Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
మీకు హార్మోన్ల అసమతుల్యత ఉన్నదని తెలిపే 8 శారీరక లక్షణాలు
మీకు హార్మోన్ల అసమతుల్యత ఉన్నదని తెలిపే 8 శారీరక లక్షణాలు
బాధాకరమైన విషయం ఏంటంటే, మనం ఏదన్నా అర్థం చేసుకునే సమయానికి పరిస్థితులు చెడ్డగా మారిపోతాయి. కానీ శరీరంలో సమస్యలు వచ్చే ముందు జరిగే కొన్ని మార్పులు,లక్షణాలు మన దృష్టిని దాటిపోవని మనం కాదనలేం.
మీరు డాక్టరును ఎప్పుడు సంప్రదించాలి?
నేను ఇటీవల మా గైనకాలజిస్టు వద్దకి సాధారణ చెకప్ కి వెళ్ళినప్పుడు ఫ్లూ,వైరల్ ఇన్ఫెక్షన్లు,సాధారణ ఆరోగ్య సమస్యలు ఎలా వెంటనే తెలుస్తాయి, కానీ హార్మోన్ల సమస్య,క్యాన్సర్ లాంటివి చాలా ఆలస్యమయ్యేదాకా ఎందుకు తెలుసుకోలేం అని అడిగాను.

శరీరం మనకి తెలిపే తీరు
ఆమె నాకు మన శరీరంలో ఏదన్నా సహజంగా జరగకుండా పోతుంటే,బయట నుంచి సాయం కావాలంటే అది మనకి కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల్లో తెలియచేయటానికి ప్రయత్నిస్తుందని చెప్పారు.
హార్మోన్ల అసమతుల్యత హెచ్చరికలు
ఆమె ప్రకారం, మొదటగా మన శరీరం తనంతట తాను సమస్యలు పరిష్కరించుకోటానికి ప్రయత్నిస్తుంది, కానీ నియంత్రణలోకి రాకపోతే మనకి శరీరం లోపల హెచ్చరికని పిరియడ్స్ సరిగా రాకపోవటం,కడుపులో కండరాలు పట్టేయడం, మూడ్స్ మారిపోతుండటం మొదలైనవాటితో తెలియచేస్తుంది.

హార్మ్లోన్ల అసమతుల్యత శారీరక లక్షణాలు
ఆవిడ మన శరీరంలో హార్మోన్ల అసమతుల్యత జరిగినప్పుడు ఏమేం జరుగుతాయో చెప్పారు. ఇక్కడ హార్మోన్ల అసమతుల్యత జరిగినప్పుడు కనబడే 8 లక్షణాలు ఇవ్వబడ్డాయి.
జుట్టు సన్నబడిపోవటం
మొత్తం తలనుంచి కాలివేళ్ళ వరకూ జరుగుతుంది, మొదటగా మెదడు తనకి దగ్గరగా ఉన్న వెంట్రుకలకి సిగ్నల్ పంపిస్తుంది. సాధారణంగా ఊడే జుట్టుకన్నా, మీకు జుట్టు సన్నబడిపోయి ఊడిపోవటం గమనిస్తారు. కుదుళ్ళ దగ్గర బలం తగ్గిపోయి జుట్టు ఊడిపోయి బట్టతలగా కన్పించవచ్చు. ఇవే మొదటి లక్షణాలు.

వీడని ఆందోళన
తర్వాత మీ మనసు స్థితి. మీరు మొత్తం డిప్రెషన్ లో ఉంటారని కాదు, కానీ ఎప్పుడూ ఏదో ఒకటి మనస్సును పట్టిపీడిస్తూ బాధగా ఉంటుంది. ఇలా శరీరంలో హార్మోన్లు సరిగా పనిచేయకపోయినప్పుడు జరుగుతుంది.

నల్లటి వలయాలు
అందరూ దీనిని అలసట,మానసిక వత్తిడి, నిద్రలేమి కారణంగా వస్తుంది అనుకుంటారు. జీవనవిధానం మార్చుకుని దీన్ని నయం చేసుకోటానికి ప్రయత్నిస్తారు. కానీ కొన్నిసార్లు ఈ నల్లటివలయాలు కళ్ళ కిందనుండి పోకుండా మొండిగా ఉండిపోతాయి. కంటి కింద నల్ల వలయాలు నిద్ర సమస్యల వల్ల రావచ్చు, దీని అర్థం పరోక్షంగా టెస్టోస్టిరాన్, ప్రొజెస్టిరాన్ లేకపోవటం వల్ల జరుగుతుంది.

మొటిమలు
తర్వాతది మీ ముఖం. మందరికీ ఆహార అలర్జీలు, వాతావరణ పరిస్థితులు ముఖంపై చర్మాన్ని ఎలా దెబ్బతీస్తాయో తెలుసు. తగిన జాగ్రత్తలు లేకపోతే, హార్మోన్ల అసమతుల్యత కూడా ముఖంపై స్పష్టంగా కన్పిస్తుంది.

ఛాతీపై మార్పులు
అసమతుల్యత ఉంటే మీ ఛాతీ చర్మంపై మార్పులు ఉంటాయి. మీకు సన్నగా నొప్పి ఉంటుంది,గడ్డలు అన్పించవచ్చు. అది క్యాన్సర్ సూచకం కావచ్చు డాక్టరును సంప్రదించండి. క్యాన్సర్ కాదని నిర్థారణ అయినా మీకు మీ స్తనాల ఆకారం, ఛాతీ సైజు, గడ్డల వంటి వాటిల్లో మార్పులు కన్పిస్తే అది మీ శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలో అసమతుల్యత కావచ్చు.

చెమట
మనందరికీ చెమట పడుతుంది. కానీ, కొంతమందికి ఎక్కువగా చెమట ఉంటుంది, దీన్ని విస్మరించకూడదు. ఎక్కువగా వేడి ఉన్నప్పుడు, బరువులు ఎత్తినప్పుడు, ఎక్కువగా అటుఇటూ తిరుగుతూ అలసిపోయేలా చేసే ఉద్యోగాలు చేయటం వలన చెమట రావడం సహజం. కానీ మీరు ఆందోళనగా ఉన్నప్పుడు లేదా దేనికన్నా భయపడుతున్నప్పుడు చెడు వాసనతో గాఢంగా చెమటపడితే అది హార్మోన్ సమస్యకి లక్షణం.

క్రమం లేకుండా బరువు పెరగటం
మీరు ఆరోగ్యంగా ఉన్నారు, కానీ ఎంత ప్రయత్నించినా కొవ్వు కొన్ని శరీరభాగాలలోనే చేరిపోతుంది.పొత్తికడుపు, ఛాతీ భాగంలో కొవ్వు పెరుగుతుంటే మీరు వెంటనే డాక్టరు దగ్గరకి వెళ్ళి హార్మోన్ల అసమతుల్యత గురించి చెక్ చేయించుకోవాలి. బరువు క్రమం లేకుండా పెరగటం హార్మోన్ల అసమతుల్యతకి దారితీస్తుంది.

అలసట
ఏదన్నా ఉత్సాహం ఇచ్చే పనిచేస్తూకూడా అలసిపోవటం లేదా రాత్రి చక్కగా పడుకునిపోయి కూడా బలహీనంగా అన్పిస్తుందా?అది మీ ప్రొజెస్టిరాన్ స్థాయిల్లో అసమతుల్యత ఉన్నదని అర్థం. మీరు డాక్టరును కలిసి రక్తపరీక్ష చేయించుకోండి.



Click it and Unblock the Notifications