For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యోని వద్ద నొప్పికి దారితీసే ఐదు సాధారణ కారణాలు

యోని వద్ద నొప్పికి దారితీసే ఐదు సాధారణ కారణాలు

|

ఆడవాళ్లకు యోనినొప్పి తీవ్ర అసౌకర్యం కలిగిస్తుంది. ప్రతిరోజు నన్ను సంప్రదించే రోగులలో కనీసం ఒక రోగి అయినా స్త్రీల అవయవాల నొప్పి అనే ఫిర్యాదుతో వస్తారు. యోని నొప్పి గురించి మనం తెలుసుకోబోయే ముందు, అసలు స్త్రీలోని ప్రత్యుత్పత్తి అవయవాల నిర్మాణాన్ని గురించి పరిశీలిద్దాం.

సాధారణంగా మనం స్త్రీ లైంగిక అవయవాల గురించి మాట్లాడేటప్పుడు,'యోని' అనే పదాన్ని రెండు కాళ్ళ మధ్య ఉండే భాగాలన్నింటిని సూచించడానికి వినియోగిస్తాము. కానీ యోని నిజానికి, వుల్వా మరియు గర్భాశయ ముఖద్వారానికి మధ్య ఉండే ఒక కాలువ వంటి నిర్మాణం మాత్రమే.

Five Surprising Common Causes of Vaginal Pain ,

వుల్వాలో పలు వేర్వేరు భాగాలు ఉంటాయి. యోని, అంతర్గత మరియు బాహ్య పెదవులు (లాబియా), స్త్రీ గుహ్యాంకురము (క్లైటోరిస్), మూత్ర రంధ్రం మరియు పెరీనియం (యోని కింది భాగం మరియు పాయువు మధ్య ఉండే భాగం). యోని నొప్పికి దారితీసే 5 సాధారణ కారణాలను గురించి ఇప్పుడు తెలియజేయబోతున్నాము.

1. వెజైనైనటిస్:

1. వెజైనైనటిస్:

ఈస్ట్ లేదా బ్యాక్టీరియా కారణంగా యోని వద్ద కలిగే నొప్పిని వెజైనైనటిస్ అంటారు. దీని వలన యోని వద్ద దురద, స్రావాలు మరియు మంట కలుగుతుంది.

2. యోనిలో పొడిదనం:

2. యోనిలో పొడిదనం:

ఈ పరిస్థితి తలెత్తినపుడు, యోని పొడిగా మారుతుంది. ఇది ఋతుక్రమం ఆగిపోయిన మహిళలలో మాత్రమే కలుగదు. యవ్వన మహిళలలో కూడా గర్భనిరోధక మాత్రలు వాడడం, చంటి పిల్లలకు పాలివ్వడం, యాంటీడిప్రెసెంట్స్ తీసుకోవడం, యాంటిహిస్టామైన్లు వాడడం, కొన్ని రకాల ఆస్తమా మందులు వాడటం వలన స్త్రీల ఆరోగ్యంపై ఒత్తిడి మరియు ఎలెర్జీలు కలగటం (వీటిని అస్సలు ఉపయోగించకూడదు) లేదా వారి భాగస్వామితో తరచుగా పొట్లాడటం వలన సంభవించవచ్చు.

బర్తోలిన్ గ్రంథులలో తలెత్తే ఇన్ఫెక్షన్ల కారణంగా కూడా యోని పొడిగా మారవచ్చు. ఈ గ్రంథులు యోని లోపల, 4 మరియు 6 వ గంటల స్థానాల్లో ఉంటాయి. ఇవి శృంగార సమయంలో కందెనను విడుదల చేస్తాయి కాబట్టి, ఈ గ్రంధి చాలా అవసరమైనది. కొన్నిసార్లు ఇవి పూడుకుపోవడంతో, ఇన్ఫెక్షన్ తలెత్తి, పూర్తిగా తొలగిపోవడం లేదా విధులు సక్రమంగా నిర్వర్తించకపోవడం జరగవచ్చు. ఏ సహజ కందెన ఉత్పత్తి కానప్పుడు, యోని పొడిగా మారుతుంది. మీ వైద్యుడి, మీ వైద్య చరిత్రను సమీక్షించడం ద్వారా, ఈ సమస్యను గుర్తించవచ్చు.

3. పోస్ట్ మెనోపాసల్ వెజైనల్ అట్రాఫి (PAV):

3. పోస్ట్ మెనోపాసల్ వెజైనల్ అట్రాఫి (PAV):

PAV మెనోపాస్ దశకు చేరుకున్న మహిళలలో, ఈస్ట్రోజెన్ ఉత్పత్తి జరగకపోవడం వలన యోని గోడలలో వాపు కలిగి, యోని సన్నబడి, పొడిగా మరియు నొప్పిగా మారుతుంది. వైద్యులు, కటి భాగ పరీక్షల ద్వారా దీనిని నిర్ధారిస్తారు. చికిత్సలో భాగంగా ఈస్ట్రోజెన్ ను అందిస్తారు. యోని కందెనలు మరియు మాయిశ్చరైజర్లు కూడా, ఈ సమస్య పరిష్కారానికి సహాయపడతాయి.

4. వెజైనిస్మస్:

4. వెజైనిస్మస్:

ఈ సమస్య తలెత్తినపుడు, అకస్మాత్తుగా యోని కండరాలు బిగుసుకుని నొప్పి కలుగుతుంది. దీనిని పెల్విక్ ఫ్లోర్ టెన్షన్ మయాల్జియా అని కూడా అంటారు. ఈ పరిస్థితి తలెత్తిన మహిళలలో శృంగారం బాధాకరంగా మారుతుంది. వైద్యులు ఈ సమస్యను కటి భాగ పరీక్షల సమయంలో, స్పెక్యులంను యోనిలోనికి చొప్పించి నిర్ధారణ చేస్తారు. కటిభాగానికి సంబంధించిన వ్యాయామాలు, డిల్డోలు మరియు కౌన్సెలింగ్ ద్వారా, ఈ సమస్యకు చికిత్స చేస్తారు.

5. ఉల్వోడైనియా:

5. ఉల్వోడైనియా:

దీర్ఘకాలికమైన ఈ నొప్పి, ఇన్ఫెక్షన్ వలనో, కేన్సర్ వలనో లేదా చర్మ వ్యాధి వలనో కలుగదు. దురదృష్టవశాత్తు, దీనికి కారణం ఇప్పటి వరకు తెలియరాలేదు. స్త్రీలు సాధారణంగా వుల్వాలో మంట కలుగుతుందని చెబుతారు. బిగుతైన జీన్స్ ధరించడం వలన, ఇది సంభవించవచ్చు. దీనిని నిర్ధారించడానికి ఎటువంటి పరీక్షలు లేవు. ముందుగా వుల్వాకు సంబంధించిన అన్నీ పరీక్షలు జరిపి, అవేవి కారణం కావని తెలుసుకున్నాక, ఉల్వోడైనియాను నిర్ధారణ చేస్తారు. చికిత్సలో భాగంగా, యాంటీ సీజర్ మండలి, ఉపరితల నొప్పి నివారిణిలు మరియు యాంటీడిప్రెసెంట్స్ సిఫార్సు చేస్తారు.

యోని ముఖద్వారం వద్ద కలిగే ఉల్వార్ వెస్టిబ్యులైటిస్ కూడా, ఒక రకమైన ఉల్వోడైనియాగా పేర్కొనవచ్చు. దీని వలన కూడా శృంగారం బాధాకరంగా మారుతుంది. టాంపూన్ వంటివి ఉపయోగించినపుడు, నొప్పి కలుగుతుంది. వైద్యులు, దూది ఉండ పరీక్ష ద్వారా వుల్వాలో ఏ భాగంలో నొప్పి కలుగుతుందో నిర్ధారణ చేస్తారు.

యోని నొప్పి తీవ్రమైన సమస్య కనుక, అలసత్వం చూపకుండా, తక్షణమే వైద్యుని సంప్రదించాలి. మీకు మీరుగా వ్యాధి నిర్ధారణ మరియు చికిత్స చేపట్టరాదు. వైద్యుని సంప్రదించాల్సిన అవసరం లేకుండా చేసుకోవాలనే తలపు చేస్తే, మీకు మీరే ప్రమాదాన్ని సృష్టించుకున్న వారవుతారు. కనుక మీ యోనిని ఆరోగ్యంగా ఉంచుకోండి. మీరు ఆనందంగా ఉండండి.

English summary

Five Surprising Common Causes of Vaginal Pain

Ladies, vaginal pain is real! I see at least one patient daily that complains of pain in her lady parts. But before we dive into some common causes of vaginal pain, let’s review some female anatomy. We all use the word "vagina" to refer to the whole package down there, but the vagina is actually the canal between your vulva and the cervix.On the other hand, the vulva includes many different parts: the opening of the vagina, the inner and outer labia (lips), the clitoris (this one needs no intro), urethra (the hole you urinate out of), and the perineum (the space between the bottom of the vagina opening and the anus).
Desktop Bottom Promotion