023: ఈ రోజు తులారాశి వారికి అకస్మిక ధనలాభం
- 18 hrs ago
ఈ 5 రాశుల వారు తమ భాగస్వామిని ఎప్పుడూ అనుమానిస్తూనే ఉంటారు..మాటలతో చిత్రహింసలకు గురిచేస్తారు
కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు అవాయిడ్ చేయవలసిన ఏడు ఆహారపదార్థాలు
కడుపుబ్బరంగా ఉందా? ఉపశమనం పొందటానికి ఏం చేయాలో అర్థం కావటం లేదా? మనలో చాలా మంది సాధారణంగా ఫేస్ చేసే స్టమక్ ప్రాబ్లెమ్ ఇది. ఈ సమస్య వలన కడుపులో గ్యాస్ తో అసౌకర్యంగా ఉంటుంది. ఏ పనీ చేయడానికి ఆసక్తి ఉండదు. కడుపుబ్బరం సమస్యకు అనేక ఫ్యాక్టర్స్ దారితీస్తాయి. అజీర్ణం, ఫుడ్ అలర్జీస్, లాక్టోస్ ఇంటాలరెన్స్ మరియు మలబద్దకం వంటివి కడుపుబ్బరానికి దారితీసే కొన్ని ప్రధాన కారణాలు. మన ఈటింగ్ హ్యాబిట్స్ కూడా ఈ సమస్యను కలిగించేందుకు తమ వంతు పాత్రను పోషిస్తాయి. ఆహారాన్ని వేగంగా తీసుకోవడం, భోజనం తరువాత చల్లటి పానీయాలను లేదా సాల్ట్ ఎక్కువగా ఉండే పానీయాలను తీసుకోవడం వంటివి పరిస్థితిని మరింత దిగజారుస్తాయి.
అలాగే, తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. రోజువారీ డైట్ లో ఎటువంటి ఆహార పదార్థాలను జోడించడం వలన ఈ సమస్య తగ్గుముఖం పడుతుందో తెలుసుకోవాలి.
ఇక్కడ బ్లోటింగ్ కి కారణమయ్యే ఆహారాల గురించి తెలుసుకుందాం:

1. బీన్స్:
బీన్స్ లేదా లెజ్యుమ్స్ అనేవి ఫైబర్ ఎక్కువగా కలిగి ఉంటాయి. అలాగే వీటిలో షార్ట్ చెయిన్ కార్బో హైడ్రేట్స్ కలవు. ఇవి సులభంగా జీర్ణం కావు. ఇవి ఇంటస్టైన్ లో ఫెర్మెంటేషన్ ప్రాసెస్ కి గురవుతాయి. ఈ ప్రక్రియలో గట్ బాక్టీరియా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే, ఈ క్రమంలో గ్యాస్ ఫార్మ్ అవుతుంది. అందువలన బీన్స్ ను వండే ముందు నీటిలో నానబెట్టడం మంచిది. అలాగే, వండటానికి ముందు బీన్స్ ను ఎక్కువసార్లు వాష్ చేయాలి.

2. లెంటిల్స్:
అన్ని రకాల లెంటిల్స్ అందరికీ సూట్ అవుతాయని లేదు. కొందరికి కందిపప్పు, శనగపప్పు అలాగే మా కీ దాల్ వంటివి సులభంగా జీర్ణం కావు. ఎందుకంటే వీటిలో బీన్స్ లో లభించేటటువంటి షార్ట్ చెయిన్ కార్బ్స్ లభిస్తాయి.

3. కాలీఫ్లవర్, బ్రొకోలీ:
ఈ వెజిటబుల్స్ క్రూసీఫెరస్ వెజ్జీస్ కోవలోకి వస్తాయి. వీటిలో ఎసెన్షియల్ విటమిన్స్ మరియు మినరల్స్ లభిస్తాయి. వీటిని తీసుకోవడం వలన కొందరిలో గ్యాస్ సమస్య తలెత్తుతుంది. కేవలం గట్ లో నే డైజెస్ట్ అవబడే షుగర్ కంటెంట్ లభించడం వలన ఇలా జరుగుతుంది.

4. ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి;
ఉల్లి లేదా వెల్లుల్లి లేనటువంటి రుచికరమైన వంటకాన్ని మీరు ఊహించగలరా? ఊహించలేరు. అందువలనే, ఈ పదార్థాలు సాధారణంగా ప్రతి కిచెన్ లో విరివిగా లభిస్తాయి. అయితే, బ్లోటింగ్ కి గురయ్యే వారు తాము తీసుకునే పదార్థాలను ట్రాక్ చేసుకోవాలి. పచ్చి ఉల్లిపాయలో అలాగే వెల్లులి లో ఫ్రాక్టేన్స్ ఉంటాయి. ఇవి సాల్యుబుల్ ఫైబర్స్ వీటి వలన బ్లోటింగ్ సమస్య తలెత్తుతుంది.

5. గోధుమలు అలాగే ధాన్యాలు:
సెలియాక్ వ్యాధుల నుంచి బాధపడేవారు అనేకమంది ఉన్నారు. వారు స్ట్రిక్ట్ గా గ్లూటెన్ ఫ్రీ డైట్ ను పాటించాలి. బ్లోటింగ్ సమస్య బారిన పడే ప్రమాదం ఉన్నవారు తాము తీసుకునే గోధుమలు అలాగే ధాన్యాల మోతాదుపై పై దృష్టి పెట్టాలి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువలన, ఇవి జీర్ణమవడానికి కొంత కష్టమవుతుంది. ఈ క్రమంలో, గ్యాస్ మరియు బ్లోటింగ్ సమస్య తలెత్తుతుంది.

6. జంక్ ఫుడ్:
మీకు జంక్ ఫుడ్ ఎంత ఇష్టమైనప్పటికీ ఫ్రైస్, తీపి పదార్థాలు అలాగే ఫిజ్జీ డ్రింక్స్ కు దూరంగా ఉండటం మంచిది. ఇవి శరీరంలోని కేలరీల మోతాదును అమాంతం పెంచడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. ఇవి సులభంగా జీర్ణమవకపోవటం వలన బ్లోటింగ్ సమస్య తలెత్తుతుంది. మరోవైపు, ఏరేటెడ్ డ్రింక్స్ లో కార్బన్ డయాక్సయిడ్ అనే గ్యాస్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థలో ట్రాప్ అయి ఉంటుంది.

7. డైరీ:
పాలు మరియు ఇతర డైరీ ప్రోడక్ట్స్ ని భారతీయులు ఎక్కువగా తీసుకుంటారు. అయితే, చాలా మంది మిల్క్ లో లభించే లాక్టోస్ అనే షుగర్ ను త్వరగా జీర్ణం చేసుకోలేరు. దీని వలన లాక్టోస్ ఇంటాలరెన్స్ సమస్య తలెత్తుతుంది. దాని ఫలితంగా, గ్యాస్, బ్లోటింగ్ మరియు క్రామ్ప్స్ సమస్య ఎదురవుతుంది. వేడి పాలకు ఈ సమస్యకు దారితీసే ఆస్కారం ఉందని చెప్పుకోవచ్చు.