For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బీట్రూట్ తింటే చిన్నప్పటి విషయాలు కూడా గుర్తొస్తాయి

అల్జీమర్స్ కు కూడా చెక్ పెట్టవచ్చంటున్నారు పరిశోధకులు. దీంట్లో ప్రధానమైనది బీట్‌రూట్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బీట్‌రూట్‌లో సాధారణ పోషకాలతో పాటు, అనేక ఔషధ గుణాలున్నాయి. మతిమరుపు, బీట్రూట్.

|

వయస్సుతో పాటు నేనున్నానంటు వచ్చేస్తుందది. పెట్టింది ఒకచోట వెతికేది మరోచోట. అబ్బా! అన్నీ అందించలేక ఛస్తున్నాం అంటు విసుగులు..ఎన్నిసార్లు చెప్పాలి సమయానికి మందులు వేసుకోమని అంటు విరుపులు..ఏంటండీ! నన్ను గుర్తు పట్టలేదా?

అల్జీమర్ కు చెక్ పెట్టేదెలా

అల్జీమర్ కు చెక్ పెట్టేదెలా

నేనూ..ఫలానా అంటు కొత్తగా పరిచయం చేసుకునే పాత పరిచయస్తులు, బంధువుల, స్నేహితులు. ఇలా ప్రతీదీ వయసుతో పాటు సహజంగా వచ్చే మతిమరుపుకు కుంటుంబ సభ్యులు, బంధువులు విసుగుతో కూడిన మాటలు, మంచిగా వుండే కుటుంబంలో అయితే ప్రేమతో కూడిన మందలింపులు..సర్వసాధారణంగా వినిపిస్తుండే మాటలు.

వయస్సు పైబడిన వారికి సర్వసాధారణంగా వచ్చే అల్జీమర్ కు చెక్ పెట్టేదెలా?

బీట్ రూట్ తో చెక్ పెట్టేద్దాం

బీట్ రూట్ తో చెక్ పెట్టేద్దాం

మనుమలకు తన చిన్ననాటి ముచ్చట్లు, కథలు, అనుభవాలు, అనుభూతులు చెప్పుకునేదెలా? వయస్సుతో పాటు అన్నీ మరచిపోవాలా? అంటే కాదనేంత సహజమైన చక్కని చిట్కా ఒకటి చెప్పేసుకుందాం..అమ్మమ్మలు, తాతయ్యల అనుభవాలను, అనుభూతుల సంగమంతో కూడిన సందేశాలను, సందర్బాలను, జాగ్రత్తలను విందాం తెలుసుకుందాం..మరి ఈ అల్జీమర్స్ కు చెక్ పెట్టే సాధనమేంటో తెలుసా? ఎర్రగా..కంటికింపుగా..భిన్నమైన బీట్ రూట్ తో పెట్టేద్దాం చెక్..

బీట్‌రూట్‌ స్పెషల్

బీట్‌రూట్‌ స్పెషల్

వయసు పైబడటం అనేది సాధారణమే. వయసుతో పాటు మతిమరుపు రావడం కూడా సాధారణమే. సమస్యలు వచ్చిపడే వేగాన్ని తగ్గించే అవకాశాలు కూడా లేకపోలేదు. కొన్ని సమస్యలు కేవలం మందులకు మాత్రమే తగ్గవు. కానీ ప్రకృతి సహజంగా లభించే కొన్ని పదార్ధాలలో కొన్నింటికి చెక్ పెట్టవచ్చు. ప్రకృతి మనిషికి ఇచ్చిన ఎన్నో అమూల్యమైన పదార్ధాలతో ఆరోగ్యాన్ని పెంపొదించుకోవచ్చు.

ఔషధ గుణాలు ఉన్నాయి

ఔషధ గుణాలు ఉన్నాయి

అలాగే వయస్సుతో పాటు వచ్చే అల్జీమర్స్ కు కూడా చెక్ పెట్టవచ్చంటున్నారు పరిశోధకులు. దీంట్లో ప్రధానమైనది బీట్‌రూట్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బీట్‌రూట్‌లో సాధారణ పోషకాలతో పాటు, అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా, వ్యర్థపదార్థాలను శరీరంలోంచి తొలగించడంతో పాటు, గుండె ఆరోగ్యాన్ని పెంచడంలోనూ ఇది బాగా ఉపయోగపడుతుంది.

మతిమరుపుకు చెక్ పెట్టే బీట్ రూట్

మతిమరుపుకు చెక్ పెట్టే బీట్ రూట్

వీటన్నింటికీ మించి మరో విశేష ప్రయోజనం కూడా బీట్‌రూట్‌ వల్ల కలుగుతుందని అమెరికాలోని సౌత్‌ ఫ్లోరిడా యూరివర్సిటీకి చెందిన పరిశోదకులు అధ్యయనంలో కనుగొన్నారు. బీట్‌రూట్‌ వినియోగం వల్ల మతిమరుపు కలిగించే అల్జీమర్‌ వ్యాధి పెరిగే వేగం బాగా తగ్గిపోవడమే ఆ విశేషం.

బెటానిన్‌ అనే మూలకం

బెటానిన్‌ అనే మూలకం

అల్జీమర్‌ వ్యాధిని కలిగించే ఒక ప్రత్యేకమైన ప్రొటీన్‌ చర్యలను బీట్‌రూట్‌ నియంత్రిస్తుందని వీరు కనుగొన్నారు. అలాగే అల్జీమర్‌ వ్యాధి పెరిగేలా చేసే మెదడులోని కొన్ని రసాయన చర్యలను బీట్‌రూట్‌లోని బెటానిన్‌ అనే మూలకం కట్టడి చేస్తుందని పరిశోధకుల్లో ఒకరైన లి-జూన్‌ మింగ్‌ స్పష్టం చేశారు.

ఇంకా చాలా ప్రయోజనాలు

ఇంకా చాలా ప్రయోజనాలు

బీట్రూట్ తో ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. బీట్‌రూట్‌ను తినొచ్చు, జ్యూస్‌గా తాగొచ్చు, కూరగా వండుకోవచ్చు. బీట్రూట్ చర్మ సౌందర్యానికి కూడా ఇది పని చేస్తుంది.గుప్పెడు ఓట్స్ ను, బీట్‌రూట్‌ ముక్కల్నీ తీసుకుని మెత్తని పేస్టులా చేసుకోవాలి. దానికి చెంచా తేనె, కాస్త నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని మునివేళ్లతో మృదువుగా మర్దన చేయాలి. తరువాత చన్నీళ్లతో కడిగేసుకోవాలి. రెండు నిమిషాలాగి నీళ్లను మరిగించి, ముఖానికి ఆవిరిపడితే చర్మం కాంతులీనుతుంది.

మెత్తని పేస్ట్‌లా చేసుకుని

మెత్తని పేస్ట్‌లా చేసుకుని

బీట్‌రూట్‌ ముక్కని మెత్తని పేస్ట్‌లా చేసుకుని దానికి చెంచా నిమ్మరసం, కోడిగుడ్డులోని తెల్లసొన కలిపి బాగా గిలక్కొట్టాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికీ మెడకీ, చేతులకూ రాసుకోవాలి. ఆరాక గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే చర్మం బిగుతుగా మారి ముడతల సమస్య దూరమవుతుంది. బీట్‌రూట్‌ రసానికి కొంచెం తేనె కలిపి, పెదాలకు రాసుకుని పది నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇలా రోజూ రాత్రి పడుకునే ముందు రాస్తే పెదాలు మృదువుగా మారతాయి.

కొంచెం పెరుగూ, బాదం నూనె

కొంచెం పెరుగూ, బాదం నూనె

బీట్‌ రూట్‌ రసంలో కొంచెం పెరుగూ, బాదం నూనె, చెంచా ఉసిరి పొడి కలిపి పేస్ట్‌లా చేసుకుని, దాన్ని తలకు రాసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఎదుగుదుతుంది. అది కండిషనర్‌గానూ ఉపయోగపడుతుంది.జుట్టు తెల్లబడిందనో, చక్కని రంగులో కనిపించాలనో భావించే వారు రసాయనాలు కలిపిన రంగుల్ని వాడే బదులు బీట్‌రూట్‌ రసాన్ని వారానికోసారి తలకు పట్టించి, అరగంట ఆగి తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టు చక్కని రంగులో కనబడుతుంది.

English summary

beetroot beats route to alzheimers

beetroot beats route to alzheimers
Story first published:Wednesday, May 9, 2018, 14:21 [IST]
Desktop Bottom Promotion