మస్టర్డ్ ఆయిల్ ద్వారా కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలివే

By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

మస్టర్డ్ ఆయిల్ అనేది కిచెన్ లో సాధారణంగా లభిస్తుంది. మస్టర్డ్ ప్లాంట్ కి చెందిన సీడ్స్ ని క్రష్ చేసి సేకరించబడిన నూనె మస్టర్డ్ ఆయిల్. మస్టర్డ్ ప్లాంట్ సైంటిఫిక్ నేమ్ బ్రాసికా జంకియా.

మస్టర్డ్ ఆయిల్ ఘాటుగా ఉంటుంది. వంటలలో దీనిని వాడతారు. అలాగే రెమెడీస్ గా కూడా దీని ఉపయోగం అనిర్వచనీయం. శతాబ్దాల కాలం నుంచి మస్టర్డ్ ఆయిల్ ని అనేక విధాలుగా వాడుతూనే ఉన్నారు.

8 Health Benefits Of Mustard Oil

దీనిని పెయిన్ రిలీవర్ గా వాడతారు. అలాగే కొన్ని కాస్మెటిక్ ప్రయోజనాల కోసం కూడా వాడతారు. ఫ్లేవరింగ్ ఏజెంట్ గా కూడా మస్టర్డ్ ఆయిల్ ఉపయోగం ఎక్కువగా ఉంది. ఇలా అనేక ప్రయోజనాల కోసం ఈ ఆయిల్ ని ఎక్కువగా వాడతారు. చాలా మంది ఈ ఆయిల్ ను సాధారణ యూసేజ్ తో పాటు డైట్ లో కూడా ప్రత్యేకించి వాడి ప్రయోజనాలు పొందుతున్నారు.

ఈ కింద చెప్పుకోబడినవి మస్టర్డ్ ఆయిల్ ద్వారా కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు. వీటిని పరిశీలించండి మరి.

1. కార్డియోవాస్క్యులర్ వ్యాధులను అరికడుతుంది

1. కార్డియోవాస్క్యులర్ వ్యాధులను అరికడుతుంది

చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంపొందించుతుంది. ఈ ఆయిల్ లో మోనో అన్ శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ మరియు పోలీ అన్ శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా లభిస్తాయి. అలాగే ఒమేగా-3 మరియు ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఇందులో సమృద్ధిగా లభిస్తాయి. ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. ఇటీవల అధ్యయనాల ప్రకారం గుండె ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు మస్టర్డ్ ఆయిల్ అనేది వివిధ వంటనూనెలకు ప్రత్యామ్నాయ నూనెగా పనికివస్తుంది తేలింది.

2. క్యాన్సర్ ను అరికడుతుంది:

2. క్యాన్సర్ ను అరికడుతుంది:

అధ్యయనాల ప్రకారం మస్టర్డ్ ఆయిల్ లో క్యాన్సర్ ను అరికట్టే గుణాలు కలవు. మస్టర్డ్ ఆయిల్ వాడకం వలన ఉదరం మరియు కొలోన్ క్యాన్సర్స్ బారిన పడే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. గ్లూకోసినోలేట్ అనే పదార్థం ఈ ఆయిల్ లో లభ్యమవుతుంది. ఇది క్యాన్సర్ ని అలాగే ట్యూమర్లని అరికడుతుంది.

3. నొప్పులను తగ్గిస్తుంది:

3. నొప్పులను తగ్గిస్తుంది:

మస్టర్డ్ ఆయిల్ అనేది జాయింట్ పెయిన్ ని అలాగే వాపుని తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీస్ వలన ర్యూమాటిజంను ఆర్తరైటిస్ ను అరికడుతుంది.

4. ఓరల్ హెల్త్ ను సంరక్షిస్తుంది:

4. ఓరల్ హెల్త్ ను సంరక్షిస్తుంది:

మస్టర్డ్ ఆయిల్ అనేది చిగుళ్ళను అలాగే దంతాలను బలపరిచేందుకు ఉపయోగపడుతుంది. పళ్ళపై ఫ్లేక్ ని తొలగించేందుకు తోడ్పడుతుంది. అలాగే డెంటల్ బాక్టీరియాను కూడా ప్రభావవంతంగా తొలగిస్తుంది. పంటినొప్పిని తగ్గించి, నోటి దుర్వాసనను అరికడుతుంది. ఇది, సహజసిద్ధమైన టీత్ వైటనర్ గా పనిచేస్తుంది.

5. జలుబు, దగ్గులను అరికడుతుంది:

5. జలుబు, దగ్గులను అరికడుతుంది:

ఇది డీకంజెస్టెంట్ గా పనిచేస్తుంది. తద్వారా, దగ్గు జలుబులను సమర్థవంతంగా తగ్గిస్తుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచడం వలన ముక్కు దిబ్బడను తగ్గించి రెస్పిరేటరీ ట్రాక్ట్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ ఆయిల్ ని మరికొన్ని ఇతర సహజసిద్ధమైన పదార్థాలతో కలిపి దగ్గు జలుబులతో పాటు ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షణ పొందవచ్చు. ఆస్త్మా, సైనసైటిస్ ని అరికట్టడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే, స్వేద గ్రంథులను ప్రేప్రేపించి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తూ జ్వరాన్ని కూడా తగ్గిస్తుంది.

6. హెల్తీ హెయిర్:

6. హెల్తీ హెయిర్:

చర్మ సంరక్షణలో అద్భుతమైన ఫలితాలను చూపించడంలో మస్టర్డ్ ఆయిల్ అనేది దిట్ట. చర్మానికి పోషణనందించి, ఆరోగ్యంగా ఉంచుతుంది. చిన్నపిలల్లకు మసాజ్ ఆయిల్ గా మస్టర్డ్ ఆయిల్ ను ఎక్కువగా వాడతారు. తద్వారా కండరాలను అలాగే ఎముకలను బలంగా ఉంచేందుకు ఈ ఆయిల్ తోడ్పడుతుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచి రక్తప్రసరణను మెరుగుపరిచేందుకు ఈ ఆయిల్ తోడ్పడుతుంది. ఈ ఆయిల్ లో యాంటీ ఫంగల్ అలాగే యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ కలవు. చెడు బాక్టీరియాపై దాడి చేసి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను ఆలాగే రాషెస్ ను అరికడుతుంది.

7. హెల్తీ హెయిర్:

7. హెల్తీ హెయిర్:

మస్టర్డ్ ఆయిల్ లో శిరోజాలను సంరక్షించే గుణాలు కూడా అధికం. ఇందులో లభించే బేటా కెరోటిన్ హెయిర్ గ్రోత్ ను ప్రమోట్ చేస్తుంది. అలాగే, స్కాల్ప్ ను వివిధ ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షించి ఆరోగ్యంగా ఉంచుతుంది. స్కాల్ప్ ను అలాగే జుట్టును ఈ ఆయిల్ తో మసాజ్ చేయడం ద్వారా రక్తప్రసరణను పెంపొందించుకోవచ్చు. తద్వారా, జుట్టు మూలాల నుంచి ఆరోగ్యంగా తయారవుతుంది. జుట్టు తెల్లబడే సమస్య తగ్గిపోతుంది. హెయిర్ ఫాల్ తగ్గుతుంది. శిరోజాలు ప్రకాశవంతంగా, ఒత్తుగా తయారవుతాయి.

8. ఆకలిని పెంపొందిస్తుంది:

8. ఆకలిని పెంపొందిస్తుంది:

మస్టర్డ్ ఆయిల్ అనేది సహజసిద్ధమైన స్టిములంట్ గా పనిచేస్తుంది. మీ ఆకలిని ప్రేరేపిస్తుంది. మెటబాలిజం రేట్ ను పెంపొందించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆ విధంగా ఆకలిని పెంపొందిస్తుంది. జీర్ణరసాలను అలాగే లివర్ లోని బైల్ పై పనిచేస్తుంది. శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించేందుకు తోడ్పడుతుంది.మస్టర్డ్ ఆయిల్ అనేక ఆరోగ్యప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ ఆయిల్ యొక్క ఓషధ గుణాలను శతాబ్దాల క్రితమే గుర్తించారు. మీ డైట్ లో అలాగే లైఫ్ స్టైల్ లోఈ ఆయిల్ ను జోడించడం వలన ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.

ఈ ఆర్టికల్ ను షేర్ చేయండి!

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే, మీ దగ్గరివారితో ఈ ఆర్టికల్ ని పంచుకోండి.

English summary

8 Health Benefits Of Mustard Oil

Mustard oil is popularly used since ages for health and culinary purposes. The unique pungent flavoured oil is not only popular as an edible oil, but it is also used externally for a number of other purposes as well as for its cosmetic uses. Both - consumption and application of this oil is found to be beneficial for overall health.
Story first published: Tuesday, February 6, 2018, 14:00 [IST]
Subscribe Newsletter