2 వారాల్లో కింద శరీరపు కొవ్వును తగ్గించుకునే 8 విధానాలు

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

మనందరికీ అందంగా కన్పించే వంపులు తిరిగిన శరీరం కావాలని, దానికి ప్రశంసలు వచ్చి మనం మరింత ఆత్మవిశ్వాసంతో ఉండాలని అన్పిస్తుంది. కానీ శరీరంలో అవసరంలేని చోట కొవ్వు చేరటం వలన మనకి నచ్చని రూపాన్ని ఎదుర్కోవాలసి వస్తుంది.

కింది భాగపు శరీరంలో కొవ్వును తగ్గించుకోవటం చాలామంది స్త్రీలకు చాలా కష్టమైన విషయం. కింద శరీరంలో కొవ్వును వదిలించుకునే పద్ధతిని పాటించడానికి చాలా కష్టంగా ఉండి, పట్టుదల, ఓర్పు అవసరం.

8 Ways To Reduce Lower Body Fat In 2 Weeks

వ్యాయామం, డైట్ సరిగ్గా కలిపి చేయటం మరియు ఇతర జీవన విధాన కారణాలను చెక్ చేసుకుంటూ ఉండటం వలన కొవ్వు వేగంగా కరగటంలో సాయపడటానికి, దీర్ఘకాలికంగా ఉపయోగపడతాయి.

1.కార్డియో

1.కార్డియో

అనవసర కొవ్వును వదిలించుకోటానికి కార్డియో వ్యాయామం చాలా ప్రభావవంతమైనది. ప్రతిరోజూ చేసే వ్యాయామ రొటీన్ ఈ కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. కార్డియో వ్యాయామం తొడలు మరియు పిరుదుల నుంచే కాక, శరీరం మొత్తంలో కొవ్వును కరిగించటంలో సాయపడుతుంది.

2.గుంజీలు మరియు లంజెస్

2.గుంజీలు మరియు లంజెస్

కింద శరీరపు కొవ్వును కరిగించటానికి గొంతుకు కూర్చునే స్క్వాట్లు మరియు లంజెస్ చాలా ఉపయోగకరం. స్క్వాట్లు కాళ్ళ కండరాలపై పనిచేస్తాయి.లంజెస్ మరియు స్క్వాట్లు రెండూ కింద శరీరపు కండరాలను బలపర్చి మరియు టోన్ చేయడానికి ఉపయోగపడతాయి.

3.యోగా

3.యోగా

చాలామంది మంచి శరీరాకృతి మరియు టోన్ అవబడటానికి యోగాసనాలు మంచివని భావిస్తారు. ప్రభావవంతమైన యోగా ఆసనాలు శరీరం మొత్తం కొవ్వును తగ్గించటానికి, ముఖ్యంగా కింద శరీరపు భాగాలనుంచి కొవ్వును కరిగించటానికి తప్పనిసరిగా ఉపయోగపడతాయి.

4.మెట్లు ఎక్కడం

4.మెట్లు ఎక్కడం

మెట్లు ఎక్కడం వంటి చాలా సింపుల్ విషయం కూడా కింద శరీర భాగాల నుంచి కొవ్వును కరిగిస్తుంది. క్రమం తప్పకుండా 5-10 నిమిషాలు ఈ వ్యాయామం చేయటం వలన చాలా లాభం ఉంటుంది.

5.డైట్

5.డైట్

అన్నదెవరో నిజంగానే అన్నారు ‘మీరు తిన్నదాని బట్టే మీరేంటో చెప్పవచ్చు' అని. తక్కువ కార్బొహైడ్రేట్లు మరియు క్యాలరీలు అలాగే ఎక్కువ ప్రొటీన్లు ఉన్న ఆహారం బరువు తగ్గాలనుకునే వారికి సరైనది. క్యాలరీలు తగ్గించాలంటే చక్కెర పదార్థాలు తీసుకోవడం కూడా తగ్గించాలి.

చిరుతిళ్ళు తినడం మరియు పెద్ద భోజనాలను సరైన చిన్న భాగాలుగా మార్చుకుని రోజంతా తినండి.గుర్తుంచుకోండి మీరెంత వ్యాయామాలు సరిగ్గా చేసినా, మీ రొటీన్ లో సరైన భోజన క్రమం లేకపోతే, ప్రభావం కన్పించదు.

6.ద్రవపదార్థాలు

6.ద్రవపదార్థాలు

మంచి వ్యాయామ అలవాటును కొనసాగించటంలో మంచినీళ్ళు చాలా ముఖ్య అవసరమైన పాత్ర పోషిస్తాయి. మీ శరీరం నుంచి విషపదార్థాలు, చెడు పదార్థాలను బయటకి తరిమేయడానికి తగినంత నీరు తాగడం అవసరం. రోజును మొదలుపెట్టడానికి నిమ్మకాయ నీళ్ళు అయితే చాలా బాగుంటుంది.

ఎక్కువ నీటి శాతం ఉండే గ్రీన్ టీ మరియు పళ్ళు కూడా ఆరోగ్యకరమైన మరియు ప్రభావవంతమైన వ్యాయామంలో భాగం కావచ్చు. అందుకే అన్నారు,'చేపలాగా నీళ్ళు తాగటం నేర్చుకోండి' అలా అయితేనే మీ శరీరం సరియైన శాతంలో నీరుతో ఉంటుంది.

7.నిద్ర మరియు మానసిక ఒత్తిడి నియంత్రణ

7.నిద్ర మరియు మానసిక ఒత్తిడి నియంత్రణ

నిద్ర మరియు ఒత్తిడిని తగ్గించుకోవటం బరువు తగ్గటంలో చాలా ముఖ్యమైన విషయం. అక్కర్లేని ప్రదేశాలలో కొవ్వు సాధారణంగా నిద్రలేమి మరియు వ్యాయామ ఒత్తిడి వలనే చేరుతుంది.

8. మసాజ్ మరియు స్క్రబ్స్

8. మసాజ్ మరియు స్క్రబ్స్

కొబ్బరి నూనె మసాజ్ లు మరియు కాఫీ స్క్రబ్స్ కండరాలను గట్టిపరిచి, టోన్ చేస్తాయని చాలా ప్రసిద్ధి. అందుకని మీ కింద శరీరపు కొవ్వును తగ్గించుకోటానికి వీటిని కూడా మీ రొటీన్లో జతచేసుకోవచ్చు.

పైన చెప్పిన విధానాలను పాటించి కేవలం 2వారాల్లో మీ కింద శరీరపు కొవ్వును తగ్గించుకుని ఫలితాలు చూడండి! గుర్తుంచుకోండి, మంచి ఆకృతి కల శరీరం, మంచి జీవనవిధానం వల్ల మాత్రమే సాధ్యం మరియు పైన చెప్పిన విధానాలు పాటించడం వలన ఫిట్ మరియు వంపులు తిరిగిన శరీరం పొందటంలో వేగవంతమైన విజయం సాధిస్తారు.

English summary

8 Ways To Reduce Lower Body Fat In 2 Weeks

A curved bottom and legs gives a confident look but most of us tend to accumulate fat on those wrong areas. A proper diet combined with effective workouts can give effective results in a few weeks and help to get rid of a bulky lower body. And the way to it is simply to get started!