For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

న్యూ ఇయర్ పార్టీ తరువాత మీ శరీరాన్ని డీటాక్స్ చేయాలనుకుంటున్నారా?

Consuming too much of unhealthy foods and alcohol, especially during the New Year season, can lead to the accumulation of fats and toxins in the body. This natural drink made of tender coconut water,

By Gandiva Prasad Naraparaju
|

మనం ఇప్పటికీ కొత్తసంవత్సరంలోకి అడుగుపెట్టాము, చాలామంది ఈ కొత్తసంవత్సరాన్ని ఒక ఉత్సాహంతో స్వాగతం పలికారు, అవునా?

మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో వివిధరకాల పార్టీలకు హాజరవ్వడం; రాత్రంతా సంగీతం, నృత్యం, ఆహరం, మందు మొదలైన వాటితో ఆనందిస్తూ చాలామంది కొత్త సంవత్సర వేడుకలలో ముందు వెళ్తారు.

లింగ, వయసు, మత నమ్మకాలతో సంబంధం లేకుండా నేటి ప్రపంచంలో, ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరాన్ని చాలా ఘనంగా జరుపుకోవాలి అనుకుంటారు, ఇదే సంవత్సరంలో అతిపెద్ద పార్టీలలో ఒకటి!

అంతేకాకుండా, క్రిస్మస్ పార్టీలు, కుటుంబ సభ్యులు కలవడం, సంవత్సర చివర పార్టీలు మొదలైనవాటితో అంటే దాదాపు వారం మొత్తం కొత్తసంవత్సర వేడుకలతో నిండి ఉంటుంది, చాలామంది ఈ సందర్భంలో ఎక్కువ అనారోగ్య పదార్ధాలు, మందు తీసుకోవడంలో మునిగిపోతారు!

అయినప్పటికీ, వేరే సందర్భాలలో, మనం ఏమి తింటున్నాము, ఏమి తగుతున్నాము అనేది గమనించుకోవాలి, ఈ సంవత్సర వేడుకల సమయంలో ప్రతిచోటా ఉత్సవాలు జరుగుతుంటాయి, అందులో మేము ఉత్సాహంగా పాల్గొనడానికి మంచి ఆహరం, మందు మమ్మల్ని పాల్గొనకుండా అపలేకపోవచ్చు.

నిజానికి, ప్రపంచం మొత్తం, సంవత్సరంలోని ఈ సమయంలో చాలామంది బరువు పెరగడం, జీర్ణ సమస్యలు వంటివి జరుగుతున్నాయని అనేకమంది ప్రసిద్ధ పరిశోధనల అధ్యయనంలో తేల్చారు, ఒక సమయంలో కొన్ని రోజులు అన్ని ఆహరం, మద్యానికి ధన్యవాదాలు.

ఇపుడు, మన ఆరోగ్యం చాలా ముఖ్యం, మంచి ఆరోగ్యం కోసం ప్రతిదీ మంచే చేయాలి మనందరికీ తెలుసు.

వరుసగా కొన్నిరోజులైనా సరే అనారోగ్యకరమైన ఆహరం తినడం, అదనంగా మందు తాగడం అనేది మన ఆరోగ్యానికి ప్రమాదకరమని కూడా మనకు తెలుసు.

అనారోగ్యకర ఆహరం, మందులో అనేక టాగ్జిన్లు ఉంటాయి, ఇవి మీ ఆరోగ్యాన్ని అస్దిరపరచి, అనేక అనారోగ్యాలను తీసుకువస్తాయి.

కొత్తసంవత్సరాన్ని ఆరోగ్య సమస్యతో ప్రారంభించడం చాలా దురదృష్టకరం, అవునా?

కాబట్టి, గత వారంలో మీరు అనారోగ్యకరమైన ఆహరం, మందు ఎక్కువగా తీసుకున్నారని అనుకుంటే, మీ శరీరంలోని టాగ్జీన్స్ ను సహజ మార్గంలో పోగొట్టుకోవడానికి, ఈ ఇంట్లో తయారుచేసిన శక్తివంతమైన పానీయాన్ని ప్రయత్నించండి!

డిటాక్స్ డ్రింక్

detox drink

కావాల్సిన పదార్ధాలు:

  • లేత కొబ్బరి నీళ్ళు - 1 గ్లాసు
  • ఆపిల్ (తొక్కు తీసిన) - ½ పండు
  • స్ట్రాబెర్రీ - 2
  • నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు

ఇది కొత్తసంవత్సర వేడుకలో తీసుకున్న ఆహరం, మందు వల్ల మీ శరీరంలో ఏర్పడిన టాగ్జీన్స్ ని బైటకు పంపి మీ వ్యవస్థని శుభ్రంచేసి, డిటాక్స్ చేయడానికి సహాయపడే ఇంట్లో తయారుచేసిన పానీయం.

ఈ పానీయాన్ని వేరే సందర్భాలలో కూడా తీసుకోవచ్చు, అనరోగ్యకరం ఆహరం, మందు తో మీకు ఇబ్బందిగా అనిపించినపుడు కూడా.

కొత్తసంవత్సరం పార్టీ తరువాత ఎక్కువ కడుపునొప్పి, వికారం, విరేచనాలు వంటి లక్షణాలను గుర్తి౦చనప్పటికీ మీరు దీన్ని గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. అయితే, ఒకవేళ మీకు, వెంటనే వైద్య సదుపాయం అవసరమైతే, ఈ పానీయం మీ వ్యవస్థకు డిటాక్స్ గా మాత్రమే పనిచేస్తుంది, ప్రమాదకర సమస్యలకు చికిత్సగా మాత్రం కాదు.

మీరు మద్యం పాయిజనింగ్ లేదా ఫుడ్ పాయిజనింగ్ తో బాధపడుతున్నట్టు అనిపిస్తే, ఈ పానీయం తాగడం సూచి౦చదగ్గది కాదు, వైద్య సహాయం తప్పక అవసర౦.

ఇపుడు, అనారోగ్య పదార్ధాలలో అధిక కొవ్వు, షుగర్, సాల్ట్ అధికంగా ఉంటాయని మనకు తెలుసు, వీటివల్ల బరువు పెరగడం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ మొదలైనవి రావొచ్చు.

మందు టాగ్జీన్స్ ని కలిగి ఉండడం వల్ల మీ శరీరం డి-హైడ్రేట్ కి గురయ్యి, వికారం, అజీర్ణం, అసిడిటీ, తలనొప్పి వంటి లక్షణాలు ఎక్కువగా ఉండొచ్చు.

కాబట్టి, సాధ్యమైనంత త్వరగా, మీశరీరం నుండి టాగ్జీన్స్, కొవ్వులు పోగొట్టుకోవాలి అంటే కొద్దిగా శ్రద్ధ పెట్టడం చాలా అవసర౦.

ఈ సహజ పానీయం కొబ్బరినీళ్ళు, స్త్రాబెర్రీలు, నిమ్మరసం, ఆపిల్ వంటి శక్తివంతమైన, ఆరోగ్యకరమైన పదార్ధాల సమ్మేళనం, ఇది ఒక్కరోజులోనే మీ శరీరాన్ని శుభ్రం చేయడానికి సహాయపడుతుంది!

లేత కొబ్బరినీళ్ళు ఎలక్ట్రోలైట్స్ ని అధిక మొత్తంలో కలిగి ఉంటాయి, ఇది మీ శరీరంలో మందు ద్వారా ఏర్పడిన డి-హైడ్రేషన్ ని సరిగా చేసి, ఇబ్బంది పెట్టె లక్షణాలను దూరంగా ఉంచుతుంది.

ఆపిల్ లో ఉండే యాంటీ-ఆక్సిడెంట్, ఫైబర్, ప్రేగుల ద్వారా మీ శరీరంలోని కొవ్వును, మలినాలను బైటకు నెడుతుంది. ఆపిల్ మీ జీవక్రియ రేటును పెంచి, త్వరగా కోలుకోడానికి సహాయపడుతుంది.

స్త్రాబెర్రీలలో యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్ C మెండుగా ఉంటాయి, కాబట్టి ఇది కూడా మీ శరీరాన్ని శుభ్రపరిచి, రాబోయే వ్యాదులనుండి దూరంగా ఉంచేలా రోగనిరోధక శక్తి స్థాయిలను పెంచుతుంది.

నిమ్మరసం లో కూడా విటమిన్ C అధికంగా ఉంటుంది, ఇది మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇది కూడా శక్తివంతమైన సహజ డిటాక్సీఫయింగ్ ఏజెంట్.

కాబట్టి, ఈ పదార్ధాల సమ్మేళనం మీ కొత్తసంవత్సర పార్టీ తరువాత మీ శరీరంలోని టాగ్జీన్స్ ని ఖచ్చితంగా తొలగించి, మీరు మంచి అనుభూతిని పొందేట్టు చేస్తుంది!

డిటాక్స్ డ్రింక్

detox drink

తయారుచేసే విధానం:

  • సూచించిన మోతాదులో పదార్ధాలను ఒక బ్లెండర్ లో కలపండి.
  • ద్రవంగా మారే వరకు బ్లెండ్ చేయండి.
  • ఆ ద్రవాన్ని ఒక గ్లాసులో తీసుకోండి.
  • ఈ పానీయంలో పంచదార కానీ ఉప్పు కానీ కలపక౦డి.
  • ఉదయాన్నే, బ్రేక్ఫాస్ట్ ముందు దీన్ని తాగండి.
  • తక్షణ ఫలితాల కోసం ఈపానీయాన్ని రోజులు 2-3 సార్లు తాగండి.

English summary

Detox Drink to Recover From This New Year Party

2017 has been a happening year when it comes to fashion. The B-town ladies had set some real style goals around the year. From cold-shoulders to the culottes trend has stolen our hearts, alluring us to follow each one of them. While these are just styles which got popular, we have also seen Bollywood celebrities setting trend in and around
Story first published:Saturday, January 6, 2018, 16:49 [IST]
Desktop Bottom Promotion