For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజూ నాలుగు పచ్చి కరివేపాకు ఆకులు తింటే చాలు, కరివేపాకుతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు

ఎక్కువ ఫ్యాట్ తో ఇబ్బందిపడేవారు రోజూ కరివేపాకు తింటూ ఉండండి. రోజూ కొన్ని పచ్చి కరివేపాకు ఆకులను తిన్నా కూడా చాలా మంచిది. బాడీలొని చెడ్డ కొలస్ట్రాల్ ను కూడా కరివేపాకు ఈజీగా తగ్గించగలదు.

|

కరివేపాకును ఈజీగా తీసిపారేయకండి. కరివేపాకుతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కరివేపాకు రోజూ తింటే చాలా హెల్తీగా ఉండొచ్చు. సాధారణంగా వంటకాలకు కాస్త మంచి వాసన రావాలని మనం కరివేపాకు ఉపయోగిస్తుంటాం.

కొందరు తినేటప్పుడు కరివేపాకు పక్కకు పడేస్తుంటారు. అలా చేయకండి. కరివేపాకులో చాలా ఔషధ గుణాలున్నాయి. అలాగే పచ్చి కరివేపాకు ఆకులను తిన్నా కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

షుగర్

షుగర్

కొందరు షుగర్ తో ఇబ్బందిపడుతుంటారు. అలాంటి వారు రోజూ కరివేపాకు తింటే మంచిది. బ్లడ్ లోని షుగర్ లెవెల్స్ ను తగ్గించే శక్తి కరివేపాకుకు ఉంటుంది. రోజూ కరివేపాకు తీసుకునే వారికి షుగర్ అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

బరువు తగ్గాలంటే

బరువు తగ్గాలంటే

ఎక్కువ ఫ్యాట్ తో ఇబ్బందిపడేవారు రోజూ కరివేపాకు తింటూ ఉండండి. రోజూ కొన్ని పచ్చి కరివేపాకు ఆకులను తిన్నా కూడా చాలా మంచిది. బాడీలొని చెడ్డ కొలస్ట్రాల్ ను కూడా కరివేపాకు ఈజీగా తగ్గించగలదు.

విటమిన్ ఏ

విటమిన్ ఏ

బాడీకి విటమిన్ ఏ చాలా అవసరం. కరివేపాకులో ఇది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రోజూ మీరు దీన్ని తీసుకుంటూ ఉండండి. విటమిన్ ఏ ఎక్కువగా బాడీకి అందితే కంటిచూపు బాగా ఉంటుంది.

వెంట్రుకలు రాలడం ఉండదు

వెంట్రుకలు రాలడం ఉండదు

చాలా మంది వెంట్రుకలు రాలే సమస్యతో ఇబ్బందిపడుతుంటారు. అలాంటి వారు రోజూ కరివేపాకు తీసుకుంటే డాండ్రఫ్ తో పాటు జుట్టు రాలిపోవడంలాంటి సమస్యలను అధిగమించొచ్చు. అలాగే జుట్టు త్వరగా తెల్లగా అవ్వదు. జుట్టు బాగా పెరుగుతుంది. నిగనిలలాడుతుంది.

Most Read :గర్భం దాల్చిన తర్వాత అండాశయ సిస్టులు ఏర్పడితే ఎలా, బిడ్డకు ప్రమాదమా? ఏం చెయ్యాలిMost Read :గర్భం దాల్చిన తర్వాత అండాశయ సిస్టులు ఏర్పడితే ఎలా, బిడ్డకు ప్రమాదమా? ఏం చెయ్యాలి

మూత్ర సమస్యలుండవు

మూత్ర సమస్యలుండవు

కరివేపాకును రోజూ తింటే మీకు ఎలాంటి మూత్ర సమస్యలు కూడా ఉండవు. మూత్రంలో మంట, మూత్రం సరిగ్గా రాకపోవడంలాంటి సమస్యలు ఏమీ కూడా ఉండవు. కిడ్నీల్లో కొందరికి రాళ్లు ఏర్పడుతుంటాయి. అలాంటి వాటిని కరివేపాకు ఈజీగా కరిగించగలదు.

ముడతలు పోతాయి

ముడతలు పోతాయి

కరివేపాకులో ఉండే ఆయుర్వేద గుణాల వల్ల చర్మంపై ఉండే ముడతలు కూడా ఈజీగా పోతాయి. మచ్చలు తొలగిపోతాయి. చర్మం నీట్ గా ఉండేలా చేస్తుంది.

చాలా విటమిన్స్

చాలా విటమిన్స్

కరివేపాకులో చాలా రకాలైన విటమిన్స్ ఉంటాయి. ఇందులో కెరోటిన్ బాగా ఉంటుంది. ఎన్నో పౌష్టిక విలువలు కరివేపాకులో ఉంటాయి.

ఆకలిని పెంచుతుంది

ఆకలిని పెంచుతుంది

కరివేపాకు ఆకలిని బాగా పెంచగలదు. అజీర్తి సమస్య ఉంటే కూడా ఈజీగా తగ్గిపోతుంది. ఆకలిగా లేని వారు కరివేపాకును రోజూ తింటూ ఉండాలి.

Most Read :తలనొప్పి వస్తే ఇలా చేసి చూడండి, చిటికెలో మాయం, తలనొప్పి నివారణకు చిట్కాలుMost Read :తలనొప్పి వస్తే ఇలా చేసి చూడండి, చిటికెలో మాయం, తలనొప్పి నివారణకు చిట్కాలు

వాంతులుకాకుండా

వాంతులుకాకుండా

వాంతులు కాకుండా చేసే గుణం కరివేపాకు ఉంటుంది. కడుపులో కాస్త తిప్పుతున్నట్లు అనిపిస్తే కరివేపాకు రసంలో కాస్త నిమ్మకాయ రసం, చక్కెర కలుపుకుని తాగండి.

విరేచనాలు

విరేచనాలు

విరేచనాలతో బాధపడేవారు కరివేపాకును బాగా ఎండబెట్టి దాన్ని పొడిగా చేసుకుని కాస్త తేనె కలుపుకుని తాగండి. ఇలా చేస్తే విరేచనాలు ఈజీగా తగ్గిపోతాయి. రోజూ నాలుగు పచ్చి కరివేపాకు ఆకులను తిని చూడండి. మీకున్న అనారోగ్యాలన్నీ మటుమాయం అవుతాయి. అసలు అనారోగ్యాల బారిన కూడా పడరు.

English summary

benefits of eating raw curry leaves daily

benefits of eating raw curry leaves daily
Desktop Bottom Promotion