For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎవరికీ అస్సలు ఇవ్వకూడని/తీసుకోకూడని 8 వస్తువుల లిస్టు ఇదిగో, ఎందుకంటే అవి మీ ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి.

|

దగ్గరివారితో పంచుకోటానికి కొన్ని వస్తువులు తప్పక ఉంటాయి. కానీ వ్యక్తిగత శుభ్రతా వస్తువులు పంచుకోవటం మాత్రం అస్సలు చేయకూడదు.

పంచుకుంటే ఏ హాని అన్పించని ఈ వస్తువులే నిజానికి తీవ్ర చర్మ మరియు ఆరోగ్య సమస్యలను, అవి తెచ్చిపెట్టే రిస్క్ ను పెంచుతాయి.

Things You Must Never Share With Others

మనకి ఇంతకుముందే దువ్వెన లేదా టూత్ బ్రష్ లాంటి వస్తువులు ఇతరులకి ఇవ్వకూడదు లేదా తీసుకోకూడదు అని తెలుసు.

ఇలాంటి వస్తువులకి యజమాని ఒకరికంటే ఎక్కువ ఉండకూడదు, అందుకని మీరు వాటిని మంచి స్థితిలో ఉండేట్లుగా శుభ్రంగా ఉంచాలి.

వాటిని ఎవరితో పంచుకోకుండా ఉండటం తప్పనిసరి, ఎందుకంటే ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకే ఇన్ఫెక్షన్లకి ఇవే ముఖ్య కారణాలు కావచ్చు.

ఈ ఆర్టికల్ లో మేము మీరు ఎవరితో ఎప్పుడూ పంచుకోకూడని వస్తువుల లిస్టును అందించాం. ఎవరికీ ఇవ్వకూడని లేదా తీసుకోకూడని ఈ వస్తువుల లిస్టు ఏమిటో తెలుసుకోడానికి కింద చదవండి.

1.ఇంట్లో వాడే చెప్పులు

1.ఇంట్లో వాడే చెప్పులు

ఇంట్లో వాడే చెప్పులు లేదా బూట్లు ఎవరితో అస్సలు పంచుకోకూడదు. మీరు వేసుకున్నప్పుడు, వాటిల్లో మీ పాదాలకి చెమట పట్టటం సహజమే. దీనివలన అక్కడ ఫంగస్ ఎదగటానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది.అందుకని వీటిని ఎవరితోనైనా షేర్ చేసుకుంటే ఇన్ఫెక్షన్ వారికి కూడా అంటుతుంది.

2.చర్మ సంరక్షణ ఉత్పత్తులు

2.చర్మ సంరక్షణ ఉత్పత్తులు

ముఖాన్ని శుభ్రం చేసుకునే బ్రష్ లు, మసాజ్ రోలర్స్ మరియు ప్రత్యేక స్పాంజిలను శుభ్రం చేయటం సులభమే. కాకపోతే వాడుతున్నకొద్దీ, కొంత కాలం తర్వాత వాటి ముళ్ళకి మరియు బ్రష్ లపై కొంచెం బ్యాక్టీరియా చేరిన చర్మం ముక్కలు ఉండిపోతాయి. ఇవి మొటిమలను, ముక్కలుగా ఊడిపోయే చర్మాన్ని కలిగిస్తాయి.

3.తువ్వాళ్ళు

3.తువ్వాళ్ళు

టవల్ యొక్క ముఖ్యమైన పని శరీరంపై నుండి తడిని పీల్చుకోవటం. బాత్ రూంలో పెరిగే తేమ వలన మీ తువ్వాలు యొక్క తడి చేరిన ప్రాంతం బ్యాక్టీరియా, ఫంగస్ పెరగటానికి అనువైన ప్రదేశంలా మారిపోతుంది. అందుకే ఎవరితో పంచుకోటానికి వీల్లేని వస్తువులలో ఇది కూడా ఒకటి.

4.డియోడరెంట్లు

4.డియోడరెంట్లు

ఏ డియోడెరెంట్ల ఉపరితలం అయితే చర్మానికి తగులుతుందో వాటిల్లో బ్యాక్టీరియా తప్పక చేరుతుంది. నిజానికి మనం ముసుగువేయాలనుకునే చెడు వాసనను కూడా బ్యాక్టీరియానే కలిగిస్తాయి కదా.

5.మానిక్యూర్ మరియు కాస్మెటిక్ ఉత్పత్తులు

5.మానిక్యూర్ మరియు కాస్మెటిక్ ఉత్పత్తులు

మీ ట్వీజర్లు, నెయిల్ క్లిప్పర్లు, అవాంఛిత రోమాలను తొలగించే ఎపిలేటర్లు, రేజర్లు మరియు ఇతర అలాంటి వస్తువులు కేవలం మీరే ఉపయోగించాలి. ఇలాంటి వస్తువులలో కనిపించని స్థాయిలో చిన్న రక్తం చుక్కలు వాటి ఉపరితలంపై అతుక్కుని ఉంటాయి. వాటిని ఇంకొకరితో పంచుకోవటం వలన మీకు హెర్పిస్ మరియు ఇతర ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి.

6. హెయిర్ క్లిప్ మరియు కర్లర్స్

6. హెయిర్ క్లిప్ మరియు కర్లర్స్

మీ అందరికీ తెలిసినదే, ఇంకొకరికి మీ దువ్వెన ఇవ్వటం అంత మంచి ఐడియా కాదని. కానీ కొన్నిసార్లు ఇతర జుట్టు ఉత్పత్తులకి కూడా ఇదే వర్తిస్తుందని మీకు తెలుసా? ఇతరులనుంచి తీసుకున్న హెడ్ బ్యాండ్లు, దువ్వెనలు, స్క్రంచీలు మరియు కర్లర్స్ నుంచి ఫంగస్ మరియు పేలు కూడా సులభంగా రవాణా అవుతాయి. అందుకే ఈ వస్తువులను ఎవరికీ ఇవ్వవద్దు మరియు తీసుకోవద్దు కూడా.

7.హెడ్ ఫోన్స్

7.హెడ్ ఫోన్స్

ప్రతి వ్యక్తికి తన చెవి గువిలిలో ప్రత్యేకమైన బ్యాక్టీరియా బ్యాలెన్స్ ఉంటుంది. మనం మన హెడ్ ఫోన్స్ ని ఇంకొకరికి ఇవ్వాలనుకుంటే ఆ సమతుల్యతను పాడుచేస్తున్నట్టు. దీనివలన చెవిలో ఇన్ఫెక్షన్ కలగవచ్చు. అందుకే హెడ్ ఫోన్స్ ను ఎవరికీ వాడుకోటానికి ఇవ్వవద్దు.

8. లిప్ గ్లాస్ మరియు లిప్ స్టిక్

8. లిప్ గ్లాస్ మరియు లిప్ స్టిక్

హెర్పిస్ వంటి వ్యాధులు సులభంగా లిప్ స్టిక్ లేదా లిప్ గ్లాస్ ఇతరులతో పంచుకోవటంతో వ్యాపిస్తాయి. ఈ వైరస్ నోటిలోని మ్యూకస్ పొర మరియు లాలాజలంలో ఉంటుంది.

English summary

Things You Must Never Share With Others

There are certain things that you must never lend or borrow from others as it can lead to the spread of infections. Hence this can affect our health big time. We must not share things like indoor shoes, skin care accessories, towels etc.
Story first published:Thursday, February 15, 2018, 13:16 [IST]
Desktop Bottom Promotion