కీళ్ళ నొప్పులు(ఆర్థరైటిస్) ఉన్నవాళ్ళు ముట్టకూడని 8 ఆహారపదార్ధాలు ఇవే

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

పెరుగుతున్న వయసు దృష్ట్యా, వృద్దాప్యం అనేది జీవితంలో ఒక భాగం అనే విషయాన్ని అందరూ ఆమోదించాలి. ఈ విషయాన్ని సాదరంగా ఆహ్వానించినప్పటికీ, కొన్ని సార్లు వృద్దాప్యాన్ని భరించడం కష్టతరం అవుతుంది దీనికి కారణం కొన్ని వృద్దాప్య సంబంధిత వ్యాధులే. అందులో ప్రముఖంగా చెప్పబడేది ఆర్థరైటిస్(కీళ్ళ నొప్పులు).

రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండడం మూలాన, జీవక్రియ విధానాలు బలంగా ఉన్నందువలన, యుక్తవయసులో ఉన్నప్పుడు రోగాలను ఎదుర్కునే శక్తిని కలిగి ఉండడం సహజం. కాని ఒక వయసుకి వచ్చాక, అదీ 50 పై బడిన వయసుకి వచ్చాక, ఎక్కువ శాతం ప్రజలు అనేక రోగాల బారిన పడడం ప్రారంభిస్తారు. దీనికి ప్రధాన కారణం రోగ నిరోధక వ్యవస్థ తగ్గడమే.

foods to avoid for arthritis

50 పైబడిన వారిలో ఎక్కువగా అలసట, జాయింట్ పెయిన్, మహిళలలో మెనోపాజ్ సమస్యలు, అధిక రక్తపోటు, ఆర్థరైటిస్, గుండె జబ్బు, అల్జీమర్స్, డిమెన్షియా వంటివి సహజంగా కనిపిస్తూ ఉంటాయి.

ఈ వయసు ఆధారిత వ్యాధులను అంగీకరించడం కష్టంగా ఉంటుంది. కావున వృద్దాప్యాన్ని అంగీకరించలేని పరిస్థితుల్లో ఉండడం సహజమే. కాని కొన్ని సహజ సిద్దమైన ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవడం మూలంగా, ఆ వయసు సంబంధిత వ్యాధులను సైతం సమర్ధవంతంగా ఎదుర్కోగల శక్తి సమకూరుతుంది.

అదేవిధంగా కొన్ని ఆహారపదార్ధాలను తక్షణం దూరం చెయ్యడం ద్వారా, ఆర్థరైటిస్ సమస్య రాకుండా నిరోధించవచ్చు. ఇక్కడ వాటిలో కొన్నిటిని పొందుపరచడం జరిగినది.

అసలు ఆర్థరైటిస్ అంటే ఏమిటి?

ఆర్థరైటిస్ అనేది కండరాలకు సంబంధించిన వ్యాధి. మోకాలు, వెన్ను, మణికట్టు, చేతివేళ్లు మొదలైన అవయవ కండరాలపై, వాటి కీళ్ళ(జాయిoట్స్) పై ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణాన శరీర కదలికలు కష్టతరమవుతాయి. ఈ పరిస్థితి ఎక్కువగా 60 ఏళ్ల వయస్సు ఉన్నవారిలో కనిపిస్తుంది. మరియు రాను రాను తీవ్రమవుతుంది. ఆర్థరైటిస్ నివారించడానికి వదిలివేయవలసిన కొన్ని ఆహార పదార్ధాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి.

కీళ్ళ నొప్పుల నివారణకు సూచించబడిన ఆహార పదార్ధాలు:

1. వేయించిన మాంసం (ఫ్రైడ్ మీట్)

1. వేయించిన మాంసం (ఫ్రైడ్ మీట్)

ఈరోజుల్లో అత్యధికులు ఇష్టపడే ఆహారపదార్ధాలు చిప్స్ , ఫ్రైస్, సమోసాలు, వేయించిన కోడి వంటివి. ఇవి రుచికరంగా ఇష్టపూరితంగా ఉంటాయి. కాని వేయించిన ఆహార పదార్ధాలు, అందులో ముఖ్యంగా వేయించిన మాంసం వలన శరీరంలో కొవ్వు శాతం అధికంగా పెరగడం జరుగుతుంది. తద్వారా ఆర్థరైటిస్ మాత్రమే కాకుండా, మూత్ర పిండాల పని తీరుపై ప్రభావం పడి, రక్తంలో కొవ్వు శాతం పెరగడం మూలంగా గుండె జబ్బుకి కూడా కారణం అవుతుంది. మరియు ఈ వేయించిన మాంసంలో ఉన్న అనారోగ్యకర కొవ్వు ఫలితంగా ఆర్థరైటిస్ ముప్పు పెరిగి కీళ్ళపై ఆ ప్రభావాన్ని చూపుతుంది. కావున వేయించిన మాంసం తగ్గించడం మంచిది.

2. గ్లూటెన్-రిచ్ ఫుడ్స్

2. గ్లూటెన్-రిచ్ ఫుడ్స్

ఈరోజుల్లో ఎక్కువ మంది గ్లూటెన్-ఫ్రీ ఆహారాలు తినడానికే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. చపాతీ, బిస్కెట్స్, బ్రెడ్ వంటి గోధుమ సంబంధిత ఆహార పదార్ధాలని గ్లూటెన్-రిచ్ ఆహార పదార్ధాలుగా పిలుస్తారు. గ్లూటెన్ అనేది ఒక విషపూరితమైన సమ్మేళనం , ఇది జీర్ణ సమస్యలు, చర్మ వ్యాధులు, అలర్జీలు మరియ ఆర్థరైటిస్ కు కూడా కారణం కావొచ్చు. కావున వీటిపట్ల జాగ్రత్త వహించడం మంచిదని డైటీషియన్లు హెచ్చరిస్తున్నారు.

3. పాల ఉత్పత్తులు

3. పాల ఉత్పత్తులు

ఈరోజుల్లో పాలు మరియు పెరుగు వంటి పాల ఉత్పత్తులు ఆరోగ్యకరమైనవిగా భావించబడుతున్నాయి . కాబట్టి, వాటిని దూరంగా ఉంచడం అనేది చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కానీ, రోజూ ఈ ఉత్పత్తులు తీసుకునే వారు ఆర్థరైటిస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు తేల్చాయి. ఎందుకనగా పాల ఉత్పత్తులలో ఉండే ప్రోటీన్, కండరాలను అసహనానికి గురిచేసే స్వభావం కలిగి ఉన్న కారణంగా, నెమ్మదిగా ఇది ఆర్థరైటిస్ కు దారితీయెచ్చు. కావున పాల ఉత్పత్తులను నెమ్మదిగా తగ్గించడం మంచిది అని డాక్టర్లు చెప్తున్నారు.

4. మొక్కజొన్న నూనె

4. మొక్కజొన్న నూనె

వంటలలో చాలా మంది ఇళ్ళల్లో మరియు రెస్టారెంట్లలో మొక్కజొన్న నూనెను ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా మాంసం వేయించుటకి ఉపయోగిస్తుంటారు. కాని ఈ మొక్కజొన్న నూనెలో ఎక్కువగా ఒమేగా-6 కొవ్వు పదార్ధాలు కలిగి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. ఈ మొక్కజొన్న నూనె ఎక్కువగా తీసుకునే వారు ఆర్థరైటిస్, మూత్రపిండాల వాపుకి సైతం గురవుతారు. కావున తీసుకోకపోవడమే మంచిది.

5. ప్రాసెస్ చేసిన ఫుడ్స్

5. ప్రాసెస్ చేసిన ఫుడ్స్

సమయానుభావం వలన ఎక్కువ మంది రెస్టారెంట్లలో, హోటళ్ళలో నిల్వ చేయబడిన ఆహారానికే ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తున్నారు. ఉదాహరణకి నిల్వ చేయబడిన పచ్చళ్ళు, పిజ్జాలు. ఈ నిల్వ చేసిన ఆహార పదార్ధాలు గుండె వ్యాధులు, అధిక రక్తపోటు, మధుమేహం మరియు ఊబకాయం వంటి ప్రధాన వ్యాధులను కలిగించుటకు కారకాలుగా ఉన్నాయి. కొంతకాలానికి ఆర్థరైటిస్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి . కావున వీటి జోలికి పోకపోవడమే మంచిది.

6.వంకాయ (వంకాయ)

6.వంకాయ (వంకాయ)

కూరగాయల రాజైన వంకాయ కూడా ఆర్థరైటిస్ కారకం గా ఉంది. ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నా, అదేవిధంగా వ్యాధిని పెంచే స్వభావం కూడా కలిగి ఉంటుంది. ఆర్థరైటిస్ పెరగకుండా చూడాలి అంటే వంకాయని దూరం ఉంచక తప్పదు మరి.

7. ఎక్కువ చక్కర నిల్వలున్న ఆహార పదార్ధాలు

7. ఎక్కువ చక్కర నిల్వలున్న ఆహార పదార్ధాలు

చాక్లెట్లు, పానీయాలు, శీతల పానీయాలు, పండ్ల రసాలు, మొదలైనవి చక్కెరను కలిగి ఉన్న ఆహార పదార్థాలు మనకు ఇది వరకే తెలుసు. ఫలితంగా ఈ ఆహార పదార్ధాలు తీసుకోవడం మూలంగా మధుమేహం, ఊబకాయం, దంత క్షయం లాంటి సమస్యలు కలుగుతాయని కూడా ప్రజలకు అవగాహన ఉంది. కానీ కొన్ని నివేదికల ఆధారంగా మీ ఆహారంలో అదనపు చక్కెర నిల్వలు, కీళ్ళనొప్పులు , మరియు కీళ్ళ వాతానికి కారణమవుతాయని తేలింది. కావున చక్కర నిల్వలున్న ఆహారపదార్ధాలు తగ్గించడమే మంచిది.

8. ఆల్కహాల్

8. ఆల్కహాల్

ఆల్కహాల్ ఎప్పటికీ ఒక పానీయమే, ఆహారం కాదు. అయినప్పటికీ ఆల్కహాల్ సేవించడం అనేది ఆర్థరైటిస్ కు ప్రధాన కారణంగా మారింది కాబట్టి, కీళ్ళనొప్పులను నివారించడానికి దూరం చెయ్యవలసిన ఆహార పదార్ధాలలో ఇది కూడా వస్తుంది. మద్యపానం అనేక రకాల శారీరక, మానసిక వ్యాధులకు కారణం అవుతుందని అందరికీ తెలిసిన విషయమే. కాని ఆల్కహాల్ ఎక్కువ శాతం కీళ్ళపై ప్రభావాన్ని చూపుతుంది, మరియు వాపును పెంచుతుంది. తద్వారా ఆర్థరైటిస్ పెరగడానికి దోహదం చేస్తుంది. కావున మద్యపానం జోలికి వెళ్ళకపోవడమే మంచిది అని డాక్టర్లు సూచిస్తున్నారు.

English summary

8 Foods To Avoid For Arthritis

Arthritis is an inflammatory disease which stiffens your joints and causes pain. There are certain habits which you can follow now, to prevent arthritis later on in life. These are some of the foods you must avoid to prevent arthritis such as fried meat, dairy products, corn oil, processed foods, gluten-rich foods, etc.
Story first published: Tuesday, March 13, 2018, 11:25 [IST]