ఛాతీలో భ‌రించ‌లేని నొప్పా? ఇంట్లో ఈ 10 వ‌స్తువులు ఉంటే...

Written By: sujeeth kumar
Subscribe to Boldsky

ఛాతీలో బ‌లంగా కొట్టేసిన‌ట్టు, తీవ్ర‌మైన నొప్పి క‌లుగుతుంటే గుండె పోటు వ‌చ్చిందా అనే సందేహం క‌ల‌గ‌క మాన‌దు. అప్ప‌టినుంచి గాభ‌రా మొద‌ల‌వుతుంది. ఛాతీలో ఎడ‌మ వైపు నొప్పి వ‌స్తే గుండెపోటు అని తీసిపారేయ‌లేం కానీ అన్ని సంద‌ర్భాల్లోనూ అదే కార‌ణం కాదు. ఛాతీ నొప్పికి అస‌లు కార‌ణ‌మేంటి? ఎక్కువ‌గా వ్యాయామం చేయ‌డం వ‌ల్లో, లేదా అజీర్తి మూలానో ఛాతీలో నొప్పి ఏర్ప‌డ‌వ‌చ్చు. కార‌ణ‌మేదైనా దీన్ని త‌గ్గించుకోవాల‌ని చూస్తుంటాం. మీకోసం మేము కొన్ని ఇంటి చిట్కాల‌ను ఇస్తున్నాం. వీలైనంత మేర‌కు పాటించి ఫ‌లితాల‌ను చూడండి.

ఛాతీ నొప్పికి కార‌ణాలు...

ఛాతిలో నొప్పి ఒక్కొక్క‌రికి ఒక్కోలా ఒక్కో ప్రాంతంలో, ఒక్కో విధంగా, ఒక్కో స‌మ‌యం ఉంటుంది. గుండె స‌మ‌స్య సైతం ఛాతీనొప్పికి దారితీయ‌వ‌చ్చు. అస‌లు ఛాతీ నొప్పికి గ‌ల కార‌ణాలు చూద్దాం..

effective-home-remedies-to-treat-chest-pain

గుండె సంబంధిత కార‌ణాలు...

గుండెలో ర‌క్త నాళాలు బ్లాక్ అయితే..

గుండె పొర చుట్టూ వాపు లాంటిది ఏర్ప‌డితే...

గుండె కండ‌రాలు వాపున‌కు గురైతే..

కార్డియోమ‌యోప‌తి అనే వ్యాధికి గురైన‌ప్పుడు

పెద్ద ధ‌మ‌నికి ఏదైనా ప‌గుళ్లు ఏర్ప‌డితే...

ఊపిరితిత్తులకు సంబంధించిన కార‌ణాలు...

బ్రాంకైటిస్‌, న్యుమోనియా, న్యుమోథోరాక్స్‌, బ్రాంకోపాస‌మ్ లాంటివ‌న్నీ ఊపిరితిత్తుల‌కు సంబంధించి వ‌చ్చే రుగ్మ‌త‌లు. ఆస్త‌మా కూడా ఒక్కోసారి ఛాతీనొప్పికి దారితీయ‌వ‌చ్చు.

కండ‌రాలు, కీళ్లకు సంబంధించిన కార‌ణాలు...

రిబ్స్ గాయమైన‌ప్పుడు లేదా విరిగిన‌ప్పుడు

ఛాతీ ప్రాంతంలో కండ‌రాలు బ‌ల‌హీన‌మై నొప్పి ఏర్ప‌డ‌వ‌చ్చు.

న‌రాలపైన ఒత్తిడి ఏర్ప‌డి నొప్పి రావ‌చ్చు.

ఇత‌ర కార‌ణాలు...

షింజిల్స్ లాంటి వైద్య రుగ్మ‌త‌లు

తీవ్ర‌మైన నొప్పి వ‌ల్ల క‌లిగే భ‌యం.

ఛాతీలో నొప్పి కాకుండా ఇత‌ర ల‌క్ష‌ణాలు కూడా క‌నిపించే అవ‌కాశం ఉంది. అవేమిటంటే..

ఛాతీ బిగుతుగా, భారంగా మారడం

ద‌వ‌డ‌, చేతి కండ‌రాలు, వెన్నులో నొప్పి

మూర్ఛ రావ‌డం, బ‌ల‌హీనంగా మారిపోవ‌డం

క‌డుపులో నొప్పి

శ్వాస పీల్చుకోవ‌డం క‌ష్ట‌మ‌వ్వ‌డం

ఇత‌ర ల‌క్ష‌ణాలు...

నోరు వ‌గ‌రు రుచి అనిపించ‌డం

మింగ‌డం క‌ష్ట‌మైపోవ‌డం

గ‌ట్టిగా ద‌గ్గిన‌ప్పుడో, శ్వాస పీల్చుకున్న‌ప్పుడు నొప్పి తీవ్ర‌మ‌వ్వ‌డం

చ‌లి జ్వ‌రం

తీవ్ర‌మైన అల‌జ‌డి, ఒత్తిడి

వెన్నులో నొప్పి

ఛాతీలో నొప్పి కేవ‌లం బాధ క‌లిగించ‌దు. రోజువారీ ప‌నుల‌కు ఆటంకాన్ని క‌లిగిస్తుంది. అందుకే దీనికి స‌త్వర ప‌రిష్కారాన్ని క‌ల్పించాలి. ఛాతీ నొప్పిని త‌గ్గించుకునేందుకు అందుబాటులో ఉన్న 10 విధానాల గురించి తెలుసుకుందాం..

1. వెల్లుల్లితో...

1. వెల్లుల్లితో...

1 టీ స్పూన్ వెల్లుల్లి ర‌సాన్ని ఒక క‌ప్పు గోరు వెచ్చటి నీటిలో వేసి బాగా క‌ల‌పి ప్ర‌తి రోజు తాగాలి. లేదా ప‌ర‌గ‌డుపునే రెండు వెల్లుల్లి ముక్క‌ల‌ను న‌మిలి తిన్నా ప్ర‌యోజ‌న‌మే. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే మేలంటారు.

వెల్లుల్లి వ‌ల్ల ఉన్న అనేక ప్ర‌యోజ‌నాల‌లో భాగంగా అది గుండె స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించి ర‌క్త‌ప్ర‌సర‌ణ‌ను స‌జావుగా సాగేట్టు చేస్తుంది. ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ స‌రిగ్గా లేక‌పోతే గుండె స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఇది ఛాతీపైన ప్ర‌భావం చూపిస్తుంది. అందుకే రోజుకు రెండో, మూడో వెల్లుల్లి తిన‌డం మేలంటారు నిపుణులు.

2. క‌ల‌బంద ర‌సం

2. క‌ల‌బంద ర‌సం

రోజులో 1 లేదా 2 సార్లు పావు క‌ప్పు క‌ల‌బంద ర‌సాన్ని తాగ‌డ‌వ మంచిదంటారు.

క‌ల‌బంద మొక్క అద్భుత‌మైన ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంటుంది. గుండెకు కూడా చాలా మంచిది. మంచి కొల‌స్ట్రాల్‌ను వృద్ధి చేస్తుంది. బ్ల‌డ్ ప్రెష‌ర్‌ను త‌గ్గించ‌డ‌మే కాదు ఛాతీ నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నాన్ని క‌లిగిస్తుంది.

3. విటమిన్లు

3. విటమిన్లు

విట‌మిన్ డి, బీ 12 లోపాల వ‌ల్ల ఛాతీ నొప్పి, గుండె స‌మ‌స్య‌లు ఏర్ప‌డే అవ‌కాశాలెక్కువ‌ని ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డైంది. ఛాతీ నొప్పి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటే ముందు మీ డైట్ ప్లాన్‌ను ప‌రిశీలించుకోవాలి. అందులో స‌మ‌తుల ఆహారం ఉన్న‌దీ లేనిదీ చూసుకోవాలి. అన్ని ర‌కాల పోష‌కాలు, విట‌మిన్లు క‌లిగి ఉన్న ఆహారాన్ని ఎంచుకోవాలి. చేప‌లు, చీజ్‌, గుడ్డు సొన‌, ప‌ప్పు దినుసులు, సోయా, మాంసం లాంటి ప‌దార్థాలు రోజు ఆహారంలో భాగం చేసుకోవాలి. డాక్ట‌ర్ను సంప్ర‌దించి స‌ప్లిమెంట్ల రూపంలో విట‌మిన్లు తీసుకోవ‌చ్చు.

4. యాపిల్ సిడార్ వెనిగ‌ర్‌

4. యాపిల్ సిడార్ వెనిగ‌ర్‌

ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సిడార్ వెనిగ‌ర్‌ను ఒక గ్లాసు నీటిలో వేసి బాగా క‌లిపి తాగాలి. సాధార‌ణంగా భోజ‌నానికి ముందు తాగ‌డం మేలు. యాపిల్ సిడార్ వెనిగ‌ర్‌కు యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ గుణాలు ఉన్నాయి. ఇవి గుండె నొప్పి, యాసిడిటీని త‌గ్గిస్తుంది. త‌ద్వారా ఛాతీలో నొప్పి మెల్ల‌గా త‌గ్గిపోవ‌చ్చు.

5. వేడి వేడి చాయ్‌

5. వేడి వేడి చాయ్‌

వేడివేడి నీళ్లు, లేదా హెర్బ‌ల్ టీ తాగ‌డం వ‌ల్ల క‌డుపు ఉబ్బ‌సం, అజీర్తి త‌గ్గుతుంది. ఛాతీలోనూ కాస్తంత ఊర‌ట ల‌భించిన‌ట్ట‌వుతుంది.

6. ప‌సుపు-పాలు

6. ప‌సుపు-పాలు

ఒక గ్లాసు వేడి నీటిలో అర టీస్పూన్ ప‌సుపు క‌లిపి రాత్రి ప‌డుకునే ముందు తాగండి. ప‌సుపులో క‌ర్‌కుమిన్ అనే ప‌దార్థం ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ను త‌గ్గిస్తుంది, రక్త నాళాలు గ‌డ్డ క‌ట్ట కుండా చూస్తుంది. ప‌సుపులో యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ గుణాలున్నాయి. ఇది ఛాతీ నొప్పిని త‌గ్గించ‌గ‌ల‌దు.

7. తుల‌సి ఆకులు

7. తుల‌సి ఆకులు

గుప్పెడు తుల‌సి ఆకుల‌ను తీసుకొని న‌మ‌లాలి. లేదా తుల‌సి ఆకుల‌తో టీ చేసుకొని తాగ‌వ‌చ్చు. లేదా తుల‌సి ర‌సాన్ని తీసి కాస్తంత తేనెతో క‌లిపి సేవించాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే ఫ‌లిత‌ముంటుంది. తుల‌సిలో విట‌మిన్ కె, మెగ్నీషియం అధిక పాళ్ల‌లో ఉంటుంది. మెగ్నీషియం ర‌క్త ప్ర‌స‌ర‌ణ‌ను మెరుగుప‌రిచి, ర‌క్త నాళాల‌ను శుభ్రంచేస్తుంది. విట‌మిన్ కె కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తుంది. ఇది ఛాతీ నొప్పిని నివారిస్తుంది.

8. న‌ల్ల మిరియాలు

8. న‌ల్ల మిరియాలు

ఒక గ్లాసు పండ్ల ర‌సంలో ఒక స్పూను మిరియాల పొడి క‌లుపుకొని తాగాలి. ఇలా రోజుకొక‌సారి తాగితే మంచిది.

న‌ల్ల మిరియాల్లో క్యాప్‌సైసిన్ అనే ప‌దార్థం ఉంటుంది. దీనికి యాంటీ- ఇన్‌ఫ్ల‌మేట‌రీ గుణాలుంటాయి. ఇవి ఛాతీ నొప్పిని త‌గ్గించ‌గ‌ల‌వు. అంతే కాదు ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ‌ను మెరుగు ప‌ర్చి గుండె ప‌నితీరు స‌జావుగా ఉండేలా చేస్తుంది.

9. మెంతులు

9. మెంతులు

1 టీస్పూన్ మెంతుల‌ను రాత్రంతా నీళ్ల‌లో నాన‌బెట్టి ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తినాలి. లేదా ఒక టీ స్పూన్ మెంతుల‌ను 5 నిమిసాల‌ను నీళ్ల‌లో వేడి చేసి ఈ మిశ్ర‌మాన్ని వ‌డ‌క‌ట్టి తాగాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే స‌రి.

మెంతుల్లో యాంటీ- ఇన్‌ఫ్ల‌మేట‌రీ గుణాలుంటాయి. ఇవి ఛాతీ నొప్పిని త‌గ్గించ‌గ‌ల‌వు. అంతే కాదు ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ‌ను మెరుగు ప‌ర్చి గుండె ప‌నితీరు స‌జావుగా ఉండేలా చేస్తుంది.

10. బాదం ప‌ప్పు

10. బాదం ప‌ప్పు

గుప్పెడు బాదం పప్పులు తీసుకొని నీళ్ల‌లో రెండు, మూడు గంట‌లు నాన‌బెట్టాలి. ఆ త‌ర్వాత తొక్క తీసి తినాలి. లేదా బాదం నూనె, రోజ్ నూనె క‌లిపి ఛాతీకి రాసుకోవాలి. ఇలా రోజుకో సారి చేయ‌వ‌చ్చు. బాదం ప‌ప్పుల్లో పాలీ అన్ శ్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువ‌. ఇవి గుండె ఆరోగ్యానికి మంచిది. కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తుంది. ఛాతీలో నొప్పి నిదానంగా త‌గ్గుతుంది. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే దీర్ఘ‌కాలంపాటు గుండె, ఛాతీ నొప్పి బారినుంచి మ‌న‌ల్ని మనం కాపాడుకోవ‌చ్చు. అంతే కాదు ఇత‌ర శ‌రీర భాగాల ఆరోగ్య‌మూ మెరుగువుతుంది. మ‌రి మీరూ ట్రై చేస్తారు క‌దూ!

English summary

effective-home-remedies-to-treat-chest-pain

When you experience a sharp, intense, and burning sensation in your chest, the first thought that comes to your mind is that it is a heart attack. And you begin to panic. Though cardiac arrest is a probability, especially when you experience pain in the left side, it may not always be the sole reason. So, what is the exact cause of your chest pain?