For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  బ్రౌన్ రైస్ ద్వారా కలిగే 9 ఆరోగ్య ప్రయోజనాలు

  |

  మీరు హెల్త్ కాన్షియస్ నెస్ కలిగిన వారైతే, ముఖ్యంగా మీరు వెయిట్ లాస్ ప్లాన్ లో ఉన్నట్టయితే, మీకు ఈపాటికే వైట్ రైస్ నుంచి బ్రౌన్ రైస్ కి షిఫ్ట్ అవమన్న సూచనలు అందే ఉంటాయి. అవునా?

  ఎందుకంటే, బ్రౌన్ రైస్ లో వైట్ రైస్ లో లభించే వాటికంటే తక్కువ ఫ్యాటెనింగ్ పదార్థాలుంటాయి. బ్రౌన్ రైస్ తో పోలిస్తే వైట్ రైస్ లో స్టార్చ్ కంటెంట్ తో పాటు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తాయి.

  ఈ కారణం చేత, బ్రౌన్ రైస్ అనేది వెయిట్ లాస్ ని ప్రోత్సహిస్తుంది. ఈ ఫ్యాక్ట్ ని మనలో చాలామంది ఈ పాటికే గుర్తించి ఉండుంటారు.

  అయితే, ఈ గ్రెయిన్స్ అనేవి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ని అందించడంలో కూడా ముందుంటాయి. ఈ విషయం సాధారణంగా అంత ప్రాచుర్యంలో లేవు.

  9 Health Benefits Of Brown Rice

  బ్రౌన్ రైస్ అనే హోల్ గ్రైన్ లో కేవలం వెలుపలి పార్ట్ ని తొలగిస్తారు. అదే వైట్ రైస్ లో అయితే దానిలోని బీజ మరియు ఊకలని తొలగించేటప్పుడు అందులోని ఫైబర్ మరియు పోషక విలువలు కూడా పోతాయి.

  కాబట్టి, వైట్ రైస్ తో పోలిస్తే బ్రౌన్ రైస్ అనేది ఆరోగ్యానికి మంచిది. వెయిట్ లాస్ ని ప్రోత్సహించడంతో పాటు అనేక ఆరోగ్యప్రయోజనాలను అందిస్తుంది.

  కాబట్టి, ఈ కింది కారణాలను దృష్టిలో పెట్టుకుంటే బ్రౌన్ రైస్ ని మీ డైట్ ప్లాన్ లో కి భాగం చేసేందుకు మీరు ఆసక్తి కనబరుస్తారు.

  1. డయాబెటిస్ ను మేనేజ్ చేస్తుంది:

  1. డయాబెటిస్ ను మేనేజ్ చేస్తుంది:

  డయాబెటిస్ అనేది సాధారణ మెటబాలిక్ డిజార్డర్. ఈ మధ్యకాలంలో, ఈ డిజార్డర్ కు గురయ్యేవారి సంఖ్య పెరుగుతూ ఉంటోంది. ఇన్సులిన్ అనే హార్మోన్ ని శరీరం తగినంతగా ఉత్పత్తి చేయకపోతే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి అమాంతం పెరుగుతాయి. అందువలన, అనేక అవాంఛిత ప్రభావాలు శరీరంపై పడతాయి. బ్రౌన్ రైస్ అనేది ఫైటిక్ యాసిడ్ మరియు ఫైబర్ లనే న్యూట్రియెంట్స్ ని పుష్కలంగా కలిగి ఉంటుంది. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని సమర్థవంతంగా తగ్గించి డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. అందువలన, డయాబెటిస్ వలన కలిగే దుష్ప్రభావాలు తగ్గుతాయి.

  2. సిస్టమ్ ని డిటాక్సిఫై చేస్తుంది:

  2. సిస్టమ్ ని డిటాక్సిఫై చేస్తుంది:

  అనారోగ్యకరమైన ఆహారాల ద్వారా మన శరీరంలోకి టాక్సిన్స్ అనేవి ఎక్కువసంఖ్యలో పేరుకుపోతూ ఉంటాయి. ఈ ప్రక్రియ రోజువారీ జరుగుతుంది. పొల్యూటెంట్స్, వాతావరణంలోని జెర్మ్స్ వంటివి కూడా ఈ ప్రక్రియను ప్రోత్సహిస్తున్నాయి. అందువలన శరీరాన్ని ఇంటర్నల్ గా డిటాక్సిఫై చేసుకోవడం తప్పనిసరి. తద్వారా, అనేక వ్యాధులను అరికట్టవచ్చు. బ్రౌన్ రైస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి సిస్టమ్ ని సహజంగా డిటాక్సిఫై చేస్తాయి. టాక్సిన్స్ ను తొలగిస్తాయి.

  3. గుండె వ్యాధులను అరికడుతుంది

  3. గుండె వ్యాధులను అరికడుతుంది

  ఈ రోజుల్లో గుండె వ్యాధుల ద్వారా ప్రాణాలను కోల్పోయే వారి సంఖ్య పెరుగుతోంది. శరీరంలోని ముఖ్య అవయవాలను దెబ్బతీసే వ్యాధులు ప్రాణాంతకమైనవి. వీటి నుంచి రక్షణ పొందటం అంత సులువు కాదు. బ్రౌన్ రైస్ లో లభించే ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లకి ఆర్టరీస్ లో పేరుకున్న ప్లేగ్ ను తొలగించే సామర్థ్యం కలదు. తద్వారా, గుండెకి రక్తసరఫరా మెరుగ్గా జరుగుతుంది. ఆ విధంగా, గుండె జబ్బులను అరికట్టవచ్చు.

  4. న్యూ మదర్స్ లో లాక్టేషన్ ని పెంపొందిస్తుంది

  4. న్యూ మదర్స్ లో లాక్టేషన్ ని పెంపొందిస్తుంది

  ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చిన తల్లులు తమ ఆరోగ్యాన్ని రికవర్ చేసుకుంటే బిడ్డకి తగినంత పోషణ వారి పాల ద్వారా లభిస్తుంది. బ్రౌన్ రైస్ అనేది నర్సింగ్ మదర్స్ లో బ్రెస్ట్ మిల్క్ ఉత్పత్తిని పెంపొందిస్తుంది. నర్సింగ్ మదర్స్ లోని మిల్క్ గ్లాండ్స్ ని ప్రేరేపించడం ద్వారా శిశువు పోషణకి అవసరమైన బ్రెస్ట్ మిల్క్ ని అందిస్తుంది.

  5. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది

  5. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది

  హెల్తీ డైట్ ను పాటించడానికి కూడా తీరిక లేని బిజీ షెడ్యూల్స్ లో ఉన్నవారు అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం ద్వారా వివిధ జీర్ణసమస్యలతో సతమతమవుతూ ఉంటారు. గాస్త్రైటిస్, బ్లోటింగ్, ఎసిడిటీ, కాన్స్టిపేషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. బ్రౌన్ రైస్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా లభిస్తుంది. ఇది డైజెస్టివ్ జ్యూస్ లను రేగులేట్ చేసి స్టూల్ ను స్మూత్ చేస్తుంది. ఆ విధంగా, పైన పేర్కొనబడిన డైజెస్టివ్ సమస్యలను తొలగిస్తుంది.

  6. హై కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది

  6. హై కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది

  ఈ మధ్యకాలంలో చాలామంది నుంచి హై కొలెస్ట్రాల్ సమస్య గురించి వింటూ రావడం జరుగుతోంది. ఈ సమస్య అత్యంత సాధారణ సమస్యగా మారిపోయింది. వివిధ కారణాలవలన శరీరంలోని అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగినప్పుడు ఆర్టెరీస్ లో కొలెస్ట్రాల్ పేర్కొని వివిధ అవయవాలను రక్తప్రసరణని అడ్డుకుంటాయి. బ్రౌన్ రైస్ లో హై కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణం ఉంది. బ్రౌన్ రైస్ లో లభించే గామా ఎమినోబ్యుటిరిక్ యాసిడ్ (GABA).

  7. క్యాన్సర్ ను అరికడుతుంది

  7. క్యాన్సర్ ను అరికడుతుంది

  క్యాన్సర్ అనే ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేకమంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఏజ్ తో అలాగే జెండర్ తో సంబంధం లేకుండా ప్రతి ఏడాది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. శరీరంలోని క్యాన్సర్ కారక కణాలు వృద్ధి చెందుతున్నప్పుడు అవి శరీరంలోని అవయవాలను అలాగే టిష్యూలను డిస్ట్రాయ్ చేస్తాయి. బ్రౌన్ రైస్ లో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ వలన క్యాన్సర్ కారక కణాల వృద్ధి అరికట్టబడుతుంది.

  8. డిప్రెషన్ ను తగ్గిస్తుంది

  8. డిప్రెషన్ ను తగ్గిస్తుంది

  డిప్రెషన్ వంటి వివిధ మానసిక సమస్యలను తొలగించే సామర్థ్యం కలిగిన సహజసిద్ధమైన ఇంగ్రిడియెంట్స్ లో బ్రౌన్ రైస్ ముఖ్య స్థానాన్ని కైవసం చేసుకుంది. గ్లుటామైన్, గ్లిజరిన్ మరియు GABA వంటి కొన్ని ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ లు బ్రౌన్ రైస్ లో లభించడం వలన ఈ ఆరోగ్య ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇవి మెదడులోని సిరోటినిన్ ఉత్పత్తిని మెరుగుపరచి మెదడులోని యాంగ్జైటీ అలాగే డిప్రెషన్ కు సంబంధించిన లక్షణాలను తగ్గిస్తుంది.

  9. బోన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది

  9. బోన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది

  ఎమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఎసెన్షియల్ న్యూట్రియెంట్స్, మెగ్నీషియం మరియు కేల్షియం వంటి మినరల్స్ బ్రౌన్ రైస్ లో సమృద్ధిగా లభిస్తాయి. ఇవి బోన్స్ ని హెల్తీగా అలాగే స్ట్రాంగ్ గా ఉంచేందుకు తోడ్పడతాయి. వయసు మీదపడుతున్నా కూడా బోన్స్ ఆరోగ్యాన్ని కాపాడటంలో బ్రౌన్ రైస్ తనదైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి, బోన్స్ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు రెగ్యులర్ బేసిస్ లో బ్రౌన్ రైస్ ను తీసుకోండి. తద్వారా ఆస్టియోపొరోసిస్ వంటి వ్యాధుల నుంచి రక్షణ పొందండి.

  English summary

  9 Health Benefits Of Brown Rice

  Brown rice is a healthier option, compared to white rice, if you are on a weight loss plan. However, brown rice also comes with a number of other health benefits like preventing diabetes, heart disease management, boosting digestive health, detoxifying the system, reducing high cholesterol, etc.
  Story first published: Monday, March 5, 2018, 13:30 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more