For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రక్తహీనతను సూచించే 8 ప్రధాన సంకేతాలు ఇవే .. !

|

మీరు ఫ్లూతో బాధపడుతున్నారనుకోండి, శరీరంలో ఏం జరుగుతుంది? సాధారణంగా జ్వరం, దగ్గు, జలుబు మొదలైన లక్షణాలు కలుగుతుంటాయి, క్రమంగా మీరు ఫ్లూకి గురయ్యారన్న నిర్ధారణ వస్తుంది. అవునా?

మనుషులుగా మనకు సాధారణ వ్యాధుల గురించి తెలియనిది కాదు, మరియు అవేమీ కొత్తవి కావు. అనారోగ్యకర జీవనశైలి అలవాట్లు కలిగి ఉన్న ఈ రోజుల్లో ఇటువంటి వ్యాధులు సర్వసాధారణం. ఎటువంటి సమస్యలు లేకుండా, జీవన శైలి సక్రమంగా ఉన్నా కూడా చుట్టుపక్కల వాతావరణం మూలంగానైనా ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఉదాహరణకు ఇంటి పక్కన చెత్తను తగలబెట్టే వారు, వంటకు కట్టెలపొయ్యి వాడకం, పరోక్ష ధూమపానం మొదలైనవి.

కొన్ని వ్యాధులు స్పష్టంగా కనిపించే ముందస్తు సంకేతాలు మరియు లక్షణాలను చూపించగా, రోగ లక్షణాలుగా నిర్ధారించి, రోగి అప్రమత్తమయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ కొన్ని వ్యాధులు మాత్రం పరిస్థితి తీవ్రమయ్యేదాకా ఎటువంటి సంకేతాలను చూపించవు.

8 Silent Signs Of Anaemia We Must Never Ignore!

జ్వరం, జలుబు, మొదలైన వ్యాధులు స్పష్టమైన ముందస్తు లక్షణాలను, ఫ్లూ వంటి వ్యాధులకై చూపిస్తాయని ఇదివరకే తెలుసుకున్నాము. అయినప్పటికీ, క్యాన్సర్ వంటి కొన్ని వ్యాధులు చివరి దశలకి వచ్చే వరకు ఎటువంటి సంకేతాలను చూపించకపోవచ్చు. సంకేతాలు అందేలోపే పరిణామాలు తీవ్రరూపాన్ని దాల్చవచ్చు కూడా.

కావున, మన ఆరోగ్యo పట్ల ఎల్లప్పుడూ శ్రద్ద ఉంచడం అన్నిటికన్నా ముఖ్యం, ఎందుకంటే కొన్ని లక్షణాలు గమనించలేని విధంగా అత్యంత సూక్ష్మంగా ఉంటాయి, కానీ మనకు ఆరోగ్యం పట్ల శ్రద్ద ఉంటే తప్పనిసరిగా వీటిని గుర్తించడం సులువవుతుంది.

రక్తహీనత మరియు రక్తం యొక్క హీమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉన్న ఎడల, ఆ పరిస్థితి ఒక వ్యక్తి బలహీనతను సూచిస్తుంది.

ఇక్కడ రక్త హీనతను సూచించే కొన్ని సంకేతాలను పొందుపరచడం జరిగినది. ఈ సంకేతాల పట్ల అప్రమత్తత అవసరం.

1. శ్వాస సరిగ్గా ఆడకపోవడం

1. శ్వాస సరిగ్గా ఆడకపోవడం

మీరు శ్వాసను సరిగ్గా తీసుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటున్న పక్షాన లేదా కొద్ది నిమిషాల నడక లేదా తక్కువ శారీరక శ్రమ కూడా మీ శ్వాసకు ప్రతిబంధకంగా మారుతున్న ఎడల, మీరు రక్తహీనతతో బాధపడుతున్నారనే అర్ధం. రక్తహీనత రక్తoలోని ఇనుము మరియు విటమిన్ బి-12 కోల్పోవడానికి కారణమవుతుంది. ఈ రెండు పోషకాలు ఊపిరితిత్తులకు తగిన ప్రాణవాయువును సరఫరా చేయడానికి దోహద పడుతుంటాయి. కావున, రక్తహీనతతో బాధపడుతున్న ప్రజలు తరచూ శ్వాస సంబంధిత సమస్యలకు గురవుతుంటారు, ఎందుకంటే వారి ఊపిరితిత్తులకి తగినంత ఆక్సిజన్ లభించదు కాబట్టి.

2. చర్మం పాలిపోవడం

2. చర్మం పాలిపోవడం

మీ చర్మం బూడిదరంగులోకి మారిపోవడం లేదా అనారోగ్యంగా ఉన్నట్లు కనిపిస్తున్న ఎడల, మీరు రక్త పరీక్ష చేయించుకోవడం అవసరం. బహుశా ఈ లక్షణాలు రక్తహీనతకు కారణం కావొచ్చు. శరీరంలోని ఎర్ర రక్త కణాలు ఆరోగ్యంగా ఉన్న ఎడల, చర్మానికి ప్రసరించే రక్తం కూడా ఆరోగ్యకరమైనదిగా ఉంటూ, చర్మం కాంతి వంతంగా కనిపించేందుకు దోహదం చేస్తుంది. కానీ రక్తహీనత వల్ల ఎర్ర రక్తకణాల సంఖ్య తక్కువగా ఉండడం వలన, చర్మం లేత బూడిద రంగులోకి లేదా అనారోగ్యకరమైన లక్షణాలతో కూడి కనిపిస్తుంది.

3. ఛాతీ నొప్పి

3. ఛాతీ నొప్పి

మీ ఛాతీభాగంలో తేలికపాటి లేదా మొద్దుబారిన నొప్పిని అనుభవిస్తున్నట్లయితే, రక్తహీనతకి గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని గుర్తుంచుకోండి. రక్తంలో తగినంత ఎర్ర రక్త కణాల సంఖ్య లేనప్పుడు ఆక్సిజనేట్ రక్తాన్ని సరఫరా చేయటానికి హృదయం అదనపు కృషి చేయాల్సిన అవసరం ఉన్నందున, రక్తహీనతతో బాధపడుతున్న ప్రజలు కూడా గుండె వ్యాధులను అనుభవించవచ్చని అనేక అధ్యయనాలలో తేలింది. కావున చాతీ నొప్పి సమస్యను ఎదుర్కొంటున్న ఎడల, వైద్యుని సంప్రదించి రక్త పరీక్ష కూడా చేసుకోవలసి వస్తుంది.

4. తినకూడని పదార్ధాలపై మనసు మళ్లడం.

4. తినకూడని పదార్ధాలపై మనసు మళ్లడం.

మంచు ముక్కలు, పెన్సిల్ ముక్కలు, పెయింట్, గోడకు రాసిన సున్నం మొదలైన వాటిని తినాలన్న కోరిక ఉంటే, లేదా వాటి వాసన తగిలినప్పుడు వాటి మీదకు మనసు మళ్ళుతూ ఉంటే, మీరు రక్త హీనతతో బాధపడుతున్నారని అర్థం. ఈ రకమైన వింత లక్షణాలు రక్త హీనతకు ప్రధాన లక్షణంగా ఉంటుంది. అయితే, పరిశోధనల అధ్యయనాల ప్రకారం, రక్తహీనత కారణంగా వ్యక్తిలో సంభవించే ఐరన్ లోపం ఈ వింత కోరికలకు ప్రధాన కారణం మరియు ఇటువంటి ఆలోచనలు రక్త హీనతకు ప్రధాన సంకేతంగా ఉంటాయని చెప్పబడింది.

5. విపరీతమైన చలి

5. విపరీతమైన చలి

వెలుపలి వాతావరణం తేమగా ఉన్నప్పుడు కూడా, మీ శరీర ఉష్ణోగ్రతతో పోల్చినప్పుడు, మీ అంత్య భాగాలైన చేతులు మరియు కాళ్ళు అత్యంత చల్లగా ఉన్నాయని మీరు గమనించినట్లయితే, రక్తహీనతకు గురయ్యారని అర్ధం. ఎర్ర రక్త కణాల్లోని ఇనుము, మిగిలిన శరీరానికి వేడిని సరఫరా చేయడంలో సహాయపడుతుంది. కావున, రక్తహీనత వలన శరీరంలో తక్కువ ఎర్ర రక్త కణాలు ఉన్నప్పుడు, అంత్య భాగాలకు తగినంత వేడి లభించక చల్లగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది.

6. తరచుగా తలనొప్పి

6. తరచుగా తలనొప్పి

ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా మీరు తరచుగా తీవ్రమైన తలనొప్పిని ఎదుర్కొంటూ ఉన్న్తట్లయితే, రక్తహీనతకు గురయ్యే అవకాశo ఉంది. సాధారణంగా, తలనొప్పులు అనేవి రక్తహీనతతో నేరుగా సంబందాన్ని కలిగి ఉండవు. అయినప్పటికీ, ఇది కూడా ఒక సంకేతం, ఎందుకంటే రక్తహీనత కారణంగా శరీరంలో ఎర్ర రక్త కణాలు ప్రాణ వాయువును సరైన మొతాదులో మెదడుకు అందివ్వలేని కారణంగా కూడా తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

7. తీవ్ర ఋతుస్రావం

7. తీవ్ర ఋతుస్రావం

మీరు ఋతుస్రావం సమయంలో అధిక రక్తాన్ని కోల్పోతున్న సమస్యని ఎదుర్కొంటున్న ఎడల, ఇది కూడా రక్తహీనత యొక్క సంకేతం కావచ్చు. ఎర్ర రక్త కణాలు తగ్గినప్పుడు, శరీరంలో సరైన మోతాదులో ఐరన్ లేని పక్షాన, ఋతుస్రావం సమయంలో గర్భాశయం గోడల నాణ్యత తగ్గడం మూలంగా, రక్త హీనతతో బాధపడుతున్న మహిళలకు ఈ సమయంలో అదనపు రక్తస్రావానికి దారితీస్తుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక, ఆరోగ్య సంబంధిత వివరాలకై, బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ విలువైన అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి.

English summary

8 Silent Signs Of Anaemia We Must Never Ignore!

Imagine you are afflicted with flu; what happens? You usually get symptoms like fever, cough, cold, etc., which prove for sure that you have flu, right? Well, as humans we are not new to diseases and we do get affected by diseases more often than not, especially these days where most people have unhealthy lifestyle habits.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more