For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మద్యపానం పూర్తిగా దూరం చేశాక శరీరంలో జరిగే 8 ప్రధాన మార్పులు

|

ఆల్కహాల్ అనేది అనేక రూపాల్లో పురాతన కాలాల నుండి ఉనికిలో ఉన్న ఒక మత్తుపానీయం. శతాబ్దాల పూర్వం నాటి చరిత్రల నుండి, సాహిత్య పుస్తకాలవరకు ఆల్కహాల్ గురించిన అనేక వివరాలను ఇప్పటికీ చూడవచ్చు. ఆల్కహాల్ అనేది ఒక మనోరంజక ద్రవపదార్థంగా నిర్వచించవచ్చు. బీర్, వైన్, వోడ్కా, విస్కీ, రమ్ మొదలైన అన్ని మద్య పానీయాలలోనూ ప్రధానమైన పదార్ధంగా ఆల్కహాల్ ఉంటుంది.

మద్యం యొక్క రసాయన నామం ఇథనాల్ మరియు ఇది ప్రజల వినోద ప్రయోజనాలకై ఉపయోగించే అతి పురాతనమైన మరియు అత్యంత సాధారణమైన మద్యపానీయాలు లేదా పదార్ధాలలో ఒకటిగా చెప్పబడుతుంది. ఒక వ్యక్తి పరిమితి మోతాదును మించిన మద్యం సేవిస్తే, దానిలోని మత్తుపదార్థం అధిక భావనలకులోనై, క్రమంగా శరీరంలో అనేక స్వల్పకాలిక మార్పులను చూపిస్తుంది. తద్వారా శరీరంలోని అవయవాలపై విష ప్రభావం పడడమే కాకుండా, అనేక రోగాలకు దారితీసి, సరైన సమయంలో చర్యలు తీసుకోని ఎడల ప్రాణాంతకంగా కూడా మారుతుంది.

8 Things That Happen To Your Body When You Quit Alcohol Completely

మద్యపానం మత్తు యొక్క ప్రధాన లక్షణాలలో కొన్ని: మూడ్ స్వింగ్స్, సుఖభ్రాంతి, కండరముల విశ్రాంతత మరియు తాత్కాలికంగా ఒత్తిడి మరియు ఆందోళన ప్రభావాలు తగ్గుట, శరీరం చేతనస్థితి కోల్పోవుట, మొదలైనవిగా ఉన్నాయి.

కొందరికి ఈ లక్షణాలు నచ్చడం మూలంగానే తెలీకుండా వ్యసనపరులుగా మారుతున్నారు. కానీ ఇది తాత్కాలిక లక్షణాలే అయినా, క్రమంగా వ్యసనం మనిషిని అదఃపాతాళానికి తీసుకుని వెళ్తుంది. ఆర్ధిక సమస్యలు, కుటుంబ, ఆరోగ్య సమస్యలతో పాటు చివరాఖరుగా ప్రాణాలను కూడా తీసేస్తుంది. రోజులో కొంత మోతాదు అంటూ మొదలుపెట్టి, వ్యసనంగా మార్చుకున్న అనేకులను మనం చుట్టూతా చూస్తుంటాము.

ఆల్కహాల్ రక్తంతో కలిసినప్పుడు వేగంగా మెదడుకి చేరుతుంది, ఇక్కడ అది వై-అమినోబ్యుటైరిక్ ఆమ్లం అనే న్యూరోట్రాన్స్మిటర్ ప్రభావాలను పెంచుతుంది. న్యూరోట్రాన్స్మిటర్లో పెరుగుదల అనేది మద్యం తీసుకునేటప్పుడు ప్రజలు తాత్కాలిక ఆనందానికి గురిచేసేలా చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

ఒక వ్యక్తి పరిమిత మోతాదు కన్నా అధిక మద్యం తీసుకుంటున్న ఎడల, సుఖభ్రాంతి లక్షణాల ప్రభావం తరువాత, నెమ్మదిగా "హ్యాంగోవర్" అని పిలవబడే ఒక పరిస్థితికి దారి తీస్తుంది. ఒక హ్యాంగోవర్ అనేది మద్యపానం అధికంగా తీసుకున్నప్పుడు కొన్ని గంటల తర్వాత సంభవించే సాధారణ పరిస్థితిగా ఉంటుంది.

శరీరంలో ఆల్కహాల్ సంబంధిత అణువులను విచ్ఛిన్నం చేయటానికి శరీరం అదనపు శ్రమ చేయవలసి ఉంటుంది. అటువంటి సందర్భంలో హ్యాంగోవర్ సంభవిస్తుంది. అధిక మద్యం తరచూ తీసుకుంటున్న ఎడల, హాంగోవర్ తీవ్ర పరిణామాలను చూపే అవకాశాలు ఉన్నాయి. క్రమంగా తలనొప్పి, వికారం, వాంతులు, మైగ్రేన్, కడుపు నొప్పి, అజీర్ణం, మలబద్ధకం లేదా అతిసారం, అలసట మొదలైన సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి.

అంతేకాకుండా, ప్రతి రోజూ మద్యం సేవించడం మూలంగా మానసిక సమస్యలకు సైతం దారితీస్తుంది. ఊబకాయం, గుండె జబ్బు, అధిక కొలెస్ట్రాల్, నిరాశ మొదలైన ఇతర ప్రధాన వ్యాధులకు లేదా సమస్యలకు కారణమవుతుంది. ఇక్కడ మద్యం పూర్తిగా ఆపివేసిన పక్షంలో శరీరంలో జరిగే 8 ప్రధాన మార్పుల గురించిన వివరాలు ఇవ్వడం జరిగినది.

1. బరువు తగ్గడం:

1. బరువు తగ్గడం:

ఆల్కహాల్, అధిక మొత్తంలో కేలరీలను మరియు తక్కువ పోషకాలతో కూడిన ఒక పదార్ధం. అంతేకాక, గతంలో జరిగిన పరిశోధనలలోని అధ్యయనాలు, వారానికి ఒకసారి మద్యం తీసుకున్నా వ్యక్తి ఆకలిని గణనీయంగా పెంచుతుందని పేర్కొంది. ఈ రెండు కారణాలు బరువు పెరగడానికి కారణం కావచ్చు. కాబట్టి, మద్యం పూర్తిగా త్యజించడం ద్వారా బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి. క్రమంగా శరీరంలోని చెడు క్రొవ్వులు కూడా తగ్గుముఖం పడుతాయి.

2. కొలెస్ట్రాల్ తగ్గుదల:

2. కొలెస్ట్రాల్ తగ్గుదల:

కేలరీలు, కొవ్వు మరియు పిండి పదార్ధాల ఉనికి గల మద్యం, ముఖ్యంగా బీర్, విస్కీ మరియు రమ్ వంటి ఆల్కహాల్ సంబంధిత పానీయాలలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, ఒక వ్యక్తి తరచుగా వీటిని సేవిస్తున్న ఎడల, వాటి నిల్వలు శరీరంలోని ధమనులలో పెరిగిపోయి నెమ్మదిగా కొలెస్ట్రాల్ పెరుగుదల జరుగుతుంది. కావున, వీటిని తగ్గించడం మూలాన కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుముఖం పడుతాయని పరిశోధకులు చెప్తున్నారు.

3. అధిక రక్తపోటు తగ్గుదల:

3. అధిక రక్తపోటు తగ్గుదల:

ఆల్కహాల్లో ఉండే రసాయన పదార్ధాలు వ్యక్తి యొక్క రక్తపోటును అసాధారణరీతిలో పెంచగలిగే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. అధిక మద్య వినియోగం, కొలెస్ట్రాల్ లెవల్స్ పెంచడమే కాకుండా, గుండెకు రక్తసరఫరా అందించడంలో ఆటంకాన్ని కలుగజేస్తుంది. క్రమంగా, మద్యం వినియోగం అధిక రక్తపోటుకు దారి తీస్తుంది. కావున మద్యం త్యజించడం ద్వారా రక్త పోటును క్రమబద్దీకరించవచ్చు.

4. మెరుగైన శక్తి స్థాయిలు:

4. మెరుగైన శక్తి స్థాయిలు:

ఒక వ్యక్తి మద్యం సేవించునప్పుడు, కొన్ని నిమిషాల తరువాత, అతను/ఆమె తమకు తాము శక్తివంతమైన భావనను పొందవచ్చు. అయితే, అధిక మద్యపానం దీర్ఘకాలిక వినియోగం మీ జీవక్రియలను క్రమంగా తగ్గిస్తుంది మరియు నిరంతర అలసటకు కారణమవుతుంది. కావున, మద్యపానం త్యజించడం మీ శక్తి స్థాయిలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

5. సమర్థవంతమైన వర్కౌట్ సెషన్స్

5. సమర్థవంతమైన వర్కౌట్ సెషన్స్

ప్రతిరోజూ మద్యం సేవించే వారు, క్రమంతప్పకుండా వార్కౌట్స్ చేస్తున్నప్పటికీ, పూర్తి స్థాయిలో ఎప్పటికీ ఫిట్ గా ఉండలేరని అనేక అధ్యయనాలలో తేలిన నిజం. మద్యం శరీరాన్ని అలసటతో బాధపెడుతుంది, అందువల్ల పూర్తి వ్యాయామం సెషన్లో మార్పులు చేయాల్సి రావొచ్చు. అదనంగా, మద్యపానం కండరాల పెరుగుదలను నిరోధించగలదు మరియు మీరు తగినంత కండరాల పటిమను కూడా పొందలేరు. కావున, వ్యాయామం నుండి మెరుగైన ఫలితాలను పొందడానికి మద్యపానాన్ని విడిచిపెట్టడం మీకు శ్రేయస్కరం.

6. మెరుగైన రోగనిరోధక శక్తి

6. మెరుగైన రోగనిరోధక శక్తి

మద్యం మీ శరీరంలోని కణాల బలహీనతలకు కారణమవుతుంది, దీనికి కారణం మద్యంలో అధిక మోతాదులో విషతుల్య రసాయనాలను కలిగి ఉండడమే. మద్యపానం మీ రోగనిరోధక వ్యవస్థను నెమ్మదిగా బలహీనపరుస్తుంది. కావున, మద్యం త్యజించడం ద్వారా రోగ నిరోధక శక్తిని తిరిగి పొందడమే కాకుండా, అనేక రోగాల బారిన పడకుండా కూడా శరీరాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

7. డిప్రెషన్ సమస్యను తగ్గిస్తుంది

7. డిప్రెషన్ సమస్యను తగ్గిస్తుంది

మద్యం మెదడులో న్యూరోట్రాన్స్మిటర్ల యొక్క హెచ్చుతగ్గులకు కారణమవుతుండటం వలన, దీర్ఘకాలిక వినియోగం బుద్ది మాంద్యం వంటి మానసిక రుగ్మతలకు కారణమవుతుంది. కావున, మద్యపానాన్ని విడిచిపెట్టిన వ్యక్తి నిరాశ, ఆందోళన, ఆత్రుత,, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలకు చెక్ పెట్టవచ్చు. డిప్రెషన్లో ఉన్న వ్యక్తులు ఎక్కువగా మద్యాన్ని తీసుకోడానికి ఇష్టపడుతారని అనేక అధ్యయనాలలో తేలిన విషయం. కానీ మద్యపానం, సమస్యను తగ్గించదు సరికదా సమస్యను రెట్టింపు చేస్తుంది. కావున మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే, మానసిక ప్రశాంతతకు అంత దగ్గరగా ఉన్నట్లు లెక్క.

8. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

8. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

ఆల్కహాల్ వినియోగించకపోవడం లేదా ఒక టీటోటాలర్గా మారడం ద్వారా కూడా క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు. అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన ఒక పరిశోధనా అధ్యయనం ప్రకారం, మద్యం సాధారణ వినియోగం కూడా శరీరంలోని కొన్ని భాగాలలో క్యాన్సర్ కణాలు అసాధారణంగా పెరగడానికి కారణమవుతుంది. కావున, మద్యపానాన్ని విడిచిపెట్టిన కారణంగా పెద్దప్రేగు కాన్సర్, కాలేయ క్యాన్సర్ మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి క్యాన్సర్ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు.

మద్యపానం, అనేక అనార్ధాలకు దారితీస్తుంది. మనిషిఆర్ధిక స్థితిగతుల నుండి కుటుంబ సంతోషాల దాకా అన్నిటినీ చిన్నాభిన్నం చేస్తుంది. అంతటితో కాకుండా, శరీరాన్ని కూడా క్రమంగా నాశనం చేస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే స్లో పాయిజన్ వలె, నెమ్మదిగా అంతర్గత అవయవాలను దెబ్బతీసి కాన్సర్ నుండి స్ట్రోక్ వంటి సమస్యల దాకా అనేక అనారోగ్యాలకు కారణమవుతుంది. మద్యపానం వినియోగం శరీర జీవక్రియలు, హార్మోనుల సమతౌల్యం మీద ప్రధానంగా ప్రభావం చూపుతుంది. క్రమంగా కిడ్నీ ఫెయిల్యూర్, కాలేయ సంబంధిత సమస్యలు, జీర్ణ సంబంధ సమస్యలు, రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్ మొదలైన సమస్యలతో పాటు, కాన్సర్ వంటి దారుణమైన వ్యాధులకు కూడా కారణంగా మారుతుంది. ఇథనాల్, కాన్సర్ కణాలను ప్రోత్సహించే లక్షణాలను కలిగి ఉంటాయి. కావున మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని వైద్యులు సూచిస్తున్నారు.

నిజానికి అనేకమందికి మద్యపానాన్ని వెంటనే మానేయడం వలన కూడా సమస్యలు వస్తాయి అని అపోహపడుతుంటారు. నిజానికి అది అబద్దం. శరీరంలో ఇది వరకే కుళ్ళిపోయిన భాగాల వలెనే ప్రాణాపాయం కలుగుతుంది కానీ, మాని వేయడం వలన కాదు. నిజానికి మద్యపానం మానివేయడం, సమస్య తీవ్రతను తగ్గిస్తుంది. క్రమంగా జీవక్రియలు కూడా మెరుగుపడుతాయి అని వైద్యులు సూచిస్తున్నారు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

8 Things That Happen To Your Body When You Quit Alcohol Completely

Although alcohol is a beverage which is not very harmful to health when it is consumed occasionally, consuming it on a regular basis can bring about a number of ailments, both psychological and physiological. There are a number of positive changes that can happen to your body when you quit alcohol completely, such as weight loss, low risk of depression, cancer, etc.
Story first published: Tuesday, August 21, 2018, 18:10 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more