మీకు అన్నివేళలా చలిగా అన్పిస్తుందా? ఈ 6 కారణాల వలన అది సమస్యాత్మకం కావచ్చు!

Written By: DEEPTHI T A S
Subscribe to Boldsky

మీ చుట్టుపక్కల ఎవరికీ చలిలేనప్పుడు వణికిపోయేవారిలో మీరు కూడా ఒకరా? ఇలా మీకు తరచూ జరుగుతుంటే, మీరు దాన్ని పట్టించుకుని తీరాలి.ఇలా జరగటానికి అనేక ఇతర సమస్యలు కారణమై, ఎప్పుడూ చలిగా ఉండటానికి దారితీయవచ్చు. మన శరీరం వెచ్చగా ఉండటానికి అనేక రసాయనిక చర్యలపై ఆధారపడుతుంది మరియు కావాల్సిన పోషకాలలో ఏవి లోపించినా, మీకు అన్ని సమయాలలో చలిగా అన్పించవచ్చు.

ఐరన్ స్థాయి తక్కువగా ఉండటం

ఐరన్ స్థాయి తక్కువగా ఉండటం

శరీరం సరిగ్గా పనిచేయటానికి ఐరన్ సరైన స్థాయిలో ఉండటం చాలా ముఖ్యం. ఈ ముఖ్యమైన పోషకం మన శరీరానికి ఆక్సిజన్ పంపిణీ చేసే ఎర్ర రక్తకణాలను తయారుచేసేలా చేస్తుంది. దీని వలన శరీరంలో ప్రతికణం సరిగా పనిచేస్తుంది. శరీరంలో ఐరన్ లోపం ఉన్నప్పుడు, ఈ ప్రక్రియపై ప్రభావం పడి, మీకు అన్ని సమయాలలో చలిగా అన్పిస్తుంది.

రక్తప్రసరణ సరిగా లేకపోవటం

రక్తప్రసరణ సరిగా లేకపోవటం

మీకు అన్నివేళలా కాళ్లూ చేతులు చల్లగా ఉంటుంటే, అది రక్తప్రసరణ సరిగ్గా లేదని సూచిస్తోంది. ఇంకా, మీకు చలి కేవలం శరీరంలో ఒకవైపే వేస్తుంటే, మీకు ఆర్థెరోస్క్లెరోసిస్ అనే గుండెజబ్బు ఉండవచ్చు.

రుతువుల ప్రకారం వచ్చే డిజార్డర్

రుతువుల ప్రకారం వచ్చే డిజార్డర్

సాధారణంగా ఎస్ ఎడి అంటారు, ఈ స్థితి తరచుగా, ముఖ్యంగా శీతాకాలంలో డిప్రెషన్, ఆందోళన, అలసట వంటి వాటితో కలిపి వస్తుంది.ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఎస్ ఎ డి శరీరంలో తక్కువ డోపమైన్ ను కలిగిస్తుంది మరియు దానివలన చల్లవాతావరణానికి మీరు సున్నితమైపోతారు.

సరిగా పడుకోకపోవడం

సరిగా పడుకోకపోవడం

చాలావరకు, మీరు సరిగా రాత్రిపూట పడుకోకపోవడం వలన మీ శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. నిద్రలేకపోవటం నాడీవ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది మరియు మెదడు వేడిని క్రమబద్ధీకరణ చేసే మెకానిజంను ప్రభావితం చేస్తుంది. అది మీ మెటబాలిజంను కూడా ప్రభావితం చేసి మీకు అలసట కలిగేలా చేస్తుంది.

మీ స్త్రీయా పురుషుడా

మీ స్త్రీయా పురుషుడా

ఈ వాస్తవం మీకు ఆశ్చర్యకరంగా అన్పించవచ్చు కానీ, శాస్త్రవేత్తల ప్రకారం పురుషుల కన్నా స్త్రీలకి ఎక్కువ చల్లగా అన్పిస్తుంది.వారు చేసిన ఒక ప్రయోగంలో హీట్ సెన్సింగ్ కెమెరాలను వాడి వారి శరీర ఉష్ణోగ్రతలను ఫోటోలు తీసారు. దాని ఫలితం ప్రకారం, సగటున స్త్రీలకు పురుషుల కన్నా 3డిగ్రీల చల్లగా అన్పిస్తుంది. మరొక అధ్యయనంలో స్త్రీలు వేడి వాతావరణ స్థితులను, చల్ల పరిస్థితులకన్నా ఎక్కువగా తట్టుకోగలుగుతారు, చల్లదనాన్ని వారు అంతగా తట్టుకోలేరు.

మీ బరువు

మీ బరువు

మీరు తక్కువ బరువుతో ఉన్నట్లయితే, మీకు వెచ్చదనాన్ని ఇచ్చే, వేడిని అట్టిపెట్టే శరీర కొవ్వు లేదని అర్థం.మీ బరువు ఎక్కువగా ఉంటే, కడుపు చుట్టూ వేడిపోవటం తగ్గిపోతుంది కానీ కాళ్ళూ చేతుల్లో కాదు. అధ్యయనాల ప్రకారం, స్థూలకాయులకి కింది పొట్టవైపు తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. అందుకని మీకు సరైన బరువుతో ఉండటం మంచిది.

English summary

Do you feel cold all the time? 6 reasons it could be worrisome!

Are you one of those who tend to shiver when no one around them is feeling cold? If this happens to you quite frequently, then you must not ignore it. This is because there could be a lot of issues that can lead to this continual feeling of coldness.
Story first published: Friday, February 23, 2018, 10:50 [IST]