For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫాదర్స్ డే 2018: పురుషులకు దీర్ఘాయువును ప్రసాదించేందుకు తోడ్పడే 6 అద్భుత చిట్కాలు

ఫాదర్స్ డే 2018: పురుషులకు దీర్ఘాయువును ప్రసాదించేందుకు తోడ్పడే 6 అద్భుత చిట్కాలు

|

పిల్లలు తమ తండ్రిని హీరోగా భావిస్తారు. పిల్లలు తమ మొట్టమొదటి హీరోకి ఒక డేను అంకితమిచ్చారు. అదే, ఫాదర్స్ డే. ప్రతి రోజూ తమ తండ్రిపై ప్రేమను, గౌరవాన్ని అలాగే అభిమానాన్ని కురిపించినా ఈ రోజు మాత్రం తమ ప్రేమను మరింత ప్రత్యేకంగా తమ తండ్రికి తెలియచేస్తారు. తమ తల్లిదండ్రులు సదా ఆరోగ్యంగా అలాగే ఆనందంగా ఉండాలని కోరుకుంటారు పిల్లలు. ఈ ఫాదర్స్ డే నాడు మీరు మీ తండ్రి యొక్క దీర్ఘాయువుకు తోడ్పడే ఈ జాగ్రత్తల గురించి తెలుసుకోండి. ఈ జాగ్రత్తలను మీ తండ్రి పాటించేలా చూసుకోండి. ఇంతకు మించిన గొప్ప కానుక మరేదీ ఉండదనడంలో సందేహం లేదు.

అలాగే, ఈ జాగ్రత్తలను మన జీవితంలో ముఖ్య పాత్రను పోషిస్తున్న మగవారందరూ పాటిస్తే వారంతా దీర్ఘాయువుతో ఆరోగ్యంగా ఉండే అవకాశాలున్నాయి.

మరి ఆ జాగ్రత్తలేంటో తెలుసుకుందామా

1. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి:

1. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి:

ఈ సలహా ఆరోగ్యంగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకోవడానికి ప్రాధాన్యమివ్వాలి. మన శరీరానికి ఏ ఆహారం పడుతుందో తెలుసుకోవాలి. ప్రతి రోజూ పండ్లను అలాగే కూరగాయలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. కొన్ని రకాల ఆహారాలపై వ్యామోహంతో ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దు. కొన్ని ఆహారపదార్థాలు మీకు పడకపోవచ్చు. వాటికి దూరంగా ఉండటం ఉత్తమం.

ఆహారం తినేటప్పుడు తినే తిండిపై శ్రద్ధ పెట్టండి. హోల్ ఫుడ్స్ ద్వారా మీకు తగినన్ని పోషకాలు అందుతాయి. ప్రతిరోజూ డైటరీ నీడ్ కు తోడ్పడే ఆహారపదార్థాలపై దృష్టి పెట్టండి. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్, ఫ్యాట్స్ మరియు తగినంత ఫైబర్ ను డైట్ లో భాగంగా చేసుకోండి. ప్రతి ఒక్కరి శరీర తీరు విభిన్నంగా ఉంటుంది. మీ శరీర తీరు గురించి తెలుసుకుని తగిన విధంగా ఆహారాన్ని తీసుకోండి.

2. తగినంత నిద్ర:

2. తగినంత నిద్ర:

బ్యూటీ స్లీప్ అనడానికి ఒక కారణం ఉంది. తగినంత నిద్ర లభిస్తే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఒక వ్యక్తికి ఎంత నిద్ర అవసరమో వారి వయసును బట్టి ఆధారపడి ఉంటుంది. పసిపిల్లలకు 20 నుంచి 22 గంటల నిద్ర అవసరపడుతుంది. పెద్దవారికి 6 నుంచి 7 గంటల నిద్ర అవసరపడుతుంది. మరుసటి రోజుకి చెందిన కార్యకలాపాలను మీరు చురుగ్గా చేసుకోవాలంటే ఎన్ని గంటల నిద్ర మీకు అవసరపడుతుందో మీరు గమనించుకుంటూ తద్వారా తగినంత నిద్రను పొందేందుకు శ్రద్ధ పెట్టాలి.

తగినంత నిద్ర లేకపోతే వచ్చే నష్టం ఏమీ లేదన్నట్టుగా అనిపిస్తుంది. కానీ, నిద్రలేమి వలన అనేక వ్యాధులు అలాగే శారీరక రుగ్మతలు తలెత్తవచ్చన్న సంగతి తెలుసుకోవాలి. నిద్రకున్న విలువను తెలుసుకోవాలి. అంతేకాక, నిద్రను తగ్గించుకోవడానికి కాఫీలు టీలను ఆశ్రయిస్తారు. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడాన్ని అలాగే ఒకే సమయానికి మేలుకోవడానికి ప్రయత్నించాలి. ఇలా షెడ్యూల్ కు స్టిక్ అయితే అనేక వ్యాధులు అలాగే ఆరోగ్య సమస్యలు దరిచేరవు.

3. వ్యాయమం:

3. వ్యాయమం:

వ్యాయామానికున్న గొప్పతనం మనకు తెలుసు. వ్యాయామం వలన శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇది వాస్తవం కూడా. ఫిట్ నెస్ ను ఇంప్రూవ్ చేస్తుంది. అనేక వ్యాధుల నుంచి రక్షణగా నిలుస్తుంది. ఫిజికల్ యాక్టివిటీస్ వలన దీర్ఘకాలంలో అనేక లాభాలను పొందవచ్చు. అందుకే క్రమం తప్పకుండా వ్యాయామాన్ని చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. జిమ్ లో గంటల తరబడీ చెమటోడ్చడం అవసరం లేదు. సింపుల్ గా మార్కింగ్ వాక్ మరియు ఈవెనింగ్ వాక్ ను మీ రొటీన్ లో భాగంగా చేసుకోవడం ద్వారా కండరాలను యాక్టివ్ గా ఉంచుకోవచ్చు.

4. రెగ్యులర్ హెల్త్ చెక్ అప్స్:

4. రెగ్యులర్ హెల్త్ చెక్ అప్స్:

ప్రాథమిక క్వార్టర్లీ చెక్ అప్ అనేది తప్పనిసరి. బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్ లెవల్స్, కొలెస్ట్రాల్, గుండె ఆరోగ్యం, లోపాలు వంటి వాటి గురించి ఈ ప్రాథమిక చెక్ అప్ ద్వారా ఒక అంచనాకు రావచ్చు. మూడు నెలల కొకసారి ఫుల్ బాడీ చెక్ అప్ అనేది అవసరపడదు. సంవత్సరానికొకసారి ఫుల్ బాడీ చెక్ అప్ ను చేయించుకుంటే మంచిది. రెగ్యులర్ హెల్త్ చెక్ అప్స్ వలన ఏవైనా అనారోగ్య సమస్యలుంటే మనకి తెలుస్తుంది. అవి తీవ్రరూపం దాల్చే లోపు మనం తగిన జాగ్రత్తలను తీసుకోగలుగుతాము.

5. ఒత్తిడిని జయించండి:

5. ఒత్తిడిని జయించండి:

ఒత్తిడి అనేది మరీ చెడ్డది కాదు. కాస్తంత ఒత్తిడి అనేది మనల్ని దృఢంగా మారుస్తుంది. పనులను చేసేందుకు తగిన ప్రేరణను అందిస్తుంది. అయితే, ఒత్తిడి విపరీతమైతే మాత్రం ఇబ్బందులే. ప్రాణాపాయంగా మారవచ్చు. ఒత్తిడి అనేది అనేక విధాలుగా ఎదురవుతుంది. ఒత్తిడి ఎదురయినప్పుడు స్ట్రెస్ హార్మోన్స్ శరీరంలో వరదలా పొంగుతాయి. ఈ హార్మోన్స్ అనేవి ఒత్తిడిని పెంచుతాయి.

యోగా మరియు మెడిటేషన్ ను ప్రాక్టీస్ చేయడం ద్వారా అటువంటి పరిస్థితులను అవాయిడ్ చేయవచ్చు. ఫిజికల్ యాక్టివిటీస్ లో పాల్గొనండి. తద్వారా, ఒత్తిడి నుంచి ఉపశమనం అందుతుంది. ముందుకు వెళుతూ ఉండండి. వివిధ వ్యక్తుల గురించి తెలుసుకోవడం ప్రారంభించండి. మీ పెర్సనల్ అలాగే ప్రొఫెషనల్ లైఫ్ కున్న వ్యత్యాసాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి రోజూ కొంత సమయాన్ని మీ గురించి కేటాయించుకోండి. వీకెండ్ లో రిలాక్స్ అవండి. మీకు నచ్చిన పనులను చేయడంలో లీనమవ్వండి.

6. స్మోకింగ్ కు దూరంగా ఉండండి:

6. స్మోకింగ్ కు దూరంగా ఉండండి:

స్మోకింగ్ అనేది ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అనేది లంగ్స్ పై మాత్రమే దుష్ప్రభావం చూపుతుందని భావిస్తూ ఉంటారు. అయితే, స్మోకింగ్ అనేది లంగ్స్ తో పాటు మరిన్ని ఇతర అవయవాలపై కూడా దుష్ప్రభావం చూపుతుంది. స్మోక్ అనేది బ్లడ్ స్ట్రీమ్ లోకి నేరుగా ప్రవేశిస్తుంది. స్మోకింగ్ వలన దాదాపు 80 శాతం మంది లంగ్ క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారు. కాబట్టి, స్మోకింగ్ కు దూరంగా ఉండటం ఉత్తమం.

English summary

Father's Day 2018: 6 Tips To Aid Longevity In Men

Father's Day 2018: 6 Tips To Aid Longevity In Men,Father's Day is the day we celebrate our first hero. It is the day we want them to know that we love them and that we want them around for as long as we can keep them. We see a lot of them suffering because of negligence of health and other basic necessities. Here are
Story first published:Saturday, June 16, 2018, 17:34 [IST]
Desktop Bottom Promotion