తెల్ల‌బియ్యం మ‌న ఆరోగ్యానికి మంచిదేనా?

Written By: sujeeth kumar
Subscribe to Boldsky

ఉరుకుల‌, ప‌రుగుల జీవితంలో ప్ర‌స్తుతం ప్ర‌తీ ఒక్కరికి ఆరోగ్యంపై శ్ర‌ద్ధ పెరుగుతోంది. మ‌న తెలుగు రాష్ట్రాల్లో సాధార‌ణంగా అంద‌రూ తినే ముఖ్య‌మైన ఆహారం అన్నం. అయితే ఈ మధ్య కాలంలో తెల్ల‌గా, పాలీష్ బియ్యంతో చేసిన అన్నం కంటే ముడి బియ్యం(బ్రౌన్‌రైస్‌) తో చేసిన అన్నం ఎంతో ఆరోగ్య‌క‌ర‌మ‌నే వాద‌న‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.

మీకు కూడా ఇది నిజ‌మ‌నే అనిపిస్తోందా? రోజువారీగా మీ ఆహారంలో తెల్ల బియ్యాన్నే వాడుతున్నారా? లేదా ముడి బియ్యం వైపు మొగ్గు చూపుతున్నారా ?నిపుణుల అభిప్రాయం ప్ర‌కారం పై రెండింటిలో ఏదీ తినాలి, ఏదీ మ‌న ఆరోగ్య‌కానికి మంచిది?

ఈ కింద వివ‌రించిన క‌థ‌నంలో మీ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు దొరుకుతాయి. వాటి గురించి తెలుసుకోవాల‌న‌కుంటున్నారా?. మ‌రి ఇంకేం! చ‌ద‌వండి.

 తెల్ల బియ్యంలో పాలీష్ చేసి బీజ‌ము

తెల్ల బియ్యంలో పాలీష్ చేసి బీజ‌ము

తెల్ల బియ్యంలో పాలీష్ చేసి బీజ‌ము, పై ఊక‌ను తీసివేస్తారు, కానీ ముడి బియ్యంలో ఊక‌, బీజ‌ము అలాగే ఉంటాయి. దీంతో ముడి బియ్యంలోని బీజము వ‌ల్ల అన్నం ఉడికించిన‌ప్పుడు పులిసిపోయిన మాదిరిగా అయి అంస‌తృప్త కొవ్వు ఆమ్లాలు ఆక్సీక‌ర‌ణ చ‌ర్యకు గుర‌వుతాయి. ఇవి మ‌న శ‌రీరంలో కొన్ని ప్ర‌తికూల చ‌ర్య‌ల‌కు దారి తీస్తాయి. ఇందువ‌ల్ల తెలిసిందేంటంటే పోషక విలువ‌ల‌తో కూడిన ఊక మ‌న శ‌రీరంలో కొన్ని విప‌రీత చ‌ర్య‌ల‌కు గురి చేస్తుంద‌ని.

 తెల్ల బియ్యంతో పోలిస్తే ముడి బియ్యంలో తేలికైన పీచు ప‌దార్థాలు

తెల్ల బియ్యంతో పోలిస్తే ముడి బియ్యంలో తేలికైన పీచు ప‌దార్థాలు

తెల్ల బియ్యంతో పోలిస్తే ముడి బియ్యంలో తేలికైన పీచు ప‌దార్థాలు అధికంగా ఉంటాయి. ముడిబియ్యంలోని ఊక‌లో ఇవి ఎక్కువ‌గా కేందీకృత‌మై ఉంటాయి. ఆహారంలో పీచు ప‌దార్థాలు ఎక్కువ‌గా తీసుకోని వారికి ఇది మంచిదే, అయితే ఇప్ప‌టికే స‌రిప‌డా పీచు ప‌దార్థాలు తీసుకునే వారు మాత్రం మ‌రోసారి ఆలోచించాల్సిందే. ఎందుంటే పీచు ప‌దార్థాలు ఎక్కువ‌గా తీసుకుంటే అది పేగు సంబంధిత గ్యాస్ స‌మ‌స్య‌లు, క‌డుపు ఉబ్బ‌డం, క‌డుపు తిమ్మిరికి దారి తీస్తాయి.

ముడి బియ్యంలో వ్య‌తిరేక పోష‌క ప‌దార్ధాలు కూడా ఉంటాయి.

ముడి బియ్యంలో వ్య‌తిరేక పోష‌క ప‌దార్ధాలు కూడా ఉంటాయి.

ముడి బియ్యంలో వ్య‌తిరేక పోష‌క ప‌దార్ధాలు కూడా ఉంటాయి. మ‌నం పోష‌క ప‌దార్థాల‌ను తీసుకున్న‌ప్పుడు, ఇవి వాటిని మ‌న శ‌రీరం శోషించుకోకుండా చేసి బ‌య‌ట‌కు పంపుతాయి. కాబ‌ట్టి ముడి బియ్యం రెండు వైపులా ప‌దును ఉన్న క‌త్తి లాంటిది. ఇందులో పోష‌కాల‌తో పాటు, వ్య‌తిరేక పోష‌కాలు కూడా ఉంటాయ‌న్న విష‌యం మ‌ర‌వ‌వ‌ద్దు.

ముడి బియ్యంలో ఫైటిక్ ఆమ్లం

ముడి బియ్యంలో ఫైటిక్ ఆమ్లం

ముడి బియ్యంలో ఫైటిక్ ఆమ్లం ముఖ్య‌మైన వ్య‌తిరేక పోష‌క ప‌దార్థం. అందుకే దీనిని తొల‌గించ‌డానికి బియ్యాన్ని ఎక్కువ సేపు నాన‌బెడ‌తాం. అయితే 20 నిమిషాల కంటే ఎక్కువ సేపు నాన‌బెట్టిన‌ప్ప‌టికీ, ముడి బియ్యంలోని ఊక‌లో ఫైటిక్ ఆమ్లాలు అలాగే ఉంటాయ‌ని కొన్ని అధ్య‌య‌నాలు నిరూపించాయి.

కొంత మంది నిపుణులు

కొంత మంది నిపుణులు

కొంత మంది నిపుణులు తెల్ల బియ్యంలోని పిండి ప‌దార్థాల(స్టార్చ్‌) వ‌ల్ల దానిని దూరంగా పెట్ట‌మ‌ని అంటారు. ఇది మ‌న శ‌రీరానికి అంత మంచిది కాద‌నేది వారి అభిప్రాయం. కానీ గుర్తుంచుకోవ‌లిసిన ముఖ్య విష‌యం ఏంటంటే పిండి ప‌దార్థాలు అధికంగా ఉంటే మ‌న శ‌రీరానికి మంచిది కాదు. పిండి ప‌దార్థాలు మన శ‌రీరానికి క‌చ్చితంగా కావాల్సిందే ఎందుకంటే ఇది మాన‌వునికి ప్రాథ‌మిక పోష‌క ప‌దార్థం. మీరు తెల్ల బియ్యం ఒక్క‌టే తిన‌కుండా ఉంటుంటే, పిండి ప‌దార్థాల వ‌ల్ల మీ శ‌రీరంలో అనూహ్య‌మైన మార్పులేవీ రావు.

తెల్ల బియ్యంలోని పిండి ప‌దార్థాల(స్టార్చ్‌) వ‌ల్ల దానిని దూరంగా పెట్ట‌మ‌ని అంటారు. ఇది మ‌న శ‌రీరానికి అంత మంచిది కాద‌నేది వారి అభిప్రాయం. కానీ గుర్తుంచుకోవ‌లిసిన ముఖ్య విష‌యం ఏంటంటే పిండి ప‌దార్థాలు అధికంగా ఉంటే మ‌న శ‌రీరానికి మంచిది కాదు. పిండి ప‌దార్థాలు మన శ‌రీరానికి క‌చ్చితంగా కావాల్సిందే ఎందుకంటే ఇది మాన‌వునికి ప్రాథ‌మిక పోష‌క ప‌దార్థం. మీరు తెల్ల బియ్యం ఒక్క‌టే తిన‌కుండా ఉంటుంటే, పిండి ప‌దార్థాల వ‌ల్ల మీ శ‌రీరంలో అనూహ్య‌మైన మార్పులేవీ రావు.

గ్లూకోజ్ విచ్ఛిత్తి చేయ‌డం కోసం పిండి ప‌దార్థాలు అవ‌స‌రం

గ్లూకోజ్ విచ్ఛిత్తి చేయ‌డం కోసం పిండి ప‌దార్థాలు అవ‌స‌రం

గ్లూకోజ్ విచ్ఛిత్తి చేయ‌డం కోసం పిండి ప‌దార్థాలు అవ‌స‌రం. ఇది ఇన్సులిన్ స్థాయుల‌ను పెంచుతుంది కాబ‌ట్టి ఇన్సులిన్ నిరోధం పెరుగుతుంది. దీని కోసం మ‌న‌కు గ్లూకోజ్ కావాలి. గ్లూకోజ్‌ని మ‌నం పిండి ప‌దార్థాల నుంచి పొందుతాం మ‌రియు కార్బోహైడ్రేట్లు ఇన్సులిన్ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌వు. మ‌న శ‌రీర క‌ణాలు గ్లూకోజ్‌ని శోషించుకోవ‌డంలో వైఫ‌ల్యం చెందిన‌ప్పుడు మాత్ర‌మే ఇన్సులిన్ నిరోధానికి దారి తీస్తుంది.

ముగింపు

ముగింపు

పైన వివ‌రించిన క‌థ‌నంలో తేలిందేంటంటే, ముడి బియ్యంలో అధికంగా పోష‌కాలు, పీచు ప‌దార్థాలు ఉంటాయి. అయితే ఇందులో ఫైటిక్ ఆమ్లం వంటి వ్య‌తిరేక పోష‌క ప‌దార్థాలు కూడా ఉంటాయి. ఇది మ‌న శ‌రీరం ఖ‌నిజ ల‌వ‌ణాలు(మిన‌ర‌ల్స్‌) శోషించుకోకుండా చేస్తాయి. ఇందువ‌ల్ల తెల్ల బియ్యం కంటే దీనిని మంచిద‌ని ఆహారంలో తీసుకోలేం. ఈ ల‌క్ష‌ణాలు వివ‌రించ‌డానికి ముఖ్య కార‌ణం ఎందుకు తెల్ల బియ్యం ఆహారంలో ఉండ‌టం మంచిద‌ని తెల‌ప‌డానికే, అలాగే తెల్ల బియ్యంలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉండ‌వు. అలాగే దీనిలో బీజ‌ము ఉండ‌క‌పోవ‌డం వ‌ల్ల అన్నం పులిసిపోయిన‌ట్లుగా అవ‌దు.

కాబ‌ట్టి, తెల్ల బియ్యం తిన‌డం మ‌న ఆరోగ్యానికి మంచిదేనా ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం, అవ‌ను తెల్ల బియ్యం ఆహారంగా తీసుకోవ‌డం మ‌న శ‌రీరానికి నిస్సందేహంగా మంచిదే. కాబ‌ట్టి మీరు నిర్భ‌యంగా తెల్ల బియ్యం అన్నంలో తిన‌వ‌చ్చు. అలాగే ముడి బియ్యం తినేవారికి కూడా ఈ స‌మాచారం తెల‌పండి.

మీ అభిప్రాయాలు, సూచ‌న‌ల‌ను మాకు తెల‌పండి. ఈ కింది బాక్స్‌లో కామెంట్లు చేయండి.

English summary

Eating White Rice is Healthy

The pros and cons of eating white rice are balanced. Some state that white rice should be an essential ingredient on your plate at least once in a day. But, eating too much of white rice can also make you feel heavier on the stomach which is why experts advise to avoid it at night.