For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

థైరాయిడ్ ఫంక్షన్స్ మెరుగుదలను మందులకన్నా ఎక్కువగా ప్రోత్సహించే అద్భుతమైన సహజసిద్ద మూలికలు

థైరాయిడ్ ఫంక్షన్స్ మెరుగుదలను మందులకన్నా ఎక్కువగా ప్రోత్సహించే అద్భుతమైన సహజసిద్ద మూలికలు

|

మెడ వెనుక భాగంలో ఉండే ఎండోక్రైన్ గ్రంధిని థైరాయిడ్ గ్రంధి అని కూడా అంటారు. దీని ముఖ్య పని శరీరానికి అవసరమైన మోతాదులో థైరాయిడ్ హార్మోన్లను తయారుచేసి రక్తంలోకి స్రవించడం. క్రమంగా శరీరంలోని ప్రతి కణజాలంతోనూ కలుస్తుంది. థైరాయిడ్ హార్మోన్లు శరీరం, శక్తిని ఉపయోగించుకోడానికి, శరీరం వెచ్చగా ఉండడానికి, మెదడు, గుండె, మరియు ఇతర అంతర్గత మరియు బాహ్య అవయవాలను సరిగ్గా పనిచేసేలా చేయడంలో పనితీరుని ప్రదర్శిస్తాయి. థైరాయిడ్ గ్రంధి అసమతుల్యానికి లోనైప్పుడు, ఈ గ్రంధి, అతి తక్కువగా లేదా అధికంగా థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. క్రమంగా బరువు తగ్గడం లేదా బరువు పెరుగుట, అలసట మరియు విశ్రాంతి లేకపోవడం వంటి అనేకములైన సమస్యలకు దారితీస్తుంది. ఈ థైరాయిడ్ సమస్య పిల్లలు కలుగకపోవడానికి గల కారణాల్లో ఒకటిగా కూడా ఉంది.

ప్రధానంగా రెండు థైరాయిడ్ లోపాలు ఉంటాయి. అవి వరుసగా హైపో థైరాయిడిజం మరియు హైపర్ థైరాయిడిజం. థైరాయిడ్ గ్రంధి శరీరంలోని జీవక్రియలు నిర్వహించడంలో తగినంత థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి చేయలేనప్పుడు హైపోథైరాయిడిజం వస్తుంది. క్రమంగా శరీరం పనితీరు నెమ్మదిoచటానికి కారణమవుతుంది, జీవక్రియలతో సహా. థైరాయిడ్ గ్రంథి అధిక మోతాదులో థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి చేసినప్పుడు, హైపర్ థైరాయిడిజం వస్తుంది. ఇది శరీరం పనితీరును వేగవంతం చేయడానికి కారణమవుతుంది, జీవక్రియ మరియు హృదయ స్పందనల రేటుతో సహా.

8 Natural Herbs that Improve Thyroid Function Better Than Medication!

థైరాయిడ్ రుగ్మత యొక్క సంకేతాలు మరియు లక్షణాలు తరచూ మారుతూ ఉంటాయి. కానీ అవి సాధారణంగా అలసట, ఆకలి మార్పులు, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు, జుట్టు నష్టం, శరీర ఉష్ణోగ్రతల అసమతౌల్యం, నిద్రలేమి, మెడలో అసాధారణ అమరికలు, గొంతు మారడం మొదలైనవి ఉంటాయి. మీరు థైరాయిడ్ స్థితిలో బాధపడుతున్నారని మీకు అనుమానం వస్తే, తక్షణం వైద్యుని సంప్రదించడం మంచిది. పరీక్షల ప్రకారం, అవసరాన్ని ఉద్దేశించి మందులను సిఫార్సు చేయడం జరుగుతుంది. వీటితో పాటు కొన్ని గృహ చిట్కాలను అవలంబించడం ద్వారా, త్వరలోనే మీ థైరాయిడ్ స్థాయిలలో సమతుల్యత ఏర్పడడం గమనించవచ్చు. థైరాయిడ్ ఉన్నవారు కనీసం 3-6 నెలలకు ఒకసారైనా థైరాయిడ్ స్థాయిల పర్యవేక్షణకోసం రక్తపరీక్షలు చేయించుకోవలసిన అవసరం ఉంటుంది.

థైరాయిడ్ ఫంక్షన్స్ మెరుగుదలను మందులకన్నా ఎక్కువగా ప్రోత్సహించే అద్భుతమైన సహజసిద్ద మూలికలు:

1. బ్లాడర్వ్రాక్

1. బ్లాడర్వ్రాక్

ఈ హెర్బ్ ఒక హాస్యాస్పద పేరును కలిగి ఉండడం మాత్రమే కాకుండా, థైరాయిడ్ హార్మోనుల లోపంతో భాదపడుతున్న వారికి సరైన మోతాదులో అయోడిన్ అందివ్వడం ద్వారా, అద్భుతమైన ప్రయోజనాలను అందివ్వగలదని చెప్పబడింది. అయోడిన్ అనేది థైరాయిడ్ గ్రంధి ఉత్తమంగా పనిచేసేలా చేయగలిగే అత్యంత ముఖ్యమైన పోషకాలలో ఒకటి. బ్లాడర్వ్రాక్ వినియోగం, శరీరం యొక్క జీవక్రియలను పునర్నిర్వహించుటకు, మరియు థైరాయిడ్ గ్రంధిని చైతన్యపర్చడానికి సహాయపడుతుంది.

2. ఫ్లాక్స్ సీడ్స్(అవిసెగింజలు)

2. ఫ్లాక్స్ సీడ్స్(అవిసెగింజలు)

అవిసె గింజలు జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి, మరియు జీవక్రియలు సక్రమంగా పని చేయడానికి ప్రసిద్ధి చెందింది. కానీ థైరాయిడ్ గ్రంధి నిర్వహణలో కూడా ఒక గొప్ప మూలికగా ఉంది. ముఖ్యంగా నిస్తేజమైపోయిన థైరాయిడ్ గ్రంధిని తిరిగి ఉత్తేజపరచుటకు, క్రమంగా థైరాయిడ్ హార్మోనుల విడుదలను క్రమబద్దీకరించేందుకు అద్భుతంగా పని చేయగలదు. రోజులో ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలు తీస్కోవడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందగలరని చెప్పబడినది.

3. లికోరైస్

3. లికోరైస్

ఒక క్రియారహిత థైరాయిడ్ గ్రంధి ఎల్లప్పుడూ శరీరానికి అలసటను కలిగించవచ్చు. కావున థైరాయిడ్ తిరిగి పనిచేసే క్రమంలో లికోరైస్ సహాయపడగలదని చెప్పబడింది. శరీరంలో శక్తిని పెంచడంతో పాటు, థైరాయిడ్ హార్మోన్ నియంత్రణను ప్రోత్సహించడానికి కూడా లికోరైస్ సహాయపడుతుంది. కొన్ని రకాల థైరాయిడ్ క్యాన్సర్ల పెరుగుదలను అడ్డుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్న సమ్మేళనంగా కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి - లైకోరైస్, గ్లైసర్హేటినిక్ యాసిడ్ కలిగి ఉంటుంది..

4. ఈవెనింగ్ ప్రిమ్రోస్

4. ఈవెనింగ్ ప్రిమ్రోస్

ఈ మూలిక ఒక నిస్తేజానికి లోనవుతున్న థైరాయిడ్ యొక్క లక్షణాలను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది జుట్టు నష్టం తగ్గించడానికి మరియు బహిష్టు ఉధృతిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఒక టీ రూపంలో ఈ మూలికను తీసుకోవడం ద్వారా అత్యంత ప్రయోజనకరమైనదిగా భావించబడుతుంది

5. ఎచినాసియా

5. ఎచినాసియా

ఈ మూలిక శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. థైరాయిడ్ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి ఎంతగానో దోహదపడుతుంది. ముఖ్యంగా హైపర్ థైరాయిడిజం ఉన్నవారు ఈ మూలిక వేర్లను ఉపయోగించడంద్వారా మంచి ఫలితాలను పొందగలరని చెప్పబడింది. దీని వేర్లను మరిగించి “టీ” గా తీసుకోవడం మంచిది.

6. లెమన్-బామ్ (నిమ్మజాతి కాదు)

6. లెమన్-బామ్ (నిమ్మజాతి కాదు)

లెమన్-బాం మింట్ జాతికి చెందిన మూలికగా చెప్పబడింది. మరియు ఇది శరీరానికి ఉపశమనం ఇవ్వగలిగే మంచి మూలికగా పరిగణించబడుతుంది. థైరాయిడ్ గ్రంథి మీద నేరుగా పనిచేసే స్వభావాన్ని కలిగి ఉన్నందున, శరీరంలోని థైరాయిడ్ హార్మోన్ క్రమబద్దీకరించడంలో చక్కగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఎక్కువగా విడుదల అవుతున్న థైరాయిడ్ హార్మోన్ నియంత్రించడంలో సహాయపడగలదు. అనగా హైపర్ థైరాయిడిజం ఉన్నవారికి సూచించదగిన మూలికగా చెప్పబడింది. క్రమంగా థైరాయిడ్ గ్రంధి యొక్క పనితీరును సాధారణీకరించడానికి సహాయపడుతుంది.

7. నేటిల్

7. నేటిల్

దీనిలోని అధిక అయోడిన్ నిక్షేపాలు, మొత్తం థైరాయిడ్ ఆరోగ్యానికి సహాయపడగలదు. ఇది అయోడిన్ లోపాన్ని తగ్గిస్తుంది. దీనిని టీ రూపంలో తీసుకోవడం ఉత్తమంగా సూచించబడింది.

8. అల్లం

8. అల్లం

అల్లంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, మరియు థైరాయిడ్ గ్రంధి ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం, దీని ప్రభావాల్లో ఒకటి. అల్లం, జింక్, మెగ్నీషియం మరియు పొటాషియం వంటి పోషకాలలో అధికంగా ఉంటుంది - ఇవి థైరాయిడ్ గ్రంధి చక్కగా పనిచేసేందుకు దోహదపడే పోషకాలుగా ఉన్నాయి. కొద్దిపాటి సేంద్రీయ ముడి తేనెతో కలిపి అల్లం టీ తీసుకోవడం ద్వారా, మంచి ప్రయోజనాలను పొందగలరు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

8 Natural Herbs that Improve Thyroid Function Better Than Medication!

8 Natural Herbs that Improve Thyroid Function Better Than Medication,The thyroid gland is an endocrine gland that is located in the lower front of the neck.
Story first published:Wednesday, September 5, 2018, 16:48 [IST]
Desktop Bottom Promotion