For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  పురుషాంగం యొక్క ఆరోగ్యాన్ని పెంచే 9 ఆశ్చర్యకరమైన ఆహారాలు

  |

  మానవ సృష్టిలో స్త్రీ పురుషుల లింగ నిర్ధారణలో ప్రముఖ పాత్ర జననేంద్రియాలదే అన్నది జగమెరిగిన సత్యం. ఈ జననేంద్రియాలు లింగ నిర్ధారణ కోసమే కాకుండా దేహంలో అనేక విధులను కూడా నిర్వహిస్తుంటాయి. అత్యధిక శాతం ప్రజలు వీటి గురించి మాట్లాడుటకు సైతం విముఖత చూపిస్తుంటారు. ఏ జననేంద్రియ సమస్యలు, రోగాలు వచ్చినా ఈ దాపరికాల కారణంగా ఎవరికీ చెప్పుకోలేక, ఆలస్యం చేసి సమస్య జఠిలం అయి ప్రాణాంతకం అయ్యేలా చేసుకుంటున్నారు. ఈ పద్దతి మారాల్సిన అవసరం ఎంతో ఉంది. కాళ్ళు చేతులు వలె వీటికి ఉత్మన్నమయ్యే సమస్యలకు కూడా సత్వర పరిష్కార మార్గానికై ప్రజలు సిద్దపడడం, నమ్మ దగిన వ్యక్తుల దగ్గర చర్చించడం, డాక్టరును సంప్రదించడం వంటివి చేయడం ఎంతో అవసరం.

  9 Surprising Foods That Can Boost The Health Of Your Penis

  ముఖ్యంగా జననేంద్రియాలు పునరుత్పక్తికి మాత్రమే కాకుండా శరీరంలోని విష తుల్య పదార్ధాలను విసర్జించుటలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంటాయి. కొన్ని రోగాలు , జన్యు సమస్యల మూలంగా వాటి పని తీరుపై ప్రభావం పడినప్పుడు, అనేక సమస్యలకు దారితీస్తుంది.

  కావున శరీరంలో ఏ ఇతరభాగాలకు సమస్య వచ్చినా మనం ఎలా అయితే స్పందిస్తామో , అదే విధంగా ఈ జననేంద్రియాల సమస్యకు కూడా పూనుకోవాలి. తక్షణమే డాక్టరుని సంప్రదించి సమస్యకి మూలం తెలుసుకుని తద్వారా వెంటనే చికిత్సను ప్రారంభించాల్సి ఉంటుంది.

  శరీరానికి ఎటువంటి ఆహార నియమాలు పాటించవలసి ఉంటుంది అని మనందరికీ ఒక అవగాహన ఉంటుంది, కానీ జననేంద్రియాలకు కూడా కొన్ని ఆహారాలు ప్రత్యేకమైన రక్షణని ఇస్తాయని తెలిసి ఉండకపోవచ్చు. కొన్ని ప్రధాన ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం ద్వారా ఈ పురుషంగా సమస్యలు రాకుండా చూడవచ్చు. మరియు కొన్ని వ్యాధుల నివారణకు కూడా ఇవి ప్రత్యేకంగా పని చేస్తాయి. ఈ ఆహారాల గురించిన వివరములు ఈ వ్యాసములో పొందుపరచబడ్డాయి.

  1. ఆపిల్

  1. ఆపిల్

  రోజుకొక ఆపిల్ తీసుకోవడం ద్వారా, డాక్టరుని దూరంగా ఉంచవచ్చని చిన్నప్పటి నుండి అనేక సందర్భాలలో వింటూనే ఉన్నాం. ఇది ఒకమంచి కొటేషన్, మరియు ఎంతో నిజం. ఈ ఆపిల్ లోని రోగ నిరోధక శక్తి, రక్త ప్రసరణ జననేంద్రియాలకు సజావుగా సాగడంలో మరియు ఆరోగ్యకరంగా ఉంచుటలో సహాయం చేస్తుంది. అదనంగా, యాపిల్లో కనిపించే ఫ్లేవానాయిడ్స్ కూడా పురుషాంగం చుట్టూ కణితుల పెరుగుదలను నివారించుటలో సహాయం చేస్తాయి.

  2.అవోకాడో

  2.అవోకాడో

  అవకాడోస్, ఈ భూమి పై దొరికే అనేక పండ్లలో ఉత్తమమైన లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి అనేకరకమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. కాన్సర్ నివారించుటలో , అధిక బరువు తగ్గించుటలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పండులో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉండటం వలన మీ రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా మీ పురుషాంగం ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు మరియు స్తంభన సమస్యలు లేకుండా చూసుకోవచ్చు.

  3. అరటి పండు:

  3. అరటి పండు:

  అరటి చాలా మంచి పోషకాలు కలిగిన రుచికరమైన పండు, దీనిని అత్యధికులు ఇష్టపడుతారు. ఈ పండు పొటాషియం లో సమృద్ధిగా ఉంటుంది, రతి సమయంలో అలసట లేకుండా చూచుటలో సహాయం చేస్తుంది. అంతేకాక, అరటిలో ఉన్న బ్రోమెలైన్ అనే ఎంజైమ్, శరీరంలో టెస్టోస్టెరోన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుకునే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ హార్మోన్ పురుషాంగ మరియు వృషణాల ఆరోగ్యానికి చాలా మంచిది.

  4. బీట్రూట్

  4. బీట్రూట్

  సహజంగా మీ పురుషాంగం ఆరోగ్యాన్ని మెరుగుపర్చాలని మీరు కోరుకుంటే, మీ సలాడ్లకు బీట్రూట్లు నిరంతరాయంగా చేర్చడం మంచిది. బీట్రూట్లు సహజంగా పురుషాంగంలో రక్తనాళాలను ఉద్రేకించగల సామర్ధ్యం కలిగిన నైట్రేట్లను కలిగి ఉంటాయి. రక్త నాళాలు వెలువరించినప్పుడు, అది మరింత ఆక్సిజనేట్ రక్తం యొక్క ప్రవాహాన్ని అనుమతిస్తుంది, తద్వారా లిబిడో మరియు పురుషాంగం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

  5. బ్రోకోలీ

  5. బ్రోకోలీ

  బ్రోకోలీ అనేది కూరగాయలో ఒక రకం, నిజానికి ఇది అంతగా ప్రాచుర్యాన్ని కలిగిలేదు. అయినప్పటికీ, బ్రోకోలీని రెగ్యులర్ గా తీసుకుంటే, అధిక బరువు కోల్పోవటానికి మరియు జీర్ణాశయ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి మీకు సహాయం చేస్తుంది. కానీ బ్రోకలీ లో విటమిన్ సి మంచిదిగా సహాయపడుతుంది కాబట్టి, అది మీ పురుషాంగం యొక్క ఆరోగ్యాన్ని పెంచటానికి సహాయపడుతుంది. జననేంద్రియాలకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో సహకరిస్తుంది.

  6. క్యారట్లు

  6. క్యారట్లు

  కారెట్లను సలాడ్ ద్వారా కాని , ఉడికించిన లేక వండిన కారెట్ గా కానీ తీసుకుంటూ ఉంటారు. మనకు ఇప్పటికే తెలిసినట్లుగా, మీ రోగనిరోధక శక్తిని పెంచడం మరియు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలని క్యారెట్లు కలిగి ఉంటాయి. అలాగే, క్యారెట్లు విటమిన్ A ని సమృద్ధిగా కలిగి ఉంటాయి, ఆరోగ్యకరమైన పురుషాంగం కోసం అవసరమైన టెస్టోస్టీరాన్ ఉత్పత్తిని పెంచడానికి విటమిన్ a సహాయం చేస్తుంది.

  7. జీడిపప్పు

  7. జీడిపప్పు

  మనము అనేక రాకాల డ్రై ఫ్రూట్స్ ని స్నాక్స్ గా తీసుకోవడానికి ఇష్టపడుతాము. కారణం వీటిలో అనేక ఆరోగ్యకారకాలు ఉండడమే కాకుండా రుచిగా కూడా ఉంటాయి. వీటిలో జీడిపప్పు అనేక రకాల పోషకాలను కలిగి ఉండడంతో పాటు డిప్రెషన్ చికిత్సలో కూడా వినియోగిస్తుంటారు. జీడిపప్పులో ఉండే జింక్, స్పెర్మ్ కౌంట్ పెంచుకునే సామర్ధ్యం కలిగి ఉంటుంది, తద్వారా పునరుత్పత్తికి మరియు జననేంద్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది.

  8. చెర్రీ

  8. చెర్రీ

  చెర్రీస్ బెర్రీ పండ్ల రకం, ఇవి రుచికరమైనవి మరియు గార్నిషింగ్ కోసం ఇతర తీపి వంటకాలకు జోడించబడతాయి. రోజులో భాగంగా చెర్రీస్ తీసుకోవడం మూలంగా, మీ పురుషాంగానికి రక్త ప్రసరణ పెంపునకు దోహద పడి ఆరోగ్యంగా ఉంచుటకు సహాయం చేస్తుంది. వీటిలో ఉన్న anthocyanin అనే పదార్ధం ధమనుల ఫలకాన్ని పెంచుటలో సహాయం చేస్తుంది. తద్వారా రక్త ప్రసరణ సజావుగా సాగే విధంగా రూపు దిద్దుకుంటాయి.

  9. లీన్ చికెన్

  9. లీన్ చికెన్

  మీ ఆహారంలో భాగంగా లీన్ చికెన్ చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా ఇది అధిక బరువుని తగ్గించుటలో, శక్తిని పెంచుటలో సహాయం చేస్తుంది. అంతేకాక, లీన్ చికెన్ కూడా విటమిన్ B3 ను కలిగి ఉంటుంది, ఇది ధమనులలో రక్త ప్రవాహాన్ని పెంచడం, ధమనుల ద్వారా పురుషాంగానికి రక్తప్రసరణ పెంచుటలో సహాయం చేస్తూ తద్వారా పురుషాంగం ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటుంది.

  English summary

  9 Surprising Foods That Can Boost The Health Of Your Penis

  This rule holds true even when it comes to the genital organs; certain foods can boost the health of these organs specifically and help them function better, while preventing diseases. So, here are a few surprising foods which help boost the health of a penis, which every man should know about.
  Story first published: Friday, March 23, 2018, 19:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more