For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హ్యాపీ హార్మోన్స్ ను పెంచే ఆహారాలివే, తిని చూడండి, అంతా సంతోషమే

|

మానసిక సంతోషం ఉన్న ఎడల, దేనినైనా సాధించవచ్చు అన్నది పెద్దల నుండి వస్తున్న నానుడి. ఆనందం కేవలం ఒకే అంశంతో ఎన్నటికీ ముడిపడి ఉండదు. ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడు అంటే, దాని వెనుక అనేక అంశాలు దాగి ఉంటాయి. విషయాలకు స్పందించే ఆలోచనా విధానం దగ్గర నుండి అనేక మానసిక మరియు శారీరిక ప్రభావాల కలయికలు ఒక వ్యక్తి సుఖదుఃఖాలను నిర్దేశిస్తాయి. వీటిలో కొన్ని తాత్కాలికమైనవిగా ఉంటే, కొన్ని శాశ్వతమైనవిగా ఉంటాయి.

ఉదాహరణకు, మీరు ఏదైనా బహుమతిని స్వీకరించినప్పుడు తాత్కాలిక ఆనందాలకు గురైతే, ఏదైనా విజయాన్ని సాధించిన ఎడల ఆ సంతోషం శాశ్వతంగా ఉంటుంది. ఈ మానసిక మార్పులకు జీవనశైలి కూడా కారకంగా ఉంటుంది. అందులో ప్రధానంగా వ్యాయామం, ఆరోగ్యం, ఆహార ప్రణాళిక మొదలైనవి కీలకపాత్ర పోషిస్తాయి. ఈ వ్యాసంలో, మీ హ్యాపీ హార్మోన్లను ప్రేరేపించే ఆహార పదార్ధాల వివరాల గురించి పొందుపరచడం జరిగినది.

ఏ హార్మోన్లు వ్యక్తి ఆనందానికి కారణం ?

ప్రధానంగా మెదడులో నాలుగు రకాల హార్మోన్లు వ్యక్తి సంతోష స్థాయిలను ప్రభావితం చేస్తుంటాయి. అవి వరుసగా డోపమైన్, సెరటోనిన్, ఎండార్ఫిన్స్ మరియు ఆక్సిటోసిన్. ఇవి మెదడులో ప్రధానమైన ప్రాధమిక హాపీ హార్మోన్లుగా ఉన్నాయి. క్రమంగా వ్యక్తిని సంతోషంగా ఉంచేందుకు బాధ్యత వహిస్తాయి. ఇక్కడ ఈ నాలుగు హాపీహార్మోన్ల గురించిన క్లుప్తమైన వివరణ పొందుపరచబడింది.

సెరోటోనిన్ :

డిప్రెషన్ స్థాయిలను తగ్గించడంలో కీలకపాత్ర పోషించే న్యూరోట్రాన్స్మిటర్, సెరోటోనిన్. ఇది కేవలం నిరాశ స్థాయిలను తగ్గించడమే కాకుండా, ఆత్మహత్య ఆలోచనలు పెరుగకుండా చూడడంలో సహాయం చేస్తుంది.

డోపమైన్ :

ఇది మరొక న్యూరోట్రాన్స్మిటర్. దీనిని తరచుగా 'కెమికల్ ఆఫ్ రివార్డ్ ' అని కూడా పిలుస్తారు. ఉదాహరణకు, మీరు ఏదైనా లక్ష్యాన్ని సాధించినప్పుడు, లేదా ఏదైనా పనిని పూర్తిచేసినప్పుడు, లేదా ఇతరుల పట్ల దయచూపు సందర్భంలో, ఈ హార్మోన్ విడుదల జరుగుతుంది.

ఎండార్ఫిన్లు :

వీటిని ఓపియాయిడ్ న్యూరోపెప్టైడ్స్ అని వ్యవహరించడం జరుగుతుంది. మరియు ఇవి శారీరిక నొప్పిని ఎదుర్కొనేందుకు సహాయం చేయడానికి కేంద్ర నాడీ వ్యవస్థ ద్వారా ఉత్పత్తి చేయబడతాయి.

ఆక్సిటోసిన్ :

ఈ హార్మోన్ డోపమైన్ మరియు సెరోటోనిన్లను ప్రేరేపిస్తుంది, క్రమంగా ఆందోళనలను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

హ్యాపీ హార్మోన్లను ప్రేరేపించే ఆహార పదార్ధాలు :

1. డార్క్ చాక్లెట్ :

1. డార్క్ చాక్లెట్ :

డార్క్ చాక్లెట్లు అనామ్లజనకాలతో పూర్తిగా నిండి ఉంటాయి. డార్క్ చాక్లెట్లోని N-అసిలెథనోలమైన్, మరియు కొన్ని ఇతర రసాయనాల సమూహం మూలంగా, ఎండార్ఫిన్స్ విడుదల జరిగి, క్రమంగా మెదడుని ఉద్దీపన గావించి, మీ మానసికస్థితిని మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది. డార్క్ చాక్లెట్ తీసుకున్న క్షణంలో మిక్కిలి సుఖభ్రాంతి అనుభూతిని పొందడానికి కారణం ఇదే. దీనికి తోడు, డార్క్ చాక్లెట్, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు, గుండె ఆరోగ్యాన్ని, మెదడు ఆలోచనా పనితీరును కూడా ప్రోత్సహిస్తుంది.

2. అవోకాడో :

2. అవోకాడో :

అవోకాడోలో ఆరోగ్యకర ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల నిక్షేపాలు ఉంటాయి, ఇవి మెదడు ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు, మానసిక స్థాయిల నియంత్రణను సైతం కలిగి ఉంటుంది. అవకాడోలోని విటమిన్ B3, సెరెటోనిన్ స్థాయిల పెరుగుదలలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. క్రమంగా మీ మొత్తం శారీరిక, మానసిక ఆరోగ్యాన్ని సానుకూలంగా ప్రభావితం చేయగలిగినదిగా ఉంటుంది.

3. చెర్రీ టమోటా :

3. చెర్రీ టమోటా :

చెర్రీ టమోటాలు లేదా సాధారణ టమోటాలలో ఒకేరకమైన పోషకాల నిక్షేపాలు ఉంటాయి ఇంచుమించుగా. లైకోపీన్ యొక్క అద్భుతమైన మూలంగా ఉన్న ఈ టమోటాలు, మీ మెదడును రక్షించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. డిప్రెషన్ స్థాయిలను తగ్గించడంలో అత్యంత ప్రభావశీలిగా చెప్పబడింది. డిప్రెషన్ స్థాయిలను పెంచే ప్రో-ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలను తగ్గించడంలో లైకోపీన్ ఎంతగానో దోహదం చేస్తుంది.

4. విత్తనాలు మరియు తృణధాన్యాలు :

4. విత్తనాలు మరియు తృణధాన్యాలు :

తృణ ధాన్యాలు, B విటమిన్లు, ఆరోగ్యకర ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం మరియు జింక్ సమ్మేళనాలతో నిండి ఉంటాయి. ఇవి ఒత్తిడి కారక హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అక్రోట్లు, బాదం మరియు గుమ్మడి విత్తనాలు, పొద్దుతిరుగుడు వంటి విత్తనాలు ఎండార్ఫిన్స్ స్థాయిల ఉత్పత్తిని ప్రేరేపించేవిలా ఉంటాయి. ఈ ఎండార్ఫిన్స్ క్రమంగా రక్త ప్రసరణ ద్వారా శరీరమంతా ప్రవహించి, ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తూ సుఖభ్రాంతికి లోనుచేస్తుంది.

5. పాలు :

5. పాలు :

ట్రిప్టోఫాన్ అని పిలబడే సమ్మేళనాల ఉనికి కారణంగా, మానసిక స్థాయిలను క్రమబద్దీకరించగలిగే లక్షణాలు పాలలో ఉంటాయి. ఈ ట్రిప్టోఫాన్లు నెమ్మదిగా సెరటోనిన్ వలె రూపాంతరం చెందుతున్న కారణంగా ఇది సాధ్యమవుతుంది. పాలలో ఉండే లాక్టీయమ్ అని పిలువబడే ప్రోటీన్, శరీరాన్ని ప్రశాంతంగా ఉండునట్లు చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

6. హ్యాపీ హార్మోన్లను ప్రేరేపించే ఇతర మార్గాలు :

6. హ్యాపీ హార్మోన్లను ప్రేరేపించే ఇతర మార్గాలు :

- హాపీ హార్మోన్లను విడుదల చేయడానికి మరొక ఉత్తమ మార్గం "నవ్వడం". నవ్వడం వలన హాపీ హార్మోన్లు విడుదల కాబడి, శారీరిక సమస్యలకు స్వాంతన కలిగిస్తుంది.

- దైనందిక ప్రణాళికలో భాగంగా 20నిముషాల పాటు వ్యాయామం చేయడం ద్వారా మెదడులో డోపమైన్, సెరటోనిన్ వంటి హాపీ హార్మోన్ల విడుదల జరుగుతుంది.

- మూడవ ఉత్తమపద్దతిగా మసాజ్ ఉంటుంది. ఇది భాదను పెంచే కార్టిసాల్ స్థాయిని 31 శాతం వరకు తగ్గించి, సెరటోనిన్ మరియు డోపమైన్ స్థాయిలను 28శాతం మరియు 31 శాతంగా పెంచగలదని పరిశోధకుల అభిప్రాయం.

- ద్యానం కూడా 65 శాతం డోపమైన్ స్థాయిలను పెంచగలదని కొన్ని అధ్యయనాల నివేదిక.

English summary

Foods That Boost Your Happy Hormones

Happiness can come from many things, some are temporary and some are permanent. For example, temporary happiness comes when you receive a gift or you have had an achievement. Permanent happiness is credited to the lifestyle changes that you make.
Story first published: Tuesday, October 2, 2018, 11:00 [IST]