For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విటమిన్ బి4 లోపాన్ని అధిగమించటానికి సాయపడే విటమిన్ బి4 ఎక్కువ వుండే ఆహారపదార్థాలు

|

ఎడినైన్ అని కూడా పిలవబడే విటమిన్ బి4, బి కాంప్లెక్స్ విటమిన్లలో ఒకటి. దీనితో పాటు బి1.బి2,బి3,బి5,బి6,బి7,బి9 మరియు బి12 విటమిన్లు కూడా బి కాంప్లెక్స్ లో ఉంటాయి. విటమిన్ బి4 నీటిలో కరగగలిగే విటమిన్, ఇది ఇతర మూలకాలతో కలిసి కో-ఎంజైమ్ గా పనిచేయగలదు. ముఖ్యంగా ఇది శరీరంలో శక్తిని ఉత్పత్తి చేసే ప్రక్రియను వేగవంతం చేస్తుందని ప్రసిద్ధి.

విటమిన్ బి4 ముఖ్యంగా డిఎన్ ఎ మరియు ఆర్ ఎన్ ఎ తయారవ్వటానికి చాలా ముఖ్యం. దీనికి ఇతర పనులు కూడా ఉన్నాయి, కణాలను ఉత్పత్తి అయ్యేలా చూడటం మరియు కణాజాల అభివృద్ధి ఆరోగ్యంగా ఉండేట్లా చూడటం వంటివి. విటమిన్ బి4 లేదా ఎడినైన్ రోగనిరోధక వ్యవస్థను కూడా బలోపేతం చేయడంలో సాయపడుతుంది, దాని వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్లకి, వివిధ వ్యాధులని ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది.

విటమిన్ బి4 కొన్ని అనారోగ్యస్థితులైన నిద్రలేమి,రక్తహీనత, తలనొప్పి, అధిక కొలెస్ట్రాల్, అజీర్తి, గాల్ స్టోన్స్, ముడతలు, మొటిమలు వంటివాటిని తగ్గిస్తుంది. ఈ విటమిన్ లోపం వలన చర్మ సమస్యలు, రక్తంలో సమస్యలు, వర్టిగో(తల తిరగటం), అలసట, కండరాల బలహీనత మరియు మూడ్ బాలేకపోవటం ఇలాంటివి కలుగవచ్చు.

విటమిన్ బి4 ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు మీ రోజువారీ ఆహారంలో ఉంటే ఈ లోపం రాకుండా నివారించవచ్చు. అందుకని విటమిన్ బి4 ఎక్కువ ఉండే ఆహారపదార్థాలేంటో ఒకసారి చూద్దాం.

1.అసలైన పచ్చి తేనె

అప్పుడే తీసిన పచ్చితేనె చాలామంది తినే పదార్థం. ప్రాచీన కాలం నుండి, దీన్ని ఆధ్యాత్మిక, కాస్మెటిక్, వైద్య ఉపయోగాల కోసం విరివిగా వాడుతూనే వస్తున్నారు. పచ్చి తేనెలో విటమిన్ బి4 ఉంటుంది, ఇది ప్రాసెస్ చేయబడ్డ తేనెకన్నా ఎంతో పోషణనిచ్చేది. పచ్చి మరియు ఆర్గానిక్ తేనెను కొని అప్పుడప్పుడూ తింటూ ఉండండి.

2. సంపూర్ణ ధాన్యాలు

2. సంపూర్ణ ధాన్యాలు

సంపూర్ణ ధాన్యాలలో బి విటమిన్లు ఎక్కువ ఉంటాయి, బి4 కూడా. ఓట్లు, గోధుమ, బార్లీ,వరి, మొక్కజొన్న, ఆవం వంటి సంపూర్ణ ధాన్యాలను మీ డైట్ లో చేర్చుకోడం వలన ఆరోగ్యకరమైన కార్బొహైడ్రేట్లు మీ శరీరానికి శక్తినిస్తాయి. ధాన్యపు గింజ పైన పొర, అంటే పీచు మరియు విత్తనంలో ఎక్కువగా విటమిన్లు మరియు ఖనిజలవణాలు ఉంటాయి.

3. హోల్ వీట్ బ్రెడ్

3. హోల్ వీట్ బ్రెడ్

బ్రెడ్ మనుషుల ఆహారంలో భాగంగా చాలా ఏళ్ల నుంచి ఉంటూ వస్తోంది. బ్రెడ్ లో బి కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి, అది బి 4 విటమిన్ కూడా అందిస్తుంది. అది అవసరమైన పోషకాలను అనగా శక్తి కోసం కార్బొహైడ్రేట్లను, కణాల ఆరోగ్యం కోసం ఖనిజ లవణాలైన ఐరన్ మరియు సెలీనియం కూడా అందిస్తుంది.

4. లవంగాలు

4. లవంగాలు

మనదేశంలో లవంగాలను వంటకాలలో దినుసుగా తప్పక ఎక్కువగా వాడతారు. ఇది భారత్ మరియు చైనాలో వేల ఏళ్ల క్రితం నుండి కేవలం వంటదినుసుగా మాత్రమే కాదు, వైద్యంలో కూడా వాడబడింది. లవంగాలలో విటమిన్ బి4 పుష్కలంగా ఉంటుంది, ఇది తీసుకోడం వలన వికారం మరియు మధుమేహం నివారించబడతాయి.

5.జీలకర్ర

5.జీలకర్ర

కారవే విత్తనాలు, అంటే జీలకర్ర చాలా ఘాటు వంటకాలలో వాడే ముఖ్యమైన దినుసు. వీటిల్లో విటమిన్ బి4 పుష్కలంగా ఉండి, ఐరన్ , కాపర్, కాల్షియం,పొటాషియం, మాంగనీస్ మరియు మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

6.స్ట్రాబెర్రీ

6.స్ట్రాబెర్రీ

స్ట్రాబెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్ బి 4 ఉండి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. స్ట్రాబెర్రీలు తినటం వలన కంటిచూపు మెరుగవుతుంది, మెదడు సరిగా పనిచేస్తుంది, అధిక రక్తపోటు తగ్గుతుంది, కీళ్ల నొప్పులు, వివిధ గుండెజబ్బులు నియంత్రించబడతాయి.అందుకని విటమిన్ బి4 లోపం తగ్గించడానికి స్ట్రాబెర్రీలు ఎక్కువ తింటూ ఉండండి.

7.క్యాప్సికం

7.క్యాప్సికం

ఘాటైన వాసన కలిగిన తినే పండు క్యాప్సికంను వంటల్లో వాడతారు. అందులో విటమిన్ బి 4 మరియు ఇతర బయోయాక్టివ్ పదార్థాలు కడుపునొప్పి, నడుంనొప్పి, తలనొప్పి,క్యాన్సర్, వయస్సు మీరే లక్షణాలు మరియు మధుమేహం వీటన్నిటినుంచి ఉపశమనం కలిగిస్తాయి.

8.ఆపిల్స్

8.ఆపిల్స్

ఆపిల్ చాలా రుచికరమైన, ప్రసిద్ధమైన పండు. ఆపిల్స్ లో అనే చాలా విటమిన్లు, ఖనిజలవణాలు ఉంటాయి. విటమిన్ బి4తో పాటు విటమిన్ సి విటమిన్ కె, విటమిన్ బి6 మరియు రిబోఫ్లేవిన్ కూడా ఉంటాయి. ఈ పండు అల్జీమర్స్ వ్యాధి, కడుపులో సమస్యలు, మలబద్ధకం, మధుమేహం మరియు కాలేయ సమస్యలు రాకుండా నియంత్రిస్తుంది.

9.అల్లం

9.అల్లం

అల్లంలో విటమిన్ బి4 ఉంటుంది, దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఆహారపదార్థాలలో దినుసుగా వాడతారు. అల్లంలో యాంటీఆక్సిడెంట్లు మరియు వాపు వ్యతిరేక లక్షణాలు ఉండి, గుండెపోటును, అజీర్తి, వికారంను నియంత్రించగలదు. రోగనిరోధక వ్యవస్థను బలంగా మార్చి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.

10.టమాటా

10.టమాటా

ఆహారంలో రుచికి కారణమవ్వటమే కాక టమాటా ఆరోగ్యాన్ని చాలా మెరుగుపరుస్తుంది. ఇందులో విటమిన్ బి4,విటమిన్ ఎ, సి, కె మరియు పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం వంటి ఇతర ఖనిజలవణాలు కూడా ఉంటాయి. ఇది రక్తపోటును తగ్గిస్తుంది, కడుపు ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది, చర్మసమస్యలు, మధుమేహం, మూత్రనాళ ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం ఇస్తుంది.

English summary

Foods Rich In Vitamin B4 To Overcome Vitamin B4 Deficiency

Vitamin B4 is particularly important for DNA and RNA formation. But this vitamin also has other functions, including promotion of cell formation and ensuring healthy tissue development. Vitamin B4 also helps in boosting the immune system, hence increasing the body's resistance to infections and illness. A deficiency in this vitamin may cause skin disorders, blood disorders, vertigo, fatigue, etc.