నాలుకపై తెల్ల‌మ‌చ్చ‌లు ఎందుకొస్తాయి...? అవి పోవాలంటే...

Written By: sujeeth kumar
Subscribe to Boldsky

మీ నాలుక త‌డారిపోతుంటుందా? నోటి నుంచి దుర్వాస‌న వెదజ‌ల్లుతుందా? జున్ను ముక్క లాంటి నాలుక‌ను ఎవ‌రూ కోరుకోరు. పిడ‌చ‌క‌ట్టుకున్న‌ట్టు తెల్ల‌గా నాలుక మారుతుంది. ఇది ఆరోగ్య‌దాయ‌కం కాదు. మ‌రి ఈ స‌మ‌స్య‌ను ఇంట్లోనే ప‌రిష్క‌రించుకునేందుకు అనేక మార్గాలున్నాయి తెలుసా?

సాధార‌ణంగా నాలుక గులాబీ రంగులో ఉండాలి. మ‌న శ‌రీరంలో ఎముక లేని అతిపెద్ద న‌రం నాలుక‌. దీంతో మ‌నం ఆహారాన్ని మింగొచ్చు, రుచి చూడొచ్చు. ఇంకా నాలుక లేనిదే మాట్లాడ‌టం సాధ్యం కాదు. నాలుక‌పై తెల్ల‌గా మార‌డం అనేక స‌మ‌స్య‌ల‌కు మూలం. స‌రైన నోటి శుభ్ర‌త పాటించ‌నివారికి ఇలా అవుతుంది. ఇది మ‌రీ అంత హానికరం కాదు కానీ దీర్ఘ‌కాలంలో స‌మ‌స్య‌ల‌ను కొనితెస్తుంది.

Effective Home Remedies For Furry Tongue,

ఇలా మార‌డానికి కార‌ణాలు...

నాలుకపై క‌ణాల వృద్ధి అధికంగా ఉండి తెల్ల‌గా మారుతుంది. దీనికి కార‌ణాలు అనేకం... వీటిలో...

మృత‌క‌ణాలు, ఆహార మిగులు, బ్యాక్టీరియా చేర‌డం.

నాలుక పిడ‌చ‌క‌ట్టుకుపోవ‌డం

మితిమీరి పొగాకు, మ‌ద్యం సేవించ‌డం

తీపి ప‌దార్థాలు ఎక్కువ‌గా తీసుకోవ‌డం

ఫంగ‌స్ ఇన్ఫెక్ష‌న్ సోక‌డం

కొన్ని ర‌కాల యాంటీబ‌యాటిక్స్ వాడ‌కం వ‌ల్ల‌

ఆస్త‌మా కోసం దీర్ఘ‌కాలంగా కొన్ని ర‌కాల ఇన్‌హేల‌ర్ల‌ను వాడటం మూలాన‌

డ‌యాబెటిస్‌, జాండీస్‌, సిఫిలిస్‌, ల్యూకోప్లేకియా, లివ‌ర్ కంజెష‌న్ మూలాన కూడా నాలుక ఇలా మారిపోతుంది.

పైన తెలిపిన అనేక కార‌ణాల్లో ఏదో ఒక‌దాని వ‌ల్ల నాలుక ఇలా తెల్ల‌గా మారిపోతుంటుంది. దీని వ‌ల్ల నోటి దుర్వాస‌న‌తో పాటు ఒక్కోసారి చిగుళ్ల నుంచి ర‌క్తం కారే ప్ర‌మాద‌ముంది.

కొన్ని ర‌కాల స‌హ‌జమైన చిట్కాల‌ను పాటిస్తే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

1. ఉప్పు

1. ఉప్పు

ఉప్పును రెండు ర‌కాలుగా వాడ‌వ‌చ్చు. ఒక గ్లాసుడు గోరు వెచ్చ‌ని నీటిలో చెంచాడు ఉప్పు వేయాలి. దీన్ని రోజుకు 6సార్లు పుక్కిలించాలి. ఇలా వారంపాటు చేస్తే నాలుక పై తెల్ల‌మ‌చ్చ‌లు తొల‌గిపోతాయి. మ‌రో విధానంలో కొంచెం ఉప్పు తీసుకొని నాలుక‌పై వేసుకోవాలి, ఆ త‌ర్వాత బ్ర‌ష్‌తో సున్నితంగా రుద్దుకోవాలి.

2. గ్లిజ‌రిన్‌

2. గ్లిజ‌రిన్‌

సూప‌ర్‌మార్కెట్‌లో వెజిట‌బుల్ గ్లిజ‌రిన్ సుల‌భంగా ల‌భ్య‌మవుతుంది. ఈ విధానం మెరుగైన ఫ‌లితాల‌ను అందిస్తుంద‌ని రుజువైంది. నాలుక‌పై గ్లిజ‌రిన్ పూసుకొని సున్నితంగా బ్ర‌ష్ చేసుకోవాలి. దీని వ‌ల్ల ఎండిపోయిన నాలుక తిరిగి తేమ‌ను సంత‌రించుకొని నోటి దుర్వాస‌న సైతం పోతుంది.

3. బేకింగ్ సోడా

3. బేకింగ్ సోడా

బేకింగ్ సోడాను, నిమ్మ‌రసంతో క‌ల‌పాలి. దీన్ని నాలుక‌తో పాటు పండ్ల మీద రాయాలి. దీని వ‌ల్ల నాలుక పైన తెల్ల‌మ‌చ్చ‌లు ఉంటే పోతాయి. అదీ కాకుండా ప‌ళ్లు త‌ళ‌త‌ళ మెరుస్తాయి. అంతేకాదు నోటి దుర్వాస‌న సైతం పోతుంది.

4. ప‌సుపు

4. ప‌సుపు

ప‌సుపు న్యాచుర‌ల్ యాంటీ బ‌యాటిక్‌. నాలుక‌పై చెడు బ్యాక్టీరియాను ప‌సుపు చంపేస్తుంది. తాజా నిమ్మ‌ర‌సంలో కాస్త ప‌సుపు క‌లపాలి. దీన్ని నాలుక‌పై తెల్ల‌మ‌చ్చులున్న చోట రాయాలి. లేదా ఒక గ్లాసు నీటిలో ప‌సుపు వేసి పుక్కిలించుకోవ‌చ్చు.

5. పెరుగు

5. పెరుగు

నాలుకపై చెడు బ్యాక్టీరియాను తీసివేసి మంచి బ్యాక్టీరియా నింపాలంటే పెరుగు చ‌క్క‌ని మార్గం. పెరుగును స్పూనుతో నేరుగా తిని నాలుక‌కు రుచిని ఆస్వాదింపజేయాలి. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా నాలుక‌పై స్థిర నివాసాలు ఏర్ప‌ర్చుకొని చెడు ఫంగ‌స్‌ను పార‌ద్రోలుతుంది.

6. అలోవెరా

6. అలోవెరా

అలోవెరాకు ఎన్నో స‌ద్గుణాలున్నాయి. ఇది యాంటీ మైక్రోబియల్‌గా ప‌నిచేస్తుంది. నోటిలో క్రిముల‌ను చంపి దుర్వాస‌ను అరిక‌డుతుంది. కాస్త అలోవెరా తీసుకొని నోటిలో వేసుకొని కొన్ని నిమిషాలు ఉంచుకోండి. ఆ త‌ర్వాత ఉమ్మివేయండి. ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల నోటి స‌మ‌స్య‌లు తీరిపోతాయి.

7. వేప‌

7. వేప‌

వేప‌కు యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ బ్యాక్టీరియా స‌ద్గుణాలు మెండు. వేడి నీటిలో వేప ఆకులు వేసి ఆ నీటితో పుక్కిలిస్తే నాలుక ఆరోగ్యంగా త‌యార‌వుతుంది. రోజుకు క‌నీసం రెండు సార్లు ఇలాచేస్తే ఫ‌లితం ఉంటుంది.

8. యాపిల్‌, క్యారెట్లు

8. యాపిల్‌, క్యారెట్లు

యాపిల్‌, క్యారెట్, స్ట్రాబెర్రీలు స‌హ‌జంగానే నోటిని శుభ్రం చేయ‌గ‌ల‌వు. వీటిని త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల నోటి దుర్వాస‌న రాదు.

9. మంచినీరు

9. మంచినీరు

మంచి నీళ్లు బాగా తీసుకోండి. దీని వ‌ల్ల ప‌ళ్లు, నాలుక సందుల్లో ఇరుక్కున ఆహార ప‌దార్థాలు లోప‌లికి వెళ్లిపోతాయి. బాగా నీరు తాగ‌డం వ‌ల్ల బ్యాక్టీరియా వృద్ధి కూడా త‌గ్గుతుంది. వ‌ట్టి మంచినీరు వ‌ద్దు అనుకుంటే దీంట్లో నిమ్మ‌ర‌సం పిండుకోవ‌చ్చు.

 10. ప‌డుకునే ముందు...

10. ప‌డుకునే ముందు...

ప‌డుకునే ముందు చ‌క్క‌గా బ్ర‌ష్‌చేసుకోండి. భోజనం త‌ర్వాత ప‌డుకునే ముందు బ్ర‌ష్ చేసుకోవ‌డం అల‌వాటు చేసుకోండి. టంగ్ క్లీన‌ర్‌తో నాలుక‌ను శుభ్రం చేసుకోవ‌చ్చు. బ్ర‌ష్‌తో నాలుక‌ను శుభ్రం చేసుకోవాలి. మౌత్ వాష్‌కూడా వాడటం వ‌ల్ల ఫ‌లితం ఉంటుంది.

ఇలా ఇంట్లోనే ల‌భ్య‌మ‌య్యే చిన్న చిన్న ప‌దార్థాల‌తో నాలుక‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. ఒక వేళ నాలుక స‌మ‌స్య జ‌టిల‌మైతే త‌ప్ప‌కుండా వైద్యుడ్నిసంప్ర‌దించండి.

ఈ క‌థ‌నం మీకు ఉప‌యోగ‌క‌రంగా అనిపించిన‌ట్ట‌యితే మీ అభిప్రాయాల‌ను మాతో పంచుకోండి.

English summary

Effective Home Remedies For Furry Tongue

Is your tongue too dry? Do you have bad breath too? No one wants their tongue to feel like cheese or even look like one. But that is what a furry tongue is like.In this post, we talk about furry tongue and the ways you can treat it using ingredients around your house. So, without waiting, find out what they are and get rid of the discomfort!