నెలసరి నొప్పులు తగ్గించుకోవడానికి చిట్కాలు

Subscribe to Boldsky

"నీ ప్రవర్తన విచిత్రంగా ఉంది. బహుశా ఇది నీ నెలసరి సమయం దగ్గరపడినట్లుంది", చాలాసార్లు మనం ఈ మాటలు విని ఉంటాం, కదా?

మీరెప్పుడైనా ఆలోచించారా, నెలసరి అయ్యేటప్పుడు ఇలా ఎందుకు జరుగుతోందని?

అనుమానం లేదు, ఇది ఖచ్చితంగా హార్మోన్ల పనే! ఈ నెప్పంతా హార్మోన్ల మాయాజాలమే! తీవ్రమైన నెలసరి నొప్పులు.

7 Tips To Relieve Menstrual Cramps At Home

ఋతుచక్రం అంటే ఏమిటి?

గర్భధారణ కలిగజేసేందుకు స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థలోని అండాశయము మరియు గర్భాశయంనందు ప్రతినెల జరిగే సహజమైన మార్పులను ఋతుచక్రం అంటారు. యుక్తవయస్సు వచ్చాక ఈ మార్పులు మొదలవుతాయి.

గర్భాశయం యొక్క పై పొర పిండాన్ని స్వీకరించడానికి వీలుగా తయారవుతుంది. ఒకవేళ పిండం కనుక తయారు కానట్లైతే ఈ దలసరి పొర తొలగిపోయి యోని మార్గం ద్వారా శరీరం బయటకు నెట్టేయబడుతుంది. దీనినే ఋతుచక్రం అంటారు.

గర్భాశయం యొక్క పైపొరలో ప్రోస్టాగ్లాండిన్స్ అనే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి ఋతుక్రమం సమయంలో ఇబ్బందికి గురి చేస్తాయి. ఇవి గర్భాశయ కండరాలు సంకోచించేటట్లు ఉద్దీపన కలుగజేస్తాయి.

ఋతుక్రమం సమయంలో నొప్పికి గర్భాశయ కండరాలు అధికంగా సంకోచించడమే కారణం. ఈ కండరాలు రక్తనాళాలపై ఒత్తిడి కలుగజేస్తాయి. ఈ ఒత్తిడి కనుక నిరంతరంగా ఉంటే గర్భాశయానికి ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతుంది. ఆక్సిజన్ కొరత వలన నొప్పి, బాధ మొదలవుతాయి.

ఈ నొప్పులు చిన్నపాటి అసౌకర్యం వలే లేదా భరింపశక్యంకానివిగా అయినా ఉండవచ్చు. ఇవి ఎక్కువగా నడుము మరియు పొత్తికడుపు వద్ద వస్తాయి. ఈ నొప్పులను వైద్య పరిభాషలో డిస్మెనోరియా అని అంటారు.

ఈ నొప్పులు చాలా అలసటతో కూడుకుని ఉంటాయి. మానసిక కల్లోలం, ఆహారం పై కోరిక, డయేరియా లేదా కడుపునొప్పి, ఒళ్ళు నొప్పులు, చికాకు మొదలైనవి కూడా కలుగుతాయి. ప్రతినెల ఐదు రోజుల పాటు నొప్పినివారణ మందులు తీసుకోవడం కూడా సమంజసం కాదు.

కొన్ని చిట్కాలు ఈ నొప్పినుండి కొంతవరకు ఉపశమనమిస్తాయి. అవి ఏమిటో తెలుసుకుందామా!

 1. హాట్ బ్యాగ్ ఉపయోగించండి:

1. హాట్ బ్యాగ్ ఉపయోగించండి:

మీ పొత్తికడుపు మరియు నడుము వద్ద కొంచెం వేడితో కాపడం పెట్టుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఇలా చేస్తే కండరాలు వ్యాకోచించి శరీరానికి సులువుగా అనిపిస్తుంది. ఒక హాట్ వాటర్ బ్యాగ్ లో వేడి నీరు నింపి లేదా స్టోన్ పిల్లో తో గాని నొప్పి ఉన్న చోట కాపండి. స్టోన్ పిల్లోలో చిన్నచిన్న రాళ్లు మాదిరిగా ఉంటాయి. దీనితో మర్దన చేసుకుంటే నొప్పులు తగ్గుతాయి.

2. మర్దన:

2. మర్దన:

మీ శరీరాన్ని మర్దన చేసుకుని తేలికపరచుకుందామని ఎప్పుడైనా అనుకున్నారా? అయితే ఇదే సరైన సమయం. నెలసరి సమయంలో మీ శరీరం మరియు మనసు విశ్రాంతి కోరుకుంటాయి. మీ నడుము, కడుపు భాగం మరియు పక్కలలో పదిహేను నిమిషాలు మర్దన చేసుకుంటే 90 శాతం నొప్పులు తగ్గుతాయి. సువాసన కలిగిన నూనెతో మర్దన చేసుకుంటే ఇంకా హాయినిస్తాయి. ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరినూనెలో కొన్ని చుక్కల సువాసన కలిగిన నూనె కలపడం వలన ఆరోమాథెరపి వలన కలిగే ప్రయోజనాలు పొందవచ్చు.

3. దూరం పెట్టవలసిన ఆహార పదార్థాలు:

3. దూరం పెట్టవలసిన ఆహార పదార్థాలు:

కడుపుబ్బరం మరియు శరీరంలో నీరు నిలుపుదల చేసే ఆహార పదార్థాలను తినకపోవడమే మంచిది. కార్బనేటెడ్ పానీయాలు, కెఫిన్, కొవ్వు పదార్థాలు, అధిక ఉప్పు ఉన్న ఆహారం మరియు మద్యం సేవించకపోవడం ఉత్తమం. ఈ ఆహార పదార్థాలు మీ రక్తంతో చక్కెర స్థాయిని గజిబిజి చేసి నొప్పులను ఇంకా ఎక్కువగా చేస్తుంది.

4. వ్యాయామం:

4. వ్యాయామం:

ఈ జాబితాలో తప్పక ఉండాల్సిన అంశం ఇది. వ్యాయామం మిమ్మల్ని శారీరకంగా దృడంగా ఉంచుతుంది. మీ కండరాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.ఆరోగ్యవంతమైన కాండరాలుంటే గర్భకోశ కండరాలు కూడా తక్కువ నొప్పితో కూడిన విధంగా వ్యాకోచిస్తాయి. ఈ వ్యాయామాలు నెలసరి రాకముందు నుంచే చేయాలి. నడక,యోగ నెలసరి సమయంలో కూడా చేయవచ్చు. వ్యాయామాల వలన శరీరంలో మనస్సును ఆనందంగా ఉంచే ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. దీనివలన నెలసరి నొప్పి తగ్గినట్టుంటుంది.

5. మూలికలు:

5. మూలికలు:

మూలకలలో నొప్పులను తగ్గించే సమ్మేళనాలుంటాయి. ఇవి నొప్పులను, మంటను తగ్గిస్తాయి. వీటిలోని అంటిస్పాస్మోడిక్ కాంపౌండ్స్ కండారాలలో పీకులను తగ్గించి గర్భకోశ కండరాల వ్యాకోచాన్ని జరిగేట్టుసాధారణంగా చేస్తాయి. డిల్ ఆకులు మరియు డిల్ విత్తనాలు, అల్లం, చామంతి పూల టీ మరియు సోంపు గింజలు ఈ సమయంలో బాగా అక్కరకు వస్తాయి.

6. ఆహారం:

6. ఆహారం:

మీరు చేయవలసినదల్లా ఈ సమయంలో జంక్ ఫుడ్ పై అస్సలు చేతులు వేయకపోవడమే! పీచుపదార్థాలు, విటమిన్లు, ఐరన్ మరియు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. బొప్పాయి, బాదంపప్పు, గుమ్మడి విత్తనాలు, బ్రాకొలి, వాల్ నట్లు, ఆలివ్ ఆయిల్, ఆకుకూరలు,బ్రౌన్ రైస్, అవిస గింజలు, చేపలు మరియు కోడి మాంసంలో ఇవన్నీ ఉంటాయి. తేలికైన శాఖాహారం అన్నిటిటికన్నా మంచి ఎంపిక.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    7 Tips To Relieve Menstrual Cramps At Home

    There are simple tips that can help you curb this horrible pain. Starting from diet, your need to be careful about what to eat, have a light vegetarian diet, rich in iron, fibre and omega-3 fatty acids. Apply some heat on your abdomen using a heating pad or hot water to get some relief. Even orgasms can help reduce cramps.
    Story first published: Friday, April 6, 2018, 19:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more