For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషులలో డిప్రెషన్ ఉందనడానికి గల సంకేతాలు ఇవే!

|

పురుషులు ఎంత బలిష్టంగా కనిపిస్తూ ఉన్నా, వారి భావోద్వేగాలపై నియంత్రణ కలిగి ఉన్నవారు మాత్రం తక్కువ సంఖ్యలోనే ఉంటారు అన్నది వాస్తవం. మానసిక దృఢత్వం ఉన్నవారు కూడా, ఒక్కసారి డిప్రెషన్ బారినపడితే ఇక అంతేసంగతులు. అనగా ఒకరకమైన నిస్తేజానికి, గందరగోళానికి గురవుతూ నిస్సారమైన జీవితాన్ని అనుభవిస్తున్నాము అన్న భావనలో ఉంటారు. మరియు ఇతరులకు, తాము డిప్రెషన్లో ఉన్నట్లు తెలీయనీకుండా జాగ్రత్త పడుతుంటారు. ఈ ఆర్టికల్లో, పురుషులలో డిప్రెషన్ యొక్క కారణాలు, లక్షణాలు మరియు చికిత్స గురించిన వివరాలను అందించడం జరుగుతుంది.

డిప్రెషన్ పురుషులను మరియు స్త్రీలను భిన్నంగా ప్రభావితం చేస్తుంది. మానసిక రుగ్మతల దృష్ట్యా స్త్రీల కన్నా పురుషుల నిష్పత్తి రెట్టింపుగా ఉందని తేలింది కూడా. WHO(ప్రపంచ ఆరోగ్య సంస్థ) ప్రకారం, సుమారు 322 మిలియన్ మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా డిప్రెషన్ బారినపడి జీవిస్తున్నారు. వారిలో అధికంగా 56 మిలియన్ల మంది భారతదేశంలోనే ఉన్నారని నివేదిక.

World Mental Health Day: Depression in Men: Causes, Symptoms, and Treatment

భారతదేశ జాతీయ మానసిక ఆరోగ్య సర్వే ప్రకారం 30-49 వయసు మధ్యగల పురుషులు అనేకరకాల మానసిక వ్యాధుల బారినపడి, ఎక్కువగా ప్రభావితమవుతున్నారని తేల్చింది. మహిళల(7.5శాతం) కన్నా, పురుషుల(13.9శాతం) మానసిక రోగాల ప్రాబల్యం అధికంగా ఉందని చెప్పడం జరిగింది.

పురుషులలో డిప్రెషన్ అంటే ఏమిటి?

పురుషులలో డిప్రెషన్ సమస్యలు అనేకం చికిత్సలకు లోబడి ఉంటాయి. డిప్రెషన్ అనేది, భావోద్వేగ లేదా శారీరిక బలహీనతల సంకేతం కాదు. పురుషులలోని డిప్రెషన్, ఆలోచనా విధానాలను ప్రభావితం చేసి, మీ రోజువారీ జీవితంలో అస్తవ్యస్త పోకడలను సృష్టించగలదు. క్రమంగా మీ పనులు, సంబంధాలలో కూడా జోక్యం చేసుకుని, సమస్యలను తీసుకుని రాగలదు.

పురుషులు తరచుగా డిప్రెషన్ బారినపడుతూ ఉంటారు. ఎందుకంటే పురుషులలో అనేకమంది, తమ భావాలను వ్యక్తంచేయడంలో సమస్యలను కలిగి ఉంటారు. బదులుగా, తలనొప్పి, వెన్నునొప్పి, నిద్రలేమి మరియు లైంగిక సమస్యల గురించి తీవ్రంగా ఆలోచిస్తూ, క్రమంగా మానసిక సమస్యలకు లోనవుతుంటారు. కేవలం అందుచేతనే, పురుషులలో డిప్రెషన్ అంత సాధారణంగా గుర్తించబడదు.

దురదృష్టవశాత్తు, డిప్రెషన్ కారణంగా జరుగుతున్న ఆత్మహత్యల సంఖ్యలో కూడా పురుషులు, స్త్రీలకన్నా అధికంగా ఉన్నారు. ఆత్మహత్య సంబంధిత ఆలోచనలు వారి మనసులోకి రావడానికి ముందే, వారు ఇతరుల నుండి కొంత సహాయాన్ని కూడా కోరుకుంటారు. ఇటువంటి సందర్భాలలో సరైన తోడ్పాటు ఉంటే, పరిస్థితి చక్కదిద్దబడుతుంది.

1. అంగస్తంభన సమస్యలు :

1. అంగస్తంభన సమస్యలు :

అనేకమంది తరచుగా ఎదుర్కొంటున్న సమస్యలలో ఇది కూడా ఒకటి. మారుతున్న ప్రపంచీకరణ విధానాలు, కాలుష్య కోరల నడుమ సరైన ప్రణాళికలు లేని జీవనశైలి, వ్యసనాలు, ప్రమాదాలు, రోగాలు, చెడు జ్ఞాపకాలు మొదలైన ప్రభావిత అంశాల కారణంగా ఈ సమస్యను ఎదుర్కొనేవారి సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. క్రమంగా కోరికలు మందగించడం, లైంగిక అసమర్థత నెలకొనడం , పర్యవసానంగా డిప్రెషన్ కలగడం జరుగుతుంది.

2. అలసట :

2. అలసట :

అలబామా విశ్వవిద్యాలయం, క్లినికల్ మనస్తత్వ శాస్త్రవేత్తల ప్రకారం, పురుషులు, మహిళలకన్నా అధికంగా అలసట మరియు ఇతర భౌతిక సమస్యలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

3. నిద్రలేమి :

3. నిద్రలేమి :

కొన్ని అభూతకల్పనలు, మూడనమ్మకాలు, వ్యసనాలు, చేదుజ్ఞాపకాలు మొదలైన వాటి కారణంగా తలెత్తే ఇన్సోమ్నియా(నిద్రలేమి) కూడా డిప్రెషన్ కారకాల్లో ఒకటిగా ఉంది.

4. కడుపునొప్పి లేదా వెన్నునొప్పి :

4. కడుపునొప్పి లేదా వెన్నునొప్పి :

వినడానికి వింతగా ఉన్నా, ఇది కూడా ఒక కారకం. అనేక సందర్భాలలో మనం తరచుగా వార్తల్లో కూడా చూస్తుంటాము. కడుపునొప్పి తాళలేక, వ్యక్తి ఆత్మహత్య అంటూ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, నిర్వహించిన అద్యయనం ప్రకారం, పురుషులు, దీర్ఘకాలిక నొప్పులు, జీర్ణసంబంధిత లోపాలు డిప్రెషన్ కారకాలుగా ఉంటాయని గుర్తించలేరు.

5. చిరాకు :

5. చిరాకు :

దుఃఖాన్ని కనబరచడానికి బదులుగా, పురుషులు చికాకుపరమైన సంకేతాలను చూపిస్తుంటారు. దీనికి కారణం వీరు నిరంతరం నెగెటివ్ ఆలోచనలు కలిగి ఉంటారు. నెగెటివ్ ఆలోచనల్లో కూడా 2రకాలు ఉంటాయి., ఎక్కువగా వాస్తవాన్ని ఆలోచించడం, రెండవది, వాస్తవాన్ని కూడా తమకు వ్యతిరేకంగా ఆలోచించడం.

6. ఏకాగ్రతను కోల్పోవడం :

6. ఏకాగ్రతను కోల్పోవడం :

సైకోమోటార్ రిటార్డేషన్ ఒక వ్యక్తికి సమాచారాన్ని ప్రాసెస్ చేయగల సామర్ధ్యాన్ని తగ్గిస్తుంది, ఈబలహీనత క్రమంగా దృష్టి మరియు ఏకాగ్రత మీద ప్రభావాన్ని చూపిస్తుంది

7. కోపం :

7. కోపం :

కొందరు పురుషులు కోపం లేదా ఉద్రేకంగా ఉండటం ద్వారా, డిప్రెషన్ సూచిస్తుంటారు.

8. ఆందోళన :

8. ఆందోళన :

మహిళలతో పోల్చినప్పుడు పురుషులలో అధికంగా స్ట్రెస్(ఆందోళన) బారినపడే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

ఆత్మహత్య ప్రేరేపిత ఆలోచనలు, పరిస్థితుల నుండి తప్పించుకునే ప్రవర్తన, వ్యసనాలు, హింసాత్మక లేదా హానికర ప్రవర్తన మొదలైనవి కూడా డిప్రెషన్ తాలూకు సంకేతాలుగా ఉంటాయని చెప్పబడింది.

మీరు డిప్రెషన్ బారినపడి ఉన్నారని తెలుసుకోవడం ఎలా?

మీరు డిప్రెషన్ బారినపడి ఉన్నారని తెలుసుకోవడం ఎలా?

1. నిరాశ మరియు నిస్సహాయతతో కూడిన అనుభూతి.

2. కార్యకలాపాలలో ఆసక్తిని కోల్పోవటం, స్నేహితులను దూరం ఉంచడం.

3. సాధారణ జీవితంతో పోల్చినప్పుడు, మరింత ఎక్కువ చికాకు మరియు అల్పస్వభావం.

4. వ్యసనాలపట్ల అధికంగా ప్రేరేపించబడడం.

5. ప్రతికూల ఆలోచనలను నియంత్రించలేకపోవడం, మరియు అలసట.

6. ఆకలి మార్పులు, నిద్రలేమి.

పురుషుల్లో డిప్రెషన్ సమస్యకు చికిత్స ఎలా?

పురుషుల్లో డిప్రెషన్ సమస్యకు చికిత్స ఎలా?

1. జీవనశైలిలో మార్పులు :

వ్యాయామాలు, ఆహార ప్రణాళికలలో అసాధారణ మార్పులు చోటుచేసుకోవడం. స్తబ్ధత నెలకొనడం వంటి సమస్యలు డిప్రెషన్ కారకాలుగా ఉంటాయి. కావున, ఆరోగ్యకర మార్పుల ప్రకారం దృష్టిసారించండి. మరియు నిద్రకు సరైన సమయం కేటాయిస్తున్నారని నిర్ధారించుకోండి.

2. మందులు :

2. మందులు :

మానసిక వైద్యుని సంప్రదించి, సూచించిన మందులను, సూచనలను క్రమంతప్పకుండా అనుసరించడం కూడా సమస్య నివారణలో సహాయపడుతుంది. సాధారణంగా, సెరటోనిన్ నోరేపినెఫ్రైన్ రిప్టేక్ ఇన్హిబిటర్ (ఎస్ఎన్ఆర్ఐ) మరియు సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్ (ఎస్ఎస్ఆర్ఐ) మందులు డిప్రెషన్ చికిత్సలో ప్రభావవంతంగా ఉంటాయి. ఈ మందులను తీసుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.

3. మానసిక చికిత్స :

3. మానసిక చికిత్స :

దీనిని టాక్ థెరపీ అని కూడా పిలుస్తారు మరియు మానసిక ఆరోగ్య నిపుణుల మీ స్పందనలు మరియు కొన్ని ట్రిగ్గర్స్(ప్రభావిత కారకాల) ఆధారితంగా మీకు సూచనలను అందివ్వడం ద్వారా, డిప్రెషన్ సమస్యకు చికిత్సను అందివ్వడం జరుగుతుంది. డిప్రెషన్ సమస్యకు చికిత్స చేయడంలో వివిధరకాల మానసిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, ఇంటర్పర్సనల్ టాక్ థెరపీ, మరియు ప్రాబ్లెం-సాల్వింగ్ థెరపీ మొదలైనవి.

డిప్రెషన్తో ఉన్న మనిషికి సహాయం చేయడం ఎలా?

డిప్రెషన్తో ఉన్న మనిషికి సహాయం చేయడం ఎలా?

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ప్రకారం, ఇక్కడ మీరు అనుసరించదగిన విధానాలను ఇవ్వడం జరిగింది.

1. వారితో తరచుగా సంభాషణలలో పాల్గొనండి, అతను చెప్పేది జాగ్రత్తగా వినండి.

2. ఆత్మహత్య మరియు జీవితం మీద ఆశను కోల్పోవడం గురించి చేస్తున్న సూచనలను విస్మరించవద్దు.

3. అతన్ని తరచుగా ఎక్కడికైనా తీసుకుని వెళ్తూ, ఏదేని ఇతరత్రా కార్యకలాపాలలో నిమగ్నుడిని చేయండి.

4. అతను ఉపయోగించే మందులు మరియు వ్యసనాలను ఒక కంట కనిపెట్టుకుని ఉండండి.

English summary

Depression in Men: Causes, Symptoms, and Treatment

Depression in men can be treated and contrary to the misconception, it's not a sign of emotional weakness or failing masculinity. Male depression changes how you think, feel and function in your daily life as it interferes with work productivity and impacts your relationship. The signs and symptoms include erectile dysfunction, fatigue, sleep problems and back pain.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more