Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
మీ రోజువారీ అలవాట్లు - మీ కంటి చూపును దెబ్బతీస్తుందని మీకు తెలుసా ?
మీ రోజువారీ అలవాట్లు - మీ కంటి చూపును దెబ్బతీస్తుందని మీకు తెలుసా ?
మన జ్ఞానేంద్రియాలలో కళ్ళు చాలా ముఖ్యమైనవి. 80% వరకు మన కళ్ళతోనే మన మన చుట్టూ ఉన్న పరిసరాలను గ్రహించగలము. మనము స్పష్టమైన చూపును కలిగి ఉండటానికి కంటిలో ఉండే అనేక నాడులు ఒకటిగా కలిసి పనిచేస్తాయి. కంటికి సంబంధించిన నరములు, బయటవైపు ప్రసరించే కాంతి ఆధారమైన సంకేతాలను గ్రహించి - మెదడులోని భాగాలకు విద్యుత్ తరంగాల రూపంలో ప్రసరించేలా చేస్తుంది, అలా మీకు స్పష్టమైన చూపును కలుగచేస్తుంది.
కంటిలోని ప్రతి భాగం దాని సొంత పనితీరును కలిగి ఉంటుంది. వాటిలో ఏ ఒక్కటి రాజీపడిన నిర్దిష్టమైన కంటి వ్యాధులు కలగటానికి (లేదా) శాశ్వతమైన అంధత్వానికి దారితీస్తుంది. మన కంటిలో కార్నియా, స్క్లేరా, ఐరిస్, పిపుల్, లెన్స్, రెటీనా, బ్లైండ్ స్పాట్, ఆప్టిక్ నర్వ్, కనురెప్పలు, వెంట్రుకలు, కనుబొమ్మలు, కన్నీటి గ్రంథులు & కంటిపొర వంటి అనేక భాగాలు ఉన్నాయి.

మన రోజువారీ కార్యకలాపాలను నిర్వర్తించడంలో కళ్ళు ముఖ్య పాత్రను పోషిస్తున్నందున, వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీకున్న కొన్ని అలవాట్లు మీ కంటి ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చని మీరు గ్రహించరు. మీ కళ్ళకు హాని కలిగించే మీ రోజువారీ అలవాట్ల గూర్చి తెలుసుకోవడానికి, ఈ క్రింది వ్యాసాన్ని పూర్తిగా చదవండి.

1. సిగరెట్ స్మోకింగ్ :-
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపి వివరాల ప్రకారం, ధూమపానం చెయ్యడం వల్ల కూడా మీ కంటి ఆరోగ్యాన్ని ప్రభావితం కాబడుతుంది. ఇది క్యాటరాక్ట్ ప్రమాదాన్ని పెంచుతుంది - కంటి లెన్స్ కదలిక మీరు చూడడానికి కష్టతరం చేస్తుంది; అలాగే, వయసు పెరిగే కొద్దీ కంటి చూపు క్షీణించడం - రెటీనా సమీపంలో ఉన్న ప్రదేశం దెబ్బతినడం వంటి చర్యల ద్వారా మీ కంటి చూపు బాగా మసకబారుతుంది.
మీరు ధూమపానం చేయడం వల్లే, కంటి రెటీనాకు వెళ్లే రక్త ప్రవాహంలో అడ్డంకులు ఏర్పడటం వల్ల మీ కంటిలో మచ్చలు (వలయాలు) ఏర్పడతాయి. ఇలా ఏర్పడే నల్లని వలయాలపై ఆక్సీకరణ యొక్క హానికరమైన ప్రభావాలు పెరుగటం వల్ల మక్యుల కణాలు తీవ్రంగా క్షీణిస్తాయని డాక్టర్లు తెలిపారు.
ధూమపానంతో సంబంధం ఉన్న ఇతర కంటి సమస్యలు కండ్లకలక, గ్లకోమా, డ్రై ఐ సిండ్రోమ్, లేజీ ఐ, ఆప్టిక్ నర్వ్ డామేజ్ & డయాబెటిక్ రెటినోపతి వంటివి ఉన్నాయి.

2. రాత్రి సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాలను వాడటం :-
మనలో చాలామంది ఎన్నోసార్లు ఎలక్ట్రానిక్ పరికరాల స్క్రీన్స్ను చూసి అసౌకర్యానికి గురవుతారు, దీని వలన మీ కళ్ళ నుండి నీరు కారటం (లేదా) కళ్లు అలసటకు గురవుతాయి. దీనినే "డిజిటల్ ఐ స్ట్రైన్" అని పిలుస్తారు. ఎలక్ట్రానిక్ పరికరాలను మితిమీరిన వాడటం వల్ల, వాటి స్క్రీన్ పై నుండి వచ్చే నీలి కాంతికి కళ్ళు ప్రభావితం అవుతాయి, ఇది కళ్ళను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది, అలా ఇది మీ నిద్రకు అంతరాయం కలిగించవచ్చు, రాత్రి మీరు పడుకునేటప్పుడు మీకు నిద్రాభంగం కలగవచ్చు.

3. వెజిటేబుల్స్ను ఎక్కువగా తినకపోవడం :-
వివిధ రకాల కూరగాయలు కలిగి ఉన్న ఆహారాలను తినడం వల్ల కంటిలో వివిధ భాగాల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. కూరగాయలలో ఉండే ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్లు & విటమిన్లు కంటి రెటీనాను రక్షించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే విటమిన్-C, విటమిన్ E, జింక్, విటమిన్-A వంటివి, పండ్లలో మాత్రమే ఉంటాయి. పండ్లలో ఉన్నన్ని పోషకాలు వేరే వాటిలో ఉండవు.

4. కళ్ళను రుద్దటం :-
మీ కళ్ళలోకి ఏదైనా పదార్థం పడినప్పుడు, మీరు వెంటనే మీ కళ్ళను రుద్దడం ప్రారంభిస్తారు. అప్పటికప్పుడు ఇది మంచి అనుభూతిని కలిగిస్తుంది, కానీ అతిగా రుద్దడం వలన కార్నియా పైన గీతలు ఏర్పడటం & వక్రీకరణకు దారితీయవచ్చు. కార్నియా చాలా సున్నితమైనది కాబట్టి మీ కన్నులోకి ఏదైనా ప్రవేశిస్తే సులభంగా కోతలు ఏర్పడవచ్చు.

5. తగినంత నిద్ర లేకపోవడం :-
అవును, మీ కళ్ళను దెబ్బతీయగల మరొక చెడ్డ అలవాటు ఇది. నిద్రలేమి అనేది మీ కళ్లకు అవసరమైన ద్రావణ ప్రసరణను అందకుండా నిరోధిస్తుంది, ఇది కళ్ళ యొక్క వాపుకు దారితీస్తుంది.
నిద్రలేమి కారణంగా కంటి నరాలు సంకోచించడం, కంటి నాళాలు హఠాత్తుగా శబ్దము చేయటం & యాంటీరియర్ ఇషేమిక్ ఆప్టిక్ న్యూరోపతి (AION) అని పిలవబడే అరుదైన పరిస్థితికి కారణమవుతుంది.

కంటి పరీక్షల వల్ల కలిగే ప్రాముఖ్యత :-
ప్రతీ 6 నెలలకు ఒకసారి కంటి పరీక్షలను చేయించడం వల్ల మీరు గుర్తించలేని & అనుభూతి చెందలేని కంటి దోషాలను నిరోధించవచ్చు.
ఉదాహరణకి, గ్లాకోమా అనేది కంటి వ్యాధి, ఇది చూపుకు సంబంధించి నరాలపై ప్రభావాన్ని చూపుతుంది, కానీ ఇది చాలా మందికి తెలియదు ఎందుకంటే దీని ప్రారంభ దశలో వాటి లక్షణాలు అంత త్వరగా బయటపడవు. అందువల్ల మీ కంటి ఆరోగ్యాన్ని నిర్ధారించడానికి సాధారణ కంటి పరీక్షలను చేయించడం చాలా ముఖ్యం.



Click it and Unblock the Notifications