For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎసిడిటి సమస్యతో బాధపడే వారికి ఎలాంటి ఆల్కహాల్ సురక్షితమైనది..

By R Vishnu Vardhan Reddy
|

స్నేహితులతో కలసి ఏదైనా వేడుకలు చేసుకుంటూ ఉంటారు లేదా సహచరులతో కలిసి ఉత్సాహంగా గడుపుతూ ఉంటారు లేదా మీకు అత్యంత దగ్గరి స్నేహితుడి వివాహ వేడుకలో పాలుపంచుకుంటూ ఉంటారు. ఇలా ఎన్నో సందర్భాల్లో చాలామంది వ్యక్తులతో కలవవలసి వస్తుంది. ఇలాంటి సందర్భంలో మద్యాన్ని కూడా త్రాగాల్సి వస్తుంది.

సాధారణంగా ప్రజలు ఆనందంగా గడపడానికి మరియు బాధలను మరచిపోడానికి మద్యం ఎక్కువగా తాగుతూ ఉంటారు. కానీ, ఏ వ్యక్తులు అయితే ఆమ్లాల వల్ల కలిగే వ్యతిరేక చర్యలకు బాధపడుతూ ఉంటారో, అలాంటివారి యొక్క ఆరోగ్యపరిస్థితిని మరింత దిగజారుస్తుంది మద్యం. ఈ సమస్య ఉన్న వ్యక్తులు గనుక మద్యం త్రాగితే వారి యొక్క పరిస్థితి మరింత దిగజారుతుంది.


అజీర్ణం లేదా జీర్ణక్రియ సరిగ్గా కాకపోవడం వీటికి కారణాలు అయి ఉండవచ్చు. వీటి వల్ల కడుపులో మంట, వేడిచేయడం మొదలగునవి చోటుచేసుకునే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అధికంగా ఆమ్లాలను కలిగి ఉన్న మద్యాన్ని ఖచ్చితంగా నిషేదించవల్సి ఉంటుంది. కానీ, మీరు ఎంతోకాలంగా ఆనందంగా గడుపుతూ వేడుక జరుపుకుంటున్న సమయాన్ని మళ్ళీ భవిష్యత్తులో గడపాలంటే ఎలా ? ఇలాంటి సమయంలో ఆ ఆనందాన్ని పూర్తిగా కోల్పోవాలా ?

దీనికి కూడా ఒక పరిష్కార మార్గం అనేది ఉంది.

ఈ పరిష్కారం మిమ్మల్ని వేడుకలు చేసుకోవద్దని చెప్పదు మరియు స్నేహితులతో ఉత్సాహంగా గడపకండి అని సూచించదు. వీటికి బదులుగా ఆ పరిష్కారం ఏమిటంటే, తక్కువ మోతాదులో ఆమ్లాలు కలిగి ఉన్న మద్యాన్ని స్వీకరించడం మంచిది. మీరు గనుక ఆమ్లాల వల్ల కలిగే వ్యతిరేక చర్యలకు బాధ్యులు గనుక అయితే, అటువంటి సమయంలో ఆమ్లాలు తక్కువ మోతాదులో ఉన్న మద్యాన్ని తీసుకోవడం మంచిది.


ఇవి రెండు ఉద్దేశ్యాలను తెలియజేస్తాయి. మొదటిది, ఇప్పుడు మీరు మీలో ఉన్న విపరీతమైన ఆమ్లాల వల్ల కలిగే వ్యతిరేక చర్యల గురించి ఎక్కువగా ఆలోచించకుండా మీ యొక్క స్నేహితులతో ఆనందంగా ఉత్సాహంగా గడపవచ్చు. రెండవది, మద్యంలో పి.హెచ్ శాతం అధికంగా గనుక ఉంటే, కడుపులో ఉన్న ఆమ్లతత్వాన్ని పెరగకుండా దాన్ని అదుపులో ఉంచగలదు. ఎటువంటి మద్యాన్ని తీసుకోవడం వల్ల ఆమ్లం వల్ల కలిగే వ్యతిరేక చర్యలను అరికట్టవచ్చు అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

ప్రస్తుతం చాలా మంది ప్రజలు ఆమ్లం వల్ల కలిగే వ్యతిరేక చర్యలకు బాధితులుగా మారుతున్నారు. ఇలా జరగడానికి ప్రధాన కారణం వారు అనుసరిస్తున్న తీరికలేని జీవన విధానం.

ఇప్పుడు ఉన్న ప్రస్తుత రోజుల్లో చాలా మంది యువతీయువకులు ఉదయం పూట సరైన సమయంలో, హాయిగా కూర్చొని అల్ఫాహారాన్ని సరిగ్గా తీసుకోవడం లేదు.

ఆహారం తీసుకునే సమయాల మధ్య వ్యవధి మరీ ఎక్కువ ఉన్నట్లయితే, అటువంటి సమయంలో ఆకలి మరింత వేస్తుంది మరియు దీని ఫలితంగా ప్రజలు అనారోగ్యకరమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటుంటారు. నూనెతో కూడిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆమ్లం వల్ల కలిగే వ్యతిరేక చర్యలు ఎక్కువగా వస్తుంటాయి.

కొన్ని అధ్యయనాలు చెబుతున్న అంశాలు ఏమిటంటే, ఆమ్లాల వల్ల కలిగే వ్యతిరేక చర్యలను ప్రేరేపించడానికి మద్యం ఉపయోగపడుతుంది. అందుకు కారణం మద్యంలో ఉండే హానికర పదార్ధాలు మరియు అసిటాల్డిహైడ్, అన్నవాహిక సంకోచాలలో జోక్యంచేసుకోవడంతో ఆమ్లం వల్ల కలిగే వ్యతిరేక చర్యలు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయట.

మద్యంలో అధిక శాతంలో ఆమ్లం ఉండటమే కాకుండా, కడుపులో మంటను పెంచే ఆమ్లాల ఉత్పత్తి పెంచే విధంగా ప్రేరేపిస్తాయి. దీని వల్ల కడుపులో ఉండే పూతను ఇది ఎక్కువగా విసిగిస్తుంది. అందుచేత మరీ అధికశాతంలో ఆమ్లం కలిగిన మద్యాన్ని తీసుకోవడం పూర్తిగా నిషేధించండి మరియు తక్కువ మోతాదులో ఆమ్లాల గుణాలు కలిగిన వైన్ మరియు బీర్ ను తాగండి.


వైన్ మరియు బీర్ వల్ల ఆమ్లం వల్ల కలిగే వ్యతిరేక చర్యలు ఎలా ఉంటాయి :

కొన్ని పరిశోధనల ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే, వైన్ లో పి.హెచ్ శాతం 2.8 నుండి 3.8 వరకు ఉండగా, బీరు లో 4.1 నుండి 4.5 పి.హెచ్ శాతం ఉంటుందట. వైన్ ని సేవించడం వల్ల కడుపులో ఆమ్లం వల్ల కలిగే వ్యతిరేక చర్యలో భాగంగా సంభవించే చికాకు చాలావరకు తగ్గిందని ఎంతోమంది ప్రజలు చెప్పినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. మీలో గనుక ఆమ్లం వల్ల కలిగే వ్యతిరేక చర్యలు ఉంటే అటువంటి సమయంలో మీరు ఒక క్యాన్ బీరు తీసుకోవడం కూడా మంచి ఎంపికనే అవుతుంది.

అయితే మద్యం ప్రభావం వల్ల మీరు ఎంత వైన్ మరియు బీరు తీసుకోవాలి అనే విషయం పై కూడా నియంత్రణ ఉంచాల్సిన అవసరం ఉంది. మరీ ఎక్కువ స్వీకరించినట్లైతే, అటువంటి సమయంలో మీలో ఆమ్లం వల్ల కలిగే వ్యతిరేక చర్యల యొక్క లక్షణాలు ఎక్కువగా ప్రేరేపింపబడతాయి.

ఆమ్లం వల్ల కలిగే వ్యతిరేక చర్యలతో బాధపడుతున్న వ్యక్తులు కొన్ని నిర్దిష్టమైన నియమ నిబంధనలను పెట్టుకొని మద్యాన్ని సేవించడం ద్వారా వారు తమ జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


మీ పరిధులను మీరు తెలుసుకోండి :

మీ యొక్క ఆరోగ్యం గురించి ఆందోళన చెందకుండా మీరు ఏ వేడుక లోనైనా ఆనందంగా గడపాలని భావించినట్లైతే, మీరు కొన్ని సూచనలను పరిగణలోకి తీసుకొని మద్యాన్ని త్రాగవలసి ఉంటుంది. కడుపులో ఆమ్లం వల్ల కలిగే వ్యతిరేక చర్యలను ప్రేరేపించే వాటిల్లో అతిముఖ్యమైనది మద్యమే కాబట్టి మీరు ఎంత సేవిస్తున్నారు అనే విషయమై నియంత్రణ ఉంచాల్సిన అవసరం ఉంది. ఇందు కోసం కొన్ని సాధారణ చిట్కాలు రూపొందించడం జరిగింది. అవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అవి మీకోసం.

మీరు వెళ్లే వేడుకలో గనుక వైన్ లేదా బీరు లేకుండా ఉంటే, అటువంటి సమయంలో మీరు తీసుకొనే మద్యాన్ని ఒక్క పెగ్గు కే పరిమితం చేయండి.

ఎందుకంటే, ఒక పెగ్గు 8 నుండి 9 ఔన్స్ ల మాల్ట్ మద్యానికి , 12 ఔన్స్ ల సాధారణ బీరు కి మరియు 1.5 ఔన్స్ ల స్వేదన మద్యానికి సమానం. మీరు గనుక మద్యం సేవించే విషయంలో నియంత్రణ పెట్టుకున్నట్లైతే, మద్యం వల్ల కలిగే వ్యతిరేక చర్యల లక్షణాలు అధికం అవడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి.

పడుకొనే రెండు మూడు గంటల ముందు ఒక గ్లాస్ మద్యాన్ని సేవించే అలవాటు మీకు గనుక ఉంటే, ఆ అలవాటుని పూర్తిగా నిషేదించాల్సిన సమయం ఆసన్నమైంది. పడుకోవడానికి కొన్ని గంటల ముందు మద్యాన్ని సేవించినట్లైతే, ఆమ్లం వల్ల కలిగే వ్యతిరేక చర్యలు అధికం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలా చేసినప్పుడు అన్నవాహిక ప్రాంతంలోని కింది భాగం కొద్దిగా విశ్రాంతి తీసుకోవడం మొదలుపెడుతుంది. ఇక ఆ సమయంలో ఆమ్లం ఉత్పత్తి అవడం విపరీతంగా పెరుగుతుంది.

వైన్ మరియు బీరు ని నిర్దిష్టమైన మోతాదులో తీసుకోవడం అలవాటు చేసుకోండి. అధికమోతాదులో గనుక స్వీకరించినట్లైతే, మీ ఆరోగ్యం పై అది విపరీతమైన వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే, ఆమ్లం వల్ల కలిగే వ్యతిరేక చర్యలు ఎంత ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి మరియు ఎలా మనల్ని బాధపెడతాయి అనే విషయం మన అందరికి తెలుసు. అందుచేత ఎప్పటికప్పుడు మనం శరీరం నిర్జలీకరణకు లోనుకాకుండా ఉండటానికి, అవసరమయ్యే మేర నీటిని ప్రతి రోజూ తీసుకోవడం మరచిపోకండి. ఇలా చేయడం ద్వారా ఆమ్లం వల్ల కలిగే వ్యతిరేక చర్యలను పూర్తిగా అరికట్టవచ్చు.

English summary

What alcohol is best if you have acid reflux?

What alcohol is best if you have acid reflux?,Consuming acidic foods can trigger acid reflux in those suffering from GERD. And alcohol happens to be one such triggering substance. But if you still want to consume alcohol, then it’s best to stick to beer and wine, as their pH is higher than other types of alcohol.