మీకు తరచూ మూత్ర విసర్జన చేయాలనే భావన కనుక కలిగితే దాని వెనుక ఉన్న ఆశ్చర్యపరిచే 9 కారణాలు మీకు తెలుసా ?

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

మీరు ఒకసారి ఇలా ఊహించుకోండి. మీరు అతి ముఖ్యమైన పనిలో ఉన్నారు. ఈ పనిని మొదలు పెట్టే ముందే మీరు మూత్ర విసర్జనకు వెళ్లి వచ్చారు. కానీ, పనిని మొదలుపెట్టిన 20 నిమిషాల తర్వాత, మళ్ళీ మీకు మూత్ర విసర్జనకు వెళ్ళాలి అని అనిపిస్తూ ఉంటుంది.

ఇలాంటి సందర్భాలు ఎదురయినప్పుడు కొద్దిగా నిరాశ పరిచే విధంగానూ మరియు అసహనం కలిగించే విధంగానూ ఉంటాయి. నిజమే కదా ?

మీకు గనుక ఇటువంటి సందర్భాలే గనుక ఎదురయినట్లైతే, సాధారణం కంటే కూడా ఎక్కువగా మీరు మూత్ర విసర్జనకు వెళ్తున్నట్లయితే ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన అంశం. ఎందుకంటే ఇది ఒక ఆందోళన కలిగించే అంశం.

9 Surprising Reasons You Feel Like Urinating Frequently,

మనకందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, ఆరోగ్యంగా ఉండాలంటే, కనీసం రోజుకి 2 లీటర్ల నీటిని తాగాలి.

మీరు ఎప్పుడైతే రోజుకి 2 లీటర్ల నీటిని తాగుతారో అటువంటి సమయంలో సాధారణంగానే రోజుకి 6 నుంచి 8 సార్లు మూత్ర విసర్జన చేయవలసి ఉంటుంది. ఇది చాలా సాధారణమైన విషయం.

అయితే మీకు గనుక ఒక రోజులో 8 నుండి 10 సార్ల కంటే, ఎక్కువగా మూత్ర విసర్జన చేయాలి అని మీకు గనుక అనిపిస్తున్నట్లయితే మరియు మీరు మూత్ర విసర్జన చేస్తున్న సమయాల మధ్య చాలా తక్కువ వ్యవధి మాత్రమే ఉన్నట్లయితే, అందుకు కారణం మీలో ఎదో కొన్ని అనారోగ్య లక్షణాలు ఉన్నాయని అర్ధం.

సాధారణంగా ఈ లక్షణాలను చాలామంది పెద్దగా పట్టించుకోకుండా వ్యవహరిస్తారు. ఎందుకంటే, అది అంత ప్రమాదకరమైనది కాదని భావిస్తారు.

అయితే తరచూ మూత్ర విసర్జనకు వెళ్లడం అనే అలవాటు, మీ శరీరంలో ఎదో రోగాలు ఉన్నాయి అనే విషయాన్ని సూచిస్తుంది మరియు వెంటనే వైద్యుల సహాయం తీసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది.

ఎందుకు వ్యక్తులు తరచూ మూత్ర విసర్జనకు వెళ్ళాలి అని భావిస్తుంటారు అనే విషయమై ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

1. ద్రవరూపం ఆహారాన్ని మరీ ఎక్కువగా సేవించడం :

1. ద్రవరూపం ఆహారాన్ని మరీ ఎక్కువగా సేవించడం :

మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. ప్రతి ఒక్క వ్యక్తి రోజుకి రెండు లీటర్ల నీటిని త్రాగటం వల్ల ఆరోగ్యంగా ఉంటారని. అయితే మనం అందరం గుర్తించవలసిన అంశం ఏమిటంటే, ఏదైనా పనిని అతిగా చేస్తే అది మంచి పనైనా కావచ్చు, కానీ చెడు ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మరియు అవాంఛనీయమైన సంఘటనలు చోటుచేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు గనుక ఒక రోజుకి కాఫీ, టీ, పళ్ళ రసాలు మొదలగు ద్రవాహారంతో పాటు, నీటిని కలిపి రెండు లీటర్ల కంటే ఎక్కువ తీసుకుంటున్నట్లైతే అలాంటి సందర్భాల్లో మీరు సాధారణం కంటే కొద్దిగా ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్తుంటారు. అయితే ఇది సర్వసాధారణం అయిన విషయం మరియు సురక్షితం కూడా. కాబట్టి మీరు ఎంత ద్రవాహారం తీసుకుంటున్నారు అనే విషయమై ఒక కన్ను వేసి ఉంచాలి. ఇలా చేయడం ద్వారా రోగాల భారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.

2. మూత్రాశయం చిన్నగా ఉండటం :

2. మూత్రాశయం చిన్నగా ఉండటం :

మనకందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి విభిన్నం గానే ఉంటారు. ఎత్తు, బరువు మొదలగు వాటితోపాటు శరీరం లోపల ఉండే అవయవాలు కూడా వ్యక్తికి వ్యక్తికి మధ్య ఎంతో విభిన్నంగా ఉంటాయి. సాధారణంగా వ్యక్తుల్లో మూత్రాశయం రెండు కప్పుల ద్రవాన్ని ఒడిసిపట్టగలదు. ఎప్పుడైతే మూత్రాశయం నిండుతుందో, అటువంటి సమయంలో మూత్ర విసర్జన చేయాలి అనే కోరిక ఎక్కువ అవుతుంది. అయితే కొంతమంది వ్యక్తుల్లో మూత్రాశయం ఒకటి నుండి ఒకటిన్నర కప్పుల ద్రవాన్ని మాత్రమే నిల్వ చేయగలవు. అటువంటి సందర్భంలో, ఇటువంటి వ్యక్తులు తరచూ మూత్ర విసర్జన చేయాల్సి రావొచ్చు. ఒకసారి మీ మూత్రాశయంను స్కాన్ చేసినట్లయితే, అటువంటి సమయంలో దాని పరిమాణం మరియు సామర్థ్యం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు.

3. నిర్జలీకరణ :

3. నిర్జలీకరణ :

ఈ కారణం వల్ల తరచూ మూత్ర విసర్జన చేయాలి అనిపిస్తుంది అని చెబితే ఎవ్వరైనా ఆశ్చర్యపడతారు. అయితే మన శరీరంలో ఎప్పుడైతే నీరు తక్కువగా ఉంటుందో, అటువంటి సమయంలో మూత్రం ఎలా ఉత్పత్తి అవుతుంది అని చాలామంది సందేహిస్తుంటారు. అవునా? కానీ, ఈ నమ్మకానికి విరుద్ధంగా అధ్యయనాలు ఏమని నిరూపించాయంటే, ఏ వ్యక్తి అయితే నిర్జలీకరణ స్థితిలో ఉంటాడో, అటువంటి వ్యక్తుల యొక్క మూత్రం మరింత కేంద్రీకృతమై ఉంటుంది. ఇలా ఎప్పుడైతే మరీ ఎక్కువ కేంద్రీకృతం అయినా మూత్రం మూత్రాశయంలో ఉంటుందో అటువంటి సమయంలో మీ మూత్రాశయం కొద్దిగా ఇబ్బంది పడుతుంది. తరచూ మూత్రానికి వెళ్లాలని మీకు అనిపిస్తుంది. కానీ, వెళ్ళినప్పుడు తగినంత మూత్రం బయటకు రాదు.

4. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం :

4. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం :

మీరు గనుక సమతుల్యమైన మోతాదులో ఒక రోజుకు కావాల్సిన నీటిని తీసుకున్నట్లు భావిస్తున్నట్లైతే మరియు మీలో మధుమేహం వ్యాధి లక్షణాలు లేకపోయినట్లయితే మరియు మీరు గనుక సాధారణం కంటే కూడా ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తున్నట్లైతే, అటువంటప్పుడు మీ శరీరంలోని మూత్ర పిండాల్లో రాళ్లు ఉన్నాయనే విషయాన్ని ఈ లక్షణం సూచిస్తుంది. సాధారణంగా ఈ అనారోగ్య సమస్యతో పాటు మరెన్నో అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. మూత్ర విసర్జన చేసేటప్పుడు బాగా మండుతున్న భావన కలుగుతుంది. వెనుకనే క్రింది భాగంలో మరియు కటి ప్రాంతంలో విపరీతమైన నొప్పి వస్తుంది. ఇలా మొదలగు లక్షణాలు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి లక్షణాలు మీరు గనుక గమనించినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

5. కటి కండరాలు బలహీనంగా ఉండటం :

5. కటి కండరాలు బలహీనంగా ఉండటం :

కటి చుట్టూ ఉన్న కండరాలు లేదా కడుపు క్రింద భాగంలో ఉన్న కండరాలు బలహీనగా ఉన్నట్లయితే అటువంటి వ్యక్తులు మూత్రాశయం పై నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంది. మూత్ర విసర్జన చేసే సమయంలో కటి ప్రాంతంలో ఉండే కండరాలు మూత్రాశయం విచ్చుకొనుటకు మరియు ముడుచుకొనుటకు ఎంతగానో సహాయం చేస్తాయి. మీ యొక్క కటి ప్రాంతంలో ఉండే కండరాలు బలిష్టంగా ఉన్నట్లయితే, అటువంటప్పుడు మూత్రాశయం పై నియంత్రణ బాగా ఉంటుంది. అంటే దానర్ధం మీరు ఎక్కువసేపు మూత్ర విసర్జనకు వెళ్లకుండా మిమ్మల్ని మీరు ఆపుకోవచ్చు మరియు తరచూ మూత్ర విసర్జనకు వెళ్ళాలి అనే భావన కూడా కలగదు. కటి కండరాలకు సంబంధించిన వ్యాయామాలు చేసినట్లయితే అవి ఆ కండరాలను బలంగా చేయడంలో సహాయపడతాయి.

6. కొన్ని రకాల మందులు :

6. కొన్ని రకాల మందులు :

మీరు గనుక రక్తపోటుని లేదా చర్మ సంబంధమైన వ్యాధులను, ఒత్తిడిని మొదలగు అనారోగ్య సమస్యలకు చికిత్స కోసం మందులు తీసుకున్నట్లైతే, అటువంటి సమయంలో కూడా మీ యొక్క మూత్రాశయం తాత్కాలికంగా బలహీనపడుతుంది మరియు తరచూ మూత్ర విసర్జనకు వెళ్ళాలి అనే భావనను మీలో ఎక్కువగా కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి, ఏ పరిస్థితుల వల్ల అయినా మీరు మందులు తీసుకున్నట్లైతే, మీ యొక్క లక్షణాన్ని వైద్యుడికి సవివరంగా చెప్పండి. అటువంటి సమయంలో వారు మీకు ఇచ్చే మందులను, అందుకు సంబంధించిన మోతాదులను మారుస్తారు.

7. పొత్తికడుపులో తిత్తులు :

7. పొత్తికడుపులో తిత్తులు :

చాలా సమయాల్లో పొత్తికడుపు క్రింది భాగంలో ఎప్పుడైతే తిత్తులు ఏర్పడటం మొదలవుతుందో, అటువంటి సమయంలో తరచూ మూత్ర విసర్జనకు వెళ్ళాలి అని ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే, ఈ తిత్తులు తరచూ మూత్రాశయం పై ఒత్తిడి పెంచుతుంటాయి. కాబట్టి, ఎప్పటికప్పుడు వైద్యుని వద్దకు వెళ్లి అంతర్గత స్కానింగ్ చేయించుకోవడం చాలా ముఖ్యం. ఈ యొక్క లక్షణాన్ని మీరు గనుక చాలా కాలం నుండి అనుభవిస్తున్నట్లైతే వెంటనే వైద్యున్ని సంప్రదించండి.

8 తక్కువ రక్తపోటు ఉండటం :

8 తక్కువ రక్తపోటు ఉండటం :

మీ రక్తపోటు గనుక సాధారణం కంటే కూడా తక్కువ ఉన్నట్లయితే, వీటికి తోడు నిద్రమత్తుగా ఉండటం, తిమ్మిర్లు విపరీతంగా ఉండటం , బాగా బలహీన పడటం లాంటి లక్షణాలు కూడా ఉన్నట్లైతే అటువంటి సమయంలో తరచూ మూత్ర విసర్జనకు వెళ్ళాలి అనిపిస్తుంది. మీకు తక్కువ రక్తపోటు ఉంది అనే లక్షణాలు మీకు గనుక కనిపిస్తున్నట్లైతే, అటువంటి సమయంలో ఈ పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి సరైన ఆరోగ్య సహాయం అవసరం.

9. రుతువిరతి ( మెనోపాజ్ ) :

9. రుతువిరతి ( మెనోపాజ్ ) :

మీరు గనుక స్త్రీ అయితే, మీ వయస్సు గనుక 45 సంవత్సరాలు దాటి ఉంటే, అటువంటి సమయంలో మీరు తరచూ మూత్ర విసర్జనకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి సమయంలో అందుకు కారణం మీరు మెనోపాజ్ దశకు చేరుకోవడం. ఈ దశలో ఉన్నప్పుడు మీ శరీరంలో ఉన్న హార్మోన్లు మార్పులకు గురవుతుంటాయి. అటువంటి సమయంలో మూత్రాశయం కొద్దిగా ఇబ్బంది పడుతుంది. అందువల్ల మీరు తరచూ మూత్రవిసర్జనకు వేళ్ళ వలసి ఉంటుంది.

English summary

9 Surprising Reasons You Feel Like Urinating Frequently!

Imagine this, you are in an important meeting at work, which started right after you used the restroom, but 20 minutes into the meeting, you feel like you want to pee, again! Well, this can be quite frustrating and embarrassing as well, right? If you are someone who has been in similar situations, where you feel like passing urine, more frequently than normal, then it could definitely be the cause for concern! As we may already know, drinking at least 2 litres of water a day is a must, if you want to remain healthy.
Story first published: Tuesday, February 6, 2018, 19:00 [IST]