For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు యూటీఐ ఉంటే ఈ 7 ఫుడ్స్ ను మీరు అవాయిడ్ చేయవలసిందే

|

ఈ రోజుల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. యూరినరీ సిస్టమ్ (బ్లాడర్, యురెత్రా లేదా కిడ్నీ)కి సంబంధించి దేనికి ఇన్ఫెక్షన్ సోకినా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ గానే పేర్కొంటారు.

ఈ ఇన్ఫెక్షన్ పురుషులకు కూడా సోకే అవకాశం ఉంది. అయితే, మహిళలకు ఈ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రతి ఐదుగురి మహిళలలో ఒక మహిళకు తన జీవితకాలంలో ఎదో ఒక సమయంలో యూటీఐ బారిన పడే అవకాశం ఉందని నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే మహిళల్లో యురెత్రాస్ అనేవి పొట్టిగా ఉంటాయి. దీనివలన బాక్టీరియా బ్లాడర్ వద్దకు త్వరగా చేరుకుంటుంది.

7 forbidden foods if youve got UTI

యూటీఐకి దారితీసే కారణాలు

బాక్టీరియా అనేది యూరినరీ ట్రాక్ట్ కు ఎంటర్ అయితే బ్లాడర్ ఇన్ఫెక్షన్ సంభవిస్తుంది. ఈ కోలీ వంటి బాక్టీరియా అనేది ఇంటస్టైన్ ను దాటుకుని యురెత్రాపై అలాగే ఆనస్ పై దాడిచేసి బ్లాడర్ వరకు ట్రావెల్ చేస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ ను తగ్గించుకోవటానికి చికిత్స చేయించుకోకపోతే కిడ్నీ సమస్యలు వాటిల్లే ప్రమాదం ఉంది.

ప్రీ డయాబెటిస్ కు చెందిన వారికి యూటీఐ ప్రమాదం తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అలాగే అన్ ప్రొటెక్టెడ్ సెక్స్ లో పాల్గొనటం కూడా యూరినరీ ట్రాక్ట్ ను ఇన్ఫెక్షన్ కు గురిచేసే మరొక కారణం. అలాగే, యూరినేట్ చేయవలసిన అవసరం వచ్చినప్పుడు ఎక్కువ సేపు ఆపుకోవడం కూడా ప్రమాదకరమే. యూరినరీ ట్రాక్ట్ షేప్ అబ్నార్మల్ గా ఉండటం, కాంట్రాసెప్టివ్స్ ను వాడటం, జన్యుసిద్ధత, మెనోపాజ్ లేదా ప్రెగ్నన్సీ వలన హార్మోన్లో తేడాలు వంటివి మహిళల్లో యూరినరీ ట్రాక్ట్ కు దారితీసే అంశాలు.

యూటీఐ లక్షణాలు:

యూటీఐ బారిన ప్రతి ఒక్కరిలో ఈ లక్షణాలు కనిపించే అవకాశం లేదు. అయితే, యూటీఐని గమనించాలంటే ఈ లక్షణాలను గమనించాలి.

• యూరినేట్ చేయవలసిన అర్జెన్సీతో పాటు యూరినేషన్ సమయంలో నొప్పి

• యూరిన్ లో రక్తం, క్లౌడీ యూరిన్, యురినేట్ చేసే సమయంలో బర్నింగ్ సెన్సేషన్

• వికారం, బ్యాక్ పెయిన్ మరియు వణుకుతో కూడిన జ్వరం

• లోవర్ అబ్డోమెన్ లో నొప్పి లేదా ఒత్తిడి

• అలసట

• తరచూ కొంచెం కొంచెంగా వచ్చే యూరినేషన్

యూటీఐ సమయంలో అవాయిడ్ చేయవలసిన ఫుడ్స్

యూటీఐను యాంటీబయాటిక్స్తో తగ్గించుకోవచ్చు. యూటీఐ అనేది చికిత్సతో తగ్గుతుంది. అయితే, మళ్ళీ మళ్ళీ ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఇది మీకు మొదటి లేదా ఐదవ ఇన్ఫెక్షన్ కావచ్చు, మీ గోల్ అనేది ఈ సమస్యను ఇక్కడితో ముగించడం.

నిపుణుల సూచనల ప్రకారం కొన్ని ఫుడ్స్ ను అలాగే కొన్ని పానీయాలను అవొఇద్ చేస్తే యూరినరీ ట్రాక్ట్ లైనింగ్ అనేది ఇరిటేట్ అవడం తగ్గుతుంది. తద్వారా యూటీఐ లక్షణాలు మరింత తీవ్రరూపం దాల్చకుండా అరికట్టవచ్చు. మీ డైట్ లో ని కొన్ని మార్పులతో యూటీఐ లక్షణాల నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఇటువంటి సమయంలో మీరు అవాయిడ్ చేయవలసిన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తద్వారా, ఈ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్ళీ రాకుండా అడ్డుకట్ట వేయవచ్చు.

1. కెఫైన్:

1. కెఫైన్:

ఉదయాన్నే ఒక కప్పుడు కాఫీ లేదా టీతో రోజును ప్రారంభం చేయడమంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అయితే, ఈ అలవాటును మానుకోవడం ద్వారా యూటీఐ సమస్య వచ్చే అవకాశమున్నవారు కాస్తంత ఉపశమనం పొందగలుగుతారు. కెఫైన్ అనేది బ్లాడర్ ని ఇరిటేట్ చేసి యూటీఐ లక్షణాలను తీవ్రంగా మార్చుతుంది. కాబట్టి, దీనిని అవాయిడ్ చేస్తే బ్లాడర్ ఇంఫ్లేమేషన్ అనేది సంభవించదు. నిజానికి, అధ్యయనాలలో ఈ విషయం స్పష్టమైంది. క్రానిక్ బ్లాడర్ ఇంఫ్లేమేషన్ సమస్య కలిగిన వారిపై అధ్యయనం చేయగా ఈ విషయం తేటతెల్లమైంది. కెఫైన్ కి బదులుగా ఒక మగ్గుడు హెర్బల్ టీని వాడితే ఆరోగ్య ప్రయోజనాలను ఎన్నో పొందవచ్చు.

2. ఆల్కహాల్:

2. ఆల్కహాల్:

టీ మరియు కాఫీలాగానే ఆల్కహాల్ కి కూడా ఈ విషయం వర్తిస్తుంది. వైన్, లిక్కర్, స్టీర్ క్లియర్ ఆల్కహాల్ అనేవి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు పొట్టని అలాగే బ్లాడర్ ని ఇరిటేట్ చేస్తాయి. యూటీఐ సమస్య ఎదురైనప్పుడు ఫ్లూయిడ్స్ ను ఎక్కువగా తీసుకోవాలి. అయితే, ఆల్కహాల్ ను కెఫైన్ ను అవాయిడ్ చేయాలి. వాటికి బదులు నీళ్లు, క్రాన్ బెర్రీ జ్యూస్ లను ప్రయత్నిస్తే ఇన్ఫెక్షన్ ను అధిగమించవచ్చు.

3. తీపి పానీయాలు:

3. తీపి పానీయాలు:

కమర్షియల్ గా లభించే స్వీటెన్డ్ జ్యూస్ లను అలాగే సోడా కలిగిన బెవెరేజెస్ లను అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే, వీటిలో లభించే పదార్థాలు ఇన్ఫెక్షన్ కు మీరు గురైనప్పుడు మీపై దుష్ప్రభావం చూపించే ప్రమాదం ఉంది. షుగరీ ఫుడ్స్ అనేవి బాక్టీరియాను ప్రోత్సహించి హీలింగ్ ప్రాసెస్ వేగాన్ని తగ్గిస్తాయి. కాబట్టి, హోంమేడ్ నేచురల్ డైయూరేటిక్ ఫ్రూట్ జ్యూస్ లను ప్రయత్నిస్తే మంచిది.

4. సిట్రస్ ఫ్రూట్స్:

4. సిట్రస్ ఫ్రూట్స్:

హోమ్ మెడ్ నేచురల్ ఫ్రూట్ జ్యూస్ లను తీసుకోమని చెప్పాము కదా? అయితే, ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతున్నప్పుడు సిట్రస్ ఫ్రూట్స్ ని మీరు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే, ఈ ఫ్రూట్స్ అనేవి యూటీఐ లక్షణాలను మరింత తీవ్రంగా మారుస్తాయి. వీటిలో లభించే యాసిడ్స్ వలన ఇలా జరుగుతుంది. షుగర్ అలాగే యాసిడిక్ ఎన్విరాన్మెంట్స్ లో బాక్టీరియా నివాసముంటుంది. కాబట్టి, యూటీఐ నుంచి ఉపశమనం కోసం సిట్రస్ ఫ్రూట్స్ ను అవాయిడ్ చేయండి.

5. స్పైసీ ఫుడ్స్:

5. స్పైసీ ఫుడ్స్:

స్పైసీ ఫుడ్స్ అనేవి బ్లాడర్ ని ఇరిటేట్ చేసి యూటీఐ లక్షణాలను మరింత పెంచుతాయి. కాబట్టి స్పైసీ ఫుడ్స్ కి దూరంగా ఉండండి. చిల్లీ ఫ్లేక్స్ తో మీ ఫుడ్ కి అడిషనల్ టాపింగ్స్ ని జోడించడం మానుకోండి. సిట్రస్ ఫ్రూట్స్ లాగానే స్పైసీ ఫుడ్స్ కు కూడా శరీరం లోని యాసిడ్ లెవల్ ని పెంచే సామర్థ్యం ఉంది. కాబట్టి, ఇటువంటి ఎన్విరాన్మెంట్ లో బాక్టీరియా త్వరగా వృద్ధిచెందుతుంది.

6. ఏనిమల్ ప్రోటీన్ అధికంగా ఉండే డైట్:

6. ఏనిమల్ ప్రోటీన్ అధికంగా ఉండే డైట్:

ఏనిమల్ ప్రోటీన్ కలిగిన గ్రిల్డ్ మీట్స్, హంబర్గర్స్ అలాగే స్టీక్స్ ను అవాయిడ్ చేయండి. ఎందుకంటే, ఇవి శరీరాన్ని అసిడిక్ గా మారుస్తాయి. ఇటువంటి ఎన్విరాన్మెంట్ లో బాక్టీరియా విపరీతంగా వృద్ధి చెందుతుంది. వీటి బదులు ఫిష్ ని తీసుకుంటే మంచిది.

7. రిఫైండ్ ఫ్లోర్:

7. రిఫైండ్ ఫ్లోర్:

బ్రెడ్స్ అనేవి రిఫైండ్ ఫ్లోర్ తో తయారవుతాయి. పాస్తా, పిజ్జా కూడా ఇదే కేటగిరీకి చెందుతాయి. రిఫైండ్ ఫ్లోర్ అనేది శరీరానికి ఏ మాత్రం మంచి చేయదు. యూటీఐ బారిన మీరు పడితే రిఫైండ్ ఫ్లోర్ ని మీరు అవస్తోది చేయాలి. లేదంటే, యూటీఐ లక్షణాలు మరింత తీవ్ర రూపం దాల్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి.

English summary

7 forbidden foods if you've got UTI

Everyone is prone to UTIs, which are caused by microbes. The best way to prevent UTI from recurring is by avoiding some foods from your diet that can irritate the lining of urinary tract. The foods that you need to keep at bay include citrus fruits, caffeine, alcohol, refined flour, foods rich in animal protein, spicy food and sweet beverages.
Story first published:Friday, April 6, 2018, 15:50 [IST]
Desktop Bottom Promotion