పెయిన్ కిల్లర్స్ ని తీసుకునేముందు ఈ 9 ముఖ్యమైన వాస్తవాలని మీరు తెలుసుకోవాలి

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

నొప్పి అనేది సహజం. దీనిని అందరూ అనుభవించి తీరతారు. నొప్పిని ఎక్స్పీరియెన్స్ చేయని వారుండరు.

నిజానికి నొప్పి లేకపోవటమంటే నరాల సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్నారని అర్థం.

కాబట్టి, వ్యాధుల వలన అలాగే ఇంజురీల వలన నొప్పి కలగడం సహజం. అన్ని వయసులవారిలోను వివిధ కారణాల వలన నొప్పి కలగటమనేది సాధారణం.

కొన్ని రకాల నొప్పులు చిన్నపాటిగా ఉంటాయి. ఇవి తాత్కాలిక నొప్పులే. అయితే, కొన్ని రకాల విపరీతమైన నొప్పులు తగ్గేందుకు చాలా సమయం తీసుకుంటాయి.

ఉదాహరణకు, విరిగిన ఎముక వలన కలిగే నొప్పి లేదా లిగమెంట్ టియర్ వలన కలిగే నొప్పి అనేది తీవ్రంగా ఉంటుంది. అలాగే, ఈ నొప్పి తగ్గడానికి సమయం కూడా పడుతుంది. మరోవైపు, మైగ్రేన్ లేదా మెన్స్ట్రువల్ క్రామ్ప్స్ అనేవి ఒక రోజులో తగ్గిపోతాయి. ఇవి తీవ్రంగా ఉన్నా ఇవి త్వరగా తగ్గిపోతాయి.

కాబట్టి, కొన్ని రకాల నొప్పులు తీవ్రంగా మిమ్మల్ని బాధిస్తున్నప్పడు పెయిన్ కిల్లర్ పై ఆధారపడటం సహజం. పెయిన్ కిల్లర్స్ తో పాటు యాంటీ ఇంఫ్లేమేటరీ మెడికేషన్స్ వలన తాత్కాలిక ఉపశమనం కలిగినా వాటి వలన భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ కలిగే అవకాశాలు లేకపోలేదు. దీర్ఘకాలం పాటు పెయిన్ కిల్లర్స్ ని వాడటం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది.

కాబట్టి, పెయిన్ కిల్లర్స్ ని వాడే ముందు ఈ ముఖ్యమైన వాస్తవాలను మీరు గ్రహించాలి.

1. పెయిన్ కిల్లర్స్ పై ఆధారపడటం అవసరమేనా?

1. పెయిన్ కిల్లర్స్ పై ఆధారపడటం అవసరమేనా?

మొదటిగా, పెయిన్ కిల్లర్స్ ని తీసుకోవాలన్న ఆలోచన రాగానే అసలీ పెయిన్ కిల్లర్స్ అవసరమేనా అన్న ప్రశ్నను వేసుకోండి. నొప్పి తీవ్రతను బట్టి పెయిన్ కిల్లర్ అవసరాన్ని నిర్ధారించుకోండి. నొప్పిని అస్సలు భరించలేకపోతే పెయిన్ కిల్లర్ పై ఆధారపడటం తప్పనిసరి. ఎన్నో రకాల నొప్పులు వాటంతటవే తగ్గుముఖం పడతాయి. కొన్ని రోజులు భరిస్తే నొప్పులు సహజంగానే తగ్గిపోతాయి. నిజానికి, పెయిన్ కిల్లర్స్ అవసరమే లేదు. ఈ డ్రగ్స్ అనేవి సమస్యను పరిష్కరించవు. ఇవి కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే కలిగిస్తాయి.

2. నొప్పిని కారణమైన అంశానికి చికిత్సని అందించండి:

2. నొప్పిని కారణమైన అంశానికి చికిత్సని అందించండి:

ప్రతి నొప్పికి ఒక మూలం ఉంటుంది. నొప్పి అనేది అనారోగ్యం వలన లేదా ఏదైనా ఇంజురీ వలన కలగవచ్చు. నొప్పి అనేది ఆయా ఆరోగ్యస్థితులను తెలియచేసే లక్షణం మాత్రమే. కాబట్టి, పెయిన్ కిల్లర్స్ ని తీసుకుని తాత్కాలిక ఉపశమనాన్ని పొందేకంటే నొప్పికి కారణమైన ఆరోగ్య సమస్యలకు తగిన చికిత్సను అందుకోవడం మంచిది. తద్వారా, నొప్పి శాశ్వతంగా తగ్గుముఖం పడుతుంది.

3. నిపుణుల సహకారం అందుకోండి:

3. నిపుణుల సహకారం అందుకోండి:

ఏదైనా వ్యాధితో లేదా ఇంజురీతో మీరు ఇబ్బందిపడి తీవ్రమైన నొప్పితో సతమతమవుతుంటే, మీరు మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకై నిపుణుల సహకారాన్ని తీసుకోవటం తప్పనిసరి. పెయిన్ కిల్లర్స్ ని దీర్ఘకాలం పాటు వాడేకంటే,ప్రత్యామ్నాయ థెరపీస్ తో లేదా సర్జరీలతో నొప్పిని తగ్గించుకోవడం మేలు. కొన్ని టెస్ట్ లను నిర్వహించిన తరువాత నొప్పి ఎన్నాళ్లకు తగ్గుముఖం పడుతుందో వైద్యులు మీకు తెలియచేస్తారు.

4. సెల్ఫ్ మెడికేటింగ్ ని నివారించండి:

4. సెల్ఫ్ మెడికేటింగ్ ని నివారించండి:

వైద్యుల సూచనలు లేకుండా మీ అంతట మీరే మెడికేషన్స్ ను ఎంచుకుని వాడుకునే పద్దతికి గుడ్ బై చెప్పండి. సెల్ఫ్ గా మెడికేషన్స్ ని తీసుకోవడం ప్రాణాపాయ పద్దతి. ఏవైనా పెయిన్ కిల్లర్స్ ఓవర్ డొసేజ్ ను మీరు తీసుకున్నట్లయితే ప్రాణాపాయ సమస్యను కొనితెచ్చుకున్నవారవుతారు. ఒకవేళ భరించరానంత నొప్పిని మీరు అనుభవిస్తున్నట్లైతే వైద్యులను సంప్రదించి తగిన డొసేజ్ ని తీసుకోండి.

5. సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోండి:

5. సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోండి:

మిగతా మెడికేషన్స్ లాగానే పెయిన్ కిల్లర్స్ ని వాడటం ద్వారా కూడా సైడ్ ఎఫెక్ట్స్ సంభవిస్తాయి. చివరికి ప్రాణాపాయ స్థితికి కూడా చేర్చుతాయి ఈ సైడ్ ఎఫెక్ట్స్. కాబట్టి పెయిన్ కిల్లర్స్ ని తీసుకునే ముందు వాటి ద్వారా కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ని తెలుసుకోండి. అజీర్ణ సమస్యలు, మలబద్ధకం, కళ్ళు తిరగటం, నీరసం, లో బ్లడ్ ప్రెషర్, హార్ట్ ఎటాక్ వంటివి పెయిన్ కిల్లర్స్ ద్వారా కలిగే కొన్ని సాధారణ సైడ్ ఎఫెక్ట్స్. అయితే, సరైన డోసేజ్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ కలిగే ప్రమాదం తక్కువే.

6. పెయిన్ కిల్లర్స్ కి అడిక్ట్ అవకండి:

6. పెయిన్ కిల్లర్స్ కి అడిక్ట్ అవకండి:

వీటికి మానసికంగా అడిక్ట్ అవడమనేది పెయిన్ కిల్లర్స్ వలన కలిగే భయానక సైడ్ ఎఫెక్ట్. నిజానికి, ప్రిస్క్రిప్షన్ పెయిన్ కిల్లర్స్ కి ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది రోగులు ఎడిక్ట్ అయ్యారు. ఈ ఎడిక్షన్ తీవ్రత ఎంతంటే వీరిని మాములుగా తయారుచేయడనికి మెడికల్ హెల్ప్ తప్పనిసరి. పెయిన్ కిల్లర్స్ వలన నొప్పి నుంచి కలిగే రిలీఫ్ అనేది ఈ ఎడిక్షన్స్ కి కారణం. చాలామంది, నొప్పి తగ్గిపోయిన తరువాత కూడా ఈ పెయిన్ కిల్లర్స్ ని తీసుకోవడాన్ని మానటం లేదు.

 7. ఇతర డ్రగ్స్ వైపు ఆకర్షితులయ్యే ప్రమాదం:

7. ఇతర డ్రగ్స్ వైపు ఆకర్షితులయ్యే ప్రమాదం:

అనేక రీసెర్చ్ స్టడీస్ తో పాటు సర్వేల ప్రకారం, పెయిన్ కిల్లర్స్ కి అడిక్ట్ అయిపోయినవారు వీటిలో లభించే ఉపశమనం మోతాదు సరిపోకపోవటం చేత కొకైన్, ఆల్కహాల్ మరియు హెరాయిన్ వంటి వాటికి ఆకర్షితులవుతున్నట్లు సమాచారం. ఎందుకంటే, పెయిన్ కిల్లర్స్ ద్వారా వారికందే రిలాక్సేషన్ వారికి మరింత కావాలనిపిస్తుంది. అందువలన, వారి బాడీ అనేది మరింత ఎక్కువ డొసేజ్ ను కోరుకుంటుంది.

8. అవయవ నష్టం:

8. అవయవ నష్టం:

స్ట్రాంగ్ పెయిన్ కిల్లర్స్ ని దీర్ఘకాలం పాటు తీసుకోవడం వలన అవయవ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. పెయిన్ కిల్లర్స్ లో కొన్ని ప్రత్యేకమైన శక్తివంతమైన కెమికల్స్ ఉంటాయి. శరీరానికి వీటిని విచ్చిన్నం చేసి బయటికి పంపించడం సులభం కాదు. కాబట్టి, లివర్ మరియు గుండె వంటివి ఈ కెమికల్స్ ని బ్రేక్ డవున్ చేయడం కోసం మరింత ఎక్కువగా శ్రమపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి, తరచూ పెయిన్ కిల్లర్స్ ని బ్రేక్ డవున్ చేయడం కోసం శరీరం అనుక్షణం శ్రమిస్తూ ఉంటే లివర్ తో పాటు గుండె బలహీనపడే అవకాశం ఉంది. చివరికి అవయవనష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

9. మీ మెడికల్ హిస్టరీని తెలుసుకోండి:

9. మీ మెడికల్ హిస్టరీని తెలుసుకోండి:

మీరు కొత్త డాక్టర్ ని గాని నిపుణుడిని గాని సంప్రదిస్తున్నప్పుడు మీ మెడికల్ హిస్టరీని వారికి తెలియచేయండి. ఉదాహరణకు, ఇంతకు ముందు వ్యాధులగురించి అలాగే అలర్జీల గురించి తెలియచేయండి. వాటితో పాటు సైకలాజికల్ ఇష్యూస్ కి సంబంధించిన చరిత్రను కూడా తెలియచేయండి. ఈ విషయాలు మీ వైద్యునికి తెలియడం వలన మీకు సరైన మెడికేషన్స్ అందుతాయి.

English summary

9 Important Facts About Painkillers

Pain is a common symptom of various ailments that people experience. Many a times, painkillers are prescribed to temporarily numb the pain. Here are a few facts that you must know before taking painkillers.
Story first published: Wednesday, February 7, 2018, 14:30 [IST]