శరీర బరువును పెంచే యోగాసనాలు !

Subscribe to Boldsky

మీరు సన్నగా ఉండటం వల్ల బాగా విసుగుచెందారా ? మీరు బరువు పెరగాలని కోరుకునే వారైతే సరైన పోషకాహారంతో కూడిన సరైన శారీరక శ్రమను పాటించవలసిన పద్ధతిని మీరు బాగా అర్థం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీ శరీరం యొక్క పరిమాణాన్ని పెంచడంలో ఆహారం అనేది ప్రముఖమైన పాత్రను పోషించలేని కారణంగా ప్రత్యేకమైన డైయిట్ ను పాటించవలసిన అవసరమేమీ లేదు.

మీరు తీసుకొనే క్యాలరీల యొక్క పరిమాణాన్ని పెంచుకోవటం అనేది కేవలం కండరాల యొక్క నిర్మాణం కోసం మాత్రమే అని గుర్తుంచుకోండి. శారీరకశ్రమ వల్ల కండరాలకు సంబంధించిన క్యాలరీలను పెంచేదిగా ఉంటుంది గానీ, కొవ్వును పెంచేదిగా మాత్రం కాదు.

Effective Yoga Asanas For Weight Gain

అనోరెక్సియా (లేదా) బులీమియా వంటి కఠినమైన తిండి లోపాల కారణంగా శరీర బరువు కోల్పోయిన వారిలో - బరువు పెరగటం అనేది చాలా అవసరం. ఎక్కువ చక్కెరను కలిగిన (లేదా) జంక్ ఫుడ్ తినడం వల్ల మీకు చాలా కేలరీలను అందించగలదు కానీ, మీ శరీర కండరాలకి సంబంధించిన క్యాలరీలను కంటే కొవ్వును పెంచడాన్ని - మీరు గుర్తించలేరు.

మీరు మీ బరువును పెంచుకోవాలనుకుంటే, మీ శరీరాన్ని పోషించటానికి కావలసినంత ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు, అవసరమైన యోగా అభ్యాసాలను శ్రద్ధగా పాటించాలి.

అనుకూలమైన శరీర బరువును పొందడమంటే, సమతుల్యంతో ఉన్న సరైన ఆరోగ్యాన్ని సాధించాలనే కోరికను కలిగి ఉండటం మరియు యోగా చెయ్యటం వల్ల శరీర హార్మోనులను పనితీరును నియంత్రించడం వల్ల, సమర్ధవంతమైన మార్గంలో శరీరాన్ని రీఛార్జ్ చేయడం వల్ల ఆరోగ్యకరమైన రీతిలో శరీర బరువు పెరుగుదలను మెరుగుపరుస్తుంది.

Effective Yoga Asanas For Weight Gain

1. వజ్రాసనా యోగ (లేదా) డైమండ్ ఆకృతి :

మీరు వజ్రాసనా యోగ లేదా డైమండ్ భంగిమను ఎప్పుడైనా ప్రయత్నించారా ? ఈ యోగ ఆసనము ముఖ్యంగా శ్వాసకు మరియు ధ్యానం కోసం చాలా మంచిది. ఈ యోగా భంగిమను అనుసరించడానికి మీ కడుపు ఖాళీగా ఉండాల్సిన అవసరం లేదు; ఈ యోగా భంగిమను మీరు భోజనం (లేదా) విందు చేసిన తర్వాత కూడా సాధన చేయవచ్చు.

మొదటగా, మీ కాళ్ళను వెనుకకు మడిచి కూర్చోండి. మీ పిరుదులకు విశ్రాంతిని కలిగించేలా మీ కాలి మడమపై కూర్చోవాలి. మీ తొడలు దూడ కండరాల (కాఫ్ మజిల్స్) మీద ఉంచాలి మరియు మీ చేతులను మీ మోకాలు మీద ఉంచాలి. మీ మోచేతులు అనేవి సరళరేఖలో ఉండాలి.

ఇప్పుడు మీరు క్రమంగా గాలిని పెంచడానికి మరియు వదలటానికి ప్రయత్నం చేయండి. ఇలా సాధన చేసేటప్పుడు మీ కళ్ళను మూసి వేయడం వల్ల మీ మనస్సుకు ప్రశాంతత కలిగి విశ్రాంతిని పొందగలరు. ఈ భంగిమలో మీరు సుమారుగా 60 - 180 సెకన్ల వరకు వేచి ఉండండి. అలానే మీరు లోతైన ఉచ్ఛ్వాసమును మరియు నిశ్వాసమును తీసుకునేలా ప్రత్యేకమైన శ్రద్ధను పెట్టండి.

ప్రయోజనాలు: ఈ వజ్రాసనం వల్ల ఆకలి కలిగించేదిగానూ, జీర్ణక్రియను మరియు రక్తం ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఈ ఆసనమును క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల తినే ఆహార పదార్థాల నుండి మంచి పోషకాలను గ్రహించి ఇది శరీర బరువును పెంచుటకు చాలా ఉపయోగకారిగా ఉంటుంది.

Effective Yoga Asanas For Weight Gain

2. పవనముక్తాసనం :

పవన్ముఖాసనము అనేది సులభమయిన యోగాసనాలలో ఒకటి మరియు కొత్తగా సాధన చేసేవారు దీనిని సులభంగా అభ్యసించవచ్చు. మీరు వెనుకకు పడుకుని, మీ పాదాలు రెండూ కలిసి సమాంతరంగా ఉండేలా చూసుకోండి. మీ చేతులను, మీ శరీరం పక్కన ఉంచాలి. ఈ స్థితిలో ఉన్నప్పుడు మీ కాళ్ళను సమాంతరంగా పైకిలేపి, చాతికి మీ మోకాళ్లు తగిలేటట్టుగా కాళ్లను మడవాలి.

ఆ తర్వాత మోకాళ్ళ చుట్టూ మీ చేతులను ఉంచి పట్టుకునేలా ఉంచండి. మోకాళ్ళపై మీ చేతుల పట్టును బిగించి, మీ ఛాతీపై ఒత్తిడిని పెంచడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత మీరు శ్వాసను వదిలేటప్పుడు మీ తలను నేల మీద నుండి పైకి లేపి - మోకాళ్ళకు తాకేలా ఆన్చడానికి ఛాతీ పైకి తీసుకురావడానికి ప్రయత్నించాలి. ఈ విధంగా మీరు మీ గడ్డాన్ని మోకాలికి తాకేలా చూడాలి..

ఈ విధమైన భంగిమలో కొద్దిసేపు వరకూ అలానే ఉండాలి, సుదీర్ఘమైన శ్వాసను కలిగి ఉండటానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు శ్వాసను పీలుస్తూ ఛాతీ నుండి మీ తలను తిరిగే నేల పైకి తీసుకు రావటానికి ప్రయత్నించండి. ఈ వ్యాయామాన్ని ఎలా అనే సాధన చేయండి.

ప్రయోజనాలు: ఇది మీ వెన్నెముకను బలపరుస్తుంది మరియు ఆకలి మెరుగుపరుస్తుంది మరియు జీర్ణ సమస్యలను సరిచేస్తుంది. ఈ ఆసనమును సాధన చేయడం వలన పెద్ద ప్రేగులలో చిక్కుకున్న గ్యాస్ విడుదల చేయటానికి సహాయపడుతుంది. గర్భిణీ స్త్రీలు ఈ ఆసానాను ఎన్నడూ సాధన చెయ్యవద్దు.

Effective Yoga Asanas For Weight Gain

3. మస్త్యాసనం :

మస్త్యాసనం (లేదా) చేప భంగిమ, కడుపు సమస్యలకు సహాయపడుతుందని మరియు మెడ మరియు భుజాలపై ఉన్న రుగ్మతలను తగ్గించటానికి సహాయపడుతుంది. మీరు వెనుకకు పడుకోవడానికి ప్రయత్నించండి. మీ కాళ్ళను కలిపే ఉంచండి మరియు పిర్రల కింద భాగంలో మీ చేతులను ఉంచండి. మీ ముంజేతులు మరియు మోచేతులు మొండానికి దగ్గరగా ఉండాలి. అరచేతులను నేల మీద ఉంచాలి.

లోపలికి గాలి పీల్చేటప్పుడు మరియు మీ తలను మరియు ఛాతీని బాగా పైకి లేపాలి. మీ ఛాతీని అలానే కొంత సమయమ వరకూ పైకెత్తబడి ఉంచండి మరియు ఈ గాలిని బయటకు వదిలేటప్పుడు మీ తలను నెమ్మదిగా వెనుకకు దించటానికి ప్రయత్నించండి. అలా నెమ్మదిగా మీ తలను నేలకు తాకించండి. మీ మోచేతులు నేలపై గట్టిగా ఆన్చి ఉంచాలి.

ఈ యోగా భంగిమలో మీ శరీర బరువును మీ తలపై ఉంచకుండా, మోచేయి మీద ఉంచుతున్నారు. ఇక్కడ మీ మెడ మీద బరువు అనేది చాలా తక్కువగా ఉండాలి, తద్వారా మీ మెడను అధిక శ్రమకు గురవ్వదు. 10 దీర్ఘమైన శ్వాసలను తీసుకునేంత వరకూ మీరు అదే భంగిమను కొనసాగించండి.

శ్వాసను సున్నితంగా లోపలికి పీలుస్తూ - బయటకు వదలాలి. ఈ భంగిమలో విశ్రాంతిని పొందటం కోసం ప్రయత్నించండి. ఇప్పుడు గాలిని పీల్చేటప్పుడు మీ తలను మరియు మొండెమును భూమి నుండి దూరంగా పైకి ఎత్తండి. ఆ తరువాత గాలి వదిలేటప్పుడు మీ తలను నేలకు దించి, మీ ఛాతీని మరియు మొండెమును వదులు చేసి నేలకు ఆన్చి ఉంచేలా నిర్ధారించుకోండి. మీ చేతులను శరీరానికి ప్రక్క వైపుకు తీసుకురావడానికి ప్రయత్నించి, ఆ తరువాత విశ్రాంతి తీసుకోండి.

ప్రయోజనాలు: ఈ ఆసనం మీ భంగిమను మెరుగుపరుస్తుంది మరియు మీ వెన్నెముక చుట్టూ ఉన్న కండరాలను బలపరుస్తుంది. ఇది ఆకలిని పెంచుతుంది మరియు మలబద్దకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

Effective Yoga Asanas For Weight Gain

4. సర్వాంగాసనం :

మీ వెన్నుని నేలకు ఆన్చి వెల్లకిలా పడుకోవడాన్ని ప్రారంభించండి. మీ వీపును నేలకు ఆన్చి బాగా పడుకొని, మరియు మీ చేతులకు విశ్రాంతిని కలిగించేటట్లుగా నేలకు పూర్తిగా ఆన్చి ఉంచాలి. సాధారణమైన శ్వాసను పీల్చుకోవడానికి ప్రయత్నించండి. గాలిని బయటకు వదిలి మళ్లీ లోపలికి తీసుకునేటప్పుడు మీ పొత్తికడుపును లోపలకు ఉంచడానికి ప్రయత్నిస్తూ, మీ రెండు కాళ్ళను నేల నుండి 90 డిగ్రీ కోణం వరకు నెమ్మదిగా ఎత్తండి.

ఆ తర్వాత గాలిని బయటకు వదిలేటప్పుడు, నేల నుండి నడుము మరియు హిప్ ను పైకి లేపండి. గాలిని పీల్చేటప్పుడు తిరిగి మీ కాళ్ళును మరియు వెనుక భాగాన్ని పైకి ఎత్తేందుకు ప్రయత్నించండి. సహాయం కోసం మీ చేతులను వెనుకవైపు ఉన్న నేలకు ఆన్చి బలమైన ఆధారాన్ని ఇవ్వండి. అలా మీ గడ్డం అనేది ఛాతీ మీద విశ్రాంతి తీసుకోవాలి అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. మీ కళ్ళు మీద మరియు కాలి మీద దృష్టిని పెట్టండి. ఈ స్థితిలోనే 2 నిమిషాల పాటు కొనసాగుతూ ఉండండి, ఆ తర్వాత సాధారణమైన శ్వాసను తీసుకోవడాన్ని కొనసాగించండి.

ప్రయోజనాలు: ఈ ఆసనము మీలో దాగున్న ఒత్తిడిని మరియు నిస్పృహల యొక్క లక్షణాలను నయం చేసి, తిరిగి పునరుజ్జీవింపచేయటానికి సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఇది జీర్ణ సమస్యలకు చక్కని పరిష్కారంగా పనిచేస్తుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Effective Yoga Asanas For Weight Gain

    Weight gain is highly essential for those people who have lost body weight due to stern eating disorders like anorexia or bulimia. Eating sugar or junk food can supply a lot of calories but you don't realize that your body tends to end up gaining fat. If you want to increase your weight all you need to do is practice
    Story first published: Saturday, January 20, 2018, 8:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more