For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఛాతీ నొప్పి నివార‌ణ‌కు 9 ఇంటి చిట్కాలు

  By Sujeeth Kumar
  |

  ఛాతో నొప్పి ఒక్కోసారి చాలా ఇబ్బందిక‌రంగా మారుతుంది. స‌రైన స‌మ‌యానికి చికిత్స అంద‌క‌పోతే శ్వాస నాళిక‌లో తీవ్ర‌మైన ఇన్ఫెక్ష‌న్లు వ‌స్తాయి. ఛాతీ నొప్పి వ‌చ్చిన‌ప్పుడు బాగా బ‌రువుగా అనిపిస్తుంది. ఒక్కోసారి ఆహారం మింగ‌డం కూడా క‌ష్ట‌మైపోతుంది.

  ఏళ్లుగా భార‌తీయులు ఇలాంటి చిన్న చిన్న నొప్పుల‌కు ఇంటి చిట్కాల‌నే పాటిస్తూ వ‌స్తున్నారు. ఇలాంటి గృహ చిట్కాల‌తో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉంటున్నాయి. మేము కొన్ని సాధార‌ణ గృహ చిట్కాల‌ను అందిస్తున్నాం. వీటితో ఛాతీ నొప్పి త‌గ్గే అవ‌కాశాలుంటాయి. వీలైతే ప్ర‌యోగించండి..

  తేనె, నిమ్మర‌సం

  తేనె, నిమ్మర‌సం

  గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మ‌ర‌సం క‌ల‌పండి. దీన్ని రోజుకు క‌నీసం 2 లేదా 3 సార్లు తాగండి. తేనె గొంతు, ఛాతీలోని మంట‌ను త‌గ్గిస్తే నిమ్మ‌రసంలోని విట‌మిన్ సి రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది.

  వేడి పాలు

  వేడి పాలు

  వేడిపాల‌ల్లో తేనె, ప‌సుపు, మిరియాలు క‌లుపుకొని తాగ‌డం వ‌ల్ల జ‌లుబు, ఛాతీ నొప్పులు త‌గ్గుతాయి. ప‌సుపులో యాంటీ బ్యాక్టీరియా గుణాల‌తోపాటు యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ గుణాలుంటాయి. ఇవి బ్యాక్టీరియాను న‌శింప‌జేస్తాయి. ఇక మిరియాలు జీర్ణ‌ప్ర‌క్రియ‌ను మెరుగుప‌ర్చ‌డ‌మే కాదు జ‌లుబు, ద‌గ్గు త‌గ్గడంలో స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ మిశ్ర‌మాన్ని రోజులో 2 సార్లు తాగితే ఫ‌లిత‌ముంటుంది.

  గోరువెచ్చ‌ని నీరు

  గోరువెచ్చ‌ని నీరు

  ఆరోగ్య నిపుణులు గోరువెచ్చ‌ని నీరు తాగమ‌ని సూచిస్తుంటారు. వేడి నీరు తాగ‌డం వ‌ల్ల గొంతు సాంత్వ‌న క‌లుగుతుంది. మెల్ల‌గా ఛాతీ నొప్పి త‌గ్గుతుంది. శ్వాస నాళిక‌లో తేమ‌ ఉంటే అది క‌రిగిపోయి సాఫీగా అవుతుంది.

  పుక్కిలిస్తే

  పుక్కిలిస్తే

  ఈ విధానం ద్వారా ఛాతీ నొప్పి త‌గ్గే అవ‌కాశాలు ఎక్కువ‌. వేడి వేడి నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి క‌రిగించాలి. దీన్ని నోట్లో వేసుకొని 1 లేదా 2 నిమిషాల పాటు పుక్కిలించాలి. ఇలా రోజులో 3 లేదా 4 సార్లు చేస్తే చాలు ఫ‌లితం క‌నిపిస్తుంది. అయితే నీటిని మింగ‌కుండా జాగ్ర‌త్త ప‌డాలి.

  చాయ్‌తో...

  చాయ్‌తో...

  అల్లం, మిరియాలు, యాల‌కులతో చేసిన చాయ్ ఛాతీ నొప్పిని త‌గ్గించ‌డంలో స‌హ‌క‌రిస్తుంది. చ‌క్కెర‌కు బ‌దులుగా తేనె క‌లుపుకోండి. మీకు చాయ్ అంటే ఇష్టం లేక‌పోతే కొంచెం అల్లం తీసుకొని న‌మిలేసేయండి.

  ఆవిరి

  ఆవిరి

  జిందాతిల‌స్మాత్ వేడి నీళ్ల‌లో వేసుకొని ఆవిరి ప‌ట్టుకోవ‌డం వ‌ల్ల ఛాతీ నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం పొందొచ్చు. ఆవిరి తీసుకునేట‌ప్పుడు శ్వాస బాగా తీసుకోవాలి. ఆ త‌ర్వాత నిదానంగా వ‌దిలేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముక్కుదిబ్బ‌డ‌, ఛాతీ నొప్పి నుంచి త‌క్ష‌ణం ఉప‌శ‌మ‌నం దొరుకుతుంది. జిందాతిల‌స్మాత్ లేదా నీల‌గిరి ఆకుల నూనెలో యాంటీ బ్యాక్టీరీయా గుణాలుంటాయి.

  బ్లాక్ కాఫీ

  బ్లాక్ కాఫీ

  బ్లాక్ కాఫీ తాగ‌డం వ‌ల్ల తాత్కాలికంగా శ్వాస నాళిక‌లో పేరుకున్న తేమ తొల‌గిపోతుంది. తాత్కాలికంగా ఉప‌శ‌మ‌నమైతే ల‌భిస్తుంది. అయితే రోజుకు 2 క‌ప్పుల‌కు మించి తాగ‌వ‌ద్దు. కాఫీలో కెఫిన్ చెడు ప్ర‌భావం చూపిస్తుంద‌న్న సంగ‌తి తెలిసిందే క‌దా!

  ప‌సుపు

  ప‌సుపు

  వేడినీటిలో చిటికెడు ప‌సుపు వేసి ఆ నీటితో పుక్కిలించాలి. ప‌సుపులో క‌ర్‌కుమిన్ అనే ప‌దార్థం ఉంటుంది. అది ఒంట్లోని తేమ‌ను సులువుగా పోగొట్టేస్తుంది. ఛాతీ స‌మ‌స్య‌ల‌కు ఇది మంచి ప‌రిష్కార మార్గం. అంతేకాకుండా ప‌సుపు యాంటీ బ‌యాటిక్‌. ద‌గ్గు, జ‌లుబును త‌గ్గించేస్తుంది.

  ఉల్లి ర‌సం

  ఉల్లి ర‌సం

  దీని చేదు రుచి మీకు న‌చ్చ‌క‌పోవ‌చ్చు అయితే ఛాతీ నొప్పి నివార‌ణలో ఇది స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తుంది. ఉల్లిలో క్వ‌ర్‌సెటిన్ అనే పదార్థం మూలంగా అది తేమ‌ను పోగొట్టేయ‌గ‌ల‌దు. యాంటీ మైక్ర‌రోబియ‌ల్ గుణాల వ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్లు ద‌రిచేర‌వు. ఉల్లి ర‌సాన్ని తీసి నిమ్మ‌ర‌సం, తేనె, నీరు క‌లుపుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని రోజులో 3 లేదా 4 సార్లు తాగితే ఫ‌లితం క‌నిపిస్తుంది.

  English summary

  9 easy ways to treat chest congestion at home

  Chest congestion can be extremely discomforting. If not treated in time, it can lead to severe infections in the respiratory tract. A person suffering from congested chest may most commonly experience pain in chest or throat, build-up of phlegm, making the chest feel really heavy. Extreme cases can even make swallowing of food difficult.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more