For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొట్ట ఉబ్బరం మరియు మలబద్దకంను సత్వరమే నివారించడానికి ఆలస్యం చేయకుండా ఈ టీని తాగేయండి!

|

రోజు పొద్దుట లేచాక కాలకృత్యాలు తీర్చుకోవడానికి గంటల సమయం పాటు బాత్రూంలో కూర్చుని పడరాని అగచాట్లు పడుతున్నారా? రోజులో ఎక్కువ సమయం పాటు పొట్ట ఉబ్బరంతో ఉన్నట్లు, గ్యాస్ తో నిండి ఉన్నట్లు అనిపిస్తుందా?

పైన మేమడిగిన ప్రశ్నలకు మీ సమాధానం అవును అయినట్లైతే, మీకు పొట్ట ఉబ్బరం లేదా మలబద్దకం సమస్యలు ఉన్నట్లు అర్ధం.

పొట్ట ఉబ్బరం మరియు మలబద్దకం అనేవి చాలామంది ఎదుర్కొనే అతి సాధారణ జీర్ణ సంబంధిత సమస్యలు. పొట్టలో జీర్ణ వాయువులు అధికంగా పేరుకుపోయినపుడు, పొట్ట ఉబ్బి, బరువెక్కి, బిగుసుకుపోయినట్టుగా అనిపిస్తుంది. దీనినే కడుపు ఉబ్బరం అంటారు. కొన్నిసార్లు దీనివలన కడుపులో తీవ్రమైన నొప్పి కలుగుతుంది.

ఆహారపదార్ధాలు మన శరీరంలో జీర్ణమయ్యాక, మిగిలిన వ్యర్ధపదార్ధాలు, గట్టిపడి ప్రేగులలో నిలిచిపోయి, బయటకు నెట్టడబడటం కష్టంగా మారే పరిస్థితిని మలబద్దకం అంటారు.

పొట్ట ఉబ్బరం మరియు మలబద్దకం రెండూ కూడా అవి ఎదుర్కొనే వ్యక్తులను తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తాయి. అంతేకాక, అధిక కాలం పాటు ఈ సమస్య నివారణకు తగు చర్యలు తీసుకోకుండా వదిలేస్తే, పైల్స్, ఫిస్ట్యులా, కడుపులో అల్సర్లు, అజీర్తి, ఎసిడిటీ, ఆకలి లేకపోవడం మరియు కడుపు, ప్రేగులలో క్యాన్సర్ వంటి అనేక ఇతర ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి.

ప్రస్తుతానికి చిన్న సమస్యలా కనిపించినప్పటికి, భవిష్యత్తులో పెద్ద ప్రమాదంగా పరిణమించవచ్చు. కనుక, పొట్ట ఉబ్బరం మరియు మలబద్దకం సమస్యల సత్వర నివారణకు దోహదపడే ఒక టీని ఎలా తయారు చేసుకుని వాడాలో మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాం.

పొట్ట ఉబ్బరం మరియు మలబద్దకం నివారణకు సహజమైన నివారణ చర్యలు సమర్ధవంతంగా పనిచేస్తాయా?

మనం తెలుసుకోవలసిన నిజమేమిటంటే, ఈ రోజుల్లో ఏ విషయాన్ని గురించి తెలుసుకోవాలన్నా, అంతర్జాలంలో మరియు పుస్తకాలలో ఎంతో సమాచారం లభిస్తుంది. దీనివలన కొన్ని అనుకూల మరియు కొన్ని ప్రతికూల పరిణామాలు ఏర్పడుతున్నాయి.

వివిధ అనారోగ్యాల చికిత్సకు సంబంధించిన సమాచారం, ప్రత్యేకంగా గృహవైద్యంకు సంబంధించి మరీంత సమాచారం లభ్యతలో ఉంది.

అయినప్పటికీ, ఈ సమాచారం ఎంతవరకు నిజమైనది మరియు సురక్షితమైనది అన్న అవగాహన మనకు ఉండదు. గృహవైద్యం విషయానికి వచ్చేటప్పటికి మరీంత జాగ్రత్తగా మెలగాలి. ఎందుకంటే, ప్రయోగం వికటిస్తే ప్రాణానికే ప్రమాదం సంభవించే ప్రమాదం ఉంది.

అదే సహజమైన పరిష్కారాలను అనుసరిస్తే ఎటువంటి ప్రమాదాలు జరగవు. ఇవి పూర్తిగా మంచివి మరియు సురక్షితమైనవి. ఇవి అనేక రకాల రుగ్మతలను నివారిస్తాయి.

నిజానికి, మందులను మింగడం కన్నా, సహజమైన చికిత్సను అనుసరించడమే ఉత్తమం, ఎందుకంటే ఇవి ఎటువంటి దుష్ప్రభావాలు కలుగజేయవు.

కనుక , ఇప్పుడు మనం ఒక సహజమైన టీతో పొట్ట ఉబ్బరం మరియు మలబద్దకంను ఎలా నివారించవచ్చో తెలుసుకుందాం!

కావలసిన పదార్థాలు:

చామోమైల్( ఒక రకమైన చామంతులు) టీ సంచులు (మార్కెట్లో దొరుకుతాయి)

యాపిల్ - ¼ కప్పు చిన్న ముక్కలు

అల్లం రసం - 2 టేబుల్ స్పూన్లు

మనం ముందుగా చదివినట్లు, సహజమైన చిట్కాలను క్రమం తప్పకుండా సరైన మోతాదులో పాటిస్తే, కడుపు ఉబ్బరం మరియు మలబద్దకం నుండి ప్రభావవంతంగా విశ్రాంతినిస్తాయి.

అంతేకాకుండా, అనారోగ్యకర జీవశైలిని ఆచరిస్తూ, చిట్కాలు ద్వారా ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవాలనుకోవడం కూడా వ్యర్ధమే!

మన ఆహారపు అలవాట్లు ఉబ్బరం మరియు మలబద్దకం యొక్క చికిత్సలో ముఖ్య భూమిక వహిస్తాయి. ఎందుకంటే, ఈ రెండూ కూడా జీర్ణ సంబంధిత సమస్యలు.

పిజ్జా, పాస్తా, వైట్ బ్రెడ్, స్వీట్లు మొదలైన జంక్ ఫుడ్ అధికంగా సేవించడం వలన ఈ సమస్య మరీంత జఠిలమవుతుంది.

పళ్లు, తాజా కూరగాయలు మరియు మొలకలు వంటి పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారం తినడం వలన మలబద్దకం సహజంగానే తగ్గిపోతుంది. అదనంగా, అనారోగ్యకర కొవ్వులు మరియు మసాలాలు లేని ఆహారం తీసుకుంటే ఆమ్లాలు ఏర్పడక, కడుపు ఉబ్బరించదు.

ఆరోగ్యకరమైన ఆహారంతో పాటుగా, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు ఈ సహజమైన పదార్థాలతో తయారు చేసుకుని టీ సేవించడం వలన కడుపు ఉబ్బరం మరియు మలబద్దకం నెమ్మదిస్తాయి.

ఈ టీ ఏ విధంగా కడుపు ఉబ్బరం మరియు మలబద్దకంను తగ్గిస్తుంది?

చామోమైల్ టీ ఆకులలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని అనాదిగా అనేక ప్రకృతి చికిత్స విధానాలలో వాడుతున్నారు.

చామోమైల్ ఆకులల్లోని యాంటీఆక్సిడెంట్లు కడుపులో ఆమ్లాలు మరియు గ్యాస్ ఉత్పత్తిని తగ్గిస్తాయి.కనుక కడుపు ఉబ్బరించిన భావన కలుగదు.

అంతేకాకుండా, విసర్జకాలను మృదువుగా మార్చడం వలన మలబద్దకం కూడా తగ్గుముఖం పడుతుంది.

యాపిల్స్ లో ఉండే పీచుపదార్ధం కూడా, విసర్జకాలను మృదువుగా మార్చి మలబద్దకం నివారణకు దోహదపడుతుంది.

అల్లం కడుపులో ఉత్పత్తి అయ్యే ఆమ్లాలను సమతుల్యం చేసి , ఎసిడిటీ మరియు కడుపు ఉబ్బరం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

తయారీ విధానం:

• కొంత నీటిని మరిగించి ఒక కప్పులో తీసుకోండి.

• దీనిలో ఒక చామోమైల్ టీ సంచిని వేసి, కొద్దిసేపు ఆ సుగుణాలన్ని నీటిలోకి ఇంకే వరకు వేచి ఉండండి.

• ఇప్పుడు టీ బ్యాగ్ ను తొలగించి,బ్యాపిల్ ముక్కలు మరియు అల్లం రసం అందులో వేయండి.

• బాగా కలిపి తాగండి.

• ప్రతిరోజూ పొద్దుట అల్పాహారం తినే ముందు ఈ టీని సేవించండి.

• ఈ టీలో పంచదార వేసుకోకండి.

English summary

Drinking This Homemade Tea Can Help Reduce Stomach Bloating & Constipation Fast!

Drinking This Homemade Tea Can Help Reduce Stomach Bloating & Constipation Fast,Do you often find yourself sitting on the toilet seat every morning and forcing yourself to pass stools with difficulty?Do you feel like your stomach is swollen most of the time, filled with gas?If your answer was yes to either of the a
Story first published: Thursday, June 21, 2018, 20:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more