For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  పిల్లలలో లుకేమియా (రక్త క్యాన్సర్) యొక్క 9 భయంకరమైన లక్షణాలు !

  |

  మన చిన్నతనం గురించి మనము ఆలోచించినప్పుడు మనలో చాలామంది ఆనందకరమైన భావోద్వేగానికి లోనవుతాము.

  ఎందుకంటే, పిల్లలుగా మనకి ఒత్తిడి మరియు ఆందోళనను కలిగి ఉండకపోవచ్చు, (కానీ అవన్నీ మనకు యుక్తవయసు నుంచి ఎదురవుతాయి) మరియు మన జీవితంలో ఎదురయ్యే ప్రతీ విషయంలోనూ మనము ఆనందాన్ని కోరుకుంటాము.

  అయినప్పటికీ, కొంతమంది దురదృష్టవంతమైన పిల్లలకు, వారి బాల్యము నుండే అత్యంత బాధాకరమైన నొప్పులతో నిండి ఉన్నందున, అలాంటి వ్యాధులకు ధన్యవాదాలు!

  మనము ఇప్పటికే తెలుసుకున్నాం, క్యాన్సర్ మానవులను ప్రభావితం చేసే అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో ఒకటి మరియు దాని లక్షణాలు బాధితులకు చాలా బాధాకరంగా ఉంటాయి.

  క్యాన్సర్ కణాలు మావన శరీరంలో పెరగడం అనేవి ప్రారంభమవుతాయి మరియు అసాధారణమైన రీతిలో చాలా వేగంగా అభివృద్ధి చెందుతాయి, అలాగే కణజాలాలను మరియు అవయవాలను నాశనం చేస్తాయి. ఇలాంటి క్యాన్సర్ కణాలకు చికిత్స చేయటం చాలా కష్టం.

  అలాగే, చాలా రకాల క్యాన్సర్లు పూర్వపు స్థితికి తిరిగి రావడమనేది చాలా ఎక్కువగా ఉన్నాయి, అందువల్ల మరణాల రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి !

  క్యాన్సర్ అనేది మన శరీరంలో ఏ భాగాన్నైనా ప్రభావితం చేసే ఒక వ్యాధి, వయస్సు మరియు లింగంతో సంబంధం లేకుండా ప్రజలందరినీ ప్రభావితం చేయవచ్చు.

  కాబట్టి, అది కూడా శిశువులను మరియు పిల్లలను కూడా ప్రభావితం చేయవచ్చు ! పిల్లలలో ల్యుకేమియా (బ్లడ్ క్యాన్సర్) కు సంబంధించిన కొన్ని ప్రమాదకరమైన లక్షణాలు గాని ఉన్నట్లైతే, దానిని మీరు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.

  ల్యుకేమియా అంటే ఏమిటి?

  ల్యుకేమియా, శరీర రక్త కణాలను ప్రభావితం చేసే ఒక రకమైన క్యాన్సర్. ఇది ఎముక మజ్జలో ఉత్పత్తి అయ్యి, చివరకు ఆరోగ్యకరమైన రక్త కణాలను కూడా నాశనం చేస్తుంది. ల్యుకేమియా, ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి లక్షలాది మంది పిల్లలను ప్రభావితం చేస్తుంది ! పిల్లలలో ల్యుకేమియా యొక్క కొన్ని లక్షణాలు ఈ క్రిందన సూచించబడి ఉన్నాయి.

  1. సులభంగా గాయాలవుతాయి :

  1. సులభంగా గాయాలవుతాయి :

  సాధారణంగా, పిల్లలు చాలా చురుకుగా ఉంటారు మరియు ఇళ్ళు బయట సైక్లింగ్ చేస్తూ, చాలా రకాల ఆటలను ఆడుతూ చాలా సమయం గడుపుతూ, చాలా వరకూ కొత్త విషయాలను నేర్చుకుంటారు. ఈ క్రమంలోనే వారు అసాధారణమైన రీతిలో కిందకి పడి పోవటం, తమను తాము గాయపరచుకోవడం, దెబ్బలను తగిలించుకోవడం అనేవి జరుగుతాయి. అయితే, మీ బిడ్డ మృదువుగా జారిన, బాగా మొద్దుబారిన వస్తువులు తగిలినప్పుడు కూడా తరచుగా గాయాలపాలైతే, అది ల్యుకేమియా వ్యాధి యొక్క సంకేతం కావచ్చు.

  2. ముక్కు నుండి రక్తస్రావం :

  2. ముక్కు నుండి రక్తస్రావం :

  చాలా యాధృచ్చిక సమయంలో, ఎలాంటి సరైన కారణాలు, గాయాలు లేకుండా మీ పిల్లల ముక్కునుండి తరచుగా రక్తస్రావం జరగటానికి మీరు గమనించినట్లయితే, ఇది ల్యుకేమియా యొక్క మరొక లక్షణము కావచ్చు. ఈ వ్యాధి వలన మీ పిల్లల ముక్కులో ఉన్న రక్తనాళాలు చాలా బలహీనమయ్యి, చాలా సులభంగా విరిగిపోతాయి.

  3. ఆకలి లేకపోవటం :

  3. ఆకలి లేకపోవటం :

  ఈ లక్షణం చాలామంది పిల్లలలో చాలా సాధారణమైనది కనిపించవచ్చు, ఎందుకంటే వారు సాధారణంగా ఆహార విషయంలో పేచీ పెడుతూ ఉంటారు, కాబట్టి ఇది అంత తొందరగా గుర్తించబడదు! ల్యుకేమియా ప్రభావితం కాబడిన పిల్లలలో, కడుపులోనూ మరియు ప్లీహములోనూ ఆ కణాలు పేరుకుపోవడం ప్రారంభమవుతాయి, అందువల్ల ప్రేగులలో తక్కువ జీర్ణ రసాలను ఉత్పత్తి చేయటానికి దారితీస్తుంది, తద్వారా ఆకలిని తగ్గిస్తుంది.

  4. తరచుగా ఇన్ఫెక్షన్లు రావడం :

  4. తరచుగా ఇన్ఫెక్షన్లు రావడం :

  వైద్య చికిత్సను అందించిన తర్వాత కూడా, మీ బిడ్డ అనారోగ్యంతో బాధపడుతున్నారని గమనించినట్లయితే, అది ల్యుకేమియా యొక్క మరొక లక్షణం కావచ్చు. ఈ క్యాన్సర్ తెల్ల రక్త కణాలను ప్రభావితం చేసి, వాటిని నెమ్మదిగా నాశనం చేయడాన్ని ప్రారంభిస్తుంది. తెల్ల రక్త కణాలు, వ్యాధులను మరియు వ్యాధుల కారకాలను గుర్తించి వాటిని కనుగొనటంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. కాబట్టి ల్యుకేమియా శరీరం యొక్క రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది.

  5. కడుపు నొప్పి :

  5. కడుపు నొప్పి :

  అప్పటినుండి ఇప్పటివరకు, చాలామంది పిల్లలు అజీర్ణం మరియు గ్యాస్ సమస్యల కారణంగా కడుపు నొప్పిని ఎదుర్కొంటున్నారు. అయితే, మీ పిల్లలు అజీర్ణ సమస్య లేకుండానే తరచుగా తీవ్రమైన కడుపు నొప్పిని ఎదుర్కొంటున్నట్లయితే, అది కడుపులో ల్యుకేమియా కణాలు సంక్రమించడం వల్ల, కడుపులో ఉన్న కణజాలాన్ని ప్రభావితం చేశాయని నిర్ధారించుకోవచ్చు.

  6. శ్వాసలో ఇబ్బందులు :

  6. శ్వాసలో ఇబ్బందులు :

  రక్తమనేది ఊపిరితిత్తులతో సహా, శరీరంలోని ప్రతి భాగానికి మరియు అవయవాలకి ప్రసరిస్తుందని, మనకు బాగా తెలుసు ! కాబట్టి, ల్యుకేమియా కారణంగా రక్తంలో క్యాన్సర్ కణాలు ఉన్నప్పుడు, అవి ఊపిరితిత్తుల కణాలను నాశనం చేస్తాయి, తద్వారా గురక మరియు ఊపిరి పీల్చడంలో ఎదురైన శ్వాస సంబంధమైన సమస్యలు అనేవి పిల్లల్లో చూడవచ్చు.

  7. కీళ్ల నొప్పులు :

  7. కీళ్ల నొప్పులు :

  మీ పిల్లలు మోకాళ్ల, మోచేతులు, వీపు భాగంలో తరచుగా కీళ్లనొప్పులను గూర్చి ఎలాంటి నొప్పులూ గాయాలు లేకుండా, మీకు ఫిర్యాదు చేస్తున్నట్లుగా మీరు గమనించినట్లయితే, ఇది కూడా ల్యుకేమియాకు సంకేతం కావచ్చు. కీళ్ల భాగం చుట్టూ పక్కల ప్రసరిస్తున్న రక్తంలో క్యాన్సర్ కణాలు ఉండటంవల్ల, నొప్పిని మరియు మంటలను కలుగజేయుటకు కారణమవుతుంది.

  8. రక్తహీనత :

  8. రక్తహీనత :

  రక్తహీనత అనేది శరీరంలో ఎర్ర రక్తకణాల యొక్క స్థాయిని క్షీణించేలా చేయడం వల్ల, మీరు మరింత బలహీనంగా ఉండటానికి దారి తీస్తుంది. అనారోగ్యం, అలసట, ఆకలిని కోల్పోవటం వంటి రక్తహీనతకు సంబంధించిన లక్షణాలను మీ పిల్లలు కలిగి ఉన్నట్లుగా మీరు గమనించినట్లయితే, అది రక్తహీనతను సూచిస్తుందా (లేక) ల్యుకేమియాను సూచిస్తుందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి, మీ పిల్లలకు తప్పక రక్త పరీక్షను జరిపించాలి.

  9. వాపులు :

  9. వాపులు :

  మీ పిల్లల చంకలు, కీళ్ళు, మెడ, కాలర్బోన్ వంటి మొదలైన భాగాలలో వాపును కలిగి ఉన్నట్లు మీరు గమనించినట్లయితే, ఇది ల్యుకేమియా యొక్క మరొక లక్షణం కావచ్చు. క్యాన్సర్ కణాలు, శరీరం యొక్క ఈ ప్రాంతాల్లో ఉన్న శోషరస గ్రంథులను ప్రభావితం చెయ్యటం వలన, అక్కడ ఏర్పడే వాపుకు గురికావచ్చు.

  English summary

  9 Dangerous Symptoms Of Leukemia (Blood Cancer) In Children

  Leukaemia is a type of blood cancer which affects the blood cells of the body. Leukaemia can affect both adults and children; however, it is more apparent in children. Here are a few dangerous symptoms of leukaemia in children.
  Story first published: Monday, February 19, 2018, 12:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more