For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Dog bite: కుక్క కరిచినప్పుడు చేయాల్సిన మరియు చేయకూడని పనులు

|

కుక్కలకు అభిమానమొచ్చినా, కోపమొచ్చినా తక్షణమే కరవడమో, రక్కడమో చేస్తాయి కనుక, వాటి ఉద్రేకం మనకు ప్రమాదంగా పరిణమించవచ్చు. పొరుగింటివారి కుక్క లేదా వీధి కుక్క మనని కరచి గాయపరిస్తే, అది అపాయకరమైన మరియు బాధాకరమైన అనుభవంగా మారే అవకాశం ఉంది. అటువంటి సందర్భంలో, మనకు ఏమి చేయాలో పాలుపోదు. కనుక కుక్క కాటుకు గురైనప్పుడు, చేయవలసిన మరియు చేయకూడని పనులు ఏమిటో ముందుగానే తెలుసుకుంటే, అటువంటి సందర్భం ఎదురైనప్పుడు, సమర్ధవంతంగా ఎదుర్కోవడం సులభమవుతుంది.

కుక్క కాటుకు గురైనప్పుడు, చేయవలసిన మరియు చేయకూడని పనులు

కుక్క కాటుకు గురైనప్పుడు, చేయవలసిన మరియు చేయకూడని పనులు

కుక్క కరచినప్పుడు, తక్షణమే వైద్య సహాయం తీసుకుని, గాయాలు తగ్గిపోయి పూర్తిగా మానేటట్టు జాగ్రత్త పడాలి. అంతేకాకుండా బాధితుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని, సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ క్రింద కుక్కల కరచినప్పుడు, పాటించవలసిన మరియు పాటించకూడని నియమాలతో కూడిన జాబితా గురించి తెలుసుకోండి.

చేయవలసిన పనుల:

చేయవలసిన పనుల:

కుక్క కరచిన తక్షణమే తీసుకోవలసిన చర్యలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం

తక్షణమే వైద్య సహాయం పొందండి - కుక్క కాటు గురైనవారికి వెంటనే, కరచిన చోట నీటితో లేదా ఆల్కహాల్ తో రుద్ది శుభ్రపరచాలి. ఒకటి లేదా రెండు చుక్కల హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణంతో కూడా శుభ్రపరచవచ్చు. లోతైన గాయలైతే కనుక వెంటనే వైద్యుని వద్దకు వెళ్ళాలి, ఎందుకంటే లోతైన గాయాలకు చికిత్స అందించకుంటే, వివిధ ఇతర వ్యాధులను కూడా వ్యాపింపజేస్తాయి. ఇది చాలా ముఖ్యంగా ఆచరించవలసిన నియమం.

 ప్రాధమిక చికిత్స చేపట్టండి–

ప్రాధమిక చికిత్స చేపట్టండి–

కుక్కకాటు వలన కలిగిన గాయానికి తక్షణమే ప్రాధమిక చికిత్సను అందిస్తే తీవ్ర అనారోగ్య పరిస్థితి తలెత్తదు. బ్యాండేజీలు మరియు ఇతర మందులను ఇంట్లో తయారుగా పెట్టుకోవాలి, లేదంటే ఆస్పత్రికి వెళ్ళాలి. ఇది కూడా ఒక ముఖ్యమైన చర్యే!

సంబంధిత అధికారులను సంప్రదించండి-

సంబంధిత అధికారులను సంప్రదించండి-

కుక్క కరవగానే, ఆ కుక్కను వెంటబెట్టడం లేదా దాని గురించి ఇతరులతో అనవసర చర్చలు చేయడం కన్నా, ఆ కుక్కకు దూరంగా వెళ్ళిపోయి, సంబంధిత అధికారులకు ఫోన్ చేసి నివేదించాలి, వైద్య సహాయం కొరకు వారిని అర్ధించండి. .

కుక్క యొక్క యజమానిని సంప్రదించండి -

కుక్క యొక్క యజమానిని సంప్రదించండి -

పెంపుడు కుక్క కరచినప్పుడు, బాధితుడు ఆ కుక్క యొక్క యజమానిని సంప్రదించి, దానికి రేబిస్ టీకాలు వేయించారో లేదో కనుక్కోండి. ఈ పని తప్పనిసరిగా చేయాలి. ఇలా చేస్తే మీ సమస్య సగం పరిష్కరమయినట్లే! చాలామంది ఈ సమాచారం యొక్క అవసరం లేదనుకుంటారు కానీ ఈ సమాచారం వైద్యునకు అందిస్తే తాదనుగుణంగా వారు చికిత్సకు ఉపక్రమిస్తారు.

ముఖ్యమైన సమాచారాన్ని సేకరించండి-

ముఖ్యమైన సమాచారాన్ని సేకరించండి-

మీరు సురక్షితంగా ఉండాలన్నా, ఇటువంటి పరిస్థితి భవిష్యత్లో మళ్లీ జరగకూడదన్నా, సంబంధిత అధికారిని సంప్రదించి యజమాని యొక్క సమాచారం సేకరించాలి. గాయాల యొక్క చిత్రాలు, మరియు దానికి సంబంధించిన పత్రాలు జాగ్రత్త చేసుకోవాలి. ఈ ప్రమాదానికి సాక్షులను కూడా సంప్రదించాలి. ఇలా చేస్తే ప్రమాదం ఓయ్ పూర్తి అవగాహన కలుగుతుంది.

నిదానంగా ఉండండి మరియు వ్యాక్సిన్ వేయించుకోండి-

నిదానంగా ఉండండి మరియు వ్యాక్సిన్ వేయించుకోండి-

మీకు కరచిన కుక్క ఆరోగ్యమైనదే అని మీకు మీరే నిర్ధారించుకోరాదు. ఇటువంటి పరిస్థితి భవిష్యత్లో మళ్లీ ఎదురవ్వదని భావించరాదు. కుక్క కరచిన వెనువెంటనే తగిన వైద్య సహాయం పొంది, టీకాలు వేయించుకోవాలి లేని సందర్భంలో రేబిస్ వంటి ప్రమాదకరమైన జబ్బులు సోకే అవకాశం ఉంది.

చేయకూడని పనులు:

చేయకూడని పనులు:

చేయవలసిన పనుల వలె చేయకూడని పనులను గురించి కూడా తెలుసుకోవడం తప్పనిసరి.

విస్మరించకండి - ఎప్పుడు మరచిపోకూడని విషయం ఏమిటంటే, కుక్కలు కలుగజేసిన గాయాలను తేలికగా తీసుకోకండి. ఈ గాయాలు చాలా ప్రమాదకరమైనవి. వెంటనే తగిన వైద్య సహాయం తీసుకుని, ప్రధమ చికిత్స పొంది, దానికి సంబంధించిన వివరాలను భవిష్యత్ అవసరాల కొరకు జాగ్రత్త పరచాలి.

మీ ఇష్టానుసారం ఊహించుకోవద్దు -

మీ ఇష్టానుసారం ఊహించుకోవద్దు -

పెంపుడు కుక్కల వలన ఎటువంటి ప్రమాదం జరగదని తేలికగా తీసుకోవద్దు. యజమానులు వాటికి టీకాలు వేయించవచ్చు, వేయించకపోనూవచ్చు. మీకు కరచిన కుక్కకు రేబిస్ ఉన్నట్లైతే, అది మీకు కూడా సోకే అవకాశం ఉంది. ఆ కుక్కను విడిగా ఉంచి గమనించాలి దానికి రేబియా ఉన్నది, లేనిది మరియు దానికి సంభందించిన ఇతర వివరాల్ని సేకరించాలి. ఒకవేళ ఆ కుక్కకు రేబిస్ ఉన్నట్లైతే, రేబియా కి సంబంధించిన నొప్పితో కూడిన టీకాలు వైద్యులు సిఫార్సు చేస్తారు. కనుక కుక్కను గురించి పూర్తి వివరాలను తెలుసుకోవడం తప్పనిసరి!ఈ విషయాన్ని గురించి చర్చించకపోవడం -

కుక్క కాటుకు గురైన కొందరు వ్యక్తులు, ఆ విషయాన్ని గురించి బయట చర్చించడాన్ని య్యటపదారు. దానిని రహస్యంగా ఉంచాలనుకుంటారు. కానీ మీరు కనుక భీమా సదుపాయం పొందాలనుకుంటే మాత్రం వారికి అవసరమైన మేరకు సమాచారాన్ని అందివ్వాలి.

English summary

Do’s and dont’s of dog bite

During dog bites, you must seek medical consultation and ensure that your wounds are properly healed and cleared off.
Desktop Bottom Promotion