For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజూ గోంగూర తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా, రోగాలన్నీ మాయం, గోంగూరతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు

గోంగూరను రోజూ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా, రోగాలన్నీ మాయం, గోంగూరతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు

|

తెలుగువారిలో చాలా మందికి గోంగూర అంటే చాలా ఇష్టం. కొందరికి గోంగూర లేకుంటే ముద్దు కూడా దిగదు. గోంగూరను రోజూ తింటే చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు. గోంగూరలో చాలా మూలిక గుణాలున్నాయి.

Amazing Health Benefits of Gongura in Telugu

గోంగూరతో మంచి రుచికరమైన కర్రీస్, పచ్చళ్లు చేసుకుని తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. గోంగూరను ఆయుర్వేదంలో కూడా బాగానే ఉపయోగిస్తారు.

వ్రణాలు లేదా ఏదైనా గడ్డలపై..

వ్రణాలు లేదా ఏదైనా గడ్డలపై..

మీకు వ్రణాలుంటే వాటిని గోంగూర ద్వారా ఈజీగా తగ్గించుకోవొచ్చు. వ్రణాలు లేదా ఏదైనా గడ్డలపై ఆముదంలో గోంగూర ఆకుల్ని ముంచి అక్కడ పెట్టుకుంటే చాలు. ఆ గడ్డలు ఈజీగా తగ్గిపోతాయి. కొందరికి ఎన్ని రోజులైనా గడ్డలు అలాగే ఉండి ఇబ్బందికలిగిస్తాయి. అలాంటి వారు ఇలా చేస్తే వెంటనే అవి పగిలిపోతాయి.

రేచీకటికితో ఇబ్బందులు

రేచీకటికితో ఇబ్బందులు

కొందరు రేచీకటికితో ఇబ్బందిపడుతుంటారు. అలాంటి వారు తరచూ గోంగూర కర్రీ తినాలి. లేదంటే గోంగూర పచ్చడిని అయినా రోజూ తింటూ ఉండాలి.

గోంగూర పూలతో..

గోంగూర పూలతో..

అలాగే గోంగూర పూలతో కూడా దీన్ని నివారించొచ్చు. ముందుగా గోంగూర పూలను బాగా దంచుకోవాలి. తర్వాత రసాన్ని తీసుకోవాలి. ఆ రసాన్ని కాస్త వడగట్టుకోవాలి. దాన్ని పాలలో కలిపి తీసుకుంటే మీ సమస్య త్వరగా పరిష్కారం అవుతుంది.

బోదకాలు సమస్య తగ్గేందుకు

బోదకాలు సమస్య తగ్గేందుకు

అలాగే బోదకాలు సమస్య తగ్గేందుకు కూడా గోంగూర బాగా ఉపయోగపడుతుంది. కొన్ని గోంగూర ఆకులను, వేప ఆకులను మిక్స్ చేసుకోండి. ఆ మిశ్రమాన్ని బోదకాలుపై పూసుకోండి.

విరోచనాలకు గురయ్యే వారు

విరోచనాలకు గురయ్యే వారు

ఇక తరుచుగా విరోచనాలకు గురయ్యే వారు కూడా గోంగూరతో మంచి ఫలితాన్ని పొందొచ్చు. గోంగూర నుంచి జిగురు తీసి దాన్ని నీటిలో కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

దగ్గు, ఆయాసం

దగ్గు, ఆయాసం

ఇక కొందరు దగ్గు, ఆయాసంతో నిత్యం ఇబ్బందులుపడుతుంటారు. అలాంటి వారు కూడా గోంగూరను రోజూ తింటూ వాటి నుంచి బయటపడొచ్చు.

బాడీలోకి ఎక్కువగా నీరు చేరి

బాడీలోకి ఎక్కువగా నీరు చేరి

కొందరు బాడీలోకి ఎక్కువగా నీరు చేరి ఉంటుంది. అలాంటి వారు గోంగూరను పథ్యంగా తీసుకుంటే మంచిది. దీంతో ఒంటిలో ఉండే నీరంతా కూడా క్రమంగా తగ్గిపోతుంది.

FVV

FVV

షుగర్ తో ఇబ్బందిపడేవారు రెగ్యులర్ గా గోంగూరతో తయారు చేసిన ఆహారపదార్థాలు తింటే చాలా మంచిది. దీంతో షుగర్ ను నియంత్రించొచ్చు.

చాలా రకాల విటమిన్స్

చాలా రకాల విటమిన్స్

గోంగూరలో చాలా రకాల విటమిన్స్ ఉంటాయి. దీంతో కంటి సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి. అలాగే దంత సమస్యలు ఉంటే అవి కూడా ఈజీగా తగ్గిపోతాయి. గోంకూరలో క్యాల్షియం కూడా బాగా ఉంటుంది. ఎముకలు బలంగా మారేందుకు గోంగూర బాగా ఉపయోగపడుతుంది.

 గోంగూరను రోజూ తింటూ ఉండాలి

గోంగూరను రోజూ తింటూ ఉండాలి

ఇక హార్ట్, కిడ్నీ వ్యాధులతో పాటు క్యాన్సర్ కూడా ఈజీగా నయం కావాలంటే గోంగూరను రోజూ తింటూ ఉండాలి. ఇలా ఎన్నో ఔషధ గుణాలున్న గోంగూరను కనీసం వారంలో ఒక్కసారైనా తింటే మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు.

English summary

Amazing Health Benefits of Gongura in Telugu

Here is the Amazing Health Benefits of Gongura in telugu. Read to know more...
Desktop Bottom Promotion